For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HIV & AIDS : ఎయిడ్స్ ఎలా సోకుతుంది... దాని లక్షణాలు, దశలు, చికిత్స విధానాలేంటి...

|

హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్(HIV) అనేది ఒక ప్రాణాంత వైరస్. ఇది కూడా కూడా కరోనా మాదిరిగా కంటికి కనిపించకుండా అందరినీ కలవరానికి గురి చేస్తుంది. ఇది దీర్ఘకాలిక, ప్రాణాంత పరిస్థితిని అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియన్సీ సిండ్రోమ్(AIDS)అంటారు.

మన దేశంలో ఈ ఎయిడ్స్ బారిన పడిన వారిలో సుమారు 2.1మిలియన్ల మంది ఉన్నారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద జనాభా HIV & AIDSతో బాధపడుతోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)ప్రకారం, 2018లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 37.9 మిలియన్ల మంది ప్రజలు HIV & AIDSతో బాధపడుతున్నారు.

వీరిలో 36.2 మిలియన్ల మంది పెద్దలు ఉండగా.. 1.7 మిలియన్ల మంది 15 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారున్నారు. ఈ సందర్భంగా ఈ వ్యాధి ఎలా సోకుతుంది.. దీనికి గల కారణాలేంటి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం...

World Aids Day 2020 : కొంచెం అప్రమత్తంగా ఉంటే ఎయిడ్స్ నుండి సులభంగా తప్పించుకోవచ్చు...

HIV అంటే..

HIV అంటే..

హ్యుమన్ ఇమ్యునో డెఫిషెయన్సీ వైరస్ (హెచ్ఐవి) అనేది రోగనిరోధక శక్తిని దెబ్బతీసే వైరస్. ఇది జీవులతో పోరాడే శరీర సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తుంది. లైంగిక సంబంధాలు, రక్త మార్పిడి, ఒకరి తర్వాత మరొకరికి అవే ఇంజక్షన్లు వాడటం, తల్లి పాల నుండి ఇది సంక్రమిస్తుంది. ఇది ఒక్కసారి సోకిందంటే జీవితకాలం పాటు ఉంటుంది. దీనికి సరైన చికిత్స లేదు. అలాగే హెచ్ఐవి ఉన్న వ్యక్తికి ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉంది.

కణాలు నాశనం..

కణాలు నాశనం..

హెచ్ఐవి సిడి-4 టి కణాలను నాశనం చేస్తుంది. ఇది ఒక రకమైన టి సెల్, వ్యాధికారక కారకాలకు సమర్థవంతమైన రోగనిరోధక ప్రతిస్పందనను నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒక సాధారణ వ్యక్తి యొక్క సిడి4 కౌంట్ క్యూబిక్ మిల్లీమీటర్ కు 500 నుండి 1500 వరకు ఉంటుంది. హెచ్ ఐవి సోకిన వారికి, సిడి 4 కౌంట్ 200 కన్నా తక్కువకు పడిపోతుంది. దీనర్థం హెచ్ఐవి సిడి 4 కణాలను గుణించి నాశనం చేస్తూనే ఉంటుంది.

ఎలా వస్తుందంటే..

ఎలా వస్తుందంటే..

హెచ్ఐవి ఎలా సోకుతుందంటే.. వీర్యం, రక్తం, యోని స్రావాలు, తల్లి పాలు లేదా ఆసన ద్రవాలు వంటి శారీరక ద్రవాల ద్వారా హెచ్ ఐవి వేగంగా వ్యాపిస్తుంది. ఇది కింది విధాలుగా జరుగుతుంది.

* లైంగిక సంబంధం కలిగి ఉండటం : మీరు ఎవరైనా భాగస్వామితో ఆసన, యోని లేదా ఓరల్ సెక్స్ వంటివి చేసినప్పుడు, వారి రక్తం, వీర్యం లేదా యోని స్రవాలు శరీరంలోకి ప్రవేశిస్తే మీరు హెచ్ఐవి బారిన పడొచ్చు.

* ఇంజక్షన్ల షేరింగ్ : కలుషితమైన ఇంట్రావీనస్ ఔషధ సామాగ్రిని(సూదులు మరియు సిరంజిలు) పంచుకోవడం వల్ల హెచ్ఐవి ప్రమాదం పెరుగుతుంది.

* రక్త మార్పిడి : హెచ్ఐవి వైరస్ రక్తమార్పిడి ద్వారా కూడా వ్యాపిస్తుంది.

* గర్భం లేదా తల్లిపాలతో.. హెచ్ఐవి సోకిన తల్లుల తమ పిల్లలకు పాలివ్వడం వల్ల హెచ్ఐవి సోకుతుంది.

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం: హెచ్‌ఐవి గురించి 5 అపోహలు!!

హెచ్ఐవి సంక్రమించే దశలు..

హెచ్ఐవి సంక్రమించే దశలు..

* స్టేజ్ -1 (అక్యూట్ దశ) : ఈ దశలో వైరస్ శరీరంలోకి ప్రవేశించిన వ్యక్తి 1-2 నెలలో ఫ్లూ వంటి లక్షణాలతో అనారోగ్యానికి గురవుతారు.

* స్టేజ్ -2(దీర్ఘకాలిక దశ) : ఈ సమయంలో హెచ్ఐవి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ముందుగా తెల్లరక్తకణాలను నాశనం చేస్తుంది. ఇలాంటప్పుడు మీరు యాంటీరెట్రోవైరల్ థెరపీ చేయించుకోకపోతే, హెచ్ఐవి సంక్రమణ సుమారు పదేళ్ల పాటు ఉంటుంది.

* స్టేజ్ - 3(ఎయిడ్స్) : ఈ దశలో రోగనిరోధక శక్తి తీవ్రంగా దెబ్బ తింటుంది. ఇది అంటువ్యాధులు మరియు ఇతర వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

ఎయిడ్స్ లక్షణాలు..

ఎయిడ్స్ లక్షణాలు..

* దీర్ఘకాలిక విరేచనాలు

* అకస్మాత్తుగా బరువు తగ్గుతూ పోవడం

* చర్మంపై దద్దుర్లు లేదా గడ్డలు

* నిరంతరం అలసట

* తరచుగా జ్వరం

* రాత్రి పూట చెమలు పట్టడం

* గొంతు మంట

* తలనొప్పి

* ఓరల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్

* రుతుచక్రంలో మార్పులు

* యోని ఇన్ఫెక్షన్

* పెల్విక్ ఇన్ఫ్లమెటరీ వ్యాధి

హెచ్ఐవి సంక్రమణ/ఎయిడ్స్ ప్రమాద కారకాలు..

హెచ్ఐవి సంక్రమణ/ఎయిడ్స్ ప్రమాద కారకాలు..

* అసురక్షిత కలయిక : లైంగిక కార్యకలాపాలలో పాల్గొనేటప్పుడు కండోమ్ ఉపయోగించకుండా అసురక్సిత లైంగిక సంబంధం కలిగి ఉండటం హెచ్ఐవి సంక్రమణకు ప్రమాద కారకం. యోని సెక్స్ కంటే అనల్ సెక్స్ మరింత ప్రమాదకరం.

* STIలు : చాలా మంది STIలు జననేంద్రియాలపై బహిరంగ పుండ్లు కలిగిస్తాయి. ఇది హెచ్ఐవి శరీరంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది.

* ఔషధాలు : ఔషధాలను ఉపయోగించే వ్యక్తులు చాలా తరచుగా సూదులు మరియు సిరంజిలను పంచుకుంటారు. ఇది ఇతరుల రక్తంతో సంబంధం కలిగి ఉండటం వల్ల బహిర్గతమవుతుంది.

ఎయిడ్స్ సమస్యలు..

ఎయిడ్స్ సమస్యలు..

* క్షయవ్యాధి : ఇది హెచ్ఐవితో సంబంధం ఉన్న వ్యక్తి యొక్క అత్యంత సాధారణ సమస్య. ఎయిడ్స్ వ్యాధి సోకిన వారిలో మరణానికి ఇది ప్రధాన కారణం.

* కాండియాసిస్ : హెచ్ఐవి సంబంధిత సంక్రమణ, కాండియాసిస్ నోటి, నాలుక లేదా యోని యొక్క శ్లేష్మ పొరలలో మంటను కలిగిస్తుంది.

* సైటో మెగల్ వైరస్ : ఇది హెర్పెస్ వైరస్, ఇది శరీర ద్రవాల ద్వారా మూత్రం, వీర్యం, లాలాజలం, రక్తం మరియు తల్లి పాల ద్వారా వ్యాపిస్తుంది.

* క్రిప్టోకోకల్ మెనింజైటిస్ : ఇది హెచ్ఐవికి అనుసంధానించబడిన కేంద్ర నాడీ వ్యవస్థ సంక్రమణ.

* క్రిప్టోస్పోరిడియోసిస్ : మీరు కలుషితమైన ఆహారం లేదా నీరు తీసుకోవడం వల్ల ఇది సంభవిస్తుంది. ఎయిడ్స్ ఉన్నవారిలో ఇది తీవ్రమైన విరేచనాలకు దారి తీస్తుంది.

ఎయిడ్స్ ఎలా నిర్ధారిస్తారంటే..

ఎయిడ్స్ ఎలా నిర్ధారిస్తారంటే..

* యాంటీ బాడీ పరీక్షలు : ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ కోసం ప్రధానంగా రక్తాన్నీ మాత్రమే తనిఖీ చేస్తారు. 23 నుండి 90 రోజుల మధ్య హెచ్ఐవి సోకిన తర్వాత ప్రతిరోధకాల రక్తం లేదా లాలాజలంలో కనిపిస్తాయి.

* యాంటీబాడీస్ మరియు యాంటీజెన్ల కోసం రక్తాన్ని తనిఖీ చేయడం ద్వారా పరీక్ష జరుగుతుంది. ఇది హెచ్ఐవి ఇన్ఫెక్షన్/ఎయిడ్స్ అత్యంత సాధారణ పరీక్ష, ఇది ఒక వ్యక్తి హెచ్ఐవి బారిన పడిన 18-45 రోజులలోపు సానుకూల ఫలితాలను చూపుతుంది.

* న్యూక్లియిక్ యాసిడ్ టెస్ట్(నాట్) : రక్తంలో వైరస్ ను కనుగొనేందుకు ఈ టెస్టు జరుగుతుంది. సాధారణంగా యాంటీబాడీ పరీక్ష ద్వారా నిర్ధారించబడుతుంది.

ఎయిడ్స్ చికిత్స..!

ఎయిడ్స్ చికిత్స..!

ప్రస్తుతం హెచ్ఐవి సంక్రమణ/ఎయిడ్స్ వ్యాధికి చికిత్స లేదు. అయితే వైరస్ ను నియంత్రించేందుకు మాత్రం కొన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. దీనిని యాంటీరెట్రో వైరల్ థెరపీ(ART)అంటారు. ఈ హెచ్ఐవి వ్యతిరేక మందులు వైరస్ ను వివిధ మార్గాల్లో నిరోధించగలవు.

ఎయిడ్స్ నివారణ మార్గాలు..

ఎయిడ్స్ నివారణ మార్గాలు..

* మీరు కలయికలో పాల్గొన్నప్పుడు కండోమ్ కచ్చితంగా వాడాలి.

* మీ లైంగిక భాగస్వాముల కలయికను పరిమితం చేయాలి.

* ఇంజక్షన్లను పంచుకోవడం మానుకోవాలి.

* ఒక వ్యక్తి రక్తంతో సంబంధం లేకుండా ఉండాలి.

English summary

HIV And AIDS: Causes, Symptoms, Stages, Diagnosis And Treatment

HIV is a virus that damages the immune system and interferes with the bodys ability to fight the organisms. This causes a chronic, life-threatening condition called AIDS.