For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెంగ్యూ వచ్చే కారణాల గురించి కొన్ని నిజాలు & నివారణ చిట్కాలు

|

మనందరికీ తెలిసిందే మనిషి జీవితం ఎంత విలువైనదో, దాన్ని అందరం చక్కగా ఎంత వీలైతే అంత సంరక్షించుకోవాలనుకుంటాం. కానీ మనిషి జీవితంలో వచ్చే పెద్ద బాధల్లో ఒకటి మనకొచ్చే జబ్బులు, అవి కొన్ని ముందు తెలిసి వస్తే మరికొన్ని తెలీకుండా వస్తాయి. అలా వచ్చి మన రోజువారీ ఆనందాన్ని కొన్నాళ్ళు హరిస్తాయి లేదా ఇంకా దారుణంగా ప్రాణాంతకంగా కూడా మారుతాయి!

కొన్ని జబ్బులు చాలా చిన్నగా ఉండి వాటంతట అవే తగ్గిపోతాయి, మరికొన్ని తీవ్ర ప్రభావం చూపించి చావుకి కూడా దారితీయవచ్చు!


అలా సోకిన కొన్నిరోజులలోనే ప్రాణాలు తీసుకోగల వ్యాధుల్లో డెంగ్యూ కూడా ఒకటి! మనందరికీ అది ఒక ప్రాణాంతక వైరల్ వ్యాధని తెలుసు,కదా?

అవును, ఈ మధ్య ఈ వ్యాధి ఎక్కువసార్లు వచ్చి బాగా విన్పిస్తూ, సామాన్యమైన పేరు అయిపోయింది!

డెంగ్యూ దోమల వలన సోకి వచ్చే వ్యాధి, ఇది వయస్సుతో ,లింగంతో సంబంధం లేకుండా మలేరియా, చికెన్ గున్యాలాగానే ఎవరికైనా సోకుతుంది.

 Important Facts To Know About The Causes & Prevention Of Dengue

దీనికి కారణాలు, చికిత్సలు, లక్షణాల వంటివి తెలుసుకోవటం చాలా ముఖ్యం, అప్పుడే డెంగ్యూ రాకుండా నివారించవచ్చు!

డెంగ్యూకి సంబంధించిన కొన్ని నిజాలను ఇక్కడ తెలుసుకోండి;

ఉష్ణదేశాలు, సమశీతోష్ణ దేశాలలో డెంగ్యూ ఎక్కువ వస్తుంది.

ఉష్ణదేశాలు, సమశీతోష్ణ దేశాలలో డెంగ్యూ ఎక్కువ వస్తుంది.

డెంగ్యూ దోమల వలన వ్యాపించే వైరల్ వ్యాధి, ఇది ఎక్కువగా భారత్, ఆఫ్రికా, దక్షిణ చైనా, తైవాన్, మెక్సికో,పసిఫిక్ ద్వీపాలు, దక్షిణ అమెరికా వంటి ఉష్ణ, సమశీతోష్ణ దేశాలలో వస్తుంది. ఈ ప్రదేశాలలో వాతావరణం వేడిగా, తేమగా ఉండి దోమలు ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. ఈ దేశాలలో నివసిస్తున్న ప్రజలు మరింత జాగ్రత్తగా ఉంటూ, దోమల వలన వచ్చే వ్యాధులను నివారించుకోటం ఎంత వీలైతే అంత నేర్చుకోవాలి.

మనుషులు, జంతువులు రెండిటికీ ఈ వ్యాధి రావచ్చు

మనుషులు, జంతువులు రెండిటికీ ఈ వ్యాధి రావచ్చు

డెంగ్యూ ఒక వైరల్ వ్యాధి, ఇది ఏడిస్ అనే దోమల జాతి వలన వ్యాపిస్తుంది. డెంగ్యూ వైరస్ ఈ దోమలకి సోకుతుంది. ఈ సోకిన దోమ మనిషిని కుట్టినప్పుడు వైరస్ రక్తం ద్వారా మనిషిలోకి చేరుతుంది. ఈ వ్యాధి కేవలం ఒక్కసారి కుడితేనే వ్యాపించవచ్చు అలాగే మనుషులు కాని ప్రైమేట్లు అయిన కోతులకి కూడా సోకవచ్చు! డెంగ్యూ ఒకరి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్ సోకిన అవయవ దానాలలో, రక్తమార్పిడిలో కొన్నిసార్లు వ్యాపించవచ్చు.

డెంగ్యూ లక్షణాలు

డెంగ్యూ లక్షణాలు

డెంగ్యూ జ్వరం లక్షణాలు సాధారణంగా ఇన్ఫెక్షన్ దోమ కుట్టిన నాలుగు నుంచి ఆరు రోజులకి మొదలవుతాయి. కొన్ని సాధారణ లక్షణాలు హఠాత్తుగా వచ్చే ఎక్కువ జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కంటి వెనుక నొప్పి, తీవ్రమైన కండరాలు,కీళ్ల నొప్పులు, తీవ్ర అలసట, వికారం,వాంతులు, చర్మంపై ర్యాషెస్, వణుకు, ఆకలి లేకపోవటం, కొంచెం ముక్కు లేదా చిగుళ్ల నుంచి రక్తం కారటం వంటివి ఉండవచ్చు.

డెంగ్యూ ఎందుకు అపాయకరం?

డెంగ్యూ ఎందుకు అపాయకరం?

డెంగ్యూ అపాయకరం కావటానికి ఒక ముఖ్య కారణం ఒకసారి ఈ లక్షణాలు కనపడ్డాయంటే, సోకిన ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి, వ్యక్తిలోని రక్తప్రసరణ వ్యవస్థ పాడయి లింఫ్ గ్రంథులు, రక్తనాళాలు,కాలేయం వంటి అవయవాల పనితీరు కూడా దెబ్బతింటుంది. అదనంగా రక్తంలోని ప్లేట్ లెట్ల సంఖ్య వేగంగా పడిపోతూ ఆ వ్యక్తి చనిపోవటానికి కారణమవుతుంది.

డెంగ్యూను నయం చేయవచ్చా?

డెంగ్యూను నయం చేయవచ్చా?

దురదృష్టకర విషయం ఏంటంటే, మిగతా వైరల్ జ్వరాలలాగానే డెంగ్యూను నయం చేయటానికి ప్రత్యేకమైన చికిత్స లేదా మందులు ఏవీ లేవు. మందులు కేవలం లక్షణాలను తగ్గించటానికి, రోగనిరోధక వ్యవస్థను బలపర్చటానికి ఇస్తారు. చాలా విశ్రాంతి, ఎక్కువ ద్రవపదార్థాలు, కొన్ని ప్రత్యేక పెయిన్ కిల్లర్స్ మాత్రమే సాయపడగలవు!

డెంగ్యూ దోమలు పగటి సమయంలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటాయి

డెంగ్యూ దోమలు పగటి సమయంలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటాయి

కొన్ని పరిశోధనల ప్రకారం, డెంగ్యూ వైరస్ కి వాహనంలా ఉండే ఏడిస్ దోమ మిగతా దోమలతో పోలిస్తే పగటి సమయంలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది. ఇంకా ఈ డెంగ్యూ జ్వరం తెచ్చే దోమలు సాధారణంగా మోచేయి, మోకాళ్ల కింద మాత్రమే కుడతాయని నమ్ముతారు!

డెంగ్యూను నివారించటానికి చిట్కాలు

డెంగ్యూను నివారించటానికి చిట్కాలు

ఆథరైజ్డ్ గా డెంగ్యూను నివారించే వ్యాక్సిన్ అంటూ ఇంకా ఏం లేదు. పరిశోధనలు జరుగుతున్నాయి. అందుకని డెంగ్యూను నివారించే ఇతర పద్ధతులేంటో కొన్ని కింద చదవండి;

-మీ పరిసరాలను శుభ్రంగా, ఎక్కడా నీరు పేరుకోకుండా చూసుకోండి, ఎందుకంటే దోమలు అలాంటి చోట్ల ఎక్కువగా పెరుగుతాయి.

-దోమతెరలు, వలలు, రిపెల్లెంట్లు వాడండి.

- మీ శరీరాన్ని పొడవు చేతుల జాకెట్లు, సాక్సులతో కప్పి వుంచుకోండి,ముఖ్యంగా బయటకి వెళ్ళేటప్పుడు ఎంత వీలైతే అంత మంచిది.

- ఇంట్లో ఎసి వాడండి, దోమలు చల్లగాలి ఉన్నచోట ఎక్కువగా రాలేవు.

- మీకు ఒకటి కన్నా ఎక్కువ డెంగ్యూ లక్షణాలు ఉన్నట్లు అన్పిస్తే, వెంటనే డాక్టర్ దగ్గరకి వెళ్ళండి.

-ఆరోగ్యంగా ఉంటూ,తింటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. అలా మీ రోగనిరోధక వ్యవస్థ బలపడి ఈ వ్యాధిని తిప్పికొట్టేలా తయారవుతుంది.

English summary

Important Facts To Know About The Causes & Prevention Of Dengue

Mosquito-borne dengue fever can be deadly, depending on the severity of the infection. Did you know tropical and subtropical countries are more prone to dengue? The dengue mosquito is active during the day time. Dengue can be fatal for people who get diagnosed with it for the second time and there is no treatment to cure it yet.
Desktop Bottom Promotion