For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాబోయే గుండెపోటు ప్రమాదాన్ని, మీ చర్మం మీద ప్యాచీలు తెలియజేస్తాయని మీకు తెలుసా!

|

హృదయ సంబంధిత వ్యాధుల మూలంగా, మరీ ముఖ్యంగా గుండెపోటు వలన, కేవలం భారతదేశంలోనే ప్రతి సంవత్సరం 80% పైగా వయోజనుల మరణాలు సంభవిస్తున్నాయని మీకు తెలుసా? కానీ, ఈ వాస్తవాన్ని జీర్ణం చేసుకోవడం చాలా కష్టమే అయినప్పటికీ, నేటి రోజుల్లో గుండెపోటు అతి పెద్ద సమస్యగా పరిణమించింది. ఒక గణాంక నివేదిక ప్రకారం, గత 26 సంవత్సరాలలో గుండెపోటు రేటు 34% పెరిగింది!

కాబట్టి, ప్రస్తుత పరిస్థితి, దీర్ఘ ఆరోగ్యం కొరకు, గుండెపోటు విషయంలో, మనం ఎంత జాగ్రత్తగా మసలుకోవాలో స్పష్టపరుస్తుంది. మనకు ఇప్పటికే తెలిసినట్లుగా, మన శరీరంలోని ఐదు ప్రధాన అవయవాలలో గుండె ఒకటి. ఇది రక్త ప్రసరణ వ్యవస్థలోని ముఖ్య అవయవం.

 Skin Patches Can Indicate Heart Attack

రక్తం నుండి కార్బన్ డయాక్సైడ్ మరియు నత్రజని వ్యర్థాలను తొలగించి, శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ తో కూడిన రక్తం సరఫరా చేయడం, గుండె యొక్క ప్రధాన విధి . మొత్తం శరీరానికి ఆక్సిజన్ తో కూడిన రక్తాన్ని సరఫరా చేసే విధి ప్రభావితం అవుతుంది కనుక, హృదయానికి ఏ చిన్న రుగ్మత లేదా గాయం కలిగినా, అది ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీయవచ్చు.

గుండెపోటు తలెత్తే పరిస్థితిలో, ధమనులలో రక్తం గడ్డకట్టడం వలన, గుండెకు జరిగే రక్త ప్రసరణ అడ్డుకోబడుతుంది. హృదయానికి రక్తం సరఫరా తగ్గినప్పుడు, కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే, గుండెలోని కణజాలం మరణించి, అవయవ వైఫల్యం సంభవిస్తుంది. గుండెపోటుకు దారితీస్తుంది!

గుండెపోటు అనేది వైద్య అత్యయిక స్థితి. సరైన సమయం చికిత్స ఇవ్వగలిగితే, ప్రాణాంతక పరిణామాలను నివారించవచ్చు. అనేక ఇతర అనారోగ్య పరిస్థితులతో మాదిరిగా,గుండెపోటును కూడా మనం గుర్తించగలిగే మరియు గుర్తించలేని కొన్ని సంకేతాలు లేదా లక్షణాలు మనకు సూచిస్తాయి.

రాబోయే గుండెపోటును తెలియజేసే సంకేతాలలో మనకు తక్కువ అవగాహన ఉన్నది, చర్మం పై ప్యాచీల అభివృద్ధి (ముఖ్యంగా పిరుదులపై ఏర్పడేవి), అని ఒక కొత్త పరిశోధనలో తేలింది.

ఎలా మరియు ఎందుకు అనే కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పిరుదుల వద్ద చర్మంపై ప్యాచీలు, ఏ విధంగా గుండెపోటును తెలియజేస్తాయి?

ఆకస్మిక పిరుదుల వద్ద చర్మంపై, కొద్దిగా ఎగుడుదిగుడుగా మరియు పసుపు రంగులో ఉండే ,చిన్న ప్యాచీల అభివృద్ధిని గమనించినట్లయితే, రాబోయే గుండెపోటుకు సూచనగా గుర్తించండి.

పరిశోధనా అధ్యయనాలలో, ఈ రకమైన ప్యాచీలు, మీ శరీరం యొక్క ఇతర భాగాలైన, మోచేతులు, మోకాలు మరియు కనురెప్పలు వద్ద కూడా కనిపించవచ్చని తెలిసింది; అయితే, ఇవి సాధారణంగా పిరుదులపై కనిపిస్తాయి.

లాంకాస్టర్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం, వైద్యపరంగా క్సాన్థోమోనాస్ అని పిలువబడే ఈ రకమైన ప్యాచీలు , రాబోయే గుండెపోటును తెలియజేసే అరుదైన సంకేతాలలో ఒకటి.

ఈ రకమైన ప్యాచీలు, ఎందుకు గుండెపోటు ప్రమాదాన్ని సూచిస్తాయి?

గుండెపోటుకు ప్రధాన కారణాలలో ఒకటి అధిక కొలెస్ట్రాల్ స్థాయి అనే వాస్తవం అందరికి తెలిసిందే!

ఒక వ్యక్తి యొక్క శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు, ధమనుల గోడలపై పొరను ఏర్పరుస్తాయి. ఇది గట్టిపడి, ధమనులలో గడ్డలేర్పడి, రక్తప్రవాహానికి అడ్డుగా ఏర్పడి, తద్వారా గుండెపోటుకు కారణమవుతుంది.

ఒక అధ్యయనం ప్రకారం, ఒక వ్యక్తి శరీరంలో దీర్ఘకాలికంగా, ఆరోగ్య ప్రమాద పరిమితి కంటే అధిక కొలెస్ట్రాల్ స్థాయి ఉంటే, పిరుదులపై కనిపించే ప్యాచీలు ఏర్పడతాయి.

శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు అసాధారణంగా పెరిగినప్పుడు, అవి చర్మం కింద పేరుకుని, ఈ ఎగుడుదిగుడు, పసుపు రంగు ప్యాచీలు ఏర్పడతాయి. పిరుదులు ప్రాంతంలోని, చర్మం మరియు కణజాలం మృదువుగా ఉంటాయి కాబట్టి కొవ్వు కణజాలం ఎక్కువగా కనిపిస్తుంది.

కాబట్టి, ఒక వ్యక్తి శరీరంలో అసాధారణంగా, చర్మం ద్వారా కనిపించేటంతటి అధిక కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు, అది ఖచ్చితంగా రాబోయే గుండెపోటుకు స్పష్టమైన సూచనగా గుర్తించాలి!

గుండెపోటుకు సంబంధించిన కొన్ని ఇతర లక్షణాలు:

• ఛాతీ ప్రాంతంలో ఒత్తిడి మరియు బిగుతు

• ఛాతి నొప్పి

• వికారం మరియు అజీర్ణం

• అలసట

• శ్వాస ఆడకపోవుట

• ఎడమ చేతి నొప్పి

• అలసట మరియు మైకము

• చల్లని చెమటలు పోయటం

English summary

Skin Patches Can Indicate Heart Attack

Heart attack is a condition in which there is a blockage of the blood flow to the heart, caused by blood clots in the arteries. When the blood supply to the heart ceases, the tissues of the heart die, leading to a heart attack. The skin patches on the buttocks are caused by chronic levels of cholesterol in a person's body, which indicate the risk of a heart attack.
Story first published: Friday, August 31, 2018, 7:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more