For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సిగరెట్ తాగినా ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండాలంటే వీటిని తినాలి

యాంటీఆక్సిడెంట్స్ దండిగా ఉంటాయి. శరీరానికి రక్త ప్రసరణ సక్రమంగా సాగేలా చేయగల గుణాలు దానిమ్మలో ఉంటాయి. దానిమ్మను తరుచూ తింటూ ఉంటే రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. ధూమపానం చేసేవారు దానిమ్మను తింటూ ఉంటే నిక

|

చాలా మందికి సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. ధూమపానం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కూడా చాలామంది సిగరెట్స్ తాగుతూనే ఉంటారు.

సిగరెట్ లేదంటే బీడీ తాగడం వల్ల నికోటిన్ అనే పదార్ధం శరీరంలో ఉత్పత్తి అవుతుంది. ఇది వేగంగా మెదడుకు చేరి ఒక రకమైన రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది. అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

ఒక్కసారి పొగతాగితే

ఒక్కసారి పొగతాగితే

మీరు ఒక్కసారి పొగతాగితే అందుకు సంబంధించిన నికోటిన్ మీ శరీరంలో దాదాపు మూడు రోజుల పాటు ఉంటుంది. అయితే మీరు ధూమపానం చేసినా ఆ ప్రభావం మీ ఆరోగ్యంపై పెద్దగా పడకుండా ఉండాలంటే మీరు పొగతాగిన తర్వాత కొన్ని రకాల పండ్లు, ఆహారపదార్థాలను తీసుకోవడం మంచిది. అయితే ఇవన్నీ కూడా ధూమపానం వల్ల ఊపిరితిత్తులపై పడే ప్రభావాన్ని కాస్త మాత్రమే తగ్గించగలవనే విషయాన్ని గుర్తించుకోవాలి.

యాపిల్స్

యాపిల్స్

యాపిల్స్ లో చాలా పోషకాలుంటాయి. ఇందులో విటమిన్లు, ఫ్లేవనాయిడ్లు, అనామ్లజనకాలు, విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను ఎదుర్కొనేందుకు ఎంతో ఉపయోగపడగలవు. మీరు సిగరెట్ తాగిన వెంటనే ఒక యాపిల్ తింటే చాలా మేలు. మీ ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం పడదు.

వెల్లుల్లి

వెల్లుల్లి

వెల్లుల్లి కూడా ఊపిరితిత్తుల్లోని నికోటిన్ ను తగ్గించటానికి సహాయపడుతుంది. ఇది మీ రక్తంలో ఉండే కొవ్వును కూడా తగ్గించగలదు. వెల్లుల్లిలోయాంటీబయాటిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.

వెల్లుల్లి మీలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీ శరీరంలో ఉండే మలినాలు మొత్తం బయటకు వెళ్లేలా చేయగల గుణాలు కలిగి ఉంటుంది. నికోటిన్ ప్రభావం శరీరంపై పడకుండా ఉండేందుకు తోడ్పడగలదు.

దానిమ్మ

దానిమ్మ

దానిమ్మలోనూ యాంటీఆక్సిడెంట్స్ దండిగా ఉంటాయి. శరీరానికి రక్త ప్రసరణ సక్రమంగా సాగేలా చేయగల గుణాలు దానిమ్మలో ఉంటాయి. దానిమ్మను తరుచూ తింటూ ఉంటే రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. ధూమపానం చేసేవారు దానిమ్మను తింటూ ఉంటే నికోటిన్ మొత్తం తగ్గిపోతుంది. దానిమ్మను పండు తిన్నా దాంతో జ్యూస్ చేసుకుని తాగినా చాలా ప్రయోజనాలుంటాయి.

Most Read:పురుషాంగం క్యాన్సర్ గురించి తెలుసా? అంగాన్ని అలా ఉంచుకోకండి, ఆ విషయంలో చాలా జాగ్రత్త అవసరంMost Read:పురుషాంగం క్యాన్సర్ గురించి తెలుసా? అంగాన్ని అలా ఉంచుకోకండి, ఆ విషయంలో చాలా జాగ్రత్త అవసరం

క్యారెట్

క్యారెట్

క్యారెట్ లో విటమిన్ ఏ, సీ, కే, బీ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరానికి చాలా అవసరం. అలాగే నికోటిన్ ను వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఇందులో ఉంటాయి. అందువల్ల ధూమపానం చేసే వారు రోజూ క్యారెట్ తినడం చాలా మంచిది.

బ్రోకలీ

బ్రోకలీ

బ్రోకలీలో విటమిన్ సీ, బీ 5 లో సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ సీ ను పొగతాగడం వల్ల కలిగే నష్టాలను నివారించగలదు. దీన్ని రోజూ తింటూ ఉంటే నికోటిన్ ప్రభావం ఆరోగ్యంపై అంతగా పడదు.

కాలీఫ్లవర్

కాలీఫ్లవర్

అలాగే కాలీఫ్లవర్, కాలే, టర్నిప్, క్యాబేజీ వంటి కూరగాయాలతో తయారు చేసిన పదార్థాలను తరుచుగా తింటూ ఉంటే మీ ఆరోగ్యంపై నికోటిన్ ప్రభావం అంతగా ఉండదు.

గ్రీన్ టీ

గ్రీన్ టీ

గ్రీన్ టీ లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి.

ధూమపానం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడకుండా చూడగలదు. అలాగే కొలెస్ట్రాల్ తగ్గించగలదు. నికోటిన్ ఊపిరితిత్తుల్ని దెబ్బతీయకుండా చేయగల గుణాలు గ్రీన్ టీలో ఉంటాయి. అందువల్ల తరుచుగా గ్రీన్ టీ తాగుతూ ఉండండి.

Most Read :ఈ మొక్కలు ఇంట్లో ఉంటే దరిద్రం పట్టిపీడుస్తుంది, వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లోఉండకూడని మొక్కలు,చెట్లుMost Read :ఈ మొక్కలు ఇంట్లో ఉంటే దరిద్రం పట్టిపీడుస్తుంది, వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లోఉండకూడని మొక్కలు,చెట్లు

English summary

Foods that flush out nicotine after smoking

Here we are talking about the Foods That Flush Out Nicotine After Smoking.
Desktop Bottom Promotion