For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Trans fat foods: ఈ విషాహారాలు తినడం వల్ల 5 బిలియన్ల మందికి గుండె జబ్బులు వస్తున్నాయి..జాగ్రత్త!

Trans fat foods: ఈ విషాహారాలు తినడం వల్ల 5 బిలియన్ల మందికి గుండె జబ్బులు వస్తున్నాయి..జాగ్రత్త!

|

డబ్ల్యూహెచ్‌ఓ(WHO) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 5 బిలియన్ల (500 కోట్లు) మంది ప్రజలు ట్రాన్స్ ఫ్యాట్‌కు గురవుతున్నారు. ఇది ప్రస్తుతం ప్రజల్లో ఆందోళన కలిగించే విషయం. ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఇతర ఆహార కొవ్వుల వలే కాకుండా, ట్రాన్స్ ఫ్యాట్స్ - దీన్ని ట్రాన్స్-ఫ్యాటీ యాసిడ్స్ అని కూడా పిలుస్తారు. ఇది శరీరంలో "చెడు" కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి మరియు "మంచి" కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ తో కూడిన ఆహారాలు గుండె జబ్బులు మరియు మరణాల ప్రమాదాన్ని పెంచుతుంది.

WHO Says 5 Billion people at risk from trans fats, leading to heart disease

ట్రాన్స్-ఫ్యాట్ అనేది అసంతృప్త కొవ్వు రకం, ఇది సహజ మరియు కృత్రిమ రూపాల్లో వస్తుంది. ఇది సాధారణంగా ప్యాక్ చేసిన ఆహారాలు, వండి నిల్వచేసిన ఆహారాలు, వంట నూనెలు మరియు స్ప్రెడ్‌లలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ట్రాన్స్ ఫ్యాట్ ఆహారం వల్ల పెద్దలలో ప్రధాన సైలెంట్ కిల్లర్. ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్ తింటే, గుండె మరియు రక్తనాళాల వ్యాధుల ప్రమాదం ఎక్కువ. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

 ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఒక విష రసాయనం, ఇది నెమ్మదిగా మనుషులను చంపుతుంది

ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఒక విష రసాయనం, ఇది నెమ్మదిగా మనుషులను చంపుతుంది

WHO డైరెక్టర్ జనరల్ డా. టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ, 'ఆరోగ్య ప్రమాదం ఎక్కువగా ఉన్నప్పుడు ట్రాన్స్ ఫ్యాట్ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. సహజంగా చెప్పాలంటే, ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఒక విష రసాయనం, ఇది నెమ్మదిగా మనుషులను చంపుతుంది. మీరు తినే ఆహారంలో ఇది ఉండకుండా చూసుకోవడం మంచిది. ప్రస్తుత ఆరోగ్యాల రిత్యా దీన్ని మనమందరం వదిలించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం

2018లో, WHO మొదటిసారిగా 2023 నాటికి కృత్రిమంగా ఉత్పత్తి చేయబడిన ట్రాన్స్ ఫ్యాట్‌లను పూర్తిగా తొలగించాలని ప్రపంచానికి పిలుపునిచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, 43 దేశాలు ఇప్పుడు ఆహారంలో ట్రాన్స్-ఫ్యాట్‌లను ఎదుర్కోవడానికి విధానాలను అమలు చేశాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా 2.8 బిలియన్ల ప్రజలను కాపాడుతుంది. ఈ అసంతృప్త కొవ్వుల ఆరోగ్య ప్రభావాలతో ఇప్పటికీ 5 బిలియన్ల మంది ప్రజలు బాధపడుతున్నారని చెప్పబడింది.

 ఇది ప్రజల్లో గుండె జబ్బులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

ఇది ప్రజల్లో గుండె జబ్బులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

ట్రాన్స్ ఫ్యాట్స్ శరీరంలో LDL (చెడు) కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. అవి మీ HDL (మంచి) కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అధిక ఎల్‌డిఎల్‌తో పాటు తక్కువ హెచ్‌డిఎల్ స్థాయిలు శరీరంలోని ధమనులలో (రక్తనాళాలు) కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇది ప్రజల్లో గుండె జబ్బులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

గుండె జబ్బులు మరియు ట్రాన్స్ ఫ్యాట్ కారణంగా అత్యధికంగా మరణించే ప్రమాదం

గుండె జబ్బులు మరియు ట్రాన్స్ ఫ్యాట్ కారణంగా అత్యధికంగా మరణించే ప్రమాదం

గుండె జబ్బులు మరియు ట్రాన్స్ ఫ్యాట్ కారణంగా అత్యధికంగా మరణించే ప్రమాదం ఉన్న 16 దేశాలలో 9 దేశాలు ఈ దిశలో ఇంకా ఖచ్చితమైన చర్యలు తీసుకోలేదని WHO తెలిపింది. ఈ 9 దేశాల్లో ఆస్ట్రేలియా, అజర్‌బైజాన్, భూటాన్, ఈక్వెడార్, ఈజిప్ట్, ఇరాన్, నేపాల్, పాకిస్థాన్ మరియు దక్షిణ కొరియా ఉన్నాయి. తక్షణమే చర్యలు తీసుకోవాలని WHO ఈ దేశాలను కోరింది.

English summary

WHO Says 5 Billion people at risk from trans fats, leading to heart disease

Here WHO Says 5 Billion people at risk from trans fats, leading to heart disease. Read on..
Story first published:Friday, January 27, 2023, 14:24 [IST]
Desktop Bottom Promotion