For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గొంతు మంటను తగ్గించే 10 ఉత్తమమైన సహజ చిట్కాలు

|

ఒక్కసారి ఊహించుకోండి, ఆఫీసు పని కోసం మీరు ఒక ముఖ్యమైన ప్రజంటేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు; గత రాత్రి నుండి మీరు గొంతులో నొప్పితోనూ మరియు చిరాకుతో మీరు బాధపడుతున్నట్లయితే ఎలా ఉంటుంది మీకు !

అలాంటి పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా ఆందోళనను చెందవచ్చు. ఎందుకంటే, ప్రజెంటేషన్లో మాట్లాడటానికి నిలకడగా ఉన్న స్వరం అనేది చాలా అవసరం మరియు మీరు గొంతు సమస్య కలిగి ఉండటం వల్ల, మీరిచ్చే ప్రజెంటేషన్తో పాటు అది కూడా బయటపడవచ్చు.

పైన వివరించిన పరిస్థితులతో మీకు సంబంధం గాని ఉన్నట్లయితే, మీరు మీ జీవితంలో కనీసం ఇలాంటి పరిస్థితులను రెండుసార్లైనా ఎదుర్కొంటారని స్పష్టమవుతోంది, ఎందుకంటే గొంతు నొప్పి అనేది చాలా సాధారణంగా వచ్చే వ్యాధి.

80% మంది ప్రజలందరూ కనీసం ఏడాదికి ఒకసారైనా సాధారణమైన జలుబును (లేదా) ఫ్లూ బారిన పడుతున్నారు, అలానే వాటితో పాటు ఎంతో బాధాకరమైన గొంతునొప్పిని సమస్యను కూడా ఎదుర్కొంటున్నారు.

నిజానికి, గొంతునొప్పి అనేది కూడా సాధారణ జలుబు (లేదా) ఫ్లూ లక్షణాల వంటిది కావచ్చు; అయితే, ఇది ఇతర ఆరోగ్య పరిస్థితులను కూడా సూచిస్తుంది.

గొంతునొప్పి అనేది శ్వాసకోశ నాళంలో పాటు గొంతులో కూడా వైరస్ (లేదా) బ్యాక్టీరియాలతో నిర్మించబడిన ఒక సమూహమని చెప్పవచ్చు.

పైన తెలిపిన ప్రక్రియలో ఇన్ఫెక్షన్లు మరియు మంటల ఫలితంగా గొంతు పొడి బారాడం, గొంతులో దురదగా ఉండటం, నొప్పిని కలిగి ఉండటం, పుండ్లు పడటం, ఆహారాన్ని మరియు నీటిని మ్రింగుటలో కష్టం వంటి ఇతర లక్షణాలకు కారణమవుతుంది.

సాధారణంగా గొంతు నొప్పి అనేది జ్వరం, దగ్గు, జలుబు వంటివి ఎదురైన పరిస్థితుల్లోనూ; అలానే ఫ్లూ (లేదా) మైక్రోబయల్ ఇన్ఫెక్షన్ వంటి పరిస్థితుల్లోనూ ఎదురయ్యే ఒక లక్షణంగా చెప్పవచ్చు.

ఏదిఏమైనప్పటికీ, మీరు తీవ్రమైన గొంతునొప్పితో చాలాకాలంగా బాధపడుతున్నట్లయితే అది టాన్సిల్స్, లైంగిక సంక్రమణ వ్యాధులు (లేదా) క్యాన్సర్ వంటి పెద్ద ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది.

కాబట్టి, పైన తెలిపిన సందర్భంలో, మీరు వెంటనే ఒక ప్రొఫెషనల్ను సంప్రదించడం చాలా ముఖ్యం.

ఔషధాలతో పాటుగా, గొంతుకు సంబంధించిన గార్గ్లింగ్ ద్రవాలను ఉపయోగించడం వల్ల, కొన్ని రకాల సూక్ష్మజీవుల వలన సంభవించిన గొంతు ఇన్ఫెక్షన్లను పోగొట్టి, మళ్లీ మీ గొంతును సహజమైన స్థితికి తీసుకురావడానికి సహాయపడుతుంది.

కాబట్టి, ఇక్కడ కొన్ని సహజమైన గార్గ్లింగ్ చిట్కాలు ఉన్నాయి, ఇవి గొంతునొప్పిని సహజంగానే నయం చేయగలవు; వాటిని మీరు కూడా ఒకసారి చూడండి.

1. ఉప్పు నీటితో పరిహారం :

1. ఉప్పు నీటితో పరిహారం :

చాలా యుగాలకు ముందు నుండి దీనిని అన్ని ఇళ్లలో ఉపయోగించబడే అత్యంత సాధారణమైన గొంతునొప్పి నివారణులలో ఒకటి, కానీ చాలా ప్రభావవంతమైనది కూడా ! వేడినీటిలో 1-2 టేబుల్ స్పూన్ల ఉప్పును కలిపి సుమారు 5 నిముషాల పాటు గార్గ్లింగ్ చెయ్యడం వల్ల గొంతునొప్పికి కారణమైన బ్యాక్టీరియాను ఉప్పు చంపడం వల్ల, మీ గొంతుకు చికిత్సను చేయవచ్చు.

2. అల్లం కషాయం :

2. అల్లం కషాయం :

ఈ అల్లం కషాయమును గార్గ్లింగ్ చెయ్యడం వల్ల మీ గొంతులోని సూక్ష్మజీవులను చంపి, గొంతు వాపును తగ్గించడం ద్వారా గొంతునొప్పి నుండి మీకు ఉపశమనం కలిగించవచ్చు. ఒక కప్పు వేడినీటిలో 1 టీ స్పూను తేనెను, ½ టీ స్పూను పంచదారను, 1 టీ స్పూను పంచదారను కలిపిన పానీయాన్ని తయారు చెయ్యాలి. దీన్ని నోటిలో వేసుకొని 5 - 10 నిమిషాల వరకూ పుక్కిలించిన తర్వాత బయటకు ఓసేయ్యలి.

3. కైయేన్ పెప్పర్ లిక్విడ్ :

3. కైయేన్ పెప్పర్ లిక్విడ్ :

ఈ చిట్కాను మొట్టమొదటగా ప్రయోగించేటప్పుడు భయానకంగా అనిపించవచ్చు, కాని ఇది చాలా అద్భుతంగా పని చెయ్యగలదని నిరూపించబడింది, కైయేన్ పెప్పర్ లో గొంతునొప్పిని తగ్గించే అద్భుతమైన యాంటీబాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. 2 చిటికెల కైయేన్ మిరియాల పొడిని వేడి నీటిలో వేసి బాగా కలిపి, 2 నిముషాలు పాటు గార్గ్లింగ్ చెయ్యండి. మరియు ఊరగాయలో చేర్చండి. ఇలా రోజుకు రెండు సార్లు చేయటం వల్ల మీ గొంతు మొదట మంటగా ఉండవచ్చు, కానీ తర్వాత మీ గొంతును చాలా సాధారణమైన స్థితికి తీసుకురాగలదు.

4. వెనిగర్ చిట్కా :

4. వెనిగర్ చిట్కా :

వెనిగర్, అసాధారణమైన యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగిన వంట పదార్ధంగా ఉంటూ ఇది మీ గొంతునొప్పికి చికిత్సను అందచేస్తుంది. ఒక కప్పు వేడి నీటిలో 2 టీస్పూన్ల వెనిగర్ను జోడించండి. ఈ మిశ్రమాన్ని 5 నిమిషాల పాటు మీ గొంతుతో ఉంచి, బాగా పుక్కిలించండి.

5. పెప్పర్మిట్ ఆయిల్ :

5. పెప్పర్మిట్ ఆయిల్ :

పెప్పర్మిట్ ఆయిల్ అనేది మీ గొంతునొప్పి లక్షణాలను త్వరగా తగ్గించడంలో సహజసిద్ధమైనదిగానూ, మరియు చాలా ప్రభావవంతమైనదిగా ఉంటుంది. ఒక కప్పులో వేడి నీటిలో పెప్పర్మిట్ ఆయిల్ యొక్క 4-5 చుక్కలను వేసి, 5 నిమిషాల పాటు గార్గ్లింగ్ చెయ్యండి. ఇలా రోజుకు రెండుసార్లు చెయ్యడం వలన మీ గొంతునొప్పిని పోగొట్టుకోండి.

6. బేకింగ్ సోడాతో చిట్కా :

6. బేకింగ్ సోడాతో చిట్కా :

బేకింగ్ సోడాలో ఉన్న సమ్మేళనాలు కూడా గొంతు సమస్యలకు దారితీసే లక్షణాలను మరియు ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో విజయం సాధించగలదని నిరూపించబడింది. ¼ టీస్పూన్ ఉప్పు మరియు ¼ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను ఒక కప్పులో వేడి నీటిలో వేసి కలపండి. గొంతు నొప్పి లక్షణాలు పూర్తిగా తగ్గే వరకూ ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు 5 నిమిషాల పాటు గార్గ్లింగ్ చెయ్యండి.

7. పసుపు పొడితో చిట్కా :

7. పసుపు పొడితో చిట్కా :

ఈ యొక్క చిట్కా ఆయుర్వేదం ద్వారా సిఫారసు చేయబడినది మరియు ఇది సైన్స్ చేత సమర్ధించబడినది, ఎందుకంటే పసుపు అనేది గొంతులో ఉన్న బాక్టీరియాను చంపగల శక్తివంతమైన మరియు సహజసిద్ధమైన యాంటీ బాక్టీరియల్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఒక కప్పు వేడి నీటిలో 1 టేబుల్ స్పూన్ పసుపును కలపాలి. అలా కలిపిన పానీయంతో 5-10 నిమిషాల వరకూ గార్గ్లింగ్ చెయ్యాలి.

8. మెంతుల చిట్కా :

8. మెంతుల చిట్కా :

మెంతులు అనేవి మంచి శక్తివంతమైన ఆహార పదార్ధాలలో ఒకటి, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. గొంతునొప్పికి చికిత్సను చేయడంతో పాటు, ఇది శోథ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఒక కప్పు వేడి నీటిలో ఒక టేబుల్ స్పూన్ మెంతుల పొడిని బాగా కలిపి, ఈ పానీయాన్ని 5 నిముషాలపాటు మీ గొంతులో ఉంచి, బాగా పుక్కిలించి బయటకు ఉసేయ్యండి.

9. లవంగ నూనె :

9. లవంగ నూనె :

గొంతు ఇన్ఫెక్షన్కు కారణమైన బ్యాక్టీరియాలను నివారించేందుకు చికిత్స చేయడంలో లవంగ నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక కప్పు వేడి నీటిలో 4-5 చుక్కల లవంగ నూనె చేర్చి, దానిని మీ గొంతులో 5 నిముషాల పాటు పుక్కిలించి ఉసేయడం వల్ల, గొంతుమంట ప్రభావాలను తగ్గించడానికి సహాయపడుతుంది.

10. టమోటా జ్యూస్ :

10. టమోటా జ్యూస్ :

టమోటాలో పుష్కలంగా దొరికే విటమిన్-సి మరియు లైకోపీన్ అనే ఈ రెండూ విశేషమైన అంశాలను మీ గొంతును ప్రభావితం చేసే బాక్టీరియాను చంపడంలో సహాయపడుతుంది. ½ కప్పు టమోటా రసం ½ కప్పు నీటిని జోడించి, ఈ మిశ్రమాన్ని బాగా వేడి చేయండి. ఈ మిశ్రమాన్ని 5 నిమిషాలు పాటు మీ గొంతులో ఉంచి బాగా పుక్కిలించి ఉసేయడం.

pinterest

pinterest

English summary

10 Best Natural Sore Throat Remedies

Having a sore throat is a big inconvenience and very irritating. Try these natural gargle-based home remedies for quick relief from your pain. Salt water gargle, ginger water, and baking soda gargle are a few best examples. Know about the others here!
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more