Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
పార్కిన్సన్స్ వ్యాధి వణుకుడు రోగం ఎలా వస్తుందో తెలుసా? రోజూ కాఫీ తాగితే ఆ భయంకరమైన వ్యాధి బారిన పడం
మెదడులోని కొన్ని నాడీ కణాలు దెబ్బతింటే పార్కిన్సన్స్ కు గురవుతారు. ముఖ్యంగా డోపమైన్ రసాయనం తయారు చేసే కణాలు దెబ్బతింటే ఈ వ్యాధి బారినపడతారు. దీంతో చేతులు వణికే సమస్యకు గురవుతారు. క్రమంగా కాళ్లతో పాటు
పార్కిన్సన్స్ వ్యాధి. ఈ వ్యాధి పేరు తెలియకపోవొచ్చుగానీ చాలా మంది జనాలు దీని బారిన పడుతూనే ఉంటారు. ఇది మనిషిని వణికించేస్తుంది. దీన్ని వణుకుడు వ్యాధి అంటారు. ఇది నరాల వ్యాధి.
మెదడులోని కొన్ని నాడీ కణాలు దెబ్బతింటే పార్కిన్సన్స్ కు గురవుతారు. ముఖ్యంగా డోపమైన్ రసాయనం తయారు చేసే కణాలు దెబ్బతింటే ఈ వ్యాధి బారినపడతారు. దీంతో చేతులు వణికే సమస్యకు గురవుతారు. క్రమంగా కాళ్లతో పాటు తల కూడా వణుకుడుకు గురవుతుంది.

కాస్త ఏజ్ ఎక్కువయ్యాకే
కాస్త ఏజ్ ఎక్కువయ్యాకే చాలా మంది పార్కిన్సన్స్ వ్యాధి బారినపడతారు. అయితే కొందరు చిన్న వయస్సులోనే దీని బారినపడే అవకాశం ఉంది.

రోజూ తినే ఆహారం
మెదడులో డోపమైన్ లోపం తలెత్తేందుకు కొన్ని కారణాలున్నాయి. సాధారణంగా మనం రోజూ తినే ఆహారం మొత్తం కూడా క్రిమి కీటకాలను నాశనం చేసేందుకు ఉపయోగించే మందులను వాడి పండిస్తుంటారు.

డోపమైన్ రసాయనం
అలాంటి ఆహారాలను మనం తినడం వల్ల క్రమంగా మెదడులో డోపమైన్ రసాయనం ఉత్పత్తి చేసే నరాలు దెబ్బతింటాయి. దీంతో మనిషి వణుకుడు వ్యాధి బారినపడతారు.

బాడీ మొత్తం వంగిపోతుంది
ఈ వ్యాధి ఏర్పడితే తినే పదార్థాలు రుచి గురించి మనకు తెలియదు. దాని వాసన కూడా తెలియదు. ముఖంలో చాలా మార్పులు వస్తాయి. బాడీ మొత్తం వంగిపోతుంది. చేతివేళ్లు ఎక్కువగా వణకడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆ వ్యాధి ముదిరిందని అర్థం.

సర్జరీ లేకుండా
అయితే పార్కిన్సన్ వ్యాధిని ప్రథమ దశలో గుర్తిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. సర్జరీ లేకుండా మందుల ద్వారానే దీన్ని నయం చేసుకోవొచ్చు.

సర్జరీలు
పార్కిన్సన్స్ వ్యాధి కోసం ఇప్పుడు కొన్ని రకాల సర్జరీలు కూడా ఉన్నాయి. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, అలాగే స్టెమ్ సెల్ ఇంప్లాంట్ లాంటి సర్జరీలున్నాయి.

కాఫీ తాగడం
అయితే పార్కిన్సన్స్ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే రోజూ కాఫీ తాగడం మంచిదని కొన్ని పరిశోధనల్లో తేలింది. కాఫీ గింజల్లో ఈహెచ్‌టీ ఉంటుంది. దీనివవల్ల పార్కిన్సన్స్ వ్యాధికి గురికాకుండా ఉండొచ్చు.



Click it and Unblock the Notifications
