For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారతదేశంలో వర్షాకాలంలో వచ్చే ప్రధాన వ్యాధులు..

వర్షాకాలమంటే ఇష్టపడని వారుండరు. ఈ సీజన్ ఇలానే ఉండిపోవాలని చాలామంది కోరుకుంటుంటారు. కానీ ఈ సీజన్లో వ్యాధులు సైతం కొందరిని బాగా ఇబ్బంది పెడతాయి. ప్రధానంగా జలుబు, దగ్గు, విరేచనాలు, మలేరియా, డయేరియా, టైఫా

|

వర్షంలో తడిచేందుకు కొందరు బాగా ఇష్టపడతారు. కానీ వర్షాకాలం(రుతుపవనాల కాలం)లో వచ్చే వ్యాధుల పట్ల మీకు అవగాహన ఉందా? ఈ నేపథ్యంలో వర్షాలు ఎక్కువగా కురుస్తున్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

Monsoon Diseases In India

వర్షాకాలంలో వచ్చే వ్యాధులను ఎలా అరికట్టాలో మీకు తెలిస్తే, వర్షాలు, వర్షాకాలం అందించే అద్భుత పచ్చదనాన్ని, అందాల దృశ్యాలను మీరు ఆనందంగా ఆస్వాదించవచ్చు. ఈ సీజన్లో మనలో చాలా మందిని మలేరియా, విరేచనాలు వంటి కొన్ని రుతుపవన వ్యాధులు ఇబ్బంది పెట్టే విషయం వాస్తవమే. అంతేకాదు అంటువ్యాధులు సైతం వేగంగా వ్యాప్తిస్తాయి.

మనలో చాలా మంది వర్షాకాలంలో సాధారణ జలుబు, ముక్కుదిబ్బడతో పాటు ఇతర సాధారణ రుతుపవనాల వ్యాధుల బారిన తరచూ పడుతుంటారు.

ఈ పోస్ట్‌లో, సాధారణ రుతుపవనాల వ్యాధుల గురించి మీకు తెలియజేస్తున్నాము. ఈ వ్యాధులతో తస్మాత్ జాగ్రత్త...

1) సాధారణ జలుబు..

1) సాధారణ జలుబు..

వర్షాకాలంలో వచ్చే వ్యాధులలో ఈ వ్యాధి సాధారణమైంది. ముక్కు దిబ్బడ తుమ్ములకు, దగ్గుకు దారితీస్తుంది. ఒకవేళ ఇందులో ఫ్లూ లక్షణాలేమైనా కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

2) టైఫాయిడ్..

2) టైఫాయిడ్..

వర్షాకాలంలో వచ్చే మరో రకమైన వ్యాధి టైఫాయిడ్. ఇది జ్వరం, తలనొప్పికి దారితీస్తుంది. దీని నివారణకు టైఫాయిడ్ వ్యాక్సిన్ వాడటం ఉత్తమం.

3) మలేరియా..

3) మలేరియా..

మనందరికీ దోమల వల్ల మలేరియా వస్తుందన్న సంగతి తెలిసిందే. వర్షాకాలంలో ఈ వ్యాధి సర్వసాధారణం. ఇది ఎక్కువ జ్వరం, శరీర నొప్పులకు దారి తీస్తుంది.

4) డయేరియా..

4) డయేరియా..

డయేరియా వ్యాధి యొక్క ప్రధాన లక్షణం వదులుగా ఉండే కదలికలు. ఈ వ్యాధి సైతం వర్షాకాలంలోనే ఎక్కువగా వస్తుంది. ఇది మీ పేగులను ఇబ్బంది పెట్టే పరాన్నజీవుల ద్వారా వ్యాపిస్తుంది.

5) చికెన్ గున్యా జ్వరం..

5) చికెన్ గున్యా జ్వరం..

ఈ జ్వరం కూడా దోమల నుండే వ్యాపిస్తుంది. తీవ్రమైన కీళ్ల నొప్పులు, జ్వరం రావడం ఈ వ్యాధి లక్షణాలు. ఇది సోకిన వ్యక్తిని వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించడం ఉత్తమం.

English summary

Most Common Monsoon Diseases

Most of us get affected by common cold and runny nose and other such common monsoon diseases especially when we roam around in the rainy season. In this post, let us know about the common monsoon diseases. Cold can cause runny nose, cough and sneezing. It is better to consult the doctor if the symptoms indicate flu.
Desktop Bottom Promotion