For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బార్లీ నీళ్లను తీసుకోవడం ద్వారా కిడ్నీ స్టోన్స్ కరుగుతాయా?

|

వ్యాధుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సాధారణంగా అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లను అలాగే అనారోగ్యకరమైన లైఫ్ స్టయిల్ హ్యాబిట్స్ ను నిందించడం జరుగుతుంది. ఎంత నాగరికత చెందినా అలాగే అభివృద్ధి చెందినా ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా మంది సరైన విధానాలను పాటించడం లేదన్నది మాత్రం నిజం. తద్వారా, అనారోగ్యాల బారిన పడుతున్నారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుని లాభం లేదు. ఈ విషయం ఆరోగ్యం విషయానికి కూడా వర్తిస్తుంది. కాబట్టి, ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించడం ద్వారా అనేక వ్యాధుల బారిన నుంచి రక్షింపబడవచ్చు.

కొన్నిసార్లు ఆరోగ్యం విషయంలో ఎక్కువగా ఓవర్ ప్రొటెక్టివ్ గా మారి సరైన అవగాహన లేకుండా ఇతరులు చెప్పిన సలహాలను గుడ్డిగా పాటిస్తాము.

health tips in telugu

బార్లీ నీళ్లను తీసుకోవడం ద్వారా కిడ్నీ స్టోన్ నుంచి ఉపశమనం

ఈ యుగంలో, పూర్వీకులు చెప్పబడిన ఆరోగ్య చిట్కాలను పాటించడానికి అనేకమంది ఆసక్తి కనబరుస్తున్నారు. పూర్వికులు చెప్పిన విషయాల లోతును గ్రహించి వాటి ద్వారా లభించే ప్రయోజనాలను అధ్యయనం చేసి ఆ ఆరోగ్య చిట్కాలను పాటించేందుకు యువత ముందడుగు వేస్తోంది. పూర్వికులు చెప్పిన ప్రతి విషయంలో ఎదో ఒక అద్భుతమైన లాజిక్ అనేది దాగి ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించడం ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నారు.

ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో కూడా పూర్వికులు అనేక విషయాలను తెలిపారు. ప్రతి రోజూ బార్లీ వాటర్ ను తీసుకోమని చెప్పారు. డైలీ డైట్ లో బార్లీ వాటర్ ను చేర్చుకోమని సలహా ఇచ్చారు. ఈ రోజుల్లో బార్లీ వాటర్ ను బీర్ గా తీసుకుంటున్నారు. నాగరికత చెందిన మానవుడు ఆల్కహాలిక్ బెవెరేజ్ గా దీనిని తీసుకుంటున్నాడు. దీని వలన శరీరానికి కలిగే లాభాల గురించి తెలియకుండానే ఈ విధంగా బార్లీను తీసుకుంటున్నాడు.

బార్లీ అనే హోల్ గ్రెయిన్ ను ఉపయోగించి బార్లీ వాటర్ ను తయారుచేస్తారు. శాస్త్రవేత్తలు అలాగే పరిశోధకులు దీనిలోని ఔషధ గుణాలను వెలికితీసి వెల్లడించే వరకు ఇది మిగతా ధాన్యాలలా ప్రసిద్ధి చెందలేదు.

ఈ అద్భుతమైన ధాన్యంలో అనేక రకాల వ్యాధులను అరికట్టే ఔషధ గుణాలు కలవు. ఆస్త్మా, ఒబెసిటీ, ఆర్తరైటిస్, అనీమియా, ఇంపొటెన్సీ వంటి సమస్యలను ఇది తగ్గించగలదని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే, ఇందులో పోషకాలు పుష్కలంగా కలవు. ఇందులో, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి.

బార్లీ వాటర్ అనేది సహజమైనది. దీనిని వాడటం ద్వారా కిడ్నీ స్టోన్స్ సమస్య నుంచి విముక్తిని పొందవచ్చు. నీళ్లను ఎక్కువగా తీసుకోవడంతో పాటు బార్లీ వాటర్ ను తీసుకోవడం ద్వారా కిడ్నీ స్టోన్స్ సమస్య తగ్గుముఖం పడుతుందని ప్రపంచవ్యాప్తంగా వైద్యులు పేషంట్స్ కి సూచించడాన్ని గమనిస్తూనే ఉన్నాము. ఎందుకంటే, నేచురల్ పద్దతిలో కిడ్నీ స్టోన్స్ నుంచి రక్షణ లభిస్తుంది. ఇంట్లోనే ఎవరైనా బార్లీ వాటర్ ను చేసుకోవచ్చు.

బార్లీ వాటర్ అనేది సహజసిద్ధంగా లభించే హెల్త్ బూస్టర్. హార్ట్ ప్రాబ్లెమ్, డయాబెటిస్ వంటి ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఇది రక్షణను అందిస్తుంది. దీనిని రోజూ డైట్ లో భాగంగా చేసుకోవడం ద్వారా డైజెస్టివ్ ప్రాబ్లెమ్స్, యూరినరీ ప్రాబ్లమ్ మరియు కిడ్నీ స్టోన్స్ నుంచి రక్షణ లభిస్తుంది.

health tips in telugu

కిడ్నీ స్టోన్స్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. యుటెరస్ లేదా కిడ్నీలో పేరుకునే వాటిని సిస్ట్ లని అంటారు. చాలా సందర్భాలలో కేల్షియం క్రిస్టల్స్ వలన ఇవి ఏర్పడతాయి.

2. ఈ మినరల్ డిపాజిట్స్ అనేవి వివిధ సైజ్ లో ఏర్పడవచ్చు. ఇసుక రేణువు సైజ్ నుంచి గోల్ఫ్ బాల్ సైజ్ లో ఇవి ఏర్పడవచ్చు.

3. ఇవి ఇంఫ్లేమేషన్, అబ్డోమినల్ పెయిన్ మరియు గ్రోయిన్ పెయిన్ కు దారితీయవచ్చు.

కిడ్నీ స్టోన్స్ ఏర్పడటానికి గల కారణాలు

1. ఇవి వారసత్వ సమస్య వలన ఏర్పడవచ్చు.

2. క్యాన్డ్, రిఫైండ్ అలాగే ప్రొసెస్డ్ ఫుడ్స్ ను తీసుకోవడం ద్వారా కిడ్నీల ఆరోగ్యం దెబ్బతినవచ్చు.

3. యాంటాసిడ్స్ కలిగి ఉండే కొన్ని ఔషధాలను రెగ్యులర్ గా తీసుకోవడం వలన సైడ్ ఎఫెక్ట్ గా ఈ సమస్య తలెత్తవచ్చు.

health tips in telugu

కిడ్నీ స్టోన్స్ ను కరిగించేందుకు బార్లీ నీళ్లు ఏ విధంగా తోడ్పడతాయి?

1. కిడ్నీ స్టోన్స్ ఏర్పడటానికి మినరల్ డిపాజిట్స్ అనేవి ప్రధాన కారణంగా వ్యవహరిస్తాయి. బార్లీ వాటర్ అనేది టాక్సిన్స్ ను అలాగే బేబీ క్రిస్టల్స్ ను యూరిన్ ద్వారా బయటికి పంపుతుంది.

2. పోషకాలు పుష్కలంగా లభించే బార్లీలో విటమిన్ బీ6 మరియు మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. రాను రాను రాళ్లుగా మారే కేల్షియం ఆక్సలేట్ ను చిన్న చిన్న పీసెస్ గా మార్చే సామర్థ్యం బార్లీ నీళ్లకు కలదు.

3. బార్లీ నీళ్లు అనేది హెల్త్ డ్రింక్ కాబట్టి, ఇది బ్లాడర్ పై ప్రెషర్ ని కలిగించడంతో పాటు ఇందులో లభించే పోషకాలు స్టోన్స్ ను కరిగించేందుకు తోడ్పతాయి. తద్వారా, స్టోన్ సైజ్ మారుతుంది. శరీరం నుంచి త్వరగా బయటికి పోతుంది.

4. బార్లీ నీళ్లలో డైటరీ ఫైబర్ అధికంగా లభిస్తుంది. అందువలన, యూరిన్ లో కేల్షియం కంటెంట్ యొక్క విసర్జనను తగ్గిస్తుంది.

English summary

Does Barley Water Really Cure Kidney Stones? Here's All You Need To Know

Haven't we heard of the age-old proverb, "Precaution is better than cure"; hence, why not use the natural essence of barley and prevent the threat of accumulation of toxins in our kidneys? You can get rid of kidney stones naturally by using barley water. It is a natural health booster which also aids in curing chronic ailments, such as heart problems, diabetes, etc..
Story first published: Monday, June 11, 2018, 10:33 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more