కాన్సర్ సంబంధిత టీకాలలోని రకాలు వాటి ఉపయోగాలు.

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

పిల్లలకు టీకాలు వేయించడం గురించి మనం తరచుగా వింటూనే ఉంటాము. కొన్ని ప్రాణాంతకమైన రోగాలు, రోగాల వలన సమస్యలు రాకుండా టీకాలు వేస్తారు. ఈరోగాలు ముఖ్యంగా కాళ్ళు చేతులు చచ్చుబడేలా లేదా పక్షవాతం , వినికిడి, మూర్ఛ , మెదడు సంబంధిత అంశాలుగా ఉంటాయి. కానీ ఈ వ్యాసంలో ప్రాణాంతకమైన వ్యాధి కాన్సర్ సంబంధించిన టీకాల గురించిన వివరణ ఇవ్వడం జరిగినది. ఈ టీకాలు కాన్సర్ రాకుండా మరియు కాన్సర్ వచ్చాక వేయు టీకాలుగా విభజించబడినవి.

ఈ కాన్సర్ టీకాలు ముఖ్యంగా రోగనిరోధక శక్తి, మరియు శరీరంలోని అనామ్లజనకాల నియత్రణలో సహాయపడడం , మరియు కొన్ని కాన్సర్ సంబంధిత బాక్టీరియాను నాశనం చేయడం వంటివి చేస్తాయి. తద్వారా కాన్సర్ రాకుండా, లేదా తీవ్రతరం కాకుండా కాపాడుటలో సహాయం చేస్తాయి. ఈ టీకాలు కాన్సర్ల రకాలతో సంబంధంలేకుండా కాన్సర్ కణాలతో పోరాటం చేస్తాయి.

The Types And Purpose Of Cancer Vaccines You Need To Know

ఈ కాన్సర్ టీకాలు ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయి

1.నివారణ వ్యాక్సిన్లు (ముందు జాగ్రత్త టీకాలు, లేదా నివారణా టీకాలు)

2.చికిత్స సంబంధిత టీకాలు

నివారణ వ్యాక్సిన్లు, ఆరోగ్యంగా ఉన్న వారికే ఇస్తారు, ఇవి భవిష్యత్తులో కాన్సర్ వచ్చే ప్రమాదాలను తగ్గించుటలో సహాయం చేస్తాయి. ఇక చికిత్స సంబంధిత టీకాలు కాన్సర్ పేషoట్లలో రోగనిరోధక శక్తి పెరుగుదల కోసం, మరియు కాన్సర్ కారక కణాల నాశనానికి ఉపయోగిస్తారు.

ఈ నివారణా టీకాలలో U.S ఆహార మరియు ఔషధ నియంత్రణా శాఖ వారి ప్రకారం రెండు రకాల టీకాలు ఉంటాయి.

HPV టీకా:

దీనిని human papillomavirus (HPV) అని కూడా పిలుస్తారు. ఇది పాపిల్లోమా అనే బాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడుతుంది . ఒకవేళ ఈ బాక్టీరియా శరీరంలో ఎక్కువైన పక్షాన గర్భాశయకాన్సర్ , యోని కాన్సర్ , జననేoద్రియాల వద్ద ఇన్ఫెక్షన్ , పెద్దపేగు కాన్సర్ వంటి సమస్యలు వస్తాయి. ఈ టీకా ఆ కాన్సర్ రాకుండా అడ్డుకోవడంలో సహాయం చేస్తుంది.

హెపటైటిస్- బి టీకా :

ఇది హెపటైటిస్ బాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఈ హెపటైటిస్- బి బాక్టీరియా కాలేయం పై పభావాన్ని చూపిస్తుంది. తద్వారా లివర్ కాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాలేయం శరీరంలోని అతి ముఖ్యమైన భాగాలలో ఒకటి, కావున హెపటైటిస్-బి టీకా వేయించుకోవడం అతిముఖ్యమైన సూచనగా డాక్టర్లు సూచిస్తుంటారు.

చికిత్స టీకాలు:

వీటిని థెరఫిటిక్ టీకాలు గా కూడా వ్యవహరిస్తారు. ఈ టీకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషించడం ద్వారా శరీరంలోని కాన్సర్ కారకాలను తొలగించే ప్రయత్నం చేస్తుంది. ఈ టీకాలు కాన్సర్ తో సతమతమవుతున్న పేషoట్ల పరిస్థితిని ఉద్దేశంగా తీసుకుని డాక్టర్లు ఎంచుకుంటారు.

ఈ టీకాలు, మరలా కాన్సర్ పునరావృత్తం కాకుండా, కాన్సర్ గడ్డలు శరీరంలో పెరగకుండా మరియు విస్తరించకుండా , కాన్సర్ కణాలను పూర్తిగా నాశనం చేయడంలో సహాయం చేస్తాయి.

కానీ ఎక్కువ శాతం కాన్సర్ చికిత్సా టీకాలు ఇంకా పర్యవేక్షణ దశలోనే ఉన్నాయి, కావున వీటిని కొందరు స్వచ్ఛందంగా ముందుకువచ్చిన కాన్సర్ పేషoట్లకు (వాలెంటీర్స్)మాత్రమే కొన్ని నిభంధనల మేర అందిస్తారు. కానీ ఇందులో ఎన్ని సఫలీకృతమవుతాయో చెప్పలేము కూడా.

కాన్సర్ చికిత్సలో ఉన్న నిభంధనలు:

కాన్సర్ కణాలు శరీరంలోని రోగనిరోధక శక్తి పై ప్రభావం చూపించి, తద్వారా కాన్సర్ కణుతులు పెరిగేలా దోహదం చేస్తాయి. పరిశోధకులు ఇతర రోగాలకు సంబంధించిన టీకాలను వీటిలో జతచేయడం ద్వారా ఈ కాన్సర్ కణుతులను నివారించుటలో మరియు విస్తరించకుండా చూచుటలో వినియోగిoచి , తద్వారా కాన్సర్ తగ్గించే ప్రయత్నం చేస్తుంటారు.

నిజానికి కాన్సర్ కణాలు ఆరోగ్యవంతమైన శరీర కణాల మాదిరిగానే ఉంటాయి, తద్వారా రోగనిరోధక కణాలు వీటిని అంత తేలికగా గుర్తించలేవు. తద్వారా నెమ్మదిగా ఈ కాన్సర్ కణాలు, రోగ నిరోధక శక్తిని అంతం చేసేలా ప్రేరేపితమవుతాయి. తద్వారా కాన్సర్ కణితి పరిమాణం పెరుగుతూ ఉంటుంది. కావున పెద్ద పెద్ద కాన్సర్ కణుతులు తగ్గించుటలో కేవలం ఒక టీకా ద్వారా మాత్రమే పని జరగదు.

అందువల్లనే డాక్టర్లు కాన్సర్ టీకాలతో కలిపి, అనేక ఇతరములైన రోగాలకు సంబంధించిన టీకాలను కూడా చికిత్స సమయంలో ఇస్తుంటారు. కానీ వయసు ప్రభావాల దృష్ట్యా, శరీరంలో తగిన రోగ నిరోధక శక్తి లేనికారణంగా శరీరం సహకరించక కొందరు అనేక కష్టాలను ఎదుర్కోవలసిన పరిస్థితులు ఏర్పడుతాయి. ఒక్కోసారి టీకా ఇచ్చిన తర్వాత కూడా శరీరం సహకరించని స్థితికి గురవుతుంది, మరణం కూడా సంభవించవచ్చు.

కావున కొన్ని జాగ్రత్తలు ముందుగానే తీసుకొనవలసి ఉంటుంది. ప్రతి 6 నెలలకు రక్త పరీక్షలు, అవసరాన్ని బట్టి కొలోనోస్కొపీ వంటి పరీక్షలు కూడా చేయించుకోవలసి ఉంటుంది. కొలోనోస్కొపీ లాంటి పరీక్షలలో, పరీక్షా సమయంలోనే పెద్దపేగులోని కాన్సర్ కారకాలను తీసివేసే అవకాశాలు ఉన్నాయి. కావున మీ శరీరంలో ఎటువంటి మార్పులు సంభవించినా కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని బట్టి పరీక్షలు చేయించుకోవడం అవసరం.

English summary

The Types And Purpose Of Cancer Vaccines You Need To Know

Cancer vaccinations will help to train the immune system to recognize and destroy harmful substances. Specific cancer vaccines are designed to treat specific types of cancer. Cancer treatment vaccines boost the immune system's ability to recognize and destroy antigens when these come to attack the body. Larger tumours are hard to get rid of using only a vaccine.
Story first published: Sunday, April 1, 2018, 9:00 [IST]