For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Hepatitis Day 2021: కాలేయాన్ని కాపాడుకోవడానికి వీటిని రెగ్యులర్ గా తీసుకోండి...

వరల్డ్ హెపటైటిస్ డే 2021 సందర్భంగా హైపటైటిస్ వ్యాధి గురించి మనం కొన్ని నమ్మలేని నిజాలను తెలుసుకోవాలి. అవేంటో మీరే చూడండి.

|

Hepatitis-B వైరస్ అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. ఇది ప్రపంచవ్యాప్తంగా చాప కింద నీరులా విస్తరించింది. ఆ సంఖ్య దాదాపు 370 మిలియన్లకు పైగా ఉందని.. సుమారు ఒక మిలియన్ మంది హెపటైటిస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.

World Hepatitis Day 2021:Must Know the Facts about Hepatitis-B Virus in Telugu

వందల సంఖ్యలో ఉన్న వైరస్ లలో ఈ హెపటైటిస్ ఒకటి. దీన్నే సీరం హెపటైటిస్ అంటారు. ఈ వ్యాధి ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అందుకే హెపటైటిస్ అనే వ్యాధికి క్యాలెండర్లో ప్రత్యేకంగా ఓ రోజును కేటాయించారు.

World Hepatitis Day 2021:Must Know the Facts about Hepatitis-B Virus in Telugu

అంటే ఇది ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోండి. ప్రతి సంవత్సరం జులై 28వ తేదీన వరల్డ్ హెపటైటిటస్ డే సందర్భంగా ప్రపంచ దేశాలకు ఈ వ్యాధి గురించి అవగాహన కల్పిస్తారు. ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే.. మనలో ఎవ్వరూ ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కాలేయంలో కొవ్వు పెరగకుండా ఏమి చేయాలి.. ఈ వ్యాధి బారిన పడిన వారు ఏమి చేయాలనే వివరాలను తెలియజేస్తారు. ఈ సందర్భంగా మనం మన కాలేయాన్ని కాపాడుకోవడానికి ఏమి చేయాలనే వివరాలను నిపుణులు కొన్ని సూచనలు చేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

స్త్రీ, పురుషులలో టైప్ 2 డయాబెటిస్ ఎక్కువగా ప్రభావితం చేసేది ఎవరికి? ప్రాణాలకు ఎక్కువ ప్రమాదం ఎవరికి?

ఎవరికి ఎక్కువగా వస్తుందంటే..

ఎవరికి ఎక్కువగా వస్తుందంటే..

ఈ వైరస్ వ్యాధికి వ్యాక్సిన్ ఉన్నప్పటికీ, ఈ హెపటైటిస్ మహమ్మారి ప్రతి 30 నుండి 45 సెకన్లకు ఓ వ్యక్తిని బలి తీసుకుంటోందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఒక అంటు వ్యాధి. హెచ్ ఐవి కంటే పది రెట్లు వేగంగా సంక్రమిస్తుంది. ఈ వ్యాధి ఉన్న గర్భిణుల పిల్లలకు డెలివరీ తర్వాత వారి పిల్లలకు కూడా ఇలాంటి వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఎలా వస్తుందంటే..

ఎలా వస్తుందంటే..

మన శరీరంలో జన్యుపరమైన తేడాలు వచ్చినప్పుడు.. ఈ హెపటైటిస్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లావు ఎక్కువగా ఉన్నవారు, డయాబెటిక్ రోగులు, హైబీపీ, గుండె సమస్యలు, కొవ్వు, థైరాయిడ్ ఇబ్బందులు ఉన్న వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

లివర్ క్యాన్సర్..

లివర్ క్యాన్సర్..

ఇది చాలా భయంకరమైన వ్యాధి కాబట్టి.. దీన్ని లివర్ క్యాన్సర్ కూడా అని అంటారు. ఈ నేపథ్యంలో మనం హెపటైటిస్ బారిన పడకుండా ఉండాలంటే ఇలాంటి పదార్థాలను రెగ్యులర్ గా తీసుకోవాలి.

ఇంట్లో ఆహారం..

ఇంట్లో ఆహారం..

- హెపటైటిస్ బారిన పడకూడదంటే.. ఇంట్లో వండుకున్న ఆహారమే తినాలి.

-బాగా ఉడికించిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది.

వేడిగా ఉండే పదార్థాల నుండి పోషకాలు బాగా లభిస్తాయి. వాటిలో కొవ్వు ఉండదు. ఇవి తీసుకోవడం తీసుకోవడం వల్ల ఎలాంటి వ్యాధులు రావు.

-కూరగాయలు, ధాన్యాలు, గింజలు, ఆకుకూరలతో పాటు పోషకాలు ఎక్కువగా ఉండే వాటిని రెగ్యులర్ గా తీసుకోవాలి.. అలాగే పండ్లను కూడా తినాలి. ఇలా నిరంతరం చేయడం వల్ల మీరు హెపటైటిస్ వ్యాధి నుండి బయటపడతారు.

-స్వీట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు, కేకులు, బేకరీ ఐటమ్స్ ఎంత తక్కువ తింటే అంత మంచిది.

-ఆల్కహాల్ ను సాధ్యమైనంత త్వరగా అవాయిడ్ చేయాలి.

-ప్రతిరోజూ కొంత దూరమైన నడవాలి. వీలైతే జాగింగ్ చేయాలి. చిన్న చిన్న బరువు ఎత్తి దించాలి. వీలైతే జిమ్ కు కూడా వెళ్లొచ్చు. ఇవన్నీ కుదరకపోయినా మెట్లు ఎక్కి దిగినా కూడా కొవ్వు అనేది ఆటోమేటిక్ గా కరిగిపోతుంది.

-ఇలాంటి జాగ్రత్తలు మీరు రెగ్యులర్ గా పాటిస్తే.. మీరు ఏ వైద్యుని దగ్గరకు వెళ్లాల్సిన అవసరం దాదాపు ఉండదు. ఇదొక్కటే కాదు ఇంకా ఎన్నో రోగాలు మన దరి చేరకుండా ఉంటాయి.

బ్రష్ చేసేటప్పుడు మీరు చేసే ఈ తప్పులు తదుపరి సమస్యకు దారితీస్తాయిబ్రష్ చేసేటప్పుడు మీరు చేసే ఈ తప్పులు తదుపరి సమస్యకు దారితీస్తాయి

రెగ్యులర్ వ్యాయామం..

రెగ్యులర్ వ్యాయామం..

సాధారణంగా కాలేయం(Liver)లో కొవ్వు పదార్థం పెరుగుతూ ఉంటుంది. అది ఓ మోతాదుకు మించి పెరిగితే చాలా ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆల్కహాల్ తాగడం వల్ల వచ్చే కొవ్వు ఒక రకమైతే, ఆల్కహాల్ తాగకపోయినా వచ్చే కొవ్వు ఇంకో రకం. కాబట్టి కొవ్వు ఎలా ఉన్నా దాని నుండి బయటపడాలంటే రెగ్యులర్ వ్యాయామం చేయాలి. అధిక బరువును వీలైనంత వేగంగా తగ్గాలి.

ఫాస్ట్ ఫుడ్ మానుకోవాలి..

ఫాస్ట్ ఫుడ్ మానుకోవాలి..

మన కాలేయాన్ని మనం కాపాడుకోవాలంటే.. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తగ్గించుకోవాలి. అలాగే ఆయిల్ ఫ్రై ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల కొవ్వు బాగా పెరిగిపోతుంది. అంతేకాదు మీ లివర్లో మంట పెరుగుతుంది. దీంతో మీ ప్రాణానికే ప్రమాదకరంగా మారుతుంది. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు.

ముందే జాగ్రత్తగా..

ముందే జాగ్రత్తగా..

ఒక్కసారి లివర్ పాడైతే.. దాన్ని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడం అనేది చాలా కష్టం. లివర్లో కొవ్వు అధికంగా ఉంటే వైద్యులు కూడా ఏమి చేయలేరు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా, చాలా మంది ఇళ్లలో నుండే పని చేయడంతో.. మరింత లావు పెరిగిపోయారు. దీంతో హెపటైటిస్ రోగుల సంఖ్య ప్రతి ఏటా భారీగా పెరుగుతూ పోతోంది.

English summary

World Hepatitis Day 2021:Must Know the Facts about Hepatitis-B Virus in Telugu

Here we are talking about the world hepatitis day 2021:know the facts about hepatitis-b virus in Telugu. Have a look
Story first published:Tuesday, July 27, 2021, 15:26 [IST]
Desktop Bottom Promotion