For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షాక్! చైనాలో కొత్తగా బుబోనిక్ ప్లేగు : దీని లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణలివే....

|

ఇప్పటికే డ్రాగన్ కంట్రీ నుండి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తోంది. అంతలోనే ఇటీవల మరో వైరస్ జి4 కూడా పుట్టుకొచ్చింది. ఇంతటి భయంకరమైన వైరస్ ల నుండి కోలుకోకముందే ప్రపంచాన్ని మరింత భయపెట్టే వ్యాధి గురించి సంచలన విషయాలు బయటపెట్టింది.

తాజాగా జూన్ 5వ తేదీన చైనా వైద్య అధికారులు మూడో భయంకరమైన వ్యాధి బుబోనిక్ ప్లేగు గురించి హెచ్చరికలు జారీ చేశారు. జులై 1వ తేదీ పశ్చిమ మంగోలియాలోని ఖోఫ్ట్ ప్రావిన్స్ లోని రెండు న్యూస్ ఛానెల్స్ బుబోనిక్ ప్లేగు కేసులను గురించి సమాచారమిచ్చాయి. ఈ భయంకరమైన వ్యాధి పెద్ద ఉడతల మాంసం నుండి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. అసలు బుబోనిక్ ప్లేగు అంటే ఏమిటి. దీనికి కారణాలు ఏమిటి? దీనికి ఏదైనా చికిత్స ఉందా? లేదా కేవలం నివారణ ఒక్కటే మార్గమా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సిద్ధ న్యాచురోపతితో కరోనాకు చెక్ పెట్టొచ్చు... అదెలాగో తెలుసుకోండి...

బుబోనిక్ ప్లేగు అంటే ఏమిటి?

బుబోనిక్ ప్లేగు అంటే ఏమిటి?

యెర్సినీయా పెస్టిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలిగే మూడు రకాల ప్లేగులలో బుబోనిక్ ప్లేగు ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 2010 మరియు 2015 మధ్య బుబోనిక్ ప్లేగు కేసులు 3248 నమోదయ్యాయి. దీని ఫలితంగా 584 మంది మరణించారు.

50 మిలియన్ల మంది..

50 మిలియన్ల మంది..

14వ శతాబ్దంలో ఆసియా, యూరప్ మరియు ఆఫ్రికా దేశాల్లో సుమారు 50 మిలియన్ల మంది ఈ బుబోనిక్ ప్లేగు వ్యాధితో మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 6వ శతాబ్దంలో తూర్పు రోమన్ సామ్రామజ్యంలో జస్టినియన్ ప్లేగుకు కారణమైంది. చైనా, మంగోలియా మరియు భారతదేశాలను ప్రభావితం చేసే మూడో అంటు వ్యాధి 1855లో యునాన్ ప్రావిన్స్ లో ఉద్భవించింది.

ప్రధానంగా మూడు రకాలు..

ప్రధానంగా మూడు రకాలు..

తెగుళ్లు ప్రధానంగా మూడు రకాలు, అవి బుబోనిక్, సెప్టిసిమిక్ మరియు న్యూమోనిక్. శరీరంలోని ఏ భాగాన్ని అయినా ఇది ప్రభావితం చేస్తుంది. బుబోనిక్ ప్లేగు ఎక్కువగా మెడలో లేదా గజ్జల్లో వస్తుంది. దీని వల్ల చాలా వాపు మరియు బాధకరమైన కణుపులు వచ్చే అవకాశం ఉంది.

కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పుడు మీరు చేసే ఈ తప్పులు మీ జీవితానికి అపాయం కలిగిస్తాయి ...!

రోగ నిరోధక వ్యవస్థకు..

రోగ నిరోధక వ్యవస్థకు..

ఇది రోగ నిరోధక వ్యవస్థలో భాగమైన శోషరస వ్యవస్థను ప్రభావితం చేయడం ద్వారా, ఇది శోషరస కణుపులలో మంటను కలిగిస్తుంది. శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. దీనికి తగిన సమయంలో యాంటీ బయోటిక్స్ తో చికిత్స చేయకపోతే బుబోనిక్ ప్లేగు ప్రాణాంతకంగా మారుతుంది.

ఈ ప్లేగుకు గల కారణాలు..

ఈ ప్లేగుకు గల కారణాలు..

ఇది యెర్సినియా పెస్టిస్ అనే బ్యాక్టిరీయా వల్ల కలిగే బ్యాక్టీరియా సంక్రమణ. ఇది ఎలుకల వల్ల కూడా వస్తుంది. దీనిని ‘ర్యాట్ఫ్ ఫ్లీ' అని కూడా పిలుస్తారు. ఎలుకలు పరాన్న జీవులు. ఇవి కొత్త బ్యాక్టీరియాను ఉత్పత్తి చేయగలవు.

ఎలా వ్యాపిస్తుందంటే...

ఎలా వ్యాపిస్తుందంటే...

ఇది మనుషులకు ఎలా వ్యాపిస్తుందంటే.. ఎవరితో మనకు నేరుగా సంబంధాలు కలిగి ఉంటామో వారికి వెంటనే సోకుతుంది. ఇది కూడా ఇన్ఫెక్షన్ మాదిరిగా చాలా వేగంగా సోకుతుంది. ఇది సోకిన ఈగలతో సంపర్కం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన జంతువు లేదా వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం ద్వారా మరియు ఇది సోకిన జంతువును తింటే బుబోనిక్ ప్లేగు రావచ్చు.

వర్షాకాలంలో వ్యాధులు రాకూడదనుకుంటే మీ రెగ్యులర్ డైట్ లో ఈ మసాలాలు జోడించండి..

దీని లక్షణాలివే...

దీని లక్షణాలివే...

బుబోనిక్ ప్లేగు యొక్క అత్యంత సాధారణ సంకేతాలలో జ్వరం, చలి, తలనొప్పి, ఒంటిపై వాపులు, శరీరంపై పుండ్లు, లింప్ గ్రంధుల్లో నొప్పి వంటివి వస్తాయి. ఇవన్నీబుబోనిక్ ప్లేగు యొక్క కొన్ని లక్షణాలు. కొన్ని రోజులు బ్యాక్టీరియాకు గురైన తర్వాత అకస్మాత్తుగా కనిపిస్తాయి.

కొన్ని సంకేతాలు

* కండరాల తిమ్మిరి

* మూర్ఛ

* చలి

* అనారోగ్యం

* అధిక జ్వరం

* వాపు కనిపించే ముందు ఈ ప్రాంతంలో నొప్పి వస్తుంది.

* తలనొప్పి

* కాలి, వేళ్లు, పెదవులు మరియు ముక్కు యొక్క కొన యొక్క గ్యాంగ్రేన్ (రక్త సరఫరా లేకపోవడం వల్ల కణజాల మరణం)

ఎలా నిర్ధారిస్తారంటే..

ఎలా నిర్ధారిస్తారంటే..

బుబోనిక్ ప్లేగును ప్రయోగశాలల్లో నిర్ధారిస్తారు. సంక్రమణ ప్రారంభ మరియు చివరి దశలలో తీసుకున్న శ్యాంపిల్స్ ను పరిశీలించడం ద్వారా వీటిని నిర్ధారిస్తారు.

ఎక్కువ ప్రమాదం ఎవరికంటే?

ఎక్కువ ప్రమాదం ఎవరికంటే?

చాలా మందికి ఈ బుబోనిక్ ప్లేగు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే ఈ కింది కారణాల వల్ల మీరు వ్యాధి బారిన పడొచ్చు.

* మీరు నిత్యం జంతువులతో కలిసి ఉంటే.

* మీరు ఆరు బయట హైకింగ్, క్యాంపింగ్ లేదా వేటలో గడిపితే

* ఎలుక, ఉడుత లేదా కుందేలు వంటి వాటికి బుబోనిక్ ప్లేగు సోకిన ఒక సజీవంగా ఉన్న జంతువును లేదా చనిపోయిన వాటిని తాకితే

* ప్లేగు వ్యాధి ఉన్న వారితో సంప్రదిస్తే..

ఈ వ్యాధికి గల చికిత్స..

ఈ వ్యాధికి గల చికిత్స..

ఈ ప్లేగును నయం చేయడానికి మందు అందుబాటులో ఉంది. అయితే సకాలంలో చికిత్స అందితేనే ఇది నయమవుతుంది. సిప్రోఫ్లోక్సాసిన్, డాక్సీసైక్లిన్ వంటి యాంటీ బయాటిక్స్ వ్యాధి చికిత్సలో ప్రభావవంతంగా పని చేస్తాయి. యాంటీబయాటిక్స్ తో చాలా మంది ప్రజలు ఒకటి లేదా రెండు వారాల్లోనే మెరుగవుతారు.

బుబోనిక్ ప్లేగు నివారణ చర్యలు...

బుబోనిక్ ప్లేగు నివారణ చర్యలు...

ప్రస్తుతానికి బుబోనిక్ ప్లేగుకు వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కాబట్టి వ్యాధి బారిన పడకుండా ఉండటానికి నివారణ చర్యలు తీసుకోవాలి.

* ఈ వ్యాధి సోకిన జంతువులను తాకేటప్పుడు చేతికి గ్లౌవ్స్ తొడుక్కోండి.

* ఎలుకలు మరియు ఉడుతలు రాకుండా మీ ఇంటి చుట్టుపక్కల ఉండే రంధ్రాలను మూసేయ్యండి.

* మీ పెంపుడు జంతువులపై ఫ్లూ కంట్రోల్ స్ప్రేలు లేదా ఇతర చికిత్సలను చేయించండి.

* మీ పెంపుడు జంతువు ఆరుబయట ఉంటే, వాటిని మీ మంచం మీద పడుకోనివ్వదు.

English summary

What is bubonic plague: Symptoms, causes, Treatment and precautions

Bubonic plague is the most common type of plague and is one of three types of plague caused by Yersinia pestis. It can spread through infected fleas and causes symptoms such as fever and swollen lymph nodes under the arms and in the neck called buboes.