For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫంగల్ ఇన్ఫెక్షన్స్: కారణాలు మరియు నివారణ

|

ఫంగస్ ఎక్కడైనా మిలియన్ల సంఖ్యలో, కుప్పలుతెప్పలుగా కనిపిస్తుంది. భూమి మీద వివిధ ఫంగస్ జాతులున్నాయి. వీటిలో అతికొద్ది మాత్రమే ఉపయోగపడే ఫంగస్లు, ఎక్కువమొత్తంలో, మన శరీరానికి అంటువ్యాధులను సంక్రమింపచేసి, నష్టాలను కలిగించే ఫంగస్లు ఉన్నాయి. వీటిలో మూడు వందల రకాలు హానికారకమైనవిగా గుర్తింపబడ్డాయి.

ఫంగల్ ఇన్ఫెక్షన్లు చాలా సులువుగా వ్యాప్తి చెందుతాయి ఎందుకనగా అవి గాలి, ధూళి, నేల, నీరు, మొక్కలు, చెట్లు మరియు జంతువులలో కూడా అవి జీవించగలవు. కొన్ని రకాల ఫంగస్లు మనుషులలో కూడా జీవించగలవు.

Fungal Infections: Causes And Prevention

వాతావరణంలో ఉండే అతిసూక్ష్మమైన ఫంగస్లు, ఇన్ఫెక్షన్లను కలుగజేస్తాయి. వీటిలో చర్మవ్యాధులు వంటి స్వల్పకాలికమైనవి మరియు ఫ్లూ వంటి ప్రాణాంతకమైనవి కూడా ఉన్నాయి. అథ్లెట్స్ ఫుట్, ఈస్ట్ఇన్ఫెక్షన్, గోళ్లకు సోకే ఫంగస్, తామర వంటివి కొన్ని తక్కువ తీవ్రమైన ఫంగల్ ఇన్ఫెక్షన్లు.

సాధారణంగా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారోలో అధికంగా ఉంటాయి. చాలావరకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు ప్రాణాంతకమైనవి కానప్పటికీ, మందులు, ఆయింట్మెంటులు వాడటం ద్వారా నివరింపబడినప్పటికి, వాటిని గురించి సమగ్రమైన సమాచారం కలిగి ఉండటం మంచిది. దాని వలన చాలా ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.

ఫంగల్ ఇన్ఫెక్షన్లు కలగడానికి కల ముఖ్య కారణాల గురించి ఈ కింద వివరంగా మీకోసం అందిస్తున్నాం.

1. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ:

1. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ:

బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారు సులువుగా ఫంగల్ ఇన్ఫెక్షన్లకు లోనవుతారు. హిప్ లేదా ఎయిడ్స్ ఉన్నవారికి మల్లే మధుమేహం ఉన్నవారు లేదా క్యాన్సర్ వ్యాధికి కీమోథెరపి చికిత్స పొందుతున్నవారిపై కూడా ఫంగస్లు సులువుగా దాడి చేస్తాయి.

కొన్నిరకాల వ్యాధుల నివారణకు వాడే మందులు, శరీరంలో రోగనిరోధకత స్థాయిని తగ్గించి, ఇన్ఫెక్షన్లను పెంచుతాయి. అదేవిధంగా, అవయవ మార్పిడి జరిగిన వారిలో కూడా రోగనిరోధకత తక్కువగా ఉండటంతో ఫంగస్ దాడి ఎక్కువవుతుంది.

యాంటీబయాటిక్స్ వాడటం వలన కూడా రోగనిరోధక వ్యవస్థ బలహీనమవుతుంది. యాంటీబయాటిక్స్ శరీరంలో వివిధ బాక్టీరియాలను నాశనం చేయటం వలన ఈస్ట్ సులువుగా వ్యాప్తి చెందుతుంది. గర్భిణీ స్త్రీలలో కూడా రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండటం వలన ఫంగల్ ఇన్ఫెక్షన్లకు లోనవుతారు.

2. పోషకాహార లోపం:

2. పోషకాహార లోపం:

వివిధ కారణాల వలన ఆహారపు అలవాట్లను నియంత్రణలో పెట్టినప్పటికిని, పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి. అలా చేస్తేనే.మీ శరీరం ఎటువంటి ఇన్ఫెక్షన్లనైనా తట్టుకుంటుంది. పోషకాలు లేని ఆహారం వలన ఫంగస్ మీ శరీరంలో త్వరగా వ్యాపిస్తుంది. సమతులాహారం ఫంగస్ ను దరిచేరనివ్వకుంటే, పోషకాహార లోపం ఫంగస్ దాడిని ఉరిగొల్పుతుంది.

3. ఒత్తిడి:

3. ఒత్తిడి:

సరైన ఆహారం తీసుకున్నప్పటికిని, మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు కలిగే అవకాశం ఉంది. ఒత్తిడి కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీసే ఒక ముఖ్య కారణం. ఐహిక ఒత్తిడి స్థాయి వలన, మన శరీరంలో కార్టిసోల్ విడుదలయ్యి, రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. కనుక మన శరీరానికి సులువుగా అంటువ్యాధులు సోకుతాయి.

ఇది శరీరంలో పిండిపదార్ధాల నిల్వలను పెంచి , ఈస్ట్ యొక్క పెరుగుదల మరియు ప్రత్యుత్పత్తికి తోడ్పడుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి వలన రోగనిరోధక శక్తి తగ్గి, శరీరం ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు గురవుతుంది.

4. ఊబకాయం:

4. ఊబకాయం:

ఊబకాయానికి, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు సంబంధం ఉందంటే మీరు ఆశ్చర్యపోవచ్చు, కానీ ఇది నిజం. అధిక బరువు వలన మీ రూపురేఖలను ఇబ్బందికరంగా మార్చడం మాత్రమే కాక, మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాన్ని కూడా పెంచుతాయి. ఊబకాయులు తమ ఆరోగ్య పరిస్థితుల వలన ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్లకు లోనవుతారు. వ్యాధినిరోధకత తక్కువ ఉండటం వలన రక్తంలో చెక్కెరల స్థాయి పెరిగి, ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకుతాయి.

5. భౌతిక స్పర్శ:

5. భౌతిక స్పర్శ:

కేవలం తోట పని, తవ్వడం వంటి పనుల ద్వారా కూడా గాలి, మట్టి మరియు ధూళిలో వ్యాపించి ఉన్న ఫంగస్లు సోకే అవకాశం చాలా ఉంది. ఈ పనుల చేసేటప్పుడు తీసుకునే శ్వాస ద్వారా కూడా కొన్ని ఫంగస్లు మన శరీరంలోనికి ప్రవేశించి వ్యాధులు కలుగజేస్తాయి. అంటే కాకుండా ఇంట్లో పెంచుకునే కుక్కలు,పిల్లులు ద్వారా కూడా తామర లోకే అవకాశం ఉంది.

ఫంగల్ ఇన్ఫెక్షన్లు కలగడానికి ఉన్న కారణాలను తెలుసుకుని, వాటికి దూరంగా ఉంటూ,మనం జగరూకతతో మేలుగుతూ ఉంటే అవి మన శరీరాన్ని సోకవు. సరైన పోషకాహారం, ఒత్తిడి నియంత్రణ శరీరాన్ని వ్యాయామం చేస్తూ దృఢంగా ఉంచుకోవడం ద్వారా ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకకుండా జాగ్రత్త పడవచ్చు.

English summary

Fungal Infections: Causes And Prevention

Around 300 mild and severe fungal infections are known to be harmful to the body. Reasons such as a weak immune system, inadequate nutrition, stress, obesity, and physical contact with microbes cause these infections. Keeping the body fit, having a nutritious diet, and checking on the levels of immunity and stress can help in preventing fungal infection.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more