For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మాస్కుతో మరో కొత్త సమస్య.. ఇలా చేస్తే.. ఈజీగా తప్పించుకోవచ్చు...

మాస్కు ధరిస్తే తలనొప్పి వస్తుందా.. లేదా అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మనందరి జీవితాల్లో మాస్కు ఒక భాగమైపోయింది. కరోనా భూతం నుండి తప్పించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూనే ఉన్నారు.

Can Wearing Mask Lead to Headache? and How to Prevent in Telugu

కరోనాకు విరుగుడు వచ్చినా.. వ్యాక్సిన్లు ఒక డోసు వేసుకున్నా.. రెండు డోసులు వేసుకున్నా.. మాస్కు మాత్రం మరువద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి నుండి అడుగు బయట పెడుతున్నామంటే చాలు ప్రతి ఒక్కరూ మాస్కు విధిగా ధరించాలంటున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మనమంతా మాస్కులను ధరిస్తున్నాం.

Can Wearing Mask Lead to Headache? and How to Prevent in Telugu

అయితే మాస్కును అనునిత్యం ఉపయోగించడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయట. ముఖ్యంగా ఎవరైతే మాస్కును ఎక్కువసేపు ధరిస్తారో.. వారిలో తలనొప్పి, బాడీ డీహైడ్రేషన్ వంటి అనేక రకాల సమస్యలు వస్తున్నాయట. అందుకు గల కారణాలేంటి.. నిపుణులు దీని గురించి ఏం చెబుతున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కొత్త సమస్యలు..

కొత్త సమస్యలు..

ప్రస్తుతం మనలో ప్రతి ఒక్కరూ స్కూలుకు వెళ్లినా.. కాలేజీకి వెళ్లినా.. ఆఫీసుకు లేదా ఇతర ప్రదేశాలకు ఎక్కడికెళ్లినా మాస్కులను కచ్చితంగా ధరించాల్సి వస్తోంది. అయితే ఆఫీసుకు వెళ్లిన వారు మాత్రం మాస్కును విధిగా 8 గంటలకు పైగా ధరిస్తున్నారు. ఇలా మాస్కును ఎక్కువగా ధరించిన అమ్మాయిల్లో వారి ముఖంపై మొటిమలు, మచ్చలు రావడం ప్రారంభమవుతున్నాయట. ఇది పక్కనబెడితే.. చాలా మందిలో తలనొప్పి వంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

అలర్జీలు ఉంటే..

అలర్జీలు ఉంటే..

ఎవరైతే జలుబు, దగ్గు, ఆస్తమా, అలర్జీలు, స్కిన్ సమస్యలతో బాధపడుతున్నారో.. వారందరూ మాస్కు ధరించడం వల్ల కొత్త సమస్యలు వస్తున్నాయి. వారికి ఎక్కువగా బాడీ డీహైడ్రేషన్ కావడం, తలనొప్పి రావడం వంటివి జరుగుతుంది. అయితే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, ప్రజలు తమ వ్యక్తిగత, అందరి క్షేమం కోసం ఈ నియమాలు పాటించక తప్పట్లేదు.

నరాల తలనొప్పి..

నరాల తలనొప్పి..

ఎక్కువ సమయం బిగువుగా ఉండే మాస్కును ధరించడం వల్ల టెంపోరోమ్యాండిబ్యులర్ జాయింట్(TMJ)లో నొప్పి ఏర్పడుతుంది. ఇది మీ కింది దవడను మీ మిగిలిన పుర్రెతో కలుపుతుంది. మాస్క్ మీ దవడలు కదలడానికి అనుమతించే కండరాలు, కణజాలలను కొంత ఇబ్బంది పెడుతుంది. దీన్ని ప్రభావితం చేసే నరాలు తలనొప్పి వచ్చేలా సంకేతాలు పంపే ప్రమాదం ఉంది.

తలనొప్పి రాకూడదంటే..

తలనొప్పి రాకూడదంటే..

ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే.. మీరు ధరించే మాస్కు బిగువుగా ఉండకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి కొంచెం లూస్ గా ఉండే మాస్కు ధరించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఉదయం నుండి సాయంత్రం వరకు మాస్కు పెట్టుకుని తీసిన తర్వాత దవడలు, బుగ్గలకు మసాజ్ చేసుకోవాలట. ఇలా చేయడం వల్ల తలనొప్పి రాకుండా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

దవడలను కదిలిస్తూ..

దవడలను కదిలిస్తూ..

మీరు మాస్కు ధరించినంత సేపు నోటిని మూసుకొని ఉంచకూడదు. అప్పుడప్పుడు నోటిని తెరవాలి. కొద్ది కొద్దిగా మీ నోటిని తెరిచి, మూసేయాలి. అలాగే దవడలను అటువైపు.. ఇటువైపు కదలిస్తూ ఉండాలి. అలాగే ఎక్కువ సమయం పాటు ఒకే మాస్కును కూడా ధరించకూడదు. నెలల పాటు ఒకే మాస్కును వాడటం కూడా మంచిది కాదు. వాటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. అలాగే మీరు ఒకసారి మాస్కును వాడిన తర్వాత, తిరిగి దాన్నే ధరిస్తుంటే కచ్చితంగా దాన్ని పూర్తిగా శుభ్రం చేసి, ఉతికిన తర్వాతనే వాడాలి. ఇలా చేయడం వల్ల మీరు తలనొప్పి, ఇతర సమస్యల నుండి తప్పించుకోవచ్చు.

FAQ's
  • మాస్కుతో ఎలాంటి కొత్త సమస్య వచ్చింది?

    మాస్కును ఎక్కువకాలం ధరిస్తే.. తలనొప్పి, బాడీ డీహైడ్రేషన్ వంటి అనేక రకాల సమస్యలు వస్తున్నాయట.

English summary

Can Wearing Mask Lead to Headache? and How to Prevent in Telugu

Here we are talking about can cwaring mask lead to headache? and how to prevent in Telugu. Have a look
Story first published:Thursday, October 14, 2021, 9:10 [IST]
Desktop Bottom Promotion