For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెజర్ అల్సర్స్ : కారణాలు, లక్షణాలు, దశలు & చికిత్స మార్గాలు !

|

ప్రెజర్ అల్సర్స్, దీనినే డెక్యుబిటస్ అల్సర్ (లేదా) దీర్ఘకాలం మిమ్మల్ని మంచాన పడేసే వ్రణమని కూడా పిలుస్తారు. అయితే ఇది మీ చర్మంపై దీర్ఘకాలిక ఒత్తిడి, తీవ్రమైన రాపిడి, కోతలు ఏర్పడిన కారణంగా సంభవించే వ్రణము వంటిది. ఇది మన శరీరంలో అస్థి (ఎముక) ప్రాంతంపై కప్పి ఉన్న చర్మంపై సంభవించే బహిరంగ గాయం.

దీర్ఘకాలం మిమ్మల్ని మంచాన పడేసే ఈ వ్రణము (పుళ్ళు) సాధారణంగా వెన్ను, హిప్, టైల్ బోన్ & చీలమండ వద్ద తరచుగా సంభవిస్తుంది కానీ, ఈ పరిస్థితికి అత్యవసర చికిత్సను తప్పక అందించాలి.

ప్రెజర్ అల్పర్స్ లక్షణాలు:

ప్రెజర్ అల్పర్స్ లక్షణాలు:

ఈ అల్సర్లో 4 విభిన్న దశలు ఉన్నాయి. ప్రతి దశలో దాని లక్షణాలు మారుతూ ఉంటాయి. కానీ వీటి సాధారణ లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.

* బయటకు తెరుచుకున్న చర్మం,

* చర్మం రంగు మారడం,

* చర్మాన్ని తాకినప్పుడు దాని రంగుని కోల్పోకపోవడం,

* ఇన్ఫెక్షన్,

* ప్రభావిత చర్మ ప్రాంతంలో నొప్పి ఏర్పడటం,

* చుట్టూ ఉన్న చర్మ ప్రాంతంతో పోలిస్తే ప్రభావిత చర్మము మృదువైనదిగా కలిగి ఉండటం.

ప్రెజర్ అల్పర్స్ 4 దశలను కలిగి ఉన్నాయి :-

ప్రెజర్ అల్పర్స్ 4 దశలను కలిగి ఉన్నాయి :-

1వ దశలో :-

మొదటి దశలో, మీ చర్మంపై ఏర్పడే పుళ్ళు తెరిచిన గాయాలుగా మారవు, చర్మం పగలదు కానీ ఇది బాధాకరమైనది ఉండొచ్చు. చర్మం ఛాయను బట్టి చూస్తే మీ చర్మము పాలిపోయినట్లుగా కనిపిస్తుంది. మీరు ఈ మొదటి దశలో ఏర్పడిన పుళ్ళను చూస్తే చాలా మృదువైన వాటిగా కనపడతాయి.

2వ దశలో :-

2వ దశలో :-

ఈ రెండవ దశలో, చర్మం తెరుచుకోవడంతో పాటు పుళ్ళ నిర్మాణానికి దారి తీస్తుంది, ఇది చాలా బాధాకరమైనదిగా ఉంటుంది. ఈ దశలో ద్రవంతో నిండిన పుళ్ళు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఏర్పడిన గాయం చుట్టూ చనిపోయిన కణజాలం & దెబ్బతిన్న చర్మం ఏర్పడటాన్ని మీరు గమనించవచ్చు.

3వ దశలో :-

3వ దశలో :-

మూడవ దశలో, ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతుంది, పుండు చర్మం క్రింద లోతుగా ఏర్పడి ఉంటాయి. అలాగే ఇది మీ కొవ్వు పొరను చీల్చుకుని ఏర్పడిన గొయ్యలా కనిపించే ప్రతికూలంగా ప్రభావానికి దారితీస్తుంది. పుండ్లలో చీము ఏర్పడటాన్ని మీరు ఈ దశలో చూడవచ్చు.

4వ దశలో :-

4వ దశలో :-

ఈ దశలో, మీకు ఏర్పడిన గాయం ఎముకలను & కండరాలను ప్రభావితం చేస్తుంది. ఈ గాయం చాలా లోతైనదిగా ఉంటూ, మీ కండరాలలోకి & ఎముకలలోకి చేరుకుని, వాటికి మరింత నష్టాన్ని కలిగిస్తుంది. ఈ పరిస్థితి లోతైన కణజాలమును, కండరాగ్రముకు నష్టం ఏర్పరిచే మీ కండరాల సమూహాలను విచ్ఛిన్నం చేయవచ్చు. ఈ దశలో, చనిపోయిన చర్మకణాలతో ఏర్పడిన బొబ్బలను మీరు చూడవచ్చు.

ప్రెజర్ అల్సర్స్ ఏర్పడటానికి గల కారణాలు :-

ప్రెజర్ అల్సర్స్ ఏర్పడటానికి గల కారణాలు :-

ప్రెజర్ అల్సర్స్, ఈ పేరును సూచించినట్లుగానే ఇది ఒత్తిడి వలన కలుగుతుంది. మీరు మీ శరీరంలోని ఒక ప్రత్యేక భాగాన్ని దీర్ఘకాలంగా ఒకే స్థితిలో ఉంచినట్లైతే, ప్రభావిత చర్మము విచ్ఛిన్నం కావచ్చు. కీళ్ళు & మృదులాస్థుల దగ్గర ఉన్న చర్మం చాలా సన్నగా ఉన్నందున మీ తుంటి, టైల్ బోన్ & చీలమండ దగ్గర ఎక్కువగా ప్రభావితమవుతుంది.

మీరు మీ చర్మం యొక్క ఉపరితలాన్ని తీవ్రంగా రుద్దుకున్నట్లయితే, అది డీబ్యూబిటస్ అల్సర్కు కారణమవుతుంది.

 ప్రెజర్ అల్సర్తో ఎక్కువగా బాధపడేవారు ఎవరు?

ప్రెజర్ అల్సర్తో ఎక్కువగా బాధపడేవారు ఎవరు?

ఈ ప్రెజర్ అల్సర్స్ అనేవి ఈ క్రింద తెలిపిన వారిలో సాధారణంగా సంభవిస్తాయి. వారు ఎవరంటే,

* మంచానపడ్డ వారు

* సాధారణంగా చక్రాల కుర్చీలకు పరిమితమైన వారు

* వృద్ధులు

* పెళుసుగా ఉండే చర్మం గల వ్యక్తులు

* రోగులు

* వారి శరీర భాగాలను తరలించడంలో ఇతరులపై ఆధారపడే రోగులు

* తగినంత పోషక పదార్థాలను తినని వ్యక్తులు

* శరీరం & చర్మాన్ని హైడ్రేట్గా ఉంచడానికి తగినంత నీరును త్రాగని వ్యక్తులు

పైన చెప్పిన ఏదైనా పాయింట్లతో మీకు సంబంధం ఉన్నట్లయితే, మీరు ఈ పరిస్థితిని ఎదుర్కొనే ఎక్కువ అవకాశం ఉంటుంది. మీరు తీసుకునే ఆహారం అన్ని రకాలైన పోషకాలను కలిగి ఉండేలా నిర్ధారించుకోండి & మీ చర్మాన్ని హైడ్రేట్గా ఉంచకుండా నిరోధించడానికి మీరు తగినంత నీరు త్రాగాలి. రోగులు, వృద్ధులు & ఇతరులపై ఆధారపడే రోగులు ఈ సమస్య బారిన పడకుండా ఉండేందుకు అదనపు జాగ్రత్తలను తీసుకోవాలి.

ప్రెజర్ అల్సర్ను ఎలా నిర్ధారించుకోవాలి ?

ప్రెజర్ అల్సర్ను ఎలా నిర్ధారించుకోవాలి ?

వైద్యులు కొన్ని విషయాలు గుర్తించడం ద్వారా మీ ఈ సమస్యను కలిగి ఉందినట్లుగా నిర్ధారించగలరు. అవి,

1. మీకు ఏర్పడిన పుండ్ల లోతు & పరిమాణం

2. పుండ్ల ఫలితంగా చర్మపు రంగులో వచ్చే మార్పు

3. ప్రెజర్ అల్సర్ కారణంగా దెబ్బతిన్న కణజాలం

4. ఈ అల్సర్ కారణంగా చర్మానికి ఏర్పడిన నష్టము & మృత కణజాలము

5. ఈ పుండ్ల ప్రస్తుత పరిస్థితి కారణంగా జరిగే రక్తస్రావం, దుర్వాసన.

ప్రెజర్ అల్సర్ను చికిత్స చేయడం :-

ప్రెజర్ అల్సర్ను చికిత్స చేయడం :-

ఈ ప్రెజర్ అల్సర్ను చికిత్స చేయటమనేది దాని దశపై ఆధారపడి ఉంటుంది. ఈ సమస్యను నివారించడానికి శస్త్రచికిత్స / మందులు / థెరపీలు అవసరం కావచ్చు. ఇలాంటి పరిస్థితికి గురైన రోగులకు ఉపశమనం కలిగించడానికి యాంటీబ్యాక్టీరియల్ వంటి ఔషధాలను కూడా చికిత్సలో భాగంగా ఉపయోగిస్తారు.

ఈ అల్సర్ కారణంగా చనిపోయిన బ్రతకాలని తొలగించేందుకు, డి-బ్రిడిమెంట్(debridement) అనే ప్రక్రియను డాక్టర్లు ఉపయోగించవచ్చు. మీకు ఏర్పడిన గాయానికి దుమ్ము, దూళి వంటివి చాలా దూరంగా ఉండేలా నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. ఈ అంశమే మీ గాయమును నయం చేయడంలో చాలా కీలకంగా వ్యవహరిస్తుంది.

అల్సర్ కారణంగా ఏర్పడిన పుండ్లను క్రమం తప్పకుండా డాక్టర్ చేత పరిశుభ్రంగా నిర్వహించబడినట్లయితే, ఇతర అంటువ్యాధులు సోకకుండా నివారించవచ్చు.

English summary

Pressure Ulcers (Bedsores): Causes, Symptoms, Stages and Treatment

Pressure ulcers aka decubitus ulcers or bed sores refer to a condition which has 4 stages. In this condition, an open wound occurs on the skin covering the body's bony region. This condition is highly treatable; the treatment depends on the stage of the ulcer. Pain in the affected region, skin dicolouration, infection, etc. are some of its symptoms.
Story first published: Monday, August 20, 2018, 14:45 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more