For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుండెకు మేలు చేసే కొబ్బరి నీళ్ళు!

By B N Sharma
|

Tender
పానీయాల్లో కొబ్బరి నీరు చాలా మంచిది. ప్రత్యేకించి వేసవి కాలంలో స్త్రీలు కొబ్బరి నీరు తాగితే గుండెకు మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. వేడిని, దాహాన్ని గణనీయంగా తగ్గించే కొబ్బరి బొండాంలో అధికంగా సహజ ఖనిజలవణాలు వున్నాయి. ఈ ఖనిజాలతో పాటు కొలెస్ట్రాల్‌ ఉండకపోవడం ద్వారా కూడా గుండెకు ఎంతో మేలు.

వేసవిలో కామెర్లు పసికర్లు వ్యాధులు రాకుండా ఉండాలంటే రోజూ కొబ్బరి బొండాల నీరు తాగటం మంచిది. జ్వరం, విరేచనాలు, నీరసంగా ఉన్నా కొబ్బరినీరు తాగితే మంచిది.ప్రకృతి మనకు ప్రసాదించిన కొబ్బరి నీరు త్రాగడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. కొబ్బరి నీళ్లు స్వేచ్చమైన మినరల్‌ వాటర్‌ అత్యదిక పరిశుభ్రమైంది. ఒక సెలైన్‌ వాటర్‌ బాటిల్‌తో సమానమైందని పరిశోధకులు చెపుతున్నారు.

కొబ్బరి నీటిలో 24 కేలరీల శక్తి వరకు ఉంటుంది. ముఖ్యంగా లేత కొబ్బరి బోండాల్లో 90 నుండి 95 శాతం నీరు ఉంటుంది. ఇందులో అనేక ఖనిజాలు, పోషకాలు ఉంటాయి. ఇంకా రక్తంలోని ఎలక్ట్రోమెట్‌ సమతూకాన్ని కొబ్బరినీరు కాపాడుతుంది. కొబ్బరి నీరు వాతాన్ని కూడా తగ్గిస్తుంది. పొట్ట అల్సర్‌ రోగులు కొబ్బరి నీరు తాగడం ద్వారా ఎంతో ఉపశమనం పొందవచ్చు.

English summary

Tender Coconut benefits Heart! | గుండెకు మేలు చేసే కొబ్బరి నీళ్ళు!

Tender coconut contains energy of 24 calories minimum. Especially it contains90 to 95 percent water having many nutrients and salts, which are needed for the body. People having stomach ulcers can take tender coconut water and get good relief from the stomach burning.
Story first published:Tuesday, November 1, 2011, 16:33 [IST]
Desktop Bottom Promotion