క్యాన్సర్ నిరోధించడానికి ఉపయోగపడే పన్నెండు ఆహారపదార్ధాలు

Subscribe to Boldsky

సోనాలి బెంద్రే తనకు క్యాన్సర్ ఉందనే విషయం ఇటీవల వెల్లడించారు. క్యాన్సర్ ప్రాణాంతకమైనది అయినప్పటికీ, కొన్ని రకాల ఆహారపదార్ధాలు తినడం ద్వారా దానిని అరికట్టవచ్చు. ఉదాహరణకు, రెడ్ వైన్లో ఉండే రెస్వెర్ట్రాల్ , క్యాన్సర్ కారక ప్రోటీన్ ఏర్పడటాన్ని అడ్డుకుంటుందని, శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వ్యాసం ద్వారా, క్యాన్సర్ ను సహజంగా నిరోధించడంలో, మీకు ఏ ఆహార పదార్థాలు సహాయపడతాయో తెలుసుకోండి.

రెడ్ వైన్లో ఉండే రెస్వెర్ట్రాల్ ద్రాక్ష చర్మం నుండి వస్తుంది . అంతేకాక, రెడ్ వైన్లో, వైట్ వైన్ కంటే ఈ పాలిఫేనోల్ సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే, ఎర్ర వైన్ తయారీలో ద్రాక్ష తొక్కలతో ఎక్కువ కాలం పాటు పులియబెడతారు.

Sonali Bendre Cancer: 12 Foods to Prevent Cancer

ప్రతి సంవత్సరం క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఈ ప్రాణాంతక వ్యాధి యొక్క మూలం తెలియకపోయినప్పటికీ, పోషకాహార లోపం, పోషకాహార లోపం మరియు టాక్సిన్లతో నిండి ఉన్న ఆహారం తీసుకోవడం వంటి కారకాలు కొంతవరకు దోహదపడతాయి.

ఏదేమైనప్పటికి, క్యాన్సర్ ను నిరోధించడానికి ఎవరూ ఏమి చేయలేరని చాలామంది చెప్తారు. కానీ, కొన్ని ఆహార పదార్థాలు క్యాన్సర్ నివారణకు ఉపయగపడతాయి.

క్యాన్సర్ నిరోధించడానికి ఉపయోగపడే అద్భుతమైన ఆహార పదార్థాలను గురించి తెలుసుకోండి.

1. పచ్చని ఆకుకూరలు:

1. పచ్చని ఆకుకూరలు:

ఆకుకూరలలో విటమిన్లు, ఖనిజాలు, ఎంజైములు మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కేల్, బచ్చలికూర, కొల్లాడ్ గ్రీన్స్, రోమైన్ లెట్యూస్, వాటర్ క్రెస్, మొదలైన ఆకుకూరల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ తో పోరాడతాయి. ఈ ఆకుకూరలు గ్లూకోసినేట్స్ యొక్క సహజ వనరు మరియు వీటిలోని యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ తత్వాలు కార్సినోజెన్లను. క్రియారహితంగా మారుస్తాయి. క్రియారహితంగా మారిన కార్సినోజెన్లు క్యాన్సర్ కణాలు చనిపోయేట్టు చేసి కణితిలు మరియు మెటాస్టాసిస్ ను నిరోధిస్తాయి.

2. బెర్రీస్:

2. బెర్రీస్:

బ్లూబెర్రీస్, చెర్రీస్, రాస్ప్బెర్రీస్, స్ట్రాబెర్రీలు, గోజీ బెర్రీలు మరియు బ్లాక్బెర్రీస్ లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిలో వ్యాధినిరోధకతను పెంచే విటమిన్ సి, విటమిన్ ఎ మరియు గాలక్ యాసిడ్ ఉంటాయి. ఫ్రీరాడికల్స్ కలుగచేసే నష్టాన్ని, వీటిలో ఉండే ప్రొయాంథోసైనిడిన్ యాంటీ ఆక్సిడెంట్లు నిరోధిస్తాయి.

3. బ్రాకొలి:

3. బ్రాకొలి:

ప్రోస్టేట్, మూత్రాశయం మరియు పెద్దప్రేగు కాన్సర్లతో పోరాడే శక్తి బ్రాకొలికి ఉందని మీకు తెలుసా? బ్రాకొలి లో ఉండే పీచుపదార్ధం మరియు సల్ఫోరఫెన్ అనే సమ్మేళనం ఉంటాయి. ఇవి శరీరాన్ని సంరక్షించే ఎంజైములు స్రావాన్ని పెంచడమే క్యాన్సర్ కారక రసాయనాలను శరీరం నుండి బయటకు నెట్టేస్తాయి.

4. నారింజ:

4. నారింజ:

నారింజ పళ్ళు క్యాన్సర్ ను నిరోధించే యాంటిఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సితో నిండి ఉంటాయి. ఏ సిట్రస్ పండ్లను తిన్నా, కొలెస్టరాల్ తగ్గించడం, బరువు కోల్పోడాన్ని ప్రోత్సహించడం మరియు చర్మం యవ్వనంతో మెరవడం వంటి మేలును చేసి అనేక ఆనారోగ్య పరిస్థితులకు దారితీయడాన్ని తగ్గిస్తుంది.

5. మూలికలు మరియు మసాలా దినుసులు:

5. మూలికలు మరియు మసాలా దినుసులు:

పసుపు కుర్కుమిన్ ని కలిగి ఉంటుంది, ఇది ట్యూమర్ పరిమాణాన్ని తగ్గించడానికి మరియు పెద్దప్రేగు మరియు రొమ్ము క్యాన్సర్లతో పోరాడడానికి సహకరిస్తుంది. పచ్చి వెల్లుల్లి, థైమ్, కారపు పొడి, ఒరేగానో, తులసి, అల్లం మరియు పార్స్లీ వంటి మూలికలు క్యాన్సర్ తో పోరాడటమే కాక వ్యాధినిరోధకతను పెంచుతాయి.

6. అల్లం:

6. అల్లం:

అల్లం క్యాన్సర్ కణాలు తమకుతాము నాశనం చేసుకునే విధంగా ప్రోత్సహిస్తుంది. మీ ఆహారంలో అల్లంను భాగంగా చేసుకుంటే అండాశయ క్యాన్సర్ కణాలను పెరగకుండా చేసి, వాటి వ్యాప్తిని అరికడుతుంది. ఇది వికారం మరియు విసర్జన సమస్యలను పరిష్కరిస్తుంది.

7. ఎర్రదుంప:

7. ఎర్రదుంప:

ఎర్రదుంపలలో ఉండే బీటాకేరోటిన్, మీ శరీరంలో విషపదార్ధాలను బయటకు నెట్టి, వ్యాధినిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి, కాలేయం యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించి,చర్మం, కళ్ళు మరియు ఇతర అవయవాలకు క్యాన్సర్ దాడి జరగకుండా పోరాడుతుంది.

8. గ్రీన్ టీ:

8. గ్రీన్ టీ:

గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, కాలేయ క్యాన్సర్ మరియు అన్నవాహిక క్యాన్సర్లతో పోరాడతాయి.

గ్రీన్ టీ క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉన్న, పాలీఫెనోల్స్ ను కూడా కలిగి ఉంటుంది. ఇవి సెల్ రెప్లికేషన్లో సహాయపడతాయి.

9. వెల్లుల్లి:

9. వెల్లుల్లి:

క్యాన్సర్ కణాల విభజన అడ్డుకోవడం ద్వారా క్యాన్సర్ ని నిరోధించడంలో సహాయపడే అనేక యాంటీ బాక్టీరియల్ లక్షణాలను వెల్లుల్లి కలిగి ఉంది. వెల్లుల్లిని తింటే రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు కాన్సర్, కడుపు క్యాన్సర్ మరియు అన్నవాహిక క్యాన్సర్ కణాలను చంపుతుంది

10. చేపలు:

10. చేపలు:

సాల్మోన్, మాకేరెల్, సార్డైన్స్ వంటి చేపలు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. వీటిలో విటమిన్లు, ప్రోటీన్లు మరియు సెలీనియం కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి కాలేయ క్యాన్సర్ నివారించడంలో సహాయపడతాయి. కొన్ని అధ్యయనాల ద్వారా, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ మధ్య సంబంధాలు ఉన్నాయని తెలిసింది.

11. పుట్టగొడుగులు:

11. పుట్టగొడుగులు:

పుట్టగొడుగులను రోగనిరోధక వ్యవస్థను మెరుగుపర్చడానికి మరియు క్యాన్సర్ ను నయం చేయడానికి గాను వాడతారు. ఇది రోగనిరోధక పనితీరును ప్రేరేపించి, కణితి పెరగకుండా పోరాడి, ఆరోగ్యకరమైన కణాల పునరుత్పత్తికి సహాయపడుతుంది.

12. ఆరోగ్యకరమైన నూనెలు:

12. ఆరోగ్యకరమైన నూనెలు:

మీరు వాడే రెఫైన్డ్ నూనెల స్థానంలో ఫ్లాక్స్ సీడ్ ఆయిల్, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె, కొబ్బరి నూనె మరియు కాడ్ నూనె వాడటం మొదలుపెట్టండి. ఈ నూనెలు రొమ్ము క్యాన్సర్ మరియు కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థ యొక్క ఉత్తమమైన పనితీరును ప్రోత్సహించడానికి సహాయపడుతుంది, మీ జీర్ణవ్యవస్థకు పోషణనిచ్చి, బరువు నిర్వహణలో సహాయపడుతుంది .

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Sonali Bendre Cancer: 12 Foods to Prevent Cancer

    A new study revealed that how red wine may help prevent cancer. Researchers say it is due to the presence of resveratrol in red wine that may help stop the formation of protein clumps. Other foods that help prevent cancer are broccoli, green leafy vegetables, citrus fruits, sweet potatoes, berries, etc.
    Story first published: Friday, July 6, 2018, 19:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more