For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు తెలుసా, శరీరంలోని చెడు రక్తం 8 భయంకరమైన రోగాలకు దారితీస్తుందని?

|

మానవ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో రక్తప్రసరణ కీలకపాత్ర పోషిస్తుంది, ఎందుకంటే అన్ని ముఖ్యమైన పోషకాలు రక్త మాధ్యమంలో, మొత్తం మానవ శరీరానికి చేరుకుంటాయి. అన్ని శరీరభాగాలు సరిగా పనిచేయడoలో సహాయం చేయడానికి సరైన ఆరోగ్యకరమైన రక్తప్రసరణ కూడా ముఖ్యం.

రక్తంలోని మలినాలు, వ్యాధులు మరియు వాపులకు ముఖ్య కారణం. అందువలన, మన రక్తంలోని మలినాల వలన కలిగే సమస్యలు లేదా వ్యాధులకు కారణమయ్యే కారణాలను తెలుసుకోవడం ముఖ్యం. తద్వారా మన శరీరంలో ఆరోగ్యకరమైన రక్తప్రసరణను నిర్వహించడానికి కొన్ని ఆరోగ్య నియమాలను రూపొందించుకుని, క్రమంగా అవసరమైన జీవనశైలి మార్పులను తీసుకునిరావలసి ఉంటుంది.

did you know impure blood can cause these 8 major diseases

మలినాలను కలిగిన రక్తాన్ని 'చెడు రక్తం' గా సూచిస్తారు. ఎందుకంటే మన శరీరానికి చెడు రక్తం అత్యంత హాని కలిగిస్తుంది. ఆధునిక జీవనశైలిలోని అలవాట్లు మన ఆహారపు అలవాట్లలో విస్తారమైన మార్పుని తీసుకువచ్చాయి, మరియు పెరిగిన పర్యావరణ కాలుష్యంతో మన శరీరాలు మరియు చర్మంపై తీవ్ర ప్రభావమే చూపిస్తూ ఉంది.

మనం పీల్చుకునే గాలి, తినే ఆహారం, మరియు త్రాగే నీరు అన్ని కలుషితాలే. రక్తం మలిన పడడానికి ఇవి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

రక్తంలో విషతుల్యాలు చేరడానికి మరికొన్ని ప్రధాన కారణాలు:

రక్తంలో అపరిశుభ్రతకు అనేక కారణాలు ఉన్నప్పటికీ, రక్తం విషపూరితం అయ్యే విషయంలో మాత్రం కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి:

• సరికాని ఆహారం

• పర్యావరణ కాలుష్యం

• తీవ్రమైన పని గంటలు, అర్థరాత్రి విందులు

• జంక్-ఫుడ్ వ్యసనం

•తక్కువ నీటిని తాగడం

• నిద్రలేమి

• ఊబకాయం

• ఒత్తిడి

• హార్మోన్లలో మార్పులు

• జీవనశైలి సరిగా లేక కలిగే వ్యాధులు

శరీరంలో చెడు రక్తము వల్ల కలిగే వ్యాధులు:

శరీరంలోని విషతుల్య పదార్ధాలు లేదా మలినాలు అధికంగా చేరడం వల్ల రక్తం విషపూరితం అవుతుంది. చర్మ సమస్యలైన మొటిమలు, దద్దుర్లు, అలెర్జీలు, వృద్ధాప్యసమస్యలు, మరియు జుట్టు నష్టం వంటి సమస్యలు రక్తం అపరిశుభ్రంగా ఉందని చెప్పడానికి ప్రధానాంశాలు. ఈ చెడు రక్తం వలన కలిగే వ్యాధుల గురించిన వివరాలు కింద పొందుపరచబడ్డాయి:

1. ఇన్ఫ్లమేటరీ డిసీజెస్:

మన శరీరంలోకి ప్రవేశించే విషo, తరచుగా రక్తంలోకి ప్రవేశించడమే అనారోగ్యాలు కలగడానికి ప్రధాన కారణం. ఈ విషపదార్ధాలు సోరియాసిస్, ఉబ్బసం, గుండె వ్యాధులు, మరియు అల్జీమర్స్ వంటి తీవ్ర పరిస్థితులకు ప్రధాన కారకంగా ఉన్నాయి. వీటిని ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ గా వ్యవహరిస్తారు.

2.గ్యాస్ట్రోఇంటెస్టినల్ చిక్కులు

శరీరంలో కలుషితమైన వ్యర్ధపదార్ధాల వలన ఏర్పడిన విషతుల్యాలు రక్తంలో విపరీతంగా చేరడం వలన జీర్ణశయాంతర నాళమైన పెద్దపేగు సమస్యలకు కారణమవుతుంది. పెద్దపేగు శరీరంలోని విషపదార్ధాల తొలగింపులో కీలకపాత్ర పోషిస్తుంది. అయినప్పటికీ, రక్తంలోని అధిక మాలిన్యత కారణంగా, జీర్ణసమస్యలు, పూతలు, మలబద్ధకం మరియు ఇతర పెద్దపేగు, జీర్ణాశయ సంబంధిత అనారోగ్యాలైన పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా లేదా హెమరోయిడ్స్ వంటివి కలుగుతాయి. పైన చెప్పినవన్నీ మొదట్లో కాస్త అసౌకర్యానికి గురిచేస్తున్నా, సరైన వైద్యం తీసుకొని ఎడల తీవ్ర రూపానికి దారితీస్తుంటాయి. కావున జీర్ణ ప్రక్రియ చక్కగా కొనసాగేలా చర్యలు తీసుకోవలసి ఉంటుంది.

3. హార్మోన్లలో అసాధారణ మార్పులు

వాతావరణంలో బాహ్య కారకాల వలన కలిగే నష్టం ముఖ్యంగా మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. క్రమంగా మహిళల్లో హార్మోన్ల అసమానతలకు కారణమవుతుంది. పురుషులు కూడా తక్కువ స్పెర్మ్ కౌంట్ సమస్యలను, క్రమంగా వంద్యత్వ సమస్యలను అనుభవించే అవకాశముంది. అయితే ఈ హార్మోనుల అసమతుల్యత అనేది ఎండోమెట్రియోసిస్ యొక్క లక్షణాలుగా మారొచ్చు., పి.ఎం.ఎస్, అతి రక్తస్రావం, తిమ్మిరి, మానసిక కల్లోలం మొదలైన ఇతర లక్షణాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి.

4. మందబుద్ది

మెదడుకు తాజా ఆక్సిజన్ సరఫరాకు స్వచ్ఛమైన రక్తం అవసరం. శరీరంలో చెడు రక్తం యొక్క పెరుగుదల కారణంగా ప్రాణవాయువు సరఫరాకు అంతరాయం కలుగుతుంది. ఇది క్రమంగా జ్ఞాపకశక్తి నష్టం, మానసిక కల్లోలం, మానసిక ప్రవర్తనలలో మార్పులు, డిప్రెషన్, నిరాశ వంటి సమస్యలకు కారణమవుతుంది. మరియు ఈ ప్రభావం వయసుతో సంబంధం లేకుండా యువతలో కూడా చిత్తవైకల్యం లక్షణాలు కలగజేస్తుంది.

5. అవయవ వైఫల్యం

కాలేయం,, మూత్రపిండాలు ప్రధానంగా శరీరంలోని వ్యర్థాల తొలగింపుకు బాధ్యత వహిస్తాయి. మన రక్తంలోని విషాల తీవ్రప్రభావాలు, ఈ అవయవాలపై ఒత్తిడిని పెంచడం ద్వారా, వాటి పనితీరు మందగిస్తుంది. నెమ్మదిగా వీటి ప్రభావం ఇతర అవయవాలమీద కూడా పడుతుంది. సరైన రక్త సరఫరా అందక మరియు వ్యర్ధ పదార్ధాలు తీవ్రంగా పేరుకుని పోవడం వంటి సమస్యల ద్వారా ఒక్కొక్క అవయవ పనితీరుపై ప్రభావం పడుతుంది.

కేవలం కాలేయం మరియు మూత్రపిండాలు మాత్రమే చెడు రక్త ప్రభావానికి గురవుతుంటాయి అనుకోవడం పొరపాటు. ఇది మన హృదయo యొక్క ప్రధాన విధికి ఆటంకంగా పరిణమిస్తుంది. ధమనుల ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ మరియు పోషకాలను సమృద్దిగా కలిగిన స్వచ్ఛమైన రక్తాన్ని సరఫరా చేస్తుంది. అయితే చెడు రక్తం సిరల ద్వారా గుండెకు తిరిగి వస్తుంది. కానీ చెడు రక్తం స్థాయిలు అధికమైన పక్షంలో గుండె మీద పని ఒత్తిడి పెరుగుతుంది, ఒత్తిడి తీవ్రమైన పక్షంలో గుండె బలహీన పడి గుండెపోటుకు కూడా దారితీస్తుంది.

6. రోగ-నిరోధక సంబధిత వ్యాధులు

మల్టిపుల్ స్క్లెరోసిస్, లూపస్, హైపోథైరాయిడిజం, ప్రేగువాపు లేదా పూతవ్యాధి మొదలైన ఇతర సాధారణ స్వయంప్రేరేపిత వ్యాధుల గురించి మీకు తెలిసి ఉండవచ్చు. అలాగే నాడీవ్యవస్థ, కండరాలు, చర్మం మరియు హృదయాలను ప్రభావితం చేసే ఇతర స్వయం ప్రతిరక్షక వ్యాధులు కూడా ఉన్నాయి.

శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ, బ్యాక్టీరియాతో పోరాడడమే కాకుండా తన స్వంత కణజాలాలపై కూడా దాడిచేసే పరిస్థితి కలుగుతుంటుంది. రోగనిరోధక వ్యవస్థ యొక్క ఈ గందరగోళం శరీరంలోని అధిక మలినాల కారణంగా సంభవిస్తుంది.

7. చర్మ వ్యాధులు

చర్మం, శరీరంలోని మలినాల తొలగింపులో అత్యంత కీలకపాత్రను పోషిస్తుంది. రక్తం విషపూరితం అయినప్పుడు, ఇది తామర, సోరియాసిస్, మోటిమలు మరియు ఇతర చర్మ సంబంధిత అలెర్జీలకు దారితీస్తుంది.

8. క్యాన్సర్

అనారోగ్యకర ఆహారం, చెడు జీవనశైలి అలవాట్లు, అధిక ఒత్తిడి స్థాయిలు, శారీరక శ్రమ లేకపోవడం, పర్యావరణ కాలుష్యం, అధికంగా జంతువుల కొవ్వు వినియోగం వంటి వివిధ అంశాల కలయిక కారణంగా శరీరంలోని విషపదార్ధాల మోతాదు అధికంగా పెరుగుతుంది. క్రమంగా కాన్సర్ వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తుంది.

రక్తంలో చెడు పదార్ధాలను తొలగించుటకు గల మార్గాలేమిటి?

ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి, ఖచ్చితంగా ఆరోగ్యకర జీవన విధానాన్ని అనుసరించాలి. రక్తంలో విషాలను పెంచుకోవడానికి దారితీసే కారకాల నుండి తప్పించుకోవడంలో ఆరోగ్యకరమైన జీవనశైలి సహాయపడుతుంది. దిగువ పేర్కొన్న మార్పులను తీసుకురావడానికి ప్రయత్నించండి:

జంక్-ఫుడ్ మానoడి. ఆరోగ్యకరమైన తృణధాన్యాలు మరియు పప్పుధాన్యాలు, ఆకుపచ్చ ఆకుకూరలు, మొలకలు, ప్రోటీన్లు, విటమిన్లు మరియు ఫైబర్లను మీ ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోండి.

• ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండండి మరియు కెఫిన్ తగ్గించండి

• శరీరానికి అవసరమైన మోతాదులో నీటిని, మరియు నిద్రను కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

• రోజులో కనీసం 30నిమిషాల నడక, లేదా మీరు ఇష్టపడే అవుట్-డోర్ ఆటలకు కాస్త సమయాన్ని కేటాయించండి. మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి యోగా మరియు ధ్యానం సాధన చేయండి. మీ ప్రసరణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నప్పుడు, శరీరంలోని అన్ని భాగాలను పోషకాలు చేరుకోవడానికి స్వచ్ఛమైన రక్తం సహాయపడుతుంది.

English summary

Did You Know Impure Blood Can Cause These 8 Major Diseases?

Impure blood is also referred to as 'toxic blood', as it causes a lot of harm to our body. Modern lifestyle habits have brought about a vast change in our dietary habits, and this, coupled with increased environmental pollution, has created havoc on our bodies and skin.The air we breathe, the food we consume, and the water we drink, are all polluted, and they lead to accumulation of toxins, eventually spoiling the purity of our blood.
Story first published:Friday, June 22, 2018, 12:14 [IST]
Desktop Bottom Promotion