Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
బాదం పాలతో ఆరోగ్యానికి గొప్ప ప్రయోజనాలు
ఎవరైతే డైరీ ప్రొడక్ట్స్ అంటే అలర్జీ ఉన్నవారు పాలు, చీజ్, పెరుగు, వెన్న, వంటి తీసుకోలేరు. అయితే ఆరోగ్యం మీద ఎక్కవు శ్రద్ద ఉన్నవారు అలర్జీలు ఇదీ అదీ అని ఏమి చూడకుండా అన్ని తినేస్తుంటారు, త్రాగేస్తుంటారు. కాబట్టి, ఈ రెండింటిలో మీరు ఏ క్యాటగిరీకి చెందినా పాలను నేరుగా కాకుండా ఏదో ఒక రూపంలో(మిల్క్ షేక్స్, లస్సీ) తీసుకోవడం మంచిది. అది కూడా వీలు కానప్పుడు అందుకు ప్రత్యామ్నాయంగా బాదం మిల్క్ ను తీసుకోవచ్చు. బాదం మిల్క్ లో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
అందుకే ప్రపంచవ్యాప్తంగా వీటికి అంత పాపులారిటీ ఉంది. బలవర్ధకమైన ద్రవ్యం బాదం పప్పు. ఇది ఖరీదైనదైనా, అంతకంటే ఖరీదు ఉండే టానిక్‌లతో పోలిస్తే మా త్రం చౌకైనదే అని చెప్పవచ్చు. బాదం పప్పు శరీర ఆరోగ్యానికీ, మానసిక ఆ రోగ్యానికీ మంచిది. పోషకాహారంగానే గాకుండా కొన్ని అనారోగ్యాలను పోగొట్టడంలో కూడా బాదం ప్రయోజనకరమైన ద్రవ్యం.
ఎలా వాడితే మంచిది?
వీటిని నేరుగా అలాగే వాడే కంటే, ఒక పూట నీళ్ళలో బాగా నానబెట్టి, పైన ఉన్న పొరలాంటి తొక్కను తీసేసి, ముద్దగా నూరి వాడడం మంచిది. ఇలా చేయడం వల్ల బాదం పప్పు సరిగ్గా అరిగి శరీరానికి వంటబడుతుంది. అప్పుడే శరీరానికి ఎక్కువ ప్రయోజనాలను చేకూర్చుతుంది. అయితే బాదం పాలలో ప్రోటీనులు మరియు క్యాల్షియం తక్కువగా ఉంటాయి. ఒక గ్లాసు బాదం పాలలో 1గ్రామ్ ప్రోటీలుంటే, ఆవు పాలలో 8గ్రాములుంటాయి. అలాగే బాదం మిల్క్ లో క్యాల్షియం 3mg ఆవు పాలలో క్యాల్షియం 300mg ఉంటాయి. కాబట్టి ప్రోటీన్ క్యాల్షియం లోపం ఉన్న వారు సాధ్యం అయినంత వరకూ ఆవు పాలను తీసుకోవడం మంచిది. అయితే బాదంపాలలో, ఆవుపాలలో ఉన్నంత ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఆ ప్రయోజనాలను ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకోండి.
బాదంపాలు: బాదంతో పాలు తయారు చేసుకోవచ్చు. బాదం పప్పులను నానబెట్టి, తొక్కదీసి, మెత్తగా రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్ళని, పాలలా చిక్కగా కనబడే వారకూ కలపాలి. బలవర్ధకం కూడా. ఆవు పాలు ఎలర్జీ అయిన వారికి ఈ పాలు ఇవ్వడం వలన సంపూర్ణ ఆహారం అందుతుంది.

వెయిట్ మేనేజ్ మెంట్:
ఒక కప్పు బాదం పాలలో 60క్యాలరీలుంటే, ఆవుపాలలో 122క్యాలరీలు 2శాతం మరియు 102క్యాలరీలు 1శాతం 86క్యాలరీలు స్కిమ్డ్ మిల్క్ లో ఉంటుంది. కాబట్టి పాలలో అధిక క్యాలరీలుండటం వల్ల బరువు కంట్రోల్ చేసుకోవాలనుకొనే వారు బాదం మిల్క్ ను తీసుకోవచ్చు.

గుండె ఆరోగ్యానికి మంచిది:
బాదంలో కొలెస్ట్రాల్ ఉండదు లేదా ఇందులో ఉండే శాచురేటెడ్ ఫ్యాట్స్ గురించి పెద్దగా పట్టించుకోవల్సిన అవసరం లేదు. అందుకే మీ ఆరోగ్యానికి ఇవి చాలా మేలు చేస్తాయి. బాదం మిల్క్ మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదం మిల్క్ లో సోడియం తక్కువగా ఉండటం, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అలాగే ఫిష్ లో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులో అధికంగా ఉంది . అందువల్ల ఇది హార్ట్ డిసీజ్ లను మరియు బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది.

హెల్తీ బ్రెయిన్:
బాదం జ్ఝాపకశక్తి పెంచడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుందని భావిస్తారు. మెమరీ పవర్ ను పెంచుతుంది. బాదం పాలు త్రాగడం వల్ల మెదడకు కావల్సిన శక్తిని పెంచుతుంది . కాబట్టి, బాదం మిల్క్ ను నిద్రించే ముందు త్రాగడం మంచిది. కాబట్టి, బ్రెయిన్ పవర్ ను మెరుగుపరుచుకోవాలంటే బాదంను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు.

స్ట్రాంగ్ బోన్స్:
కాల్షియం ఆవు పాలకంటే బాదం పాలలో ఎక్కువగా ఉండదని ఇంతకు ముందే చెప్పడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా 30శాతం క్యాల్షియం తప్పనిసరిగా అవసరం అవుతుంది. అలాగే 25శాతం విటమిన్ డి కూడా అవసరం అవుతుంది. ఇవి రెండు శరీరానికి అందితే ఆర్థరైటిస్, ఓస్టిరియోపోసిస్ సమస్యలుండవు. మరియు వ్యాధినిరోధకతను పెంచుతుంది. హెల్తీ బోన్స్ మరియు దంతాల కొరకు కూడా ఈ రెండు బాగా సహాయపడుతాయి.

కండరాలను బలోపేతం చేస్తాయి. నొప్పులను నివారిస్తాయి:
ఒక సర్వింగ్ బాదం పాలలో 1grmప్రోటీన్ కలిగి ఉంటాయి. మరియు ఇందులో విటమిన్ బి (ఐరన్, రొబోఫ్లెవిన్ )అధికంగా ఉండి, ఈ రెండు కండరాల పెరుగుదలకు మరియు కండరాలు బలోపేతం చేయడానికి అద్భుతంగా సహాయపడుతాయి. అదే సమయంలో కండరాల నొప్పులను నివారిస్తాయి. బాదం పాలు ఆవుపాలకంటే రుచికరంగా ఉంటాయి. కాబట్టి, డ్రై ప్రొడక్ట్స్ అలర్జీ ఉన్నావారు బాదం పాలను తీసుకోవచ్చు.

జిమ్ కు ముందు బాదం పాలు:
బాదం పప్పు తినడం వల్ల ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే పీచు, ప్రొటీన్లు, కాలరీలు, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సాయపడతాయి. జిమ్‌కి వెళ్లే ముందు స్నాక్‌గా కొన్ని బాదం పప్పుల్ని తింటే 15 ఆవశ్యక పోషకాలు లభిస్తాయి.

రక్త హీనతను నివారిస్తుంది:
ప్రతి వందగ్రాముల బాదం పప్పులో రాగి 1.15 మిల్లీగ్రాములు ఆర్గానిక్ రూపంలో లభిస్తుంది. ఈ రాగితో పాటు ఇనుము.. ఇత...ర పోషకాలు కూడా అధికం. బాదం రƒక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. రక్తహీనతను పోగొడుతుంది.

పొట్ట సమస్యలు:
కడుపునొప్పి, మలబద్దకం సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా బాదం తింటే సమస్య పరిష్కారం అవుతుందంటున్నారు వైద్య నిపుణులు.

లైంగిక సామర్థ్యం పెంచుతాయి:
బాదం పప్పుల్ని తినడం వలన మన శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు అందుతాయి. అంతే కాకుండా మన శరీరంలో సెక్స్ హార్మోన్లను విడుదల చేసేలా చేస్తుంది. మహిళల్లో కోరికలు పెరగడానికి బాదం చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణుల అభిప్రాయం.



Click it and Unblock the Notifications











