For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పనసపండుతో అతిసార (డయేరియా)కు చెక్ పెడదాం..

|

అతిసార (డయేరియా) వ్యాధితో ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఒక్కసారి ఇది వస్తే పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ వ్యాధి ఎక్కువగా కలుషిత నీరు తాగడం ద్వారా, మనం తీసుకునే ఆహారం, బ్యాక్టీరియా, వైరస్ ద్వారా సంక్రమిస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా వర్షాకాలంలోనే ఎక్కువగా వ్యాపిస్తుంది. ఎందుకంటే ఈ సీజన్లో వర్షాలు ఎక్కువగా కురిసి నదులు, చెరువులు, వాగులు, వంకలు, కాలువల్లో నీరంతా రంగు మారుతుంది. వీటినే మనం తీసుకోవడం వల్ల మానవ శరీరంలో పేగుల యొక్క కదలికలపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపుతాయి.

ఇంగ్లీష్ మందులను ఇగ్నోర్ చేద్దాం..

ఇంగ్లీష్ మందులను ఇగ్నోర్ చేద్దాం..

ఇలాంటప్పుడే కొంచెం కడుపునొప్పి, ఎక్కువ సార్లు విరేచనాలు అవుతుంటాయి. క్రమంగా మన శరీరంలో అసమతుల్యత, శారీరక బలహీనత వంటి లక్షణాలు ఏర్పడటానికి కారణాలుగా మారతాయి. అతిసార వ్యాధి తీవ్రమైన స్థితి కానప్పటికీ, మీకు అసౌకర్యంగా ఉండటమే కాకుండా శరీరం పూర్తిగా అలసిపోయేలా చేస్తుంది. అవసరమైన దాని కన్నా ఎక్కువ ఆహారాన్ని తీసుకోవటం ద్వారా, కెఫీన్, ఆల్కహాల్ వంటి అసహనానని వ్యక్తపరిచే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల డయేరియా త్వరగా అటాక్ చేస్తుంది. ఇలాంటప్పుడే మనం ఇంగ్లీష్ మందుల వైపు చూస్తుంటాం. వాటినే ఎక్కువగా వాడుతుంటాం. కానీ అలా వాటిని అంత శ్రేయస్కరం కాదు. ఆ వ్యాధి నివారణ కోసం నేచర్ లో లభించే సహజమైన పదార్థాలను వాడటం చాలా ఉత్తమం. వాటిలో డయేరియాకు అత్యంత వేగంగా చెక్ చెప్పేందుకు పనసపండు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి పనసపండు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఎక్కువ మోతాదులో ఈ పండును తినకూడదు..

ఎక్కువ మోతాదులో ఈ పండును తినకూడదు..

పనసపండు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. కాని ఏ, సి విటమిన్లు మాత్రం కొంత మాత్రమే ఉంటాయి. అయితే పొటాషియం, మెగ్నీషియం, పుష్కలంగా లభిస్తాయి. అయితే ఎక్కువ మోతాదులో ఈ పండును తినకూడదు. మితంగా తింటేనే అనేక లాభాలు చేకూరతాయి. మిగిలిన పండ్లతో పోలిస్తే వీటిలో లవణాలు, విటమిన్లు తక్కువ కాబట్టి జీర్ణం కావడం కొంచెం కష్టం.చిన్నపిల్లల్లో జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది కాబట్టి వారికి ఈ గింజలను కాల్చి ఇవ్వవచ్చు.

మలబద్ధకాన్ని నివారిస్తుంది..

మలబద్ధకాన్ని నివారిస్తుంది..

జ్వరం, అతిసారతో బాధపడేవారు పనసతొనలు తింటే చాలా ఉపశమనం పొందవచ్చు. ఇందులో జిగురు గుణం కూడా ఉన్నందు వల్ల మలబద్ధకాన్ని సైతం నివారించవచ్చు. ఈ పనసపండులో విటమిన్ సి ఉన్నందున వ్యాధి నిరోధక శక్తిని సైతం బాగా మెరుగుపరుచొచ్చు. ఆస్తమాతో బాధపడేవారికి కూడా ఈ పండు ఎంతో ఉపయోగపడుతుంది. పనస వేరును బాగా ఉడికించి దాని నుంచి వచ్చే రసం తీసుకుంటే ఆస్తమా అదుపులో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

క్యాన్సర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది..

క్యాన్సర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది..

పనసపండులో ఫైటోన్యూట్రియెంట్స్, యాంటీ యాక్సిడెంట్లు క్యాన్సర్ వ్యాధి నిరోధకానికి బాగా సహాయపడతాయి. అంతే కాదు ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల అజీర్తి, అల్సర్ల సమస్యను కూడా నయం చేయడంలో ఇది ఉపయోగపడుతుంది.

కంటిచూపును మెరుగుపరచడంలోనూ..

కంటిచూపును మెరుగుపరచడంలోనూ..

ఈ పనసపండును బాగా మగ్గిన తరువాత తింటే మనో ఉల్లాసాన్ని ఇస్తుంది. అలసటను సైతం తగ్గిస్తుంది. అంతే కాదు అన్నింటికంటే ముఖ్యంగా మన కంటిచూపు మెరుగుపడేందుకు కూడా దోహదం చేస్తుంది. చర్మ, కేశ, ఆరోగ్యానికి కూడా ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే మెగ్నిషీయం, కాల్షియం ఎముకల్లో ఎనర్జీని పెంచుతుంది. వీటిలోని ఖనిజ లవణాలు థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడతాయి. పనసపండులోని ఐరన్, రక్తహీనత సమస్యను నివారించడంలోనూ పనికొస్తుంది. రక్తం గడ్డకట్టే సమస్యను నివారిస్తుంది.

English summary

Let’s check for diarrhea with Jack fruit

Eating this jackfruit after a well-seasoned meal is a delight. It also reduces fatigue. And most importantly, it helps improve our eyesight. Works as a skin, hair and health. It contains magnesium and calcium which increases energy in the bones. The mineral salts in it protect the health of the thyroid gland. Iron in peanuts is also effective in preventing anemia. Prevents blood clotting problem.
Story first published: Saturday, August 17, 2019, 18:27 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more