For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గౌట్ సమస్యను నిరోధించేలా చేసే 5 ఇంటి చిట్కాలు !

గౌట్ సమస్యను నిరోధించేలా చేసే 5 ఇంటి చిట్కాలు !

|

గౌట్ను "వ్యాధులన్నింటిలోనూ రారాజని" పిలుస్తారు ఎందుకంటే, మన గత చరిత్రలో ఉన్న సంపన్నులలో అధికభాగం వారు మాంసము & మద్యం వంటి గొప్ప ఆహారాన్ని తినాలని కోరుకునేవారు.

కానీ అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు.

home remedies for gout

ఈ రోజుల్లో, పేదలు కూడా మాంసమును తినడానికి & మద్యం తాగడానికి కోరుకుంటారు, వాటి నాణ్యత తక్కువగా ఉన్నప్పటికీ కూడా. ఈ కారణం చేతనే ప్రపంచవ్యాప్తంగా గౌట్ బారిన పడే వారి గణాంకాలు క్రమక్రమంగా పెరుగుతున్నది.

కాబట్టి, మీరు ఈ బాధాకరమైన పరిస్థితితో బాధపడుతున్నట్లయితే, ఇక్కడ మీకు 5 రకాలైన నివారణలు సూచించబడి ఉన్నాయి, వాటిని ప్రతిరోజూ మీరు అప్లై చేయవచ్చు.

1. చెర్రీస్ను తినండి :

1. చెర్రీస్ను తినండి :

గౌట్ అనేది మీ శరీర కీళ్ళ భాగాలైన బొటనవేలు, చీలమండలు, మోకాలు, మోచేతులు, మణికట్లు & చేతి వేళ్లలో యూరిక్ యాసిడ్ క్రిస్టల్ నిక్షేపణ వలన కలిగే ఒక బాధాకరమైన పరిస్థితి. చెర్రీస్లో ఉండే యాంతోసైనిన్లు మీ రక్తంలో గల యూరిక్ యాసిడ్ క్రిస్టల్ స్థాయిలను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. ఈ చెర్రీస్ను ఎక్కువగా తినడం వల్ల గౌట్ సంబంధిత నొప్పులను, వాపులను తగ్గించగలిగే ఒక గొప్ప మార్గం.

వాస్తవానికి, జర్నల్ ఆర్థరైటిస్ & రుమాటాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనంలో, చెర్రీలను తినని రోగులతో - తినే వారిని పోలిస్తే గౌట్ లక్షణాలను 35 శాతం తక్కువగా కలిగి ఉన్నారని కనుగొనబడింది.

2. ఎక్కువగా నీరును తాగండి :

2. ఎక్కువగా నీరును తాగండి :

మీ రక్తంలో ఉన్న యురిక్ యాసిడ్ను మీ మూత్రపిండాల సహాయంతో వాటిని సంగ్రహించి మీ ముత్రము ద్వారా వాటిని మీ శరీరం నుండి బయటకు తొలగించే బాధ్యతను నిర్వర్తిస్తాయి. కానీ మీరు చాలా తక్కువ నీరును త్రాగితే, మూత్రపిండాలు సమర్థవంతంగా పని చేయలేకపోతుంటాయి, దీని వలన రక్తంలో యూరిక్ యాసిడ్ స్ఫటికాల స్థాయి మరింతగా పెరుగుతుంది.

కాబట్టి, మీరు ఎక్కువ నీరును తాగటం వల్ల, మీ శరీర వ్యవస్థలో ఉన్న వ్యర్థాలను, శరీరం నుండి బయటికి పంపించడంలో ముఖ్య పాత్రను పోషించే మూత్రపిండాలకు సహాయం చేస్తుంది. వాస్తవానికి, UCLA హెల్త్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం, గౌట్తో బాధపడుతున్న మహిళలు ప్రతి రోజు కనీసం 2.6 లీటర్ల నీరును & పురుషులకి 3.5 లీటర్ల నీటిని తాగాలి.

3. తక్కువ శాతం కొవ్వును కలిగిన పాలను వాడండి :

3. తక్కువ శాతం కొవ్వును కలిగిన పాలను వాడండి :

కొన్ని ఆహారాలు మీ శరీరంలో యురిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతున్నట్లుగానే, మిగతావి మీ శరీరంలో విష వ్యర్థ పదార్థాల స్థాయిని తగ్గిస్తాయి. తక్కువ కొవ్వును కలిగిన పాలు కూడా ఇదే వర్గంలోకి వస్తాయి.

వాస్తవానికి, న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురించిన ఒక అధ్యయనంలో, తక్కువ కొవ్వు పాలను (లేదా) పెరుగును కనీసం వారంలో రెండుసార్లు తాగితే, వారి రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి 48% వరకూ తగ్గించబడిందని కనుగొన్నారు.

4. మీ ఆహారంలో

4. మీ ఆహారంలో "విటమిన్ సి" కారకాలను పెంచండి :

జాన్ హోప్కిన్స్ విశ్వవిద్యాలయంలో పరిశోధకుల అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ 500 mg విటమిన్-C ను క్రమంగా 2 నెలల పాటు తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలలో తగ్గుదల ఉందని కనుగొనబడింది. అలాగే విటమిన్-సి ను అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది, దీనిని వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనందున, మీరు ఈ సమస్య పరిహారానికి దీనిని కూడా ప్రయత్నించవచ్చు.

5. ప్రోబయోటిక్స్ :

5. ప్రోబయోటిక్స్ :

మీ గౌట్లో ఉన్న వ్యాధికారక బ్యాక్టీరియాల వలసరాజ్యాన్ని నిరోధించేందుకు, ప్రోబయోటిక్స్ అనేది చాలా ప్రయోజనకరమైనది. అలాగే ఒక అధ్యయనం ప్రకారం లాక్టోబాసిల్లి, ప్లాన్టరుం, బ్రీవీస్ వంటి వాటితో కలిపి ప్రోబయోటిక్స్ను తీసుకోవడం వల్ల, మీ రక్తంలో ఉన్న యూరిక్ యాసిడ్ల స్థాయిని తగ్గిస్తుంది.

గుర్తుంచుకోండి : ఎక్కువ మోతాదులో ప్రోబయోటిక్స్ను వాడటమనేది శరీరానికి చాలా ప్రమాదకరం. కాబట్టి వాటిని తగిన మోతాదులో వాడండి.

English summary

5 Easy Home Remedies For Gout

Gout is a painful condition caused by uric acid deposits in your joints. Here are 5 easy home remedies for gout: eat more cherries, drink more water, consume low-fat dairy products, and more.
Story first published:Saturday, April 7, 2018, 15:37 [IST]
Desktop Bottom Promotion