For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

న్యూమోనియా : లక్షణాలు, కారణాలు, చికిత్స మరియు నివారణలు..

ప్రపంచవ్యాప్తంగా న్యూమోనియా వ్యాధి ప్రతి సంవత్సరం వేల మంది పసిపిల్లలను బలి తీసుకుంటోంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధిని అతిపెద్ద ఆరో వ్యాధిగా ప్రకటించింది.

|

ప్రస్తుతం ప్రాణాంతక వ్యాధులు ఏవి అంటే మనలో చాలా మంది క్యాన్సర్, గుండెపోటు, ఎయిడ్స్, మలేరియా, డెంగ్యూ అని చెబుతుంటారు. కానీ వీటి కంటే మరో ప్రాణాంతకమైన వ్యాధి ఉంది. అదే న్యూమోనియా. ఇది చిన్నారుల్లో వేగంగా వ్యాపిస్తుంది. ప్రస్తుత నాగరిక ప్రపంచంలో ఈ న్యూమోనియా వ్యాధి నివారణకు పరిష్కారం ఉన్నప్పటికీ మనం కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవు.

Pneumonia

న్యూమోనియా పిల్లలతో పాటు వృద్ధులలో కూడా ఎక్కువగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా నవజాత శిశువులకు ప్రతిరోజూ తలస్నానం చేయిస్తే మీరు న్యూమోనియాకు స్వాగతం పలికినట్టేనని మీకు తెలుసా.. ఈ నేపథ్యంలో అసలు న్యూమోనియా అంటే ఏమిటి? దీని లక్షణాలు ఏమిటి? ఈ వ్యాధి ఎలా వస్తుంది? దీనికి గల కారణాలేంటి? దీని వల్ల కలిగే నష్టాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

న్యూమోనియా అంటే ఏమిటి?

న్యూమోనియా అంటే ఏమిటి?

ప్రపంచవ్యాప్తంగా న్యూమోనియా వ్యాధి ప్రతి సంవత్సరం వేల మంది పసిపిల్లలను బలి తీసుకుంటోంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధిని అతిపెద్ద ఆరో వ్యాధిగా ప్రకటించింది. మనం పీల్చుకునే గాలిలో సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశిస్తే ఈ వ్యాధి వచ్చే అవకాశముంది. ఊపిరితిత్తుల్లో అత్యంత కీలకమైన గాలి గది ఆల్వియోలై అనే భాగంలో ఆక్సీజన్, కార్బన్ డై ఆక్సైడ్ మార్పిడి జరుగుతూ ఉంటుంది. ఏదైనా కారణాల వల్ల ఆల్వియోలైలో వాయు మార్పిడి జరగకపోతే శ్వాసక్రియ సక్రమంగా జరగకుండా ఉంటే, దానిని న్యూమోనియా అంటారు. వాడుకలో నెమ్ము చేసిందని అంటుంటారు.

న్యూమోనియా లక్షణాలు..

న్యూమోనియా లక్షణాలు..

న్యూమోనియా వచ్చినప్పుడు చలితో కూడిన జ్వరం వస్తుంది. అలాగే జలుబు, కఫం, దగ్గు, ఛాతిలో నొప్పి సాధారణంగా ఉంటుంది. కొందరిలో దగ్గుతున్న సమయంలో రక్తం కూడా రావచ్చు. కఫం విషయానికొస్తే కొందరికి చిక్కగా, మరి కొందరికి కఫం పలుచగా పడవచ్చు. కఫం రంగు ఎల్లో లేదా రెడ్ లేదా గ్రీన్ కలర్లో ఉండొచ్చు. ఈ లక్షణాలు ఉంటే న్యూమోనియా వచ్చినట్లు నిర్ధారించవచ్చు. అలాగే బ్లడ్ కల్చర్, ఛాతీ ఎక్స్ రే, రక్తపరీక్షల ద్వారా న్యూమోనియాను నిర్ధారిస్తారు. తెల్లరక్తకణాల సంఖ్యను బట్టి కూడా ఈ వ్యాధిని అంచనా వేస్తారు.

న్యూమోనియాకు కారణాలు..

న్యూమోనియాకు కారణాలు..

వైరస్, బ్యాక్టీరియా, శిలీంద్రాలు, ప్రోటోజోవా, క్షయ వల్ల న్యూమోనియా వ్యాధి వస్తుంది. మనం తీసుకునే శ్వాసలో గాలితో పాటు కొన్ని సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి, చిన్నపిల్లలకు, 60 ఏళ్లు వయసు పైబడిన వారికి ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది. ఈ వ్యాధి తీవ్ర దశలో ఉన్నప్పుడు న్యూమోనియా వస్తుంది. దీనినే బ్యాక్టీరియా సెప్టీసీమియాగా పిలుస్తారు.

న్యూమోనియాలో రకాలు..

న్యూమోనియాలో రకాలు..

న్యూమోనియాను వైద్యులు పలు రకాలుగా విభజించారు. ఈ వ్యాధి బ్యాక్టీరియా వల్ల వస్తే బ్యాక్టీరియల్ న్యూమోనియా అని, వైరస్ వల్ల వస్తే వైరస్ న్యూమోనియా అని, టిబి వల్ల వస్తే టిబి న్యూమోనియా, ఫంగస్ వల్ల వస్తే ఫంగల్ న్యూమోనియా అంటారు. పక్షవాతం, క్యాన్సర్ వచ్చిన వారిలో తిన్నది సరిగా మింగలేనప్పుడు వచ్చే న్యూమోనియా ఆస్పిరేషన్ న్యూమోనియా అంటారు.

న్యూమోనియా ఎవరికి వస్తుంది..

న్యూమోనియా ఎవరికి వస్తుంది..

న్యూమోనియా ఎక్కువగా చిన్నపిల్లల్లోనూ, 60 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. షుగర్, గుండెపోటు, హెచ్ఐవి, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నప్పుడు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు, పొగ తాగే అలవాటు ఉన్నప్పుడు ఊపిరితిత్తుల్లో న్యూమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. న్యూమోనియా అనేది చాలా సాధారణమైన వ్యాధి. కానీ కొన్నిసార్లు ప్రాణాంతకమైనది. వీటిలో ఫంగల్ న్యూమోనియా అనేది చాలా ప్రమాదకరమైనది.

న్యూమోనియా పరీక్షలు..

న్యూమోనియా పరీక్షలు..

న్యూమోనియాకు సంబంధించి రెండు పరీక్షలను చేస్తారు. ఒకటి ఛాతీకి సంబంధించి ఎక్స్ రే తీయడం. అలా తీసిన ఎక్స్ రేలో ఎక్కడైనా ఏదైనా మచ్చలు కనిపిస్తే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని నిర్ధారిస్తారు. అలాగే ఎవరికైనా కఫం వచ్చినప్పుడు యాంటి బయోటిక్ మందులను వాడకుండా ముందే కల్చర్ కు పంపిస్తే మనకు 24 గంటలలోపే ఈ వ్యాధి గురించి తెలిసిపోతుంది. అందులో ఎన్ని సూక్ష్మక్రిములు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. దానికి ఎలాంటి యాంటి బయోటిక్ మందులు ఇవ్వాలో కూడా నిర్ధారించవచ్చు. అది ఎంత ప్రమాదకరమో కూడా తెలుసుకోవచ్చు. కొంతమందిలో క్యాన్సర్ ఉన్న వారికి సిటి స్కాన్ వంటివి చేస్తారు.

న్యూమోనియాకు చికిత్సలు..

న్యూమోనియాకు చికిత్సలు..

ఈ వ్యాధి సోకినపుడు వారం నుండి పది రోజుల వరకు యాంటీ బయోటిక్ మందులను చికిత్సకు ఉపయోగిస్తారు. ఈ సమయంలో ఐవీ ఫ్లూయిడ్స్, కృత్రిమ ప్రాణవాయువు కూడా అవసరమవుతాయి. శ్వాసకోశల్లో న్యూమోనియా చీముగా మారడం, ఛాతిలో చీము చేరడం, మెదడు తదితర అవయవాల్లోకి చేరడం జరుగుతుంది. దీనికి కూడా వ్యాధి తీవ్రతను బట్టి వైద్యులు తగిన చికిత్సలు అందిస్తారు. 2 నుండి 5 ఏళ్ల పిల్లలకు, 65 ఏళ్లు దాటిన వారికి ఐదేళ్లకు ఒకసారి టీకా మందు (న్యూమోకోకస్ వ్యాక్సిన్) రక్షణ లభిస్తుంది.

న్యూమోనియా నివారణలు..

న్యూమోనియా నివారణలు..

ముఖ్యంగా పసిపిల్లలకు న్యూమోనియా వ్యాధి రాకుండా ఉండేందుకు తల్లిపాలను ఆరు నెలల నుండి సంవత్సరం వరకు పట్టించాలి. దీని వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే చిన్నపిల్లలకు చలికాలంలో తలస్నానం చేయించడం మానుకోవాలి. చలి వాతావరణంలో తలస్నానం చేస్తే జలుబు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల జలుబు చేస్తే న్యూమోనియా సోకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వైద్యుల సలహాల మేరకు ఏడాది వయస్సు వరకు శిశువులకు చలికాలంలో తలస్నానం చేయించకపోవడమే మంచిది. అలాగే న్యూమోనియాకు సోకిన వారు వీలైనంత చల్లని ప్రదేశాలకు వెళ్లకుండా ఉండాలి. రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలకు కూడా వెళ్లకుండా ఉండటమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ముక్కుకు కర్చీఫ్ ధరించడం, బయటికి వెళ్లి వచ్చిన వెంటనే బట్టలు మార్చుకోవడం వంటివి చేయాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.

English summary

Pneumonia Causes, Symptoms, Treatment and Prevention

Read on to know the Pneumonia causes, symptoms, diagnosis, treatment and prevention.
Desktop Bottom Promotion