For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ హార్ట్ హెల్త్ కాపాడుకునేందుకు కలబంద యొక్క 5 శక్తివంతమైన మార్గాలు

By Ssn Sravanth Guthi
|

కలబంద (అలోవెర)అనేది నిత్య నూతనంగా ఉండే మొక్క, మాంసంతో కూడిన ఆకులను కలిగినట్లుగా ఉండి, దాదాపు ప్రతిరోజూ అద్భుత శక్తులను ప్రతిబింబించే ఒక మొక్క.

మంచి ఆరోగ్యానికి ఈ మొక్క ఒక ప్రత్యేకమైన వనరుగా ఉంటూ కొన్నిసార్లు మనల్ని ఆశ్చర్య పరుస్తుంది ఈ కలబంద. ఉదాహరణకు, మీ జీర్ణక్రియ పనితీరును ఆప్టిమైజ్ చేయడానికి, ఆరోగ్యకరమైన చర్మాన్ని ఇస్తాయి మరియు మీ హృదయనాళ వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది.

ఇప్పుడు, కలబంద అనేది స్వయంగా అస్వస్థతలను "నయం చేయదు" అని మనము తెలుసుకోవాలి; అయితే అది ఏం చేస్తుందంటే "చికిత్స" చేసి, మంచిగా ఉంచేందుకు ప్రోత్సహిస్తుంది.

5 Powerful Ways that Aloe Vera Takes Care of Your Heart

ఇక్కడ, మేము విశేషమైన వాటి గురించి మాట్లాడాలనుకుంటున్నాము: కలబంద మీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు.

ఎలా అనేది మేము వివరిస్తాము ...

కలబందలోని 12 గ్రేట్ హెల్త్ అండ్ బ్యూటీ బెనిఫిట్స్!

1. కలబంద మంచి కొలెస్ట్రాలను (HDL) నియంత్రిస్తుంది :

1. కలబంద మంచి కొలెస్ట్రాలను (HDL) నియంత్రిస్తుంది :

మంచి కొలెస్ట్రాల్ (లేదా) HDL లను "అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్" అని కూడా పిలుస్తారు (లిపోప్రొటీన్ అనగా క్రొవ్వు మరియు ప్రొటీన్ల మిశ్రమము), మీ రక్తంలో మీరు కలిగి ఉన్న రెండు రకాల కొలెస్ట్రాల్లలో ఇది ఒకటి.

మీ రక్తములో కనుగొనబడిన చెడు కొలెస్ట్రాలను (LDL) మీ కాలేయానికి చెరవేసి, ఆపైన శరీరం నుండి బయటకు పంపించేందుకు సహాయపడుతుంది, కావున దీనిని "మంచిదని" అందరూ కొనియాడతారు.

కానీ ఈ లిపోప్రొటీన్ను అధిక స్థాయి కలిగి ఉండటం మీ ఆరోగ్యానికి మంచిదికాదా?

మనము దీనితో జాగ్రత్తగా ఉండవలసి అవసరం ఉంది, ఎందుకంటే కొంత మందికి తీవ్రమైన జన్యుపరమైన సమస్యలను కలిగి ఉండటం వలన సమస్యలకు దారితీసే అవకాశాలు ఉండవచ్చు. కాబట్టి దీనిని సమతుల్యంగా ఉంచుకోవడం ఉత్తమం, మరియు ఇక్కడ కలబంద మీకు సహాయపడుతుంది.

కలబంద చాలా ప్రభావవంతంగా ఉంటుంది, ఎందుకంటే ఇది మీలో మంచి కొలెస్ట్రాలను పెంచదు, కానీ ఇది రెండు రకాల లిపోప్రోటీన్ల మధ్య మంచి సమతౌల్యాన్ని ప్రోత్సహిస్తుంది.

 2. ఇది మీ ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గిస్తుంది :

2. ఇది మీ ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గిస్తుంది :

మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాలను తగ్గించటం ఎంత ముఖ్యమైనది అనే దాని గురించి మనము తరచుగా వింటూనే విన్నాము.

అయితే, మరింత కనికరంలేని శత్రువు మీ ట్రైగ్లిజరైడ్స్.

మీ శరీరంలో ట్రైగ్లిజెరైడ్స్ ను అధికస్థాయిలో కలిగి ఉంటే మీరు మీ శరీరంలోని అన్ని అదనపు శక్తిని మండించడం లేదు, అందువలన అది కొవ్వుగా మారి శరీరంలో నిల్వ చేయబడుతుంది.

హైపర్-ట్రైగ్లిజెరైడిమియా మీ గుండె ఆరోగ్యానికి ఒక నిశ్శబ్దమైన ముప్పు. అందువల్ల అది దాని సాధారణ పరిధిని మించి (150 mg / dl) ఉన్నప్పుడు, మీరు గుండెజబ్బు కలిగి ఉండే అధిక ప్రమాదముతో పాటు ప్యాంక్రియాటైటిస్ వంటి ఇతర పరిస్థితులు కూడా కలిగి ఉంటారు.

 3. ఇది మీ రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది :

3. ఇది మీ రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది :

కలబందలో గ్లూకోమాన్నన్ ను కలిగి ఉండటంతో మీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గించే ఒక రకమైన కరిగే ఫైబర్ ఇది.

ఆంత్రోక్వినోన్లు అనబడే ఒక క్రిమినాశిని (ఫినాల్) రకం, ఇది లాక్టిన్స్ తో పాటు కలిసి, మీ శరీరంలోని చక్కెరను సమతుల్యపరచడానికి సహాయం చేస్తుంది.

సానుకూల ఫలితాలను చూసేందుకు, ప్రతిరోజూ ఒక టేబుల్ స్పూన్ కలబందను రెండు నెలల పాటు గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి.

కలబంద యొక్క యాంటీ-ఇన్ఫ్లమేటరీ, డిటోక్సిఫయింగ్, మరియు హీలింగ్ వంటివి కూడా మనకు బాగా సహాయపడతాయి. ఇది మధుమేహం ఉన్నవారికి ఆరోగ్యకరమైన మొక్క అని చెప్పవచ్చు.

అన్ని రకాల జుట్టు సమస్యలకు అద్భుత ఔషధం అలోవెరా

4. ఇది మీ రక్తపోటును తగ్గిస్తుంది :

4. ఇది మీ రక్తపోటును తగ్గిస్తుంది :

కలబంద రసం మీ రక్తపోటును తగ్గిస్తుంది, దీనికి బలమైన కారణం అందులో విటమిన్-సి అధికంగా ఉండటమే.

విటమిన్-సి మీ ధమనులకు, మంచి రక్తప్రసరణను మరియు సరైన ఆక్సిజనేషన్ అందించేందుకు అద్భుతమైనదని మర్చిపోవద్దు.

అదనంగా, ఇది మీ రక్త కేశనాళికల విస్తరించేందుకు, మరియు వాటి సాగేగుణమును మెరుగుపరుస్తుంది, మరియు ధమనులు గట్టిపడేందుకు సహాయపడుతుంది.

5. కలబందకు బలమైన గుండె యొక్క కృతజ్ఞతలు :

5. కలబందకు బలమైన గుండె యొక్క కృతజ్ఞతలు :

కలబందలోని ఉన్న అనేక అమైనో ఆమ్లాలలో - ఆర్జినైన్ ఒకటి. నిజానికి, ఇది మీ గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది.

ఆర్జినైన్ అనేది ఒక పాక్షికంగా-అత్యవసరమైన అమైనో ఆమ్లం, దీనిని మీ శరీరం చిన్న పరిమాణంలో ఉత్పత్తి చేస్తుంది. మీరు తినే ఆహారం లేదా సప్లిమెంట్స్ ద్వారా మీరు దాన్ని పొందగలరు. వీటిని వేరుశెనగ, వాల్నట్స్ (అక్రోట్లను), మరియు కలబందలో కూడా పొందవచ్చు. మీరు బయట లభించే ఆర్జినైన్ ఒక మోస్తరుగా తీసుకున్నట్లయితే, మీరు ఇలా చేస్తారు:

మంచి గుండె, శరీరానికి రక్తంను ప్రసరించేలా చేస్తుంది.

మంచి రక్త ప్రసరణ మెటాబొలిక్ రేటు పెంచి శరీరంలో వ్యర్థ్యాలను తొలగిస్తుంది

సరైన రక్తప్రవాహం కోసం మీ రక్త నాళాలు వెడల్పుగా ఉంచడానికి అవసరమైన నత్రజని ఆక్సైడ్ను ఉత్పత్తి చేయడంలో సహాయపడతుంది.

English summary

5 Powerful Ways that Aloe Vera Takes Care of Your Heart

Now, we should point out that aloe vera doesn’t “cure” illnesses by itself; what it does is “treat” them and encourage well being. Here, we’d like to talk about something remarkable: aloe vera can take care of your heart.We’ll explain how…
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more