For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లివర్ చెడిపోకుండా ఇలా శుభ్రం చేసుకుంటే లక్షల రూపాయల్ని మిగిలించుకోవొచ్చు

కొంతమంది పుట్టుకతోనే లివర్ వ్యాధితో బాధపడుతుంటారు. అలాంటి వారు ఆసుపత్రులకు వెళ్ళి వేల రూపాయలు ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే కచ్చితంగా లివర్ వ్యాధుల నుంచి బయటపడొచ్చు.

|

మన శరీరంలో ప్రతి అవయవం ముఖ్యమైనదే. ఆ అవయవాలు సరిగ్గా పనిచేయాలంటే మనం తినే తిండిపైనే అది ఆధారపడి ఉంటుంది. శరీరంలోని అవయవాల్లో లివర్ కూడా చాలా ముఖ్యమైనది. సాధారణంగా మద్యం అలవాటు ఉన్న వారు లివర్ సంబంధిత వ్యాధుల బారిన పడుతుంటారు.

లివర్ చెడిపోతుంటుంది

లివర్ చెడిపోతుంటుంది

అలాగే అతిగా ఆహారం తినడం, జంక్ ఫుడ్, వేపుళ్లు తీసుకోవడం, ఒత్తిడి, ఆందోళన, కాలుష్యం, పనిభారం, పొగతాగడం, మద్యం సేవించడం... వంటి అనేక రకాల కారణాల వల్ల మన లివర్ చెడిపోతుంటుంది. దీంతో ఆ భాగం శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటికి పంపడంలో విఫలం చెందుతుంది. తద్వారా అనారోగ్యాల బారిన పడతాం.

లివర్ వ్యాధితో బాధపడుతుంటారు

లివర్ వ్యాధితో బాధపడుతుంటారు

కొంతమంది పుట్టుకతోనే లివర్ వ్యాధితో బాధపడుతుంటారు. అలాంటి వారు ఆసుపత్రులకు వెళ్ళి వేల రూపాయలు ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు.

కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే కచ్చితంగా లివర్ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడొచ్చు.

ఎండు ద్రాక్ష

ఎండు ద్రాక్ష

ఎండు ద్రాక్ష లివర్ వ్యాధికి బాగా పనిచేస్తుంది. ప్రతిరోజు కొన్ని ఎండు ద్రాక్షలు తీసుకొని నీటిలో వేసి బాగా కరిగించాలి. ఆ నీటిని ప్రతిరోజు తీసుకోవాలి. ఇలా రెండురోజుల పాటు నాలుగు పూటలు ఎండు ద్రాక్ష తీసుకుంటే చాలా మంచిది. లివర్ శుభ్రం అవ్వడమే కాకుండా వ్యాధులు కూడా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇలా కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే లివర్ సంబంధిత వ్యాధుల నుంచి బయపడొచ్చు.

పసుపు

పసుపు

లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో పసుపు కూడా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. నిత్యం ఒక గ్లాస్ వేడి పాలలో 1/4 టీస్పూన్ పసుపు కలుపుకుని తాగినా చాలు. లివర్ శుభ్రం అవుతుంది. విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.

నిమ్మ జాతి పండ్లు

నిమ్మ జాతి పండ్లు

నిమ్మ, నారింజ, ద్రాక్ష, గ్రేప్ ఫ్రూట్, కివీ లాంటి విటమిన్ సి ఉన్న పండ్లు తినాలి. వీటిల్లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు లివర్‌ను క్లీన్ చేస్తాయి. తరచూ ఈ పండ్లను తింటుంటే లివర్ సమస్యలు రావు. రోజూ ఒక గ్లాస్ వేడి నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగినా చాలు. లివర్ క్లీన్ అవుతుంది.

బీట్‌రూట్, క్యారెట్

బీట్‌రూట్, క్యారెట్

బీట్‌రూట్, క్యారెట్‌లలో ఫ్లేవనాయిడ్లు, బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి లివర్ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. లివర్‌ను శుభ్రం చేస్తాయి.

అవకాడోలు

అవకాడోలు

శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపేందుకు లివర్‌కు గ్లూటాథియోన్ అనబడే సమ్మేళనం అవసరం అవుతుంది. అయితే ఆ సమ్మేళనం ఎక్కువ మోతాదులో కావాలంటే అవకాడోలను తినాలి. దీంతో గ్లూటాథియోన్‌ను లివర్ గ్రహించి తద్వారా శరీరంలో ఉన్న వ్యర్థాలను వెంట వెంటనే బయటకు పంపుతుంది.

ఆకుపచ్చని కూరగాయలు

ఆకుపచ్చని కూరగాయలు

ఆకుపచ్చగా ఉండే ఆకు కూరలు, కూరగాయలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలో ఉండే ఔషధ గుణాలు లివర్‌లో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు పంపి లివర్‌ను శుభ్రం చేస్తాయి. తద్వారా లివర్ పనితనం మెరుగు పడుతుంది.

యాపిల్స్

యాపిల్స్

యాపిల్ పండ్లలో ఉండే పెక్టిన్ లివర్‌కు సహాయ పడుతుంది. ఇది లివర్ మెరుగ్గా పనిచేసేందుకు దోహదం చేస్తుంది. దీంతో వ్యర్థాలు ఎప్పటికప్పుడు శరీరం నుంచి వెళ్లిపోతాయి.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్‌ను తీసుకోవడం వల్ల శరీరం ప్రత్యేకమైన లిపిడ్ సమ్మేళనాలను తయార చేసుకుంటుంది. అవి వ్యర్థాలను గ్రహించి బయటకు పంపుతాయి. దీంతో లివర్‌పై భారం తగ్గుతుంది. తద్వారా లివర్ క్లీన్ కూడా అవుతుంది.

రాగులు, సజ్జలు, జొన్నలు

రాగులు, సజ్జలు, జొన్నలు

రాగులు, సజ్జలు, జొన్నలు వంటి ఆహార పదార్థాలను తరచూ తినాలి. దీంతో లివర్ మెరుగ్గా పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను తొలగిస్తుంది.

వెల్లుల్లి

వెల్లుల్లి

రోజూ రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని పచ్చిగా తినడం అలవాటు చేసుకుంటే చాలు. దాంతో లివర్ సురక్షితంగా ఉంటుంది. లివర్ ఎప్పటికప్పుడు శుభ్రం అవుతుంది. వ్యర్థాలు బయటికి వెళ్లిపోతాయి.

వాల్‌నట్స్

వాల్‌నట్స్

ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్‌కు సహాయం చేస్తాయి. దీంతో లివర్ శుభ్రం అవడమే కాదు, మరింత మెరుగ్గా వ్యర్థాలను బయటకు పంపుతాయి.

గ్రీన్ టీ

గ్రీన్ టీ

క్యాటెకిన్స్ అని పిలవబడే యాంటీ ఆక్సిడెంట్లు గ్రీన్ టీలో పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్‌ను శుభ్రం చేసి లివర్ పనితనాన్ని మెరుగు పరుస్తాయి. రోజూ గ్రీన్ టీ తాగితే లివర్ ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది.

లంగ్స్ , లివర్ ని శుభ్రం చేసుకునే చిట్కా

లంగ్స్ , లివర్ ని శుభ్రం చేసుకునే చిట్కా

ఇక పొగ తాగటం వల్ల చెడిపోయిన లంగ్స్ , లివర్ ని ఇంట్లో కూర్చునే 3 రోజుల్లోనే శుభ్రం చేసుకునే చిట్కా కూడా ఒకటి ఉంది.కావలసిన పదార్ధాలు: సన్నగా తరిగిన ఉల్లిపాయలు 400 గ్రాములు. పసుపు 2 టీ స్పూన్లు. నీరు ఒక లీటరు. ఒక అల్లం కొమ్ము. బ్రౌన్ షుగర్ 400 గ్రాములు.

తయారు చేసే విధానం

తయారు చేసే విధానం

ఒక పాత్రలో నీరు తీసుకొని అందులో బ్రౌన్ షుగర్ వేసి మరిగించాలి. కొద్ది సేపటి తర్వాత అందులో అల్లం కొమ్ము, ఉల్లిపాయలు వేసి మరిగించాలి. చివరగా ఆ మిశ్రమంలో కొద్దిగా తగిగిన అల్లం, పసుపు కలిపి మంటను తగ్గించాలి. ఆ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారాక, రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచాలి.

వాడే విధానం

వాడే విధానం

ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు పరిగడుపున మరియు రాతి పూట భోజనం చేసిన 2గంటల తర్వాత తీసుకోవాలి. దీనికి తో పాటు వ్యాయామం చేస్తే మంచిది. అలాగే వేడి నీటితో స్నానం చేయాలి. 20 నిమిషాలకు మించి స్నానం చేయటం మంచిది కాదు. ఈ విధానాలన్నీ పాటించి లివర్ చెడిపోకుండా శుభ్రం చేసుకుంటే లక్షల రూపాయలు అనవసర ఖర్చును మీరు మిగిలించుకోవొచ్చు.

English summary

liver friendly foods that cleanse your liver

liver friendly foods that cleanse your liver
Desktop Bottom Promotion