For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Computer Eye Strain:కంటి సమస్యలు కంట్రోల్ అవ్వాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి...

డిజిటల్ స్క్రీన్లను చూస్తూ కళ్లపై పడే ఒత్తిడిని ఎలా అధిగమించాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

మన పంచేద్రియాలలో కళ్లు ఎంతో ప్రధానమైనవి. అదే విధంగా చాలా సున్నితమైనవి. వీటిని ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటే అంత మంచిది. అయితే కరోనా వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక మన కళ్లపై ఒత్తిడి బాగా పెరిగింది.

Computer Eye Strain : How to Prevent Eyestrain From Digital Devices in Telugu

చాలా మంది ఆన్ లైన్ క్లాసులు, బిజినెస్ మీటింగులు, వర్చువల్ మీటింగులు, ఓటీటీ సినిమాలు, ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్లనూ తదేకంగా చూస్తున్నారు. దీంతో కళ్లపై ఎక్కువ ఒత్తిడి పడుతోంది.

Computer Eye Strain : How to Prevent Eyestrain From Digital Devices in Telugu

దీంతో చాలా మందికి కళ్లు పొడిబారటం, కళ్లలో మంటలు రావడం.. కళ్ల కింద నల్లటి వలయాలతో పాటు కంటి చూపు సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కంటిపై ఒత్తిడిని తగ్గించేందుకు ఏమి చేయాలి.. ఎలాంటి చిట్కాలను పాటించాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మీరు ఈ ఆయుర్వేద ఆహారాన్ని తిన్నారా ... తింటే మీరు వేగంగా బరువు తగ్గగలరు ...!మీరు ఈ ఆయుర్వేద ఆహారాన్ని తిన్నారా ... తింటే మీరు వేగంగా బరువు తగ్గగలరు ...!

కంటి ఒత్తిడి తగ్గించుకునేందుకు..

కంటి ఒత్తిడి తగ్గించుకునేందుకు..

ఈ డిజిటల్ యుగంలో ‘వర్క్ ఫ్రమ్ హోమ్' ఆన్ లైన్ క్లాసులు, వర్చువల్ మీటింగులు అనేవి మనకు వరమనుకోవాలో లేదా శాపమనుకోవాలో ఏ మాత్రం అర్థం కావడం లేదు. ఈ విధానం వల్ల మన కళ్లపై ఒత్తిడి తీవ్రంగా పెరుగుతోంది. అందుకే కంటి ఆరోగ్యాన్ని పెంచే విటమిన్-A(రెటినాల్, బీటా కెరోటిన్) ఎక్కువగా దొరికే క్యారెట్లు, ఆకుకూరలను మీరు రెగ్యులర్ గా తీసుకోవాలి. వీటి వల్ల కంటిచూపు మెరుగయ్యేందుకు, కంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడొచ్చు.

కంటి అలసటను తగ్గించుకునేందుకు..

కంటి అలసటను తగ్గించుకునేందుకు..

ప్రస్తుతం చాలా మంది దాదాపు 15-18 గంటలసేపు ల్యాప్ టాప్, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లతోనే గడిపేస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరి కళ్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కంటిపై ఒత్తిడిని తగ్గించేందుకు కంటి వ్యాయామం చేయాలి. అదెలాగంటే.. ముందుగా కళ్లు పూర్తిగా మూసుకోవాలి. చేతి మునివేళ్లను కళ్లపై ఉంచి క్లాక్ డైరేక్షన్లో 3 సార్లు.. యాంటీ క్లాక్ డైరెక్షన్లో మూడుసార్లు గుండ్రంగా తిప్పుతూ మర్దన చేసుకోవాలి.

కళ్లకు సాంత్వన..

కళ్లకు సాంత్వన..

అలా కంటి వ్యాయామం చేస్తూ.. నెమ్మదిగా కళ్లను తెరవాలి. ఆ తర్వాత మళ్లీ అలాగే చేయాలి. అంటే రోజుకు కనీసం మూడుసార్లు ఇలా చేస్తే మీ కంటికి సాంత్వన లభిస్తుంది. ఇక కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ స్క్రీన్ ముందు గంటలకొద్దీ కూర్చునేవారు బ్లూలైట్ ఫిల్టర్ గ్లాస్ వాడటం మంచిది. వీటి వల్ల మన కళ్లలోకి కాంతి తక్కువగా ప్రవేశిస్తుంది. దీంతో మన కళ్లపై తీవ్ర ప్రభావం పడకుండా జాగ్రత్త పడొచ్చు.

డెల్టా ప్లస్, 3 వ వేవ్ ఆందోళనకు కారణం: లక్షణాలు ఏమిటి? టీకాలు వేయకుండా దీనిని నివారించవచ్చా?డెల్టా ప్లస్, 3 వ వేవ్ ఆందోళనకు కారణం: లక్షణాలు ఏమిటి? టీకాలు వేయకుండా దీనిని నివారించవచ్చా?

మధ్యలో విరామం..

మధ్యలో విరామం..

మనలో చాలా మంది పనిలో పడితే చాలు.. కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్ల స్క్రీన్లను కళ్లు పెద్దవిగా చేసి మరీ చూస్తుంటారు. ఇలా చేయడం వల్ల కళ్లు పొడిబారడం, కళ్లలో మంట పుట్టడం వంటివి స్టార్టవుతాయి. అలా కాకుండా ఉండాలంటే.. మీరు పని చేసే సమయంలో మధ్య మధ్యలో అంటే కనీసం పది నిమిషాలకోసారి బ్రేక్ తీసుకోవాలి.

క్లీన్ చేసుకోవాలి..

క్లీన్ చేసుకోవాలి..

మీరు వాడే మానిటర్ పై దుమ్ము, ధూళి లేకుండా స్క్రీన్ ను తరచుగా క్లీన్ చేసుకోవాలి. అలాగే దాని వెలుగు మీ కంటిపై నేరుగా పడకుండా మీరు విండో దగ్గర లేదా డోర్ల దగ్గర కూర్చోవాలి. అలాగే మీ స్క్రీన్ బ్రైట్ నెస్ ను కూడా మీ కంటికి సరిపోయేలా సెట్ చేసుకోవాలి. అంతేకానీ క్లారిటీ కోసమని, బ్రైట్ నెస్ పెంచుకుంటే.. అది మీ కళ్లను మరింత దెబ్బతీస్తుంది.

కలర్ సెట్టింగ్స్..

కలర్ సెట్టింగ్స్..

మీ రూమ్ లో వెలుతురుకు తగ్గట్టు.. ఎప్పటికప్పుడు కలర్ సెట్టింగులను మార్చే సాఫ్ట్ వేర్లను డౌన్ లోడ్ చేసుకోవాలి. దీని వల్ల మీ రూమ్ లో వెలుతురుకు అనుగుణంగా స్క్రీన్ బ్రైట్ నెస్, కాంట్రాస్ట్ మారుతూ ఉంటాయి. దీంతో మీ కళ్లపై తక్కువ ప్రభావం పడుతుంది. అలాగే మీరు చూసే ఫాంట్ సైజ్ సాధ్యమైనంత వరకు పెద్దగా పెంచుకోవాలి.

మీరు బాత్రూంలో చేసే ఈ పని వల్ల , ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో మీకు తెలుసా?మీరు బాత్రూంలో చేసే ఈ పని వల్ల , ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో మీకు తెలుసా?

స్క్రీన్ ను సరైన ఎత్తులో..

స్క్రీన్ ను సరైన ఎత్తులో..

మీరు ఇంటి నుండి పని చేసే సమయంలో మీ కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ స్క్రీన్ ను సరైన ఎత్తులో ఉంచుకోండి. మీ కంటికి దిగువన (సుమారు 30 డిగ్రీల) ఉంచండి. దీని వల్ల మీ కంటిపై తక్కువ ఒత్తిడి పడుతుంది. అలాగే మీరు పని చేసేటప్పుడు మీ మెడ మరియు భుజాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది.

కంటి అద్దాలు..

కంటి అద్దాలు..

మీ కంటిపై ఒత్తిడి ఎక్కువసేపు పడటం వల్ల కంటి శుక్లం వంటి సమస్యలు రావొచ్చు. కాబట్టి మీ కళ్ల ఆరోగ్యాన్ని కాపాడటానికి మీరు పని చేసే సమయంలో డాక్టర్లు సూచించిన కంటి అద్దాలను ధరించాలి. దీని వల్ల మీ కంటి ఆరోగ్యం మెరుగవుతుంది. మీ కళ్లు పొడిబారే అవకాశాలు కూడా తక్కువవుతాయి.

English summary

Computer Eye Strain : How to Prevent Eyestrain From Digital Devices in Telugu

Here we are talking about the computer eye strain : How to prevent eyestrain from digital devices in Telugu. Read on
Story first published:Friday, June 25, 2021, 12:40 [IST]
Desktop Bottom Promotion