For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Mosquito Day 2021:దోమలకూ ఓ రోజు వస్తుందని మీకు తెలుసా...

బ్రిటీష్ ఇండియా శాస్త్రవేత్త 1897లో సికింద్రబాద్ నివాసముండే రోజుల్లో ఆగస్టు 20వ తేదీన మలేరియా పరాన్నజీవి ఫ్లాస్మోడియం పరాన్నజీవి ఉనికిని, అనాఫిలస్ అనే ఆడదోమ లాలజలగ్రంధుల్లో గుర్తించాడు.

|

ఈ ప్రపంచంలో ప్రతి జీవికి ఓ రోజు వస్తుంది అనే డైలాగ్ చాలా చోట్ల మీరు వినే ఉంటారు. అలా దోమలకు ఆగస్టు 20వ తేదీ అనేది ఒకటుందని చాలా మందికి తెలీదు.

World Mosquito Day

బ్రిటీష్ శాస్త్రవేత్త, వైద్యులు, కీర్తిశేషులు రోనాల్డ్ రాస్ చారిత్రాత్మక ఆవిష్కరణకు గుర్తుగా ప్రపంచ దోమల దినోత్సవాన్ని ప్రతి ఏటా జరుపుకుంటున్నారు. దోమల వల్ల ఏమేమి రోగాలొస్తాయో అందరికీ తెలిసిందే. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి రోగాలు రాకుండా ఏమేమీ జాగ్రత్తలు తీసుకోవాలో.. రాస్ అనే శాస్త్రవేత్త దోమల గురించి ఏమి కనుగోన్నారో తెలియాలంటే ఈ స్టోరీని చదవాల్సిందే..

దోమలకు గుర్తింపు వచ్చింది ఎక్కడో తెలుసా..

దోమలకు గుర్తింపు వచ్చింది ఎక్కడో తెలుసా..

బ్రిటీష్ ఇండియా శాస్త్రవేత్త సికింద్రాబాద్ లో నివాసముండే రోజుల్లో 1897 ఆగస్టు 20వ తేదీన మలేరియా పరాన్నజీవి ఫ్లాస్మోడియం పరాన్నజీవి ఉనికిని, అనాఫిలస్ అనే ఆడదోమ లాలజలగ్రంధుల్లో గుర్తించాడు. ఫ్లాస్మోడియం జీవితచక్రాన్ని సైతం విపులంగా వివరించాడు. దీంతో ఆ గొప్ప శాస్త్రవేత్త ఆవిష్కరణకు గుర్తుగా దోమలకు ఒక గుర్తింపు వచ్చింది. ఈయన ఆవిష్కరణకు ముందు ప్రజల్లో వేరే భావన ఉండేది. అంతకుముందు దీనిని మాల్ అని పిలిచేవారు. మాల్ అంటే చెడు అని అర్థం. చేడు ఏరియా వలన కలిగే వ్యాధి అని అందుకనే అలా పిలిచేవారు. రోనాల్డ్ రాస్ మహానుభావుడి చేసిన కృషి వల్లనే మలేరియాతో పాటు దోమల వల్లే వచ్చే ఇతర వ్యాధులకు నివారణ మార్గాలు సులభమయ్యాయి.

ఇవే మలేరియా లక్షణాలు..

ఇవే మలేరియా లక్షణాలు..

ఛాతిలో నొప్పిగా ఉండటం, దగ్గు, చెమటలు పట్టడం, విరేచనాలు, నీరసంగా ఉండటం, చలిజ్వరం, తలనొప్పి ఆయాసం వంటి తొలిదశలో వచ్చే లక్షణాలు. దోమ కాటుకు గురైన ఏడు నుండి 18 రోజుల మధ్యలో మనకు మలేరియా లక్షణాలు కనిపిస్తాయి. ప్రారంభ దశలోనే ఈ వ్యాధిని గుర్తిస్తే మనం మెరుగైన చికిత్సను అందించవచ్చు.

మలేరియాను ఇలా నిర్ధారిస్తారు..

మలేరియాను ఇలా నిర్ధారిస్తారు..

ఆ వ్యాధి సోకినట్లు అనుమానమొచ్చినా లేదా ముందుగానే రక్త నమూనాలను సేకరించి మైక్రోస్కోపిక్ ల్యాబోరేటరీ టెస్టులు లేదా ఆర్డీటీ టెస్టుల ద్వారా మలేరియా వ్యాధి సోకిందా లేదా అనేది వైద్యులు నిర్ధారిస్తారు. ఇంకా ఇతర వ్యాధుల్లో కూడా మలేరియా లక్షణాలు కనిపించే అవకాశముంది. కనుక పారాసైటలాజికల్ టెస్టుల ద్వారా ఈ వ్యాధిని తప్పకుండా నిర్ధారించొచ్చు. గర్భిణులు, చిన్నారులు మలేరియా వ్యాధి చాలా ప్రమాదకరం అని వైద్యులు చెబుతుంటారు.

ఆరు రకాల అనాఫిలిస్ దోమలతో మలేరియా..

ఆరు రకాల అనాఫిలిస్ దోమలతో మలేరియా..

ఇప్పటివరకు మొత్తం ఆరు రకాల దోమలను గుర్తించారు. అవేంటంటే.. 1) అనాఫిలిస్ కలిసిఫెసీస్ 2) అనాఫిలిస్ ఫ్లువైటీస్ 3) అనాఫిలిస్ స్టిఫెనెస్ 4) అనాఫిలిస్ సండైకస్ 5) అనాఫిలిస్ మినిమస్ 6) అనాఫిలిస్ ఫెలిపినిసిస్. ఈ ఆరు రకాల అనాఫిలిస్ ఆడ దోమలు వాటిలోని ఫ్లాస్మోడియం పరాన్నజీవికి ఆశ్రయం ఇచ్చి మలేరియాను వ్యాప్తి చేస్తుంటాయి. ఇప్పుడు దోమల నివారణకు ఏమేమీ చేయాలో తెలుసుకుందాం.

దోమల నివారణకు ఈ చిట్కాలను పాటించండి..

దోమల నివారణకు ఈ చిట్కాలను పాటించండి..

దోమలను తరిమికొట్టేందుకు మీరు మార్కెట్లో లభించే ఖరీదైన కాయిల్స్ ను కొనాల్సిన పనిలేదు. కేవలం మీ ఇంట్లో లభ్యమయ్యే వస్తువులతోనే దోమలను తరిమికొట్టొచ్చు. అదేంటంటే ఒక గిన్నె లేదా బౌల్ లో నీళ్లు నిండా వేసి వాటిలో అరడజను కర్పూరం బిళ్లలను వేసి మీరు నిద్రించే గదిలో ఒక మూలన పెట్టాలి. ఆ కర్పూరం నుండి వచ్చే వాసనకు దోమలు రావు. లేదా ఆలౌట్ బాటిల్ లో వేపనూనెను వేసినా దోమలు మీ దగ్గరికి రావడానికి భయపడతాయి.

పుదీన మొక్క ఘాటుకు దోమలు దరి చేరవు..

పుదీన మొక్క ఘాటుకు దోమలు దరి చేరవు..

దోమలు విజృంభించేందుకు అనువైన కాలమిది. దోమ కాటుకు అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. అందుకనే దోమ కాటుకు గురికాకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలి. పుదీనా మొక్కను కుండీలో నాటి ఇంట్లో పెట్టుకుంటే దోమల బెడద దాదాపు తగ్గుతుంది. పుదీన ఘాటుకు కూడా దోమలను మళ్లొంచొచ్చు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి..

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి..

మలేరియా వ్యాధి బారిన పడిన తర్వాత బాధలు పడేకంటే.. ఆ వ్యాధి సోకకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తే మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనికోసం పరిసరాలను పరిశుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. ఒకవేళ దోమలు ఎక్కువగా ఉంటే నిద్రించే సమయంలో దోమ తెరలను ఉపయోగించాలి. కిటికీలు, తలుపులకు నెట్ లు బిగించుకోవాలి. మస్కిటో రిపెల్లెంట్స్ క్రీములు, స్ప్రేలు వాడటం కూడా మంచిది.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి..

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి..

ఈ వర్షాకాలంలో వీధుల్లో ఎక్కడైనా అపరిశుభ్ర ఆహారాన్ని తీసుకోకుండా ఉండటం చాలా శ్రేయస్కరం. ఎక్కువగా ద్రవాహారం తీసుకోవాలి. దాని ద్వారా రోగ నిరోధక వ్యవస్థ బలోపేతమై, రోగాల బారిన పడకుండా ఉంటాం.

PC : Magzter

దోమ కాటుకు గురైతే..

దోమ కాటుకు గురైతే..

ఒకవేళ దోమ కాటుకు గురైతే ఆ ప్రాంతాన్ని చల్లని నీటితో కడగండి. దోమ కాటుకు గురైన మీ స్కిన్ పై వెనిగర్ లో ముంచిన దూదితో రుద్దండి. అప్పటికీ తగ్గకపోతే మలేరియా వ్యాక్సిన్ ను వాడితే ఫలితం ఉంటుంది. మలేరియా వ్యాక్సిన్ ను ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కెన్యా, ఆఫ్రికా వంటి దేశాల్లో చిన్నారులకు ఎక్కువగా మలేరియా సోకుతుందని వారి కోసం ఎక్కువగా ఈ వ్యాక్సిన్ ను వినియోగిస్తున్నారు.

PC : The Conversation

English summary

World Mosquito Day 2019: History, Theme and Significance

British Indian scientist discovered the presence of the malaria parasite Flasmodium parasite on the 20th day of August 1897, at the home of Secunderabad, Anopheles. He also detailed the life cycle of the Flasmodium. Mosquitoes have gained recognition for the invention of that great scientist.Before his discovery, people had a different feeling. Earlier it was called Mall. The mall means bad. It was so called because it was a bitter area-borne disease.
Desktop Bottom Promotion