For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళల్లో యూరినరీ ఇంకాంటినెన్స్ (మూత్ర విసర్జనని నియంత్రించుకోలేకపోవటం) లక్షణాలు

|

యూరినరీ ఇంకాంటినెన్స్ అంటే బ్లాడర్ పై నియంత్రణ లేకపోవటం. ఈ సమస్య వలన మూత్రం లీక్ అవడం జరుగుతుంది. ఇది ఒక లక్షణం ఆంతే కాని ఇది వ్యాధి కాదు. ఈ సమస్య అనేక పరిస్థితుల వలన ఎదురవుతుంది. లక్షలాది మంది మహిళలు ఈ సమస్యతో సతమతమవుతునట్టు తెలుస్తోంది.

ఇది ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది. ముప్పై ఏళ్ళు దాటిన ప్రతి నలుగురిలో ఒక మహిళ యూరినరీ ఇంకాంటినెన్స్ సమస్యతో ఇబ్బందిపడుతుననట్టు తెలుస్తోంది. అలాగే, ఈ ఇబ్బందికి గురైన ప్రతి పది మంది మహిళల్లో ఎనిమిది మంది ఈ లక్షణం సాధారణమేనని ఇది ఏజింగ్ వలన ఎదురవుతుందన్న అపోహలో ఉన్నారు.

వారంతా ఈ సమస్య తాత్కాలికమేనని ఇది దానంతటదే తగ్గుతుందని భావిస్తున్నారు. లేదంటే, ఈ లక్షణాన్ని భరించడానికి కూడా సిద్ధపడుతున్నారు.

ఇంకాంటినెన్స్ లో వివిధ రకాలు:
అర్జ్ ఇంకాంటినెన్స్ లో రెస్ట్ రూమ్ కి వెళ్ళవలసిన అవసరం దృఢంగా ఏర్పడుతుంది. ఆ సమయంలో యూరిన్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది. నిద్రలో కూడా ఈ సమస్య తలెత్తవచ్చు. లేదా రెస్ట్ రూమ్ కి వెళ్లే దారిలో కూడా యూరిన్ లీక్ అవవచ్చు.

స్ట్రెస్ ఇంకాంటినెన్స్ అనేది వ్యాయామం సమయంలో లేదా కొన్ని ప్రత్యేకమైన మూవ్మెంట్స్ లేదా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు అలాగే నవ్వినప్పుడు ఏర్పడుతుంది.

ఓవర్ ఫ్లో ఇంకాంటినెన్స్ అనేది బ్లాడర్ పూర్తయిందన్న భావనను కలిగించదు. రోజంతా, యూరిన్ చిన్న చిన్న మొత్తంలో లీక్ అవుతుంది.

ఈ సమస్యతో బాధపడుతున్న మహిళలు సాధారణంగా క్లినిక్ లో తమ ఇబ్బందులను ఈ విధంగా వివరిస్తారు. వారు వివరించే సాధారణ సమస్యలు.

దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు లీకవడం.

రోజువారి నడకలో లీక్ అవడం.

లీక్ అవుతుందన్న భయంతో నీళ్లను తాగకపోవడం. ఎల్లప్పుడూ దాహంగా అనిపించడం.

ఏదైనా మంచి శారీని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు యూరిన్ లీక్ అవుతుందేమోనని సందేహం వెంటాడడం.

యూరిన్ లీక్ వలన ఎదురయ్యే దుర్వాసన వలన సోషల్ ఫంక్షన్స్ లో పాల్గొనడానికి ఆసక్తి కనబరచకపోవటం.

స్పైసీ ఫుడ్స్ ని వండేటప్పుడు లీక్ అవుతుందేమోనన్న భయం.

అన్ని వయసుల మహిళలలో యూరినరీ ఇంకాంటినెన్స్ సమస్య ఎదురవుతుంది. యంగ్ మదర్స్ లేదా ప్రీ మెనోపాజల్ అలాగే వయసైన మహిళల్లో ఈ సమస్య తలెత్తుతుంది.

పెల్విక్ మజిల్ టోన్ పనితీరు ఏజింగ్ వలన దెబ్బతిన్నప్పుడు, ఇంజ్యూరీ వలన లేదా ఇంతకు ముందు ఏదైనా సర్జరీ వలన నెర్వ్ లేదా మజిల్ డామేజ్ తలెత్తినప్పుడు ఇంకాంటినెన్స్ సమస్య తలెత్తుతుంది. బిడ్డకు జన్మనివ్వడం, ముఖ్యంగా వెజీనల్ డెలివరీలో, ఒబెసిటీ, దీర్ఘకాలిక దగ్గు, మలబద్దకంతో పాటు మరికొన్నిమెడికేషన్స్ ను వాడటం వలన సమస్య తలెత్తుతుంది.

ఇవన్నీ మజిల్స్ పనితీరును దెబ్బతీస్తాయి. తద్వారా, సమస్యను తగ్గిస్తాయి. అయితే, ఈ సమస్య వలన మహిళలు పడే బాధ వర్ణనాతీతం. ఈ సమస్యతో బాధపడుతున్న వారిలో 90 శాతం మంది మహిళలే. జీవితంలోని ప్రారంభ దశలోనే చాలా మంది ఈ సమస్యకు గురవుతున్నారు. మెనోపాజ్ సమయంలో అలాగే వయసు మీద పడుతున్నప్పుడూ ఈ సమస్య మరింత పెరుగుతోంది.

యూరినరీ ఇంకాంటినెన్స్ కు దారితీసే వివిధ కారణాలు:

D డెలీరియం/ డిమెన్షియా

I ఇన్ఫెక్షన్స్ (యూరిన్, వెజీనా)

A అట్రాఫిక్ వెజినిటీస్ (ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గుముఖం పట్టినప్పుడు)

P సైకలాజికల్ కారణాలు (ముఖ్యంగా డిప్రెషన్)

P ఫార్మాసీటికల్ ఏజెంట్స్

E ఎండోక్రైన్ కండిషన్స్ (డయాబెటిస్)

R రెస్ట్రిక్టెడ్ మొబిలిటీ
S స్టూల్ ఇంపాక్షన్

మహిళలు ఈ సమస్యతో డీల్ చేయడానికి ప్యాడ్స్ వేసుకోవడం, తక్కువగా ఫ్లూయిడ్స్ ని తీసుకోవడంతో పాటు వారి సోషల్ లైవ్స్ లో కొన్ని మార్పులు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యంగా ఉండేందుకు సాధారణంగా పాటించవలసిన జాగ్రత్తలను ఈ సమస్యను డీల్ చేసేందుకు విస్మరిస్తారు.

అవుట్ డోర్ ఎక్సర్సైజ్ లను అవాయిడ్ చేయడం, పిల్లల్ని ఎత్తుకోవడాన్ని మానేయడం లేదా గ్రాసరీస్ బరువును మోసేందుకు మొగ్గు చేయకపోవడం అలాగే సెక్సువల్ ఇంటిమసీలను తగ్గించుకోవడం జరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మరియు సెల్ఫ్ ఎస్టీమ్ ను తగ్గించుకుని ఫ్రస్ట్రేషన్ కు గురవడం జరుగుతుంది. దాంతో, రోజు వారి పనులపై శ్రద్ధ తగ్గుతుంది.

పేషంట్ యొక్క హిస్టరీ అంటే డెలివరీ టైప్, పెల్విక్ సర్జరీకి ముందు జరిగిన విషయాలు, ఎంతమంది పిల్లల్ని కన్నారు అన్న విషయంపై డయాగ్నసిస్ ఆధారపడి ఉంటుంది. వెజీనల్ హెల్త్ ను పరిగణలోకి తీసుకునేందుకు ఫిజికల్ ఎగ్జామినేషన్స్ ను చేస్తారు. వివిధ పరీక్షలను నిర్వహిస్తారు. తద్వారా, ఇంకాంటినెన్స్ కు దారితీసిన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటారు. ఆ విధంగా థెరపీ విధానాలని నిర్ణయిస్తారు.

ఈ టెస్ట్ లు కొన్ని సింపుల్ వి అయితే మరికొన్ని స్పెషలైజ్డ్ వి అయుంటాయి.

యూరిన్ కల్చర్
మార్షల్ టెస్ట్
అల్ట్రా సౌండ్

క్యూ టిప్ టెస్ట్ (ఒక వేళ సీటీ స్కాన్ పాజిటివ్ అయితే / RI >30 degrees)

సిస్టోస్కోపీ
యూరోడైనమిక్స్

పెల్విక్ మజిల్ ఎక్సర్సైజేస్, బిహేవియరల్ మోడిఫికేషన్స్, యూరినరీ ట్రీట్మెంట్ ఇన్ఫెక్షన్, లోకల్ హార్మోన్ థెరపీ, నియో కంట్రోల్ థెరపీ మరియు సర్జరీ వంటివి ఇప్పటి ట్రీట్మెంట్ ఆప్షన్స్.


వృద్ధులైన మహిళల్లో కూడా స్ట్రెస్ ఇంకాంటినెన్స్ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు సర్జరీలు తోడ్పడతాయి. సర్జికల్ ట్రీట్మెంట్ లో టీవీటీని (టెన్షన్ ఫ్రీ వెజీనల్ టేప్) వాడతారు. స్ట్రెస్ ఇంకాంటినెన్స్ కు ఇది అద్భుతమైన సొల్యూషన్.

ఈ చికిత్సను ఒక రోజులోనే చేస్తారు. ఇది సింపుల్ సర్జరీ. ముప్పై నిమిషాల్లో ఈ సర్జరీ పూర్తవుతుంది. లోకల్ అనస్తీషియానిచ్చి ఈ సర్జరీని పూర్తి చేస్తారు. అదే రోజు పేషంట్ ఇంటికి వెళ్ళవచ్చు. ఆపరేషన్ తరువాత బాధ కూడా తక్కువగానే ఉంటుంది.

ఈ సర్జరీతో 96 శాతం సక్సెస్ రేట్ ను గమనించవచ్చు. 85 శాతం మంది పేషంట్స్ పూర్తిగా కోలుకున్నారు. 11 శాతం పేషంట్స్ దాదాపు కోలుకుంటున్నారు.

అర్జ్ ఇంకాంటినెన్స్ ను తగ్గించేందుకు ఇప్పుడు అందుబాటులో ఉండే మెడికల్ థెరపీస్ అనేవి మహిళల జీవితాన్ని ఆనందమయం చేసేందుకు తోడ్పడతాయి.

సెల్ఫ్ మేనేజ్మెంట్ లో ఇవన్నీ భాగమవుతాయి:

అడల్ట్ డైపర్లు / ప్యాడ్స్ ను వాడటం ద్వారా లీక్ ను అరికట్టవచ్చు

ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఎక్సర్సైజ్ ను అవాయిడ్ చేయడం

టీ లేదా కాఫీ ఇంటేక్ ను తగ్గించుకోవడం

బరువును తగ్గడం

లైఫ్ స్టైల్ ను అవసరమైనంత మేర మార్చుకోవడం

ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రతీ మహిళ ఈ సమస్య నుంచి విముక్తిని ఆశిస్తుంది. తద్వారా, సోషల్ లైఫ్ స్టైల్ లో యాక్టివ్ గా పాలుపంచుకోవచ్చని భావిస్తుంది. సడెన్ లీక్ వలన ఎదురయ్యే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవచ్చని ఆశిస్తుంది. సింపుల్ అలాగే సురక్షితమైన ట్రీట్మెంట్ తో తక్కువ సమయంలో హాస్పిటల్ స్టే ఉండే వీలుండే ట్రీట్మెంట్స్ ను ఎంచుకోవడాన్ని ప్రిఫర్ చేస్తుంది. మహిళల్లో, ఇంకాంటినెన్స్ అనేది సాధారణ సమస్యే అయినా ఇది మహిళల జీవితాల్లో పెద్ద ప్రభావం చూపుతుంది. చాలా మంది మహిళలు ఈ సమస్యను మౌనంగా ఎదుర్కొంటున్నారు. అందుబాటులో ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్స్ పై అవగాహన లేకపోవటం వలన వారు ఈ సమస్యను భరిస్తున్నారు.

అదృష్టవశాత్తూ, ఈ సమస్యకు పరిష్కారం ఉంది. ఆ పరిష్కార వివరాల్ని తెలుసుకుని మహిళలు ఈ సమస్యలు తగ్గించుకోవాలి.

సోర్స్: డాక్టర్ దురు షాహ్

డైరెక్టర్, గైనిక్ వరల్డ్

సెంటర్ అసిస్టెడ్ రీప్రొడక్షన్ & ఉమెన్స్ హెల్త్

ప్యానల్ కన్సల్టెంట్ - బ్రీచ్ క్యాండీ హాస్పటల్ & జాస్లాక్ హాస్పిటల్

English summary

Urinary Incontinence Symptom In Females

Urinary incontinence, often called loss of bladder control, is the unwanted loss or leak of urine. It is a symptom, not a disease, caused by a variety of conditions, common in millions of women which can be a source of great embarrassment. 1 out of every 4 women has urinary incontinence after the age of 30 years, and 8 out of 10 who are affected, mistakenly believe that incontinence is a normal part of ageing!