For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  అధిక బరువుతో అనార్థాలెన్నో..మీరు ఊహించనన్ని సైడ్ ఎఫెక్ట్స్ !

  By Mallikarjuna
  |

  శరీరంలో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉండటాన్ని స్థూలకాయం అంటారు. నేటి సమాజంలో స్థూల కాయం అధికంగా విస్తరిస్తున్నది. మనిషిలో స్థూల కాయం క్రమేణా పెరుగుతూ తరచు జీవితాంతం కొన సాగుతుంది. ఇతర దేశాల్లోలాగే మన దేశంలో కూడా స్థూలకాయం ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా రూపొందుతున్నది. సుమారు 2.2 కోట్ల మంది భారతీయులు స్థూలకాయం (ఒబేసిటీ)తో, అందులో ప్రత్యేకంగా ఉదర స్థూలకాయం (అబ్డామినల్‌ ఒబేసిటీ) తో బాధపడుతున్నారని అంచనా. 'న్యూట్రిషన్‌ ఫౌండే షన్‌ ఆఫ్‌ ఇండియా వారి అధ్యయనం ప్రకారం ఢిల్లీ లోని మధ్య తరగతి పురుషుల్లో 32.3 శాతం, మధ్య తరగతి స్త్రీలలో 50 శాతం మంది స్థూల కాయులని వెల్లడైంది. ఒక మనిషిని పరిశీలించి, ఆ మనిషి స్థూల కాయుడా, కాదా అని దాదాపు ఖచ్చితంగా చెప్పవచ్చు. స్థూలకాయాన్ని నిర్ధారణ చేసే పరీక్షల్లో

  బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బిఎంఐ), నడుము తుంటి నిష్పత్తి (వెయిస్ట్‌-హిప్‌ రేషియో), నడుము చుట్టుకొలత ముఖ్యమైనవి.

  కొందరు స్థూలకాయంతో ఆరోగ్య సమస్యలు ఏమొస్తాయిలే అనీ, ఒక వయసు తర్వాత పొట్ట రావడం మామూలే అని అనుకుంటారు. నిజానికి ఒళ్లంతా కొవ్వు పేరుకుపోవడం ద్వారా లావెక్కిపోయి వచ్చే స్థూలకాయం కంటే పొట్టచుట్టూ కొవ్వు పేరుకునిపోవడమే అత్యంత ప్రమాదకరం. పొట్టచుట్టూ కొవ్వు పేరుకుని పోవడాన్ని సెంట్రల్ ఒబేసిటీ అంటారు. మన పొట్ట చుట్టూ అనేక పొరలు ఉంటాయి. సెంట్రల్ ఒబేసిటీలో చర్మం కిందనే కాకుండా, కండరాల లోపలివైపు, జీర్ణాశయం, పేగుల చుట్టు కూడా కొవ్వు పేరుకొనిపోతుంది. డయాబెటిస్, హైబీపీ, రక్తలో కొవ్వు శాతం పెరగడం (హైపర్‌లిపిడిమియా) వంటి సమస్యలు వచ్చే అవకాశం... సాధారణ స్థూలకాయం కంటే సెంట్రల్ ఒబేసిటీలో చాలా ఎక్కువ. కాబట్టి పొట్ట పెరుగుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.

  స్థూలకాయానికి మితి మీరి భుజించడం, తగినంత వ్యాయామం లేకపోవడం, శరీరం తక్కువ కేలరీలను ఖర్చు చేయడం ప్రధాన కారణాలు. వంశపారంపర్య, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, శరీర ధార్మిక, జీవన క్రియలకు సంబంధించిన అంశాల ప్రభావం శరీర బరువు మీద ఉంటుంది. అధిక బరువుతో మీరు ఊహించని అనర్థాలెన్నో ఈ క్రింది విధంగా తెలుసుకోండి.

  1. మలబద్దకం

  1. మలబద్దకం

  సాధారణంగా మలబద్దకం ఉన్నవారు, మోషన్ సరిగా పాస్ చేయాలి. ప్రేగుల్లో కదలికలు కష్టం అవుతుంది. ఇది జీర్ణవ్యవస్థకు, ఆహారపు అలవాట్లకు సంబంధించిన ఉంటుంది. మలబద్దకానికి మరో కారణం ఎక్సెస్ బాడీ ఫ్యాట్ వల్ల స్టూల్ పాస్ చేయడం కష్టం అవుతుంది.

  2. జ్ఝాపకశక్తిని కోల్పోవడం

  2. జ్ఝాపకశక్తిని కోల్పోవడం

  స్థూలకాయం వల్ల జ్ఝాపకశక్తి కోల్పోతారన్న విషయం ఏఒక్కరూ ఊహించరు. శరీరంలో ఎక్సెస్ ఫ్యాట్ ఉన్నట్లైతే కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా పెరుగుతాయి. శరీరంలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు బ్రెయిన్ సెల్స్ డీజనరేట్ అవ్వడం వల్ల జ్ఝాపకశక్తిని కోల్పోవడం జరుగుతుంది. చిన్న వయస్సులోనే జ్ఝాపశక్తి కోల్పోవడం, మతిమరుపు సమస్యలను ఎదుర్కొంటారు.

  3. గాల్ స్టోన్

  3. గాల్ స్టోన్

  గాల్ స్టోన్ బైల్ , ఫ్యాట్, కొలెస్ట్రాల్ లు గాల్ బ్లాడర్ లో చేరడం వల్ల రాళ్ళు లాగ ఏర్పుడుతాయి, దాంతో వివిధ రకాల లక్షణాలు కనబడుతాయి. గాల్ స్టోన్స్ కు ముఖ్య కారణం ఓబేసిటి, ఎక్సెస్ ఫ్యాట్ మరియు కొలెస్ట్రాల్ వల్లే గాల్ బ్లాడర్ లో రాళ్ళు ఏర్పడుటకు కారణం అవుతాయి.

  4. మైగ్రేన్

  4. మైగ్రేన్

  మైగ్రేన్ వల్ల నరాల్లో ఇన్ఫ్లమేషన్ కారణంగా తలనొప్పి, ఇతర లక్షణాలు కనబడుతాయి. అంతే కాదు, ఓవర్ వెయిట్ వల్ల , ఎక్సెస్ ఫ్యాట్ వల్ల కూడా మైగ్రేన్ వస్తుందని, వివిధ రకాల పరిశోధనల్లో తేలింది . దాంతో బ్రెయిన్ కు ఆక్సిజన్ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల మైగ్రేన్ తలనొప్పి వస్తుంది.

  5. ప్రీమెచ్యుర్ బర్త్

  5. ప్రీమెచ్యుర్ బర్త్

  ఓవర్ వెయిట్ వల్ల ఇన్ఫెర్టిలిట్ చాన్సెస్ ఎక్కువ అని మనలో చాలా మందికి తెలిసిన విషయమే. ఓవర్ వెయిట్ వల్ల హార్మోనుల్లో మార్పులు దాంతో సంతానలోపం, ప్రీమెచ్యుర్ బేబీలు పుట్టడం ఇవన్నీ కూడా , బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ వల్ల హార్మోనులు అసమతుల్యతల వల్ల ఏర్పడుతాయి.

  6. ఓస్టిరియో ఆర్థ్రైటిస్

  6. ఓస్టిరియో ఆర్థ్రైటిస్

  ఓస్టిరియో ఆర్థ్రైటిస్ వల్ల మోకాళ్ళలో కార్టిలేజ్ బోన్స్, మడమలు, మోచేతులు , జాయింట్ మూమెంట్ బాధాకరంగా , అసౌకరంగా మారుతుంది. ఎక్సెస్ బాడీ ఫ్యాట్ వల్ల చాలా మందిలో జాయింట్స్ మీద ఒత్తిడి ఎక్కువ పడటం వల్ల నొప్పులు ఎక్కువ అవుతాయి.

  7. ప్రొస్టేట్ క్యాన్సర్

  7. ప్రొస్టేట్ క్యాన్సర్

  ప్రొస్టేట్ క్యాన్సర్ చాలా సాధారణమైనది. ఇది ప్రొస్టేట్ గ్రంధుల మీద ప్రభావం చూపుతుంది. ఎక్సెస్ బాడీ ఫ్యాట్ ప్రొస్టేట్ గ్రంథులు పెద్దవిగా మారినప్పుడు జరుగుతుంది. ఇది క్యాన్సేరియస్ సెల్స్ మీద ప్రభావం చూపుతుంది. దాంతో ప్రాణాంతక క్యాన్సర్ కు దారితీస్తుంది.

  8. యుటేరియన్ క్యాన్సర్

  8. యుటేరియన్ క్యాన్సర్

  ఓవర్ వెయిట్ వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ , యుటేరియన్ క్యాన్సర్ కు దారితీస్తుంది. ఎక్సెస్ బాడీ ఫ్యాట్ వల్ల యూట్రస్ పెద్దగా పెరగడం వల్ల యూట్రస్ క్యాన్సర్ కు దారితీస్తుంది.

  9. ఎండోక్రైన్ డిజార్డర్

  9. ఎండోక్రైన్ డిజార్డర్

  ఎండోక్రైన్ గ్రంథులు రక్తంలోకి వివిధ రకాల హార్మోనులను ఉత్పత్తి చేస్తుంది, ఇది శరీరానికి చాలా అవసరం. ఎక్సెస్ బాడీ ఫ్యాట్ హెల్తీ ఎండోక్రైన్ హార్మోనులను నివారించడం వల్ల హార్మోనుల్లో అసమతుల్యత ఏర్పడుతుంది.

  10. ఫంగల్ ఇన్ఫెక్షన్స్

  10. ఫంగల్ ఇన్ఫెక్షన్స్

  ఓవర్ వెయిట్, లేద స్థూలకాయం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. ఎక్సెస్ బాడీ ఫ్యాట్ కారణంగా పర్ప్సిరేషన్ ఎక్కువ ఉత్పత్తి అవ్వడం వల్ల చెమటలు అధికమై ఫంగల్ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది

  English summary

  10 Scary Side Effects Of Being Overweight That You Never Knew!

  When a person has excess body fat, it can cause him to become overweight or obese. Obesity is a major lifestyle disease that has a number of side effects. Here are some of them: constipation, developing gall bladder stones, and osteoarthritis.
  Story first published: Saturday, January 20, 2018, 16:30 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more