Latest Updates
-
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
ఉదయం అల్పాహారానికి ఉత్తమైన పండ్లు
బ్రేక్ ఫాస్ట్/ఉదయం తీసుకొనే అల్పాహారం చాలా ముఖ్యమైనది. ప్రతి రోజూ రెగ్యులర్ గా తీసుకోవల్సిన ఆహారం అల్పాహరం. మరియు తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ హెల్తీగా, రోజంతటీకి సరిపోయే పోషకాలను అందించేవై ఉండాలి . హెల్తీ బ్రేక్ ఫాస్ట్ అంటే సలాడ్స్, లేదా వెజిటేబుల్ సాండ్విచ్ ఏదైనా కావచ్చు. ముఖ్యంగా పండ్లు చాలా ఆరోగ్యరమైనవి మరియు బ్రేక్ ఫాస్ట్ కోసం ఇవి చాలా హెల్తీ ఆప్షన్ కూడా. ముఖ్యంగా ఇటువంటి ఎంపిక మీరు బరువు తగ్గాలనుకొన్నప్పుడు చాలా బాగా పనిచేస్తాయి.
ఈ ఆర్టికల్లో బ్రేక్ పాస్ట్ కు హెల్తీ ఫ్రూట్ ఏంటనేవి మీకు తెలియజేయడం జరిగింది . ఈ ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి మరియు మరియు శరీరంలో స్టామినా పెంచతుంది. రోజంతా పుల్ ఎనర్జీతో నింపుతుంది.
బ్రేక్ ఫాస్ట్ గా ఎటువంటి పండ్లను తీసుకోవాలో ఈ క్రింది స్లైడ్ ద్వారా వివరించడం జరిగిం. వీటిని మీ రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు . బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం చురుకుగా ఉంటుంది. అంతే కాదు శరీరం యొక్క బరువును మెయింటైన్ చేయవచ్చు ఇంకా స్కిన్ స్ట్రక్చర్ ను కూడా చక్కగా మెయింటైన్ చేయవచ్చు. మరి బ్రేక్ ఫాస్ట్ కు ఎటువంటి ప్రూట్ తీసుకోవాలో చూద్దాం...

అరటిపండ్లు:
రెగ్యులర్ గా మీలో బౌల్ మూమెంట్ సమస్యలున్నప్పుడు, మలబద్దకంతో బాధపడుతుంటే, ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో అరటిపండ్లను తీసుకోవచ్చు. అరటిపండ్లు ప్రెద్దప్రేగులో జీర్ణకాకుండా ఇరుక్కున్నఆహారాలను ముందుకు నెట్టడంతోపాటు, త్వరగా జీర్ణం అయ్యేందుకు సహాయపడుతుంది. అంతే కాదు అరటి పండ్లు ఎనర్జీ ఫుడ్స్. తక్షణ శక్తిని పుంజుకొనేలా చేస్తాయి . అందుకే వీటిని బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా తీసుకోమాని చెబుతుంటారు.

పుచ్చకాయ:
ఈ పుచ్చకాయను ముఖ్యంగా సమ్మర్ సీజన్ లో తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే వాటర్ కంటెంట్ తక్షణ శక్తిని అంధివ్వడానికి అద్భుతంగా సహాయపడుతుంది. మస్క్ మెలోనో, వాటర్ మెలోన్ రెండూ కూడా బ్రేక్ ఫాస్ట్ కు చాలా మంచి ఆహారాలు. అధిక నీటిశాతంతో పాటు, అత్యధిక పోషకాలుతో ఇవి నిడి ఉన్నందున వీటిని బ్రేక్ ఫాస్ట్ లో తప్పనిసరిగా చేర్చుకోవచ్చు.

సిట్రస్ పండ్లు:
సిట్రస్ యాసిడ్ కలిగినటువంటి నిమ్మ, లైమ్ మరియు ఆరెంజ్ వంటి పండ్లను ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఈ పండ్లలో ఉండే అసిడిక్ బాడీ ఫంక్షన్ మరియు మెటబాలీజం మెరుగ్గా పనిచేయడానికి అద్భుతంగా సహాయపడుతాయి . అయితే, అసిడిటి సంబంధ సమస్యలున్న వారు ఈ ఆహారాలను తీసుకోవడం అంత మంచిది కాదు. కానీ ఈ పండ్లలో వాటర్ కంటెంట్ అధికంగా ఉండటంతో పాటు. ఇవి శరీరానికి హైడ్రేషన్ లో ఉంచడానికి అద్భుతంగా సహాయపడుతాయి. అందుకే వీటిని బ్రేక్ ఫాస్ట్ ఫుడ్ గా తీసుకుంటున్నారు. వీటితో పాటు, ఇతర హెల్త్ ఫ్రూట్స్ ను సలాడ్స్ రూపంలో తీసుకోవడం వల్ల అసిడిక్ సమస్యలు ఏర్పడవు.

డ్రై ఫ్రూట్స్:
డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం, మరియు రెసిన్ వంటివి ఒక మంచి ఎంపిక. ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్స్ లో షుడర్ మరియు కార్బోహైడ్రేట్స్ తక్షణ శక్తిని అందించి రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచడానికి అద్భుతంగా సహాయపడుతాయి. డ్రై ఫ్రూట్స్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇవి ఎక్కువ ఎనర్జీని అందిస్తాయి. అందుకే వీటిని బ్రేక్ ఫాస్ట్ కు ఒక బెస్ట్ ఫ్రూట్స్ గా చెబుతున్నారు. బరువు పెరగాలనుకొనే వారు వీటిని తప్పనిసరిగా తీసుకోవచ్చు.

బొప్పాయి:
బొప్పాయి డిటాక్స్ ఫ్రూట్ మరియు వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవచ్చు. ఇది స్టొమక్ మరియు బౌల్ ను శుభ్రం చేస్తుంది. బొప్పాయిని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల శరీరాన్ని డిటాక్సి ఫై చేస్తుంది. దాంతో శరీరం మరియు చర్మం రిఫ్రెషింగ్ గా ఉంటుంది. బొప్పాయి శరీరానికి చాలా వేడి చేస్తుంది. కాబట్టి, ఎవరైతే బాడీ హీట్ తో బాధపడుతుంటారో అటువంటి వారు బొప్పాయిని తినకపోవడమే మంచిది. అలాగే గర్భిణీలుగా ఉన్న మహిళలకు కూడా వీటిని నివారించాలి.



Click it and Unblock the Notifications
