For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్ పాశ్చర్ సిండ్రోం (GPS) : కారణాలు, లక్షణాలు, నిర్ధారణ, మరియు చికిత్సా విధానాలు

|

గుడ్ పాశ్చర్ సిండ్రోం (GPS), ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అనగా శరీర రోగ నిరోధక శక్తి మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అర్ధం. క్రమంగా ఈ వ్యాధికి గురైనప్పుడు, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల్లోని అంతర్లీన పొరలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. శరీర రక్షణ వ్యవస్థ అయిన కొల్లాజెన్ (అనుసంధాన కణజాలాల ఏర్పాటులో ఇమిడి ఉండే ఒకరకమైన ప్రోటీన్) కు వ్యతిరేకంగా ప్రతిరోధకాల (యాంటీ బాడీస్) ఉత్పత్తి జరిగినప్పుడు ఈ వ్యాధి సంభవించడం జరుగుతుంది. ఈ వ్యాధి, ప్రధానంగా ఊపిరితిత్తులు మరియు మూత్రపిండాలపై ప్రభావాన్ని చూపుతుంది.

గుడ్ పాశ్చర్ సిండ్రోం సమస్యకు గల మరో పేరు, యాంటీ గ్లోమెర్యులర్ బేస్మెంట్ యాంటీ బాడీ డిసీజ్ (యాంటీ-జిబిఎమ్). ఈ రుగ్మతకు సంబంధించిన ప్రాథమిక లక్షణాలు, స్వల్పంగా ఉన్న కారణాన, వ్యాధి నిర్ధారణ తప్పుదోవ పట్టించేలా ఉంటాయి. ఉదాహరణకు, అలసట ఎక్కువగా ఉండడం, చురుకుదనం తగ్గడం. ఎందుకంటే ఈ లక్షణాలు, ఇతర రుగ్మతలలో కూడా సాధారణంగానే సంభవిస్తుంటాయి. క్రమంగా వ్యాధి నిర్ధారణ ఆలస్యమవుతుంది. సకాలంలో గుర్తించి చికిత్స చేయని పక్షంలో ఈ గుడ్ పాశ్చర్ సిండ్రోం ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తుంది.

 

గుడ్ పాశ్చర్ సిండ్రోం యొక్క ప్రధాన కారణాలు, లక్షణాలు, రోగ నిర్ధారణ మరియు చికిత్సా పద్దతుల గురించిన మరిన్ని వివరాల కోసం వ్యాసంలో ముందుకు సాగండి.

Goodpasture Syndrome

గుడ్ పాశ్చర్ సిండ్రోం (GPS) అంటే ఏమిటి?

దీనిని వాస్తవానికి పల్మనరీ రెనల్ సిండ్రోమ్ అని వ్యవహరిస్తారు. ఇది మూత్రపిండాలు మరియు ఊపిరితిత్తుల్లో తలెత్తే తీవ్రమైన అస్వస్థతల గ్రూపుకు జతచేయబడి ఉంటుంది. గుడ్ పాశ్చర్ సిండ్రోంలో ఈ క్రింది పరిస్థితులు ప్రధానంగా ఇమిడి ఉన్నాయి.

• గ్లోమేర్యులోనెఫ్రిటిస్ లేదా గ్లోమేర్యూలి సంబంధిత వాపు (గ్లోమెర్యులి, మూత్రపిండాలలోని రక్త నాళాలకు చెందిన చిన్న క్లస్టర్లుగా ఉంటాయి. ఇది వ్యర్థాలను ఫిల్టర్ చేయడానికి, మరియు రక్తం నుంచి అదనపు నీటిని తొలగించడంలో సహాయం చేస్తుంది)

• యాంటీ గ్లోమెర్యులర్ బేస్మెంట్ మెంబ్రేన్ యొక్క ప్రతిరక్షకాల ఉనికి.

• ఊపిరితిత్తులలో రక్తస్రావం.

 

ఈ స్థితిలో, రోగ నిరోధక కణాలు కొల్లాజెన్ యొక్క నిర్దిష్ట ప్రాంతానికి వ్యతిరేకంగా ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడానికి మొగ్గుచూపుతాయి. అనగా యాంటీ బాడీస్, మూత్రపిండాలు మరియు ఊపిరితిత్తుల్లోని కొలాజెన్ పై దాడి చేస్తాయని చెప్పబడుతుంది.

ఈ సమస్యను మొట్టమొదటిసారి ఎర్నెస్ట్ గుడ్ పాశ్చర్ అనే వ్యక్తి వెలుగులోకి తెచ్చింది. 1919 సంవత్సరంలో ఇన్ఫ్లుఎంజా పాండమిక్ అనే వైరస్ వ్యాప్తి చెందిన సమయంలో, ఊపిరితిత్తులలో రక్తస్రావం, మరియు మూత్రపిండాల వైఫల్యం కారణంగా ఒక రోగి మరణించినట్లు నివేదించబడింది. క్రమంగా దీనిని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి పేరుమీద, గుడ్ పాశ్చర్ సిండ్రోం అని పేరుపెట్టడం జరిగింది.

గుడ్ పాశ్చర్ సిండ్రోం యొక్క ప్రధాన కారణాలు . .

గుడ్ పాశ్చర్ సిండ్రోం వెనుకగల అసలు కారణం ఏమిటన్న వివరణాత్మక పరిశోధన, ఇంకా పూర్తిస్థాయిలో వెలుగులోకి రానప్పటికీ, ఇది జన్యు మరియు పర్యావరణ కారకాల కలయిక కారణంగా తలెత్తుతుందని ఎక్కువగా నమ్మబడుతుంది. దిగువ పేర్కొన్న కారణాల వలన ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్ ఏర్పడవచ్చు :

• సిగరెట్ పొగ

Goodpasture Syndrome

• హైడ్రో కార్బన్లను ఎక్కువగా పీల్చడం.

• వైరల్ ఇన్ఫెక్షన్స్.

• హెయిర్ డై అధికంగా వాడటం

• లోహ ధూళి ప్రభావానికి అధికంగా గురికావడం

• కొకైన్ వంటి డ్రగ్స్ అధికంగా ఉపయోగించడం

• మద్యపానం, మాదకద్రవ్యాల వంటి వ్యసనాలు.

గుడ్ పాశ్చర్ సిండ్రోం యొక్క లక్షణాలు :

ఈ లక్షణాలు కాలానుగుణంగా నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయి. క్రమంగా వ్యాధి నిర్ధారణ ఆలస్యమవుతుంటుంది. వాటిలో ప్రధానమైనవి ఇక్కడ పొందుపరచడం జరిగింది.

లక్షణాలు :

• శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

• చర్మం పాలిపోవడం.

• వికారం మరియు వాంతులు

• అలసట

సాధారణంగా ఊపిరితిత్తులు, మూత్రపిండాల కన్నా ముందే ప్రభావితమవుతాయి. క్రమంగా, ప్రాథమికంగా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. దీని తరువాతి దశలో, అదనంగా తీవ్రమైన దగ్గు, కొన్నిసార్లు రక్తస్రావం కూడా తలెత్తవచ్చు.

మూత్రపిండాలు ప్రభావితం అయినప్పుడు దిగువ పేర్కొన్న లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి :

• మూత్రంలో రక్తం

• నురుగుతో కూడిన మూత్రం

• అధిక రక్తపోటు

• కాళ్ళలో వాపు

• మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు మండుతున్న భావన

• పక్కటెముకల క్రింద, మరియు వెన్నులో నొప్పి

• గుడ్ పాశ్చర్ సిండ్రోం మూలంగా మూత్రపిండాలు విఫలం కావడం వల్ల డయాలసిస్ లేదా మూత్రపిండాల మార్పిడి చేయాల్సి రావొచ్చు.

గుడ్ పాశ్చర్ సిండ్రోం యొక్క నిర్ధారణ :

గుడ్ పాశ్చర్ సిండ్రోం లక్షణాలు ఏవైనా తలెత్తినట్లు మీ వైద్యులు గమనిస్తే, దిగువ రోగ నిర్ధారణ పరీక్షలను నిర్వహించవచ్చు :

Goodpasture Syndrome

యూరినాలిసిస్ :అధిక స్థాయిలో ప్రోటీన్ మరియు అధిక సంఖ్యలో ఎర్ర రక్త కణాలు మూత్రంలో ఉంటే కిడ్నీ డ్యామేజ్ జరిగి ఉండొచ్చు.

ఛాతీ ఎక్స్-రే :ఊపిరితిత్తుల నష్టం ఉంటే, ఎక్స్ రే ఫలితాలలో చూపించవచ్చు. ఉదాహరణకు, అసాధారణంగా ఉన్న తెల్లని మచ్చలు ఊపిరితిత్తుల రక్తస్రావాన్ని సూచిస్తాయి.

Goodpasture Syndrome

రక్త పరీక్ష :ఊపిరితిత్తులు, మూత్రపిండాలపై దాడిచేసే యాంటీబాడీస్ ఉనికిని విశ్లేషించడానికి రక్త పరీక్షలు సహకరిస్తాయి.

బయాప్సీ :గుడ్ పాశ్చర్ సిండ్రోం సంబంధిత యాంటీ బాడీస్ ఉనికిని తనిఖీ చేయడానికి, ఊపిరితిత్తులు లేదా మూత్రపిండాల నుండి ఒక చిన్న కణజాలాన్ని సేకరించి పరీక్షలకు పంపవచ్చు.

గుడ్ పాశ్చర్ సిండ్రోమ్ యొక్క చికిత్స :

ఈ సమస్యకు సత్వర చికిత్స అవసరం అవుతుంది., క్రమంగా క్రింది దశలు ప్రధానంగా అనుసరించవలసి ఉంటుంది.

• హానికరమైన యాంటీ బాడీస్ తో పోరాడేలా ఔషదాలివ్వడం.

• శరీరంలో ద్రవం నిలుపుదల లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం.

• తీవ్రమైన మూత్రపిండాల మరియు ఊపిరితిత్తుల సమస్యలను నిరోధిస్తూ,

Goodpasture Syndrome

సాధారణ రక్త పోటును నిర్వహించడం.

చికిత్సా ప్రక్రియలో, సాధారణంగా కార్టికోస్టెరాయిడ్ లు మరియు సైక్లోఫాస్ఫేమిడ్ వంటి ఓరల్ ఇమ్యూనోసూప్రెసెంట్ ఔషధాల వినియోగం తప్పనిసరిగా ఉంటుంది. ఈ ఔషధాలు గుడ్ పాశ్చర్ సిండ్రోమ్ యాంటీ బాడీస్ యొక్క రోగ నిరోధక వ్యవస్థ పనితీరుని తగ్గించడం ద్వారా పనిచేస్తాయి. ఈ ఔషధాలతో చికిత్స ఆరు నుంచి పన్నెండు నెలల కాలం వరకు కొనసాగవచ్చు.

' ప్లాప్మాహెర్సిస్ ' గా పిలిచే మరో పద్దతిని కూడా చికిత్సా పద్దతిగా ఉపయోగించుకోవచ్చు. ఇది రక్తం నుండి హానికరమైన యాంటీ బాడీస్ తొలగించడానికి సహాయపడుతుంది . ఈ ప్రక్రియలో శరీరం నుంచి రక్తాన్ని బయటకు తీసి, సెంట్రిఫ్యూజ్లో ఉంచటం జరుగుతుంది. సెంట్రిఫ్యూజ్ ప్లాస్మా నుండి ఎరుపు మరియు తెల్ల రక్త కణాలను వేరుచేస్తుంది (గుడ్ పాశ్చర్ సిండ్రోమ్ యాంటీబాడీస్ కలిగి ఉన్న భాగం). ఎర్ర మరియు తెల్ల రక్త కణాలను ప్రత్యామ్నాయ ప్లాస్మాతో కలిపి, ఆ తర్వాత తిరిగి రోగి శరీరంలోనికి ప్రవేశబెట్టడం జరుగుతుంది. ఈ పద్దతిని అనేక వారాలపాటు ప్రతిరోజూ కొనసాగించవలసి ఉంటుంది. ఇది కనీసం రెండు సంవత్సరాల కాలం వరకు ఉండవచ్చు.

చివరిగా ....

చికిత్స చేయకపోతే ప్రాణాంతకంగా మారే రుగ్మతగా ఉన్న కారణంగా, కొద్దిపాటి లక్షణాలు కనిపించినా వైద్యుల చేత నిర్ధారణ గావించుకుని ముందస్తు చర్యలకు పూనుకోవడం ఉత్తమంగా సూచించబడుతుంది. లేనిచో ప్రాణాంతకంగా మారే అవకాశాలు లేకపోలేదు. ఆహార ప్రణాళికలు మరియు పోషక అసమానతలు ఈ గుడ్ పాశ్చర్ సిండ్రోమ్ తో సంబందాన్ని కలిగి లేవని నిపుణులు చెబుతున్నారు. కావున సరైన జీవనశైలి విధానాలను, ఆహార ప్రణాళికలను పాటిస్తూ ఆరోగ్యకర వాతావరణం చుట్టూ ఉండేలా చూసుకోవడమే దీనికి ఉన్న ఏకైక మార్గం. పైగా దీనికి వయసుతో సంబంధంలేని కారణాన, ముందస్తు జాగ్రత్తలే ఉత్తమంగా సూచించబడుతుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Goodpasture Syndrome (GPS): Causes, Symptoms, Diagnosis And Treatment

Goodpasture syndrome is a pulmonary-renal syndrome. This is linked to a group of acute illnesses that involve the kidney and lungs. It is largely believed that it is caused due to a combination of genetic and environmental factors. The treatment procedure usually involves the use of oral immunosuppressive drugs such as corticosteroids and cyclophosphamide.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more