For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పని ఒత్తిడి వలన మీరు అలసటకు గురవుతున్నారా? ఈ హనీ థెరపీస్ ను ప్రయత్నించండి మరి

పని ఒత్తిడి వలన మీరు అలసటకు గురవుతున్నారా? ఈ హనీ థెరపీస్ ను ప్రయత్నించండి మరి

|

ఆఫీస్ లోని అదనపు పని వలన ఎక్కువగా అలసటకు గురవుతున్నారా? టార్గెట్స్ ని రీచ్ అవ్వాలన్న ఒత్తిడితో పాటు పనిని అనుకున్న సమయానికల్లా పూర్తి చేయాలన్న ఒత్తిడి ప్రతి ఉద్యోగిని వేధించడం సహజమే.

అయితే, రోజు పూర్తయ్యేసరికల్లా ఈ ఒత్తిడి వలన విపరీతమైన అలసటకు గురవుతూ ఉంటారు. ఇంటికి వచ్చిన వెంటనే ఆఫీస్ బ్యాగ్స్ ను పక్కన పెట్టేసి కాసేపు నడుం వాల్చాలని అనిపించడం సహజం.

ఒకవేళ, మీరు కూడా ఇటువంటి కోవకు చెందిన వ్యక్తుల కిందకు వస్తే మీరు కచ్చితంగా ఈ హనీ థెరపీలను ప్రయత్నించి చూడాలి. ఈ ప్రభావవంతమైన హనీ థెరపీలను ఈ ఆర్టికల్ లో పొందుబరిచాము.

Health benefits of honey

ప్రాచీనకాలం నుంచి తేనె యొక్క సుగుణాలు ప్రసిద్ధి చెందిన విషయం తెలిసినదే. తేనెలోనున్న అద్భుతమైన ఔషధవిలువల వలన మనకు ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు లభిస్తాయి. అందువలన, ఆయుర్వేదంలో తేనెను ముఖ్యమైన పదార్థంగా భావిస్తారు.

ఈ కారణంచేతనే అమ్మమ్మలూ అలాగే నాన్నమ్మలు మన వెంటపడి మరీ తేనెను తీసుకోమని పదే పదే చెప్తూ ఉండేవారు. కనీసం ఒక స్పూన్ తేనెనైనా రోజుకు ఒక్కసారి తీసుకోమని గట్టిగా చెప్తూండేవారు.

తేనెలో షుగర్ కంటెంట్ అధికంగా లభిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ అలాగే యాంటీ ఫంగల్ ప్రాపర్టీలు ఇందులో అధికంగా లభ్యమవుతాయి. తేనెలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అలాగే, ఐరన్ తో పాటు కేల్షియం కూడా సమృద్ధిగా లభిస్తుంది.

అయితే, ఏదైనా మితంగా తీసుకుంటేనే ఔషధంగా పనిచేస్తుంది. వేటినైనా ఎక్కువగా తీసుకుంటే వాటివలన దుష్ప్రభావాలే కలుగుతాయి. తేనెకు కూడా ఈ విషయం వర్తిస్తుంది. తేనెను ఎక్కువగా తీసుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యలు వెంటాడతాయి.

అలసటను తగ్గించుకోవడానికి తేనెను ఏ విధంగా తీసుకోవాలో ఇక్కడ వివరించాము. వీటిని పరిశీలించండి మరి.

1. తేనె:

1. తేనె:

ఒక టేబుల్ స్పూన్ తేనెలో ఒక చిటికెడు ఉప్పును కలపాలి. నిద్రపోయేముందు దీనిని తీసుకోవాలి. ఇలా చేస్తే అలసట దూరమవుతుంది. మంచి నిద్ర పడుతుంది.

2. తేనె మరియు గ్రీన్ టీ:

2. తేనె మరియు గ్రీన్ టీ:

ఒక గ్లాసుడు నీటిని మరిగించండి.

ఒక టీస్పూన్ గ్రీన్ టీను మరిగే నీటిలో కలపండి.

దాదాపు ఐదు నిమిషాల వరకు నీటిలో గ్రీన్ టీను ఉండనివ్వండి.

ఆ తరువాత నీటిని వడగట్టి ఒక టీస్పూన్ తేనెను జోడించి బాగా కలపండి.

ఒకటి లేదా రెండు కప్పుల టీను రోజూ తీసుకుంటే అలసట మటుమాయం అవుతుంది.

3. తేనె మరియు పాలు:

3. తేనె మరియు పాలు:

ఒక గ్లాసుడు వేడి పాలను తీసుకోండి.

అందులో ఒక టీస్పూన్ తేనెను జోడించి బాగా కలపండి.

ఉదయాన్నే అలాగే రాత్రిపూట ఇలా తీసుకుంటే అలసట కనుమరుగవుతుంది.

4. తేనె, అల్లం మరియు నిమ్మ:

4. తేనె, అల్లం మరియు నిమ్మ:

ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీటిని తీసుకోండి.

అర టేబుల్ స్పూన్ తేనెను, రెండు టేబుల్ స్పూన్ల అల్లం రసాన్ని అలాగే రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని గోరువెచ్చటి నీటిలో జోడించాలి.

వీటిని బాగా కలిపి రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తాగాలి.

5. తేనె మరియు దాల్చిన:

5. తేనె మరియు దాల్చిన:

ఒక కప్పుడు గోరువెచ్చటి నీటిని తీసుకోండి.

అందులో ఒక టేబుల్ స్పూన్ తేనెను అలాగే అర టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలపండి.

వీటిని బాగా కలపండి.

ఈ మిశ్రమాన్ని రోజూ నిద్రపోయే ముందు తాగండి.

English summary

Health benefits of honey

Honey is known to have plenty of health benefits. Working for long hours can leave one stressed and tired. Consuming honey with green tea or cinnamon helps in getting rid of the stress and tiredness.
Story first published:Tuesday, May 22, 2018, 18:29 [IST]
Desktop Bottom Promotion