For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రి కంటే ఉదయం వచ్చే గుండెపోటు చాలా ప్రమాదకరం: అధ్యయనాలు చెబుతున్నాయి !!!!

రాత్రివచ్చే గుండెపోటు కంటే ఉదయం వచ్చే గుండెపోటు చాలా ప్రమాదకరమని అధ్యయనాలు చెబుతున్నాయి !!!!

|

గుండె మనిషికి అత్యంత విలువైన అవయవం. పిడికిలి పరిమాణంతో, గుండె శరీరానికి అవసరమైన రక్తాన్ని అందిస్తుంది. గుండె నిరంతరం బిజీగా ఉంటుంది. రక్తాన్ని శుద్ధి చేసి శరీరంలోని అన్ని అవయవాలకు రక్తం ప్రసరింపచేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నిరంతరం పనిచేస్తూ ఉండే హృదయం ఏదైనా ఒక అంతరాయం వల్ల లేదా అనుచిత పని వల్ల గుండె ప్రమాదం ఏర్పడితే గుండె పనిచేయడం ఆగిపోతుంది. ఈ క్షణంలోనే వ్యక్తి షాక్ కు గురి అవుతుంటారు.

కాబట్టి మనం తీసుకునే ఆహారపు అలవాట్లు ఉత్తమమైనవిగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే గుండెకు ఇబ్బంది కలగవచ్చు. మన చుట్టూ ఉన్న కలుషితమైన వాతావరణం, ధూమపానం మరియు మద్యపానం గుండెపై ఒత్తిడిని కలిగిస్తాయి. అటువంటి సందర్భంలో, గుండెపోటు సంభవించవచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి దుశ్చర్యల నుండి ప్రాణాలకు ముప్పు వచ్చే అవకాశం కూడా ఉంది. మొదటి సారి చిన్న పాటి లక్షణాలతో గుండెపోటు సంభవించిన తర్వాత, భవిష్యత్తులో తీవ్రమైన గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.అది జీవితాలను ప్రమాదంలో పడేస్తుంది.

 Heart Attack More Severe in the Morning Than Night: Study

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పంచసూత్రం అనుసరించడం మంచిది. రక్తంలో చక్కెర పరిమాణం, కొవ్వు పదార్ధం, శరీర బరువు మరియు నడుము చుట్టుకొలత, అతియాస ఈ ఐదు అంశాలు సాధ్యమైనంత తక్కువ ఉంచుకుంటే మంచిది. అదనంగా వ్యాయామం మరియు శరీరసౌష్టవాన్ని నిర్వహించడం ముఖ్యమైనదని హృదయనాళ నిపుణులు తెలియజేస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో హృదయ స్పందన రేటు

గ్రామీణ ప్రాంతాల్లో హృదయ స్పందన రేటు

గ్రామీణ ప్రాంతాల్లో హృదయ స్పందన రేటు 6 శాతం, పట్టణ ప్రాంతాల్లో 8 శాతం నుండి 10శాతానికి పెరుగుతోంది. గతంలో 50 ఏళ్ళలో మహిళలకు గుండెపోటు వచ్చేది. కానీ ఇటీవలి సంవత్సరాలలో ఈ సంఖ్య ఘననీయంగా పెరుగుతోంది. కుంటుంబంలో ఒత్తిడి, వృత్తి రిత్యా ఒత్తిడి, పిల్లలను జాగ్రత్తగా చూసుకునే ఒత్తిడి ఇవన్నీ మనిషిలో హార్మోన్ల అసమతుల్యతకు గురిచేస్తుంది. 40 సంవత్సరాల వయస్సు పురుషులు, 45 సంవత్సరాలు పైబడ్డ మహిళలు రక్తంలో చెక్కెర ప్రమాణం, కొవ్వు పదార్థాల పరీక్ష మరియు థ్రెడ్మిల్ ఇసిజి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.ఇది సాధారణమైతే ప్రతి 2 సంవత్సరాలకు ఒక సారి పరీక్ష చేయించుకోవచ్చు.

గుండెపోటు వచ్చినప్పుడు సాధారణంగా ఛాతీ

గుండెపోటు వచ్చినప్పుడు సాధారణంగా ఛాతీ

గుండెపోటు వచ్చినప్పుడు సాధారణంగా ఛాతీ యొక్క ఎడమ వైపు, మధ్య భాగంలో నొప్పి, మంట లక్షణాలు కనబడుతాయి. గుండెపోటు లక్షణాలు 30 నుంచి 40% మందిలో ఛాతీ మధ్యలో నొప్పి లక్షణాలు కనబడవు. గుండెపోటు ఎవరికి, ఎప్పుడు వస్తుందో చెప్పడం అసాధ్యం. గుండెపోటు వచ్చేవరకు గుండె సమస్య వస్తుందనే ఆలోచనే ఉండదు. అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి ఎలా కనిపించడం ప్రారంభిస్తుంది. ఆకస్మికంగా గుండెపోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు చాలా మంది గమనించరు. ఆ లక్షణాలు గుర్తించినట్లయితే, వైద్యులు సంప్రదించడానికి కంటే ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు మరియు గుండెపోటు ప్రమాదాన్ని నివారించవచ్చు. గుండెపోటుకు ముందు కనిపించే హెచ్చరిక సంకేతాలు లేదా లక్షణాలను ఇక్కడ చూడండి:

అజీర్ణ సమస్య

అజీర్ణ సమస్య

హార్ట్ అటాక్ రావడానికి ముందు అజీర్ణం సమస్య లక్షణం కనబడవచ్చు. కడుపులో మంట అనిపిస్తుంది.

ఒత్తిడి

ఒత్తిడి

ఛాతీ మధ్యలో నొప్పి అనిపిస్తుంది. ఛాతీలో ఏదో పట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఆ నొప్పి ఒక నిమిషం వరకు కనిపిస్తుంది. దాని తర్వాత తక్కువ అయినట్లు అనిపిస్తుంది. ఇలా జరిగినప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు.

మైకంతో నొప్పి

మైకంతో నొప్పి

భుజం, మెడ, దవడ మరియు ఛాతీ ఈ భాగాల్లో నొప్పి అనిపిస్తుంది. మాత్ర తీసుకున్నా నొప్పి తగ్గదు. ఇలాంటి లక్షణాలు గుండెపోటు దగ్గరి లక్షణాలను సూచిస్తుంది.

తలతిరగడం

తలతిరగడం

గుండెపోటుకు ముందు అలసట, చెమట, తలనొప్పి, పల్స్ కొట్టుకోవడంలో వ్యత్యాసం కనబడతుంది. ఇలా జరిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

అధిక రక్తపోటు

అధిక రక్తపోటు

ఈ సమస్య ఉన్నవారు, డయాబెటిస్ ఉన్నవారు, అధిక కొలెస్ట్రాల్, అస్సలు వ్యాయామం చేయని వారు గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

తలతిరగడం

తలతిరగడం

ఏ కారణం లేకుండా తలతిరగడం, నాడీ కొట్టుకోవడంలో వ్యత్యాసం, తల మెదడుకు రక్తాన్ని సరిగ్గా ప్రసారం చేయకపోతే, తలనొప్పికి కారణం,మరియు ఎప్పుడూ తలనొప్పి లక్షణాలు కనబడుతుంటే హార్ట్ స్పెషలిస్ట్ ను సంప్రదించాలి.

శ్వాసలో వేగం

శ్వాసలో వేగం

గుండె సరిగా పనిచేయనప్పుడు, ఊపిరితిత్తులకు రక్తం సరిగా ప్రవహించలేదు. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. చల్లని వాతావరణంలో కూడా శరీరంలో చెమట పడుతుంటే అది గుండెపోటుకు ఒక సంకేతంగా గుర్తించాలి.

బద్ధకం

బద్ధకం

ఏకారణం లేకుండానే మీ శరీరంలో చాలా సుస్తుగా అనిపిస్తుంటే అది గుండెపోటు యొక్క లక్షణం కావచ్చు. ఇది మనకు ఒక నెల ముందు నుండి కనిపిస్తుంది. ఛాతీలో బిగుతు, టెన్షన్ లేదా బర్నింగ్ సెన్సేషన్ వంటి లక్షణాలు ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఈ లక్షణం ఛాతీ యొక్క ఎడమ వైపు నొప్పిని కలిగించదు. ఇది మెడ, గొంతు, పొత్తి కడుపు, వీపు, పండ్లు, దవడ మరియు భుజాలలో కూడా నొప్పిని కలిగిస్తుంది. క్రమరహిత ఛాతీ ఒత్తిడి గుండెపోటుకు సంకేతం.

కనిపించే లక్షణాలు:

కనిపించే లక్షణాలు:

గుండె అసాధారణ రీతిలో రక్తాన్ని పంపింగ్ చేస్తున్నప్పుడు ఉదరం మరియు చెతులు, కాళ్లలో వాపు కనిపిస్తుంది. దీన్ని నుండి మంటను కలిగిస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే చికిత్స తీసుకోండి మరియు ఆలస్యం చేయకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

రాత్రిపూట గుండెపోటు చాలా ప్రమాదకరమైనది:

రాత్రిపూట గుండెపోటు చాలా ప్రమాదకరమైనది:

గుండెపోటు అనే ప్రమాదకరమైన వ్యాధి లేదా ఆరోగ్య సమస్యపై ఇటీవల ఒక అధ్యయనం జరిగింది. దాని ప్రకారం రాత్రి వేళల్లో వచ్చే గుండెపోటు కంటే పగటిపూట మరియు ఉదయాన్నే వచ్చే గుండెపోటు చాలా ప్రమాదకరమని చెబుతారు.

ఈ అధ్యయనంను జనరల్ ట్రెండ్స్ ఇన్ ఇమ్యునాలజీ పత్రికలో

ఈ అధ్యయనంను జనరల్ ట్రెండ్స్ ఇన్ ఇమ్యునాలజీ పత్రికలో

ఈ అధ్యయనంను జనరల్ ట్రెండ్స్ ఇన్ ఇమ్యునాలజీ పత్రికలో ప్రచురించబడింది. సిర్కాడియన్ లయలు మరియు రోగనిరోధక ప్రతిస్పందనల మధ్య సంబంధాన్ని అధ్యయనం విశ్లేషించింది. ఉదయం మరియు సాయంత్రం ఫలితాలు భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే శరీరం కాంతి, హార్మోన్లు, జీవక్రియ మరియు ఇతర శారీరక ప్రక్రియల వంటి వివిధ అంశాలకు ప్రతిస్పందిస్తుంది. ఈ అధ్యయనం ఎలుకలపై జరిగింది. మానవులు మరియు ఎలుకల తెల్ల రక్త కణాలు ఇలాంటి రిథమిక్ నమూనాను చూపుతాయి. పరిశోధన పూర్తయిన తర్వాత, గుండెపోటు మానవులలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని మరియు రాత్రి సమయంలో సంభవించే వాటి కంటే ఉదయం గుండెపోటు చాలా తీవ్రంగా ఉంటుందని అధ్యయనం కనుగొంది.

జీవనశైలిలో కొన్ని సాధారణ మార్పులు చేసుకుంటే

జీవనశైలిలో కొన్ని సాధారణ మార్పులు చేసుకుంటే

జీవనశైలిలో కొన్ని సాధారణ మార్పులు చేసుకుంటే గుండెపోటు రాకుండా సహాయపడతాయి. ఆరోగ్యకరమైన గుండె గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన హృదయాన్ని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రారంభ దశలోనే గుండెపోటు యొక్క లక్షణాలను ఆపడానికి తగిన నివారణ చర్యలు తీసుకోవాలి.

మీ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి:

మీ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి:

* కనీసం 20 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి

* గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారం తీసుకోండి.

* మీ రక్తపోటు మరియు రక్త పరీక్షను క్రమం తప్పకుండా ఉంచండి.

* కొలెస్ట్రాల్ స్థాయి సరిగ్గా ఉందని నిర్ధారించుకోండి.

* యోగా మరియు ధ్యానంతో ఒత్తిడిని నిర్వహించండి

* ధూమపానం మరియు మద్యానికి దూరంగా ఉండండి.

English summary

Heart Attack More Severe in the Morning Than Night: Study

A heart attack can occur at any time of the day. It is a serious condition which can sometimes lead to the sudden death of the person as well. As per the recent study, the severeness of a heart attack can depend on the time of the day. The study states that a heart attack in the morning is severe than the night.The study was published in the Journal Trends in Immunology. The study analysed the relationship between circadian rhythms and immune responses.
Story first published:Friday, September 27, 2019, 11:04 [IST]
Desktop Bottom Promotion