For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరంలో పల్స్ రేటును నిలకడగా ఉంచే ఆహారాలు..!

|

మన నాడీ వ్యవస్థలో ముఖ్యంగా రెండు బాగాలుంటాయి. సహనుభూతి నాడీ వ్యవస్థ, పరసహానుభూతి నాడీ వ్యవస్థ. వీటిల్లో మొదటిది మన శారీరక ప్రతిచర్యలను పెంచడానికి ఉపయోగపడుతుంది. స్ట్రెస్ ఏర్పడినపుడు, ఆదాడిని ఎదుర్కొనే నేపధ్యంలో పోరాడ్డం, లేదా పారిపోవడం ఏదో ఒకటి చేయడానికి మన శరీరానికి సిద్దపరిచే క్రమంలోsns వ్యవస్థ మన శారీరక పనితీరును వేగవంతం చేస్తుంది. రక్త ప్రసరణ అధికం చేయడం, కండరాలకు అధిక బలాన్ని అందివ్వడంవంటి చర్యల ద్వారా, శరీరం తనంతట తాను బహిర్గత ప్రమాదకర పరిస్థితుల నుండి కాపాడుకునేలా చేస్తుంది.

నాడీ(పల్స్) వ్యవస్థ మన జీవక్రియలను కాపాడుతుంది. గుండె సవ్యంగా కొట్టుకోవడం, ఆహారం జీర్ణం కావడం వంటి మౌళిక చర్యలను pns అదుపులో వుంచుతుంది. ఇది మన ఇతర శారీరక చాలక క్రియలను తగ్గించి, శక్తిని నిల్వవుంచి, జీవక్రియలకు వెచ్చిస్తుంది. అందువల్లే ఈ వ్యవస్థ చక్కగా పనిచేసినపుడు మనం చక్కగా రిలాక్స్ అవుతాం. లేదా మనం చక్కగా రిలాక్స్ కావడం ద్వారా ఈ నాడీ వ్యవస్థను చక్కగా పనిచేసే విధంగా చేయవచ్చు.

ప్రస్తుతం ఒక నిశ్ఛల జీవన విధానం, పెరుగుతున్న స్ట్రెస్ లెవల్స్(ఒత్తిడి స్థాయిలు)ఆందోళన, వ్యాయామం చేయకపోవడం మరియు అనియత ఆహారపు అలవాట్లు వంటివి ఆరోగ్యం మీద చెడు ప్రభావాన్ని ఎక్కువగా చూపెడుతున్నాయి.ఈ కారణాల మనిషి సోమరిగా మారడానికి మరియు గుండె ప్రేరేపిస్తాయి. హైపర్ యాక్టివ్ కవల్ల గుండె పనితీరును మరింత పెరుగుతుంది. దాంతో గుండె కొట్టుకోవడం లేదా పల్స్ రేట్ పెరుగుదలకు దోహదం చేస్తుంది.

అయితే కొన్ని సందర్బాల్లో.. అనారోగ్యకారణంగా.. పల్స్ రేటు తగ్గిపోతే శరీరం మొత్త అస్థవ్యస్థంగా మారిపోతుంది. దాంతో ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో పల్స్ రేట్ తగ్గడానికి విటమిన్ లోపం మరియు వైద్య అంశాలు కారణం కావచ్చు. అయితే గుండె వేగంగా కొట్టుకోవడం లేదా అసాధారణంగానే వేగంగా కొట్టుకోవడం, ప్రమాదకరమైనది. దాంతో గుండె సంబందిత వ్యాదులు గుండె పోటు మరియు స్ట్రోక్ వంటి హానికరమైన ఆనారోగ్యసమస్యలను పెంచడమే కాకుండా మరణానికి కూడా దారి తియ్యవచ్చు. కాబట్టి ఒక స్థిర మైన పల్స్ రేట్ మెయింటైన్ చేసి మనం ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు ఉన్నాయి. ఇవి మనలోని పల్స్ రేట్ ను స్థిరంగా ఉంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మరి ఆ ఆహారాలేంటో ఒక సారి చూద్దాం...

క్యాల్షియం రిచ్ ఫుడ్స్: ప్రతి రోజూ 1000mg ల క్యాల్షియం రిచ్ ఫుడ్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. దాంతో హార్ట్ బీట్ నార్మల్ గా కొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. పెరుగు, పాలు, చీజ్ మరియు ఇతర డైరీ ప్రొడక్ట్స్, మొలసెస్, టోఫు, బ్రొకోలి, క్యాబేజ్ వంటి వాటిలో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల ఈ మీడైట్ లో ఇవి తప్పనిసరిగా చేర్చడం వల్ల పల్స్ రేట్ క్రమంగా ఉంటుంది.

మెగ్నీషియం రిచ్ ఫుడ్స్: రోజుకి మీ శరీరానికి కనీసం 270 నుండి 400mg a మెగ్నీయం అవసరం అవుతుంది. హార్ట్ బీట్ సాధారణంగా కొట్టుకోవడానికి ఇందెంతో దోహదం చేస్తుంది. మెగ్నీషియ రిచ్ ఫుడ్స్, బ్రాజిల్ నట్స్, బాదాం, ఫ్లాక్స్ సీడ్స్, ఓట్ మీల్, కర్జూరం, గుమ్మడి, క్వాష్ సీడ్స్, మరియు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ చేర్చుకోవడం చాలా అవసరం.

ఓమేగా3 ఫ్యాటీ యాసిడ్స్: ఫిష్ ఆయిల్స్ ఓమేగా3 ఫ్యాటీ ఆసిడ్స్ కలిగి ఉంటుంది. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా అవసరం. చేపల్లో గుండె ఆరోగ్యానికి పల్స్ రేట్ స్టడీ గా ఉండటానికి సార్డినెస్, తున, మకెరాల్, ఓస్ట్రెయిస్, వంటి వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వెజిటేరియన్ ఫుడ్స్ లో నట్స్, మరియు ఫ్లాక్స్ సీడ్స్ వంటి వాటికూడా తీసుకోవడం మంచిది.

పొటాషియం రిచ్ ఫుడ్స్: పొటాషియం గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. తగినంత పోషకాంశాలు లేకుండా గుండె ఆరోగ్యంగా ఉండదు. కాబట్టి శరీరానికి కావల్సిన పోషకాంశాల కోసం అరటి, కొబ్బరి నీళ్ళు, సిట్రస్స్ పండ్లు, టమోటో, అవొకాడో లిమా బీన్స్, సోయా బీన్స్, ప్రూనేస్ మరియు సాల్మన్ వంటి వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్: గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో మరియు నార్మల్ పల్స్ రేటును కంట్రిబ్యూట్ చేస్తుంది. ఆకుకూరలు, బ్రొకోలి, బ్రసెల్స్, ధాన్యాలు, పుదీనా, బీన్స్, పీస్, క్యాబేజ్ లెట్యూస్ మరియు పార్సలే వంటి అధిక ఐరన్ కలిగి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి.

ఫైబర్ ఫుడ్స్: ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల డాక్టర్ అవసరం ఉండదు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల పల్స్ రేట్ నిలకడగా ఉంటుంది. ద్రాక్ష, ఆపిల్స్, డేట్స్, పీచెస్, బెర్రీస్, ఆప్రికాట్, కివి మరియు పపాయ వంటివి హెల్తీ హార్ట్ బీట్ ను కలిగి ఉంటాయి.

ఆలివ్ ఆయిల్: వంటలకు ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మేలు. ఇందులో మోనో సాచురేటెడ్ ప్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. హెల్త్ పల్స్ రేట్ కు దోహదం చేస్తుంది.

గ్రీన్ టీ: గ్రీటీ గురించి చాలా స్ట్రాంగ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న సంగతి కొన్ని అద్యయనాలు పేర్కొన్నాయి. అంతే కాదు డుండె ఆరోగ్యానికి చాలా మంచిది.

రెడ్ వైన్: రెడ్ వైన్ త్రాగడం వల్ల శరీరంలో జీవక్రియలు క్రమబద్దంగా ఉండి ఇది గుండె ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తుంది మంచి కొలెస్ట్రాల్ హెడి ఎల్ లెవల్స్ ను పెంచుతుంది. వ్యాధి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.

తృణధాన్యాలు: తృణధాన్యాల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలం మరియు ఫైటో స్ట్రాంగెన్స మరియు ఫైటో స్ర్టొరాల్స్ కారినెరీ డిసీజెస్ నుండి రక్షణ కల్పించబడుతుంది.

English summary

Foods To Slow Down Pulse Rate | శరీరంలో పల్స్ రేటు తగ్గిపోతే ఏం అవుతుంది...?

A sedentary lifestyle, rising stress levels, anxiety, lack of exercise and erratic food habits. These reasons are enough to compel our heart to trod the lazy path or increase it's function by making it hyperactive. An array of factors might contribute to a rise or increase in heart or pulse rate.
Story first published: Wednesday, March 20, 2013, 17:33 [IST]