For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుండె జబ్బులకు కారణమైన అంశాలను తెలుసుకుని అప్రమత్తంగా ఉండండి !

గుండె జబ్బులకు కారణమైన అంశాలను తెలుసుకుని అప్రమత్తంగా ఉండండి !

|

మీరు ఎక్కువకాలం పాటు ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే ఎవరైనా ఉన్నారా? ఇంకా బాగా చెప్పాలంటే, అన్ని జీవులు మనుగడ సాగించాలనే ప్రవృత్తితో భూమి పైకి వస్తాయి, అవన్నీ ఎక్కువకాలం బ్రతకడం కోసమే తమ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లుగా ఉంటాయి.

మానవజీవితంలో ఎదురయ్యే అనూహ్యమైన పరిణామాలను ముందుగా ఎవరూ ఊహించలేరు, అలా సంభవించే ఆకస్మిక ప్రమాదాలు, వ్యాధులు ప్రజల జీవితాన్ని తక్షణమే అంతమొందిస్తాయి. కాబట్టే మానవ జీవితాలు దుర్బలమైనవి. మన జీవితాలను మనకు అనుగుణంగా నియంత్రించడంలో మనకు ఎటువంటి అవకాశాలు లేవు.

Surprising Factors That Can Cause Heart Diseases

ఇవన్నీ వాస్తవాలే అయినప్పటికీ, ఒక వ్యక్తి చేయగలిగే కొన్ని విషయాలు మాత్రం ఉన్నాయి, ఇది వారి ఆరోగ్యాన్ని నిరంతరంగా పెంపొందించడంలో సహాయపడుతుంది. ఎవరైతే మానసిక ఆరోగ్యంతో సంతృప్తికరంగా ఉంటారో, అలాంటి వారికి దీర్ఘాయువు చేకూరుతుంది !

అందువల్ల, ప్రతి ఒక్కరూ తమ శరీరానికి వ్యాధులను కలగజేసే అంశాల గురించి పూర్తిగా అవగాహన చేసుకోవాలి, తద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంలో ఎల్లప్పుడూ ఒక నిర్దేశిత లక్ష్యాన్ని కలిగి ఉండాలి.

మన శరీరంలో ఉన్న అన్ని ఇతర భాగాలకు రక్తాన్ని సరఫరా చేసేందుకు బాధ్యత వహించే అతి ముఖ్యమైన అవయవము "హృదయమని" మనందరికీ బాగా తెలుసు.

గుండె వ్యాధులనేవి నేడు సర్వసాధారణం & అత్యధిక మరణాలు సంభవించడానికి ఇదే ప్రధాన కారణం. కాబట్టి, గుండె జబ్బులను కలగజేసే ఆశ్చర్యకరమైన అంశాలలో కొన్నింటిని మీరే ఇక్కడ గమనించండి.

ముందస్తుగా వచ్చే యుక్తవయస్సు :

ముందస్తుగా వచ్చే యుక్తవయస్సు :

సాధారణంగా, అమ్మాయిలు 12-16 సంవత్సరాల మధ్యలో యుక్తవయస్సును పొందుతారు. అలా అమ్మాయిలు యుక్తవయస్సులోకి వచ్చిన తర్వాత వారిలో పునరుత్పత్తి అవయవాలనేవి బాగా అభివృద్ధి చెందుతాయి, అలా ఆమెకు నెలలో ఒకసారి పిరియడ్స్ అనేవి ప్రారంభమవుతాయి. అయితే, మరికొన్ని సందర్భాల్లో, కొంతమంది అమ్మాయిలు 12 సంవత్సరాలు రాకముందే యుక్త వయసులోకి వస్తారు, వారి రక్తంలో అధిక ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరగడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. ఇది ధమనులలో రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది, దాని ఫలితంగా వీరు భవిష్యత్తులో గుండె సమస్యలను ఎదుర్కొంటారు.

డైట్ పిల్స్ :

డైట్ పిల్స్ :

ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడకుండా ఉంటూ, తమ శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవాలని కోరుకునేవారు - తాము కలిగి ఉన్న అధిక బరువును కోల్పోయి, ఆరోగ్యవంతమైన బరువును నిర్వహించడమనేది తప్పనిసరి. చాలామంది బరువు కోల్పోవటానికి "డైట్ పిల్స్ను తీసుకుంటారు. ఆరోగ్యకరమైన ఆహార నియమాలను & నిర్దేశిత వ్యాయామాలను పాటించడానికి బదులుగా ఈ మాత్రలను ఉపయోగించడం వల్ల శరీరంలో అధికంగా ఉన్న బరువును తగ్గించడంలో సహాయం చేయటానికి హామీని ఇస్తుంది.

తరచుగా ఫ్లూ బారిన పడటం :

తరచుగా ఫ్లూ బారిన పడటం :

ఫ్లూ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్, దాని కారణంగా మీకు జలుబును, దగ్గు, గొంతులో ఇన్ఫెక్షన్, జ్వరం, శరీర నొప్పులు కలగటం వంటి అనేక లక్షణాలకు దారితీస్తుంది. ఎవరైతే నిరంతరంగా ఈ ఫ్లూ సమస్యను ఎదుర్కొంటారో అటువంటి వారిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి వారిలో గుండె జబ్బులు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే, ఫ్లూ వైరస్ గుండె నాళాలలోకి చేరి అక్కడ ఉన్న కణజాలాన్ని బలహీనపరుస్తాయి కాబట్టి.

ఒంటరితనం :

ఒంటరితనం :

అవును, వినడానికి కొత్తగా ఉన్నా కూడా ఇది నిజం. అయితే, ఇటీవల కాలంలో చేపట్టిన అధ్యయనాల ప్రకారం, ఒంటరిగా ఉన్నట్లు భావిస్తున్న ప్రజలు ఎక్కువగా ఒత్తిడిని కలిగి ఉన్నట్లుగా వెల్లడైంది. ఆ విధంగా వారు డిప్రెషన్లోకి వెళ్లి వారి మెదడులో ఉన్న రసాయనాలను ప్రభావితం చేస్తాయి. ఇదిలా జరిగినప్పుడు ఒత్తిడి & డిప్రెషన్ల కలయిక వల్ల రక్తపోటు పెరిగి గుండె జబ్బులకు దారితీస్తుంది.

మధ్యపానం ఎక్కువ చేయడం :

మధ్యపానం ఎక్కువ చేయడం :

మీరు ప్రతిరోజు మద్యం తాగడానికి బాగా ఇష్టాన్ని కలిగి ఉండటం వల్ల, మీరు తీసుకునే భోజనంతో పాటు ఒక గ్లాసు బీర్ (లేదా) వైన్ను కూడా తీసుకున్నట్లయితే, మీ ధమనులను గట్టి పడేలా చేసి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడం ద్వారా గుండె వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. దానితోపాటు, ప్రతిరోజూ మద్యపానం వ్యసనమును కలిగి ఉండటం వలన కాలేయ వ్యాధులకు కూడా దారితీస్తుంది.

విటమిన్-డి లోపం :

విటమిన్-డి లోపం :

మానవ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్లు, మాంసకృత్తులు, ఖనిజాలు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు మొదలైన ఆవశ్యక పోషకాలు చాలా అవసరమని మనందరికీ బాగా తెలుసు. విటమిన్లలో ఇంకా చాలా రకాలు ఉన్నాయి; వాటితో పాటు విటమిన్-డి కూడా ఒక ముఖ్యమైన పోషక పదార్థం. విటమిన్ D లోపం వల్ల కూడా అనేక మంది గుండె వ్యాధుల బారిన పడటానికి కారణమవుతుంది.

English summary

Surprising Factors That Can Cause Heart Diseases

Are you someone who wants to remain hale and healthy for a longer time? Well, all living beings come with a survival instinct, which makes them aim for longevity. We also know that, life is fragile and unpredictable, as people's lives can be taken instantly, due to accidents, diseases, etc. So, many of us may feel like there is nothing much we can do, as the span of our lives is not under our control.
Desktop Bottom Promotion