Latest Updates
-
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి!
బరువు తగ్గించడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందే గ్రేప్ ఫ్రూట్ ఆయిల్
గ్రేప్ ఫ్రూట్ ఆయిల్లో యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తాయి మరియు వ్యాధులకు కారణం అయ్యే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. చాలా వరకూ గ్రేప్ ఫ్రూట్ ఎసెన్షియల్ ఆయిల్లో ముఖ్యమైనటువంటి అంశం లిమోనిన్ అనే కంటెంట్ ఉండటం వల్ల ఈ ఆయిల్ వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ లెమనిన్ అనే కంటెంట్ ట్యూమర్ ఫైటింగ్, క్యాన్సర్ నివారణకు సహాయపడే ఫైటో కెమికల్స్ కలిగి ఉంటుంది. ఇది డిఎన్ఎ మరియు సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. లెమనిన్ తో పాటు గ్రేప్ ఫ్రూట్ ఆయిల్లో ఇతర పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, మిరిసెంటో, టర్పినైన్, పినైన్ మరియు సిట్రోనిలోల్ వంటి ముఖ్యమైన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి .
అత్యంత సాధారణంగా, గ్రేప్ ఫ్రూట్ ఆయిల్ ను గొంతు నొప్పి మరియు శ్వాసకోశ అంటువ్యాధులు, అలసట, కండరాల నొప్పులు, అలాగే కీళ్ళనొప్పులు కోసం ఒక సహజ నివారణిగా పోరాడటానికి ఉపయోగిస్తారు. అది కూడా బరువు తగ్గించుకోవడం కోసం ఈ గ్రేప్ ఫ్రూట్ ఆయిల్ ను ఉపయోగిస్తున్నారు. ఇది శక్తి స్థాయిలు మరియు జీవక్రియ పెంచడానికి సహాయం చేస్తున్నది చెప్పబడింది, ఇంకా ఇది స్వీట్స్ తినాలనే కోరికలను అరికడుతుంది.
READ MORE: కిస్మిస్ మంచి పోషకాహారమేకాదు, ఉత్తమ ఆహారం కూడా!
ఒక సహజ నివారణిగా, గ్రేప్ ఫ్రూట్ ఆయిల్ లివర్(కాలేయాన్ని) శుభ్రపరిచి శరీరంలో టాక్సిన్స్ మరియు వ్యర్థ్యాలను తొలగిస్తుంది . ఇంకా ఇది శోషరస వ్యవస్థ ప్రోత్సహిస్తుంది మరియు ద్రవం నిలుపుదల నియంత్రించవచ్చు.
గ్రేప్ ఫ్రూట్ ఆయిల్ ఉపయోగాలేంటో తెలుసుకుందాం

బరువు తగ్గిస్తుంది:
బరువు తగ్గించడంలో ఫ్యాట్ ను కరిగించడంలో గ్రేప్ ఫ్రూట్ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది. మెటబాలిజం రేటు పెంచుతుంది. ఆకలి తగ్గిస్తుంది. పచోలి ఆయిల్ తో గ్రేప్ ఫ్రూట్ ఆయిల్ మిక్స్ చేసి తీసుకోవడం వల్ల ఇది ఆకలి కోరికలు తగ్గిస్తుంది మరియు ఆకలిని అరికడుతుంది. ఇంకా బౌల్ మూమెంట్ ను వేగవంతం చేస్తుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది . రెండు మూడు చుక్కల గ్రేప్ ఫ్రూట్ ఆయిల్ ను నీటిలో వేసి షేక్ చేసి నముడు, పొట్ట వద్ద అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది అద్భుతమైన డ్యూరియాటిక్ మరియు లింఫోయాటిక్ గా పనిచేస్తుంది

నేచురల్ యాంటీ బ్యాక్టిరియల్
గ్రేప్ ఫ్రూట్ ఆయిల్లో యాంటీ బ్యాక్టిరియల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది హానికరమైన బ్యాక్టిరియాను తొలగించడంలో సహాయపడుతుంది. మనం తీసుకొనే ఆహారం, నీటి ద్వారా బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఫుడ్ అలర్జీకి కారణం అయ్యే బ్యాక్టీరియాను తొలగించడంలో, జబ్బులను నివారించడంలో గ్రేప్ ఫ్రూట్ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది. అలాగే చర్మంలో మరియు ప్రేగుల్లోని బ్యాక్టిరియాను మరియు ఫంగస్ ను కూడా నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. మోల్డ్ గ్రోత్ ను కనుగొని, ప్యారాసైట్స్ ను నాశనం చేస్తుంది.

క్యాండిడా కిల్లర్
గ్రేప్ ఫ్రూట్ ఆయిల్ వల్ల మరో బెనిఫిట్ ఇందులో యాంటీ ఎబిలిటీస్ ఉన్నాయి మరియు ఇది ఈస్ట్ మరియు బ్యాక్టీరియాను తొలగించే లక్షణాలు కలిగి ఉండటం వల్ల క్యాండిడా వైరస్ లక్షణాలు సోకకుండా బాధ్యత వహిస్తుంది. అలాగే కొన్ని పరిశోధనల ద్వారా గ్రేప్ ఫ్రూట్ ఆయిల్ యూరినరీ ట్రాక్ ఇన్పెక్షన్ ను నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుందని కనుగొన్నారు . గ్రేప్ ఫ్రూట్ ఆయిల్ ను పీల్చినప్పుడు లంగ్స్, మరియు శ్వాససంబంధిత సమస్యలను నివారించుకోవచ్చని కనుగొన్నారు.

ఒత్తిడి తగ్గిస్తుంది:
కొద్దిగా గ్రేప్ ఫ్రూట్ ఆయిల్ ను వాసన చూస్తే చాలు ఒత్తిడి తగ్గిస్తుంది. మనస్సుకు ఉపశమనం కలిగిస్తుంది. ఒత్తిడి తగ్గించడంలో ఉపశమనం కలిగించడంతో పాటు, స్నానం చేసే నీటిలో వేయడం వల్ల లేదా చర్మానికి అప్లై చేయడం వల్ల ఒత్తిడి, ఇన్ఫ్లమేషన్ వంటివి తగ్గిస్తుంది. అలాగే గ్రేప్ ఫ్రూట్ ఆయిల్ ను మంచి ఫెర్ఫ్యూమ్ లా చెస్ట్, నడుము, మెడ వద్ద మర్ధన చేసుకోవచ్చు.

హ్యాంగోవర్ క్యూర్:
గ్రేప్ ఫ్రూట్ ఆయిల్ పిత్తాశయం మరియు కాలేయం ఉద్దీపనగా ఉంది, కాబట్టి, ఆల్కహాల్ సేవించిన తర్వాత రోజు తలనొప్పి, కోరికలు మరియు సగ్టినెస్ వంటివని ఆపు చేయడానికి సహాయపడుతుంది. ఉపసంహరణ లక్షణాలను తగ్గించడానికి సహాయం పడుతుంది. నొప్పు నివారిణిగా ఉపయోగించడానికి కొద్దిగా గ్రేఫ్ ఫ్రూట్ ఆయిల్ ను నీటిలో మిక్స్ చేసి మెడ, చర్మం, గొంతు కు అప్లైచేయాలి. ఇది డిటాక్సిఫికేషన్ మరియు యూరినేషన్ పెంచడానికి సహాయపడుతుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్, బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేయడానికి గ్రేప్ ఫ్రూట్ ఆయిల్ సహాయపడుతుంది

స్వీట్ తినాలనే కోరికను కంట్రోల్ చేస్తుంది
మీరు ఎప్పుడూ స్వీట్స్ తినాలే కోరిక కలిగి ఉంటే? గ్రేప్ ఫ్రూట్ ఆయిల్ ఆ కోరికను తగ్గిస్తుంది . దీన్ని డైరెక్ట్ గా వాసన చూడటం వల్ల స్వీట్స్ తినాలనే ఆలోచన తగ్గిస్తుంది. స్వీట్ తినాలనే కోరిక కలిగినప్పుడు గ్రేఫ్ ఫ్రూట్ ఆయిల్ బాటిల్ తీసుకొని వాసన చూడాలి. అలాగే కొన్ని చుక్కల గ్రేప్ ఫ్రూట్ ఆయిల్ ను నీటిలో లేదా టీలో మిక్స్ చేసి తీసుకోవాలి.

ఎయిర్ ఫ్రెష్ నర్
వంటగదిలో అసౌకర్యం కలిగించే దుర్వాసనలు తొలగించడానికి, పాత్రల వాసన తొలగించడానికి మరియు బాత్రూమ్ వాసన నివారించడానికి కొద్దిగా గ్రేప్ ఫ్రూట్ ఆయిల్ ను చిలకరించాలి. గ్రేప్ ఫ్రూట్ ఆయిల్ తో పాటు కొద్దిగా సిట్రస్ ఎసెన్షియల్ ఆయిల్ ను కూడా మిక్స్ చేసి చిలకరించడం ల్ల మంచి ఫలితం ఉంటుంది . అలాగే ఇంట్లో ఈగలు వాలకుండా చేస్తుంది . బ్యాక్టిరియాల లేదా ఇతర వాసనలు గాలిలో లేకుండా నివారిస్తుంది. అలాగే ఉడెన్ ఫర్నీచరన్ మరియు కౌంటర్ టాప్స్, ఫ్లోర్స్, హౌస్ హోల్డ్ అప్లియన్సెస్ ను నివారించడంలో సహాయపడుతుంది.

బ్లడ్ సర్కులేషన్
దాదాపు అన్ని రకాల థెరఫిటిక్ చికిత్సల్లో సిట్రస్ ఎన్సెన్సియల్ ఆయిల్స్ ఉపయోగిస్తుంటారు. దాని వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది మరియు రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. పీరియడ్స్ లో వచ్చే తిమ్మెరలు, పొట్ట ఉబ్బరం, అలసట, మరియు కండరాల నొప్పులును నివారించడంలో గ్రేప్ ఫ్రూట్ ఆయిల్ ఉపయోగకరమైనది మరియు నేచురల్ రెమెడీ.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
మూత్రాశయం, కాలేయం, కడుపు మరియు మూత్రపిండాలతో సహా - - జీర్ణ అవయవాలకు రక్తప్రసరణను పెంచుతుంది. ఇది డిటాక్సిఫికేషన్ కు సహాయపడుతుంది. జీర్ణక్రియకు ఇది ఒక పాజిటివ్ ఎఫెక్ట్ కలిగి ఉంది . కోల్పోయిన ద్రవాలను తిరిగి ఉత్పత్తి అయ్యేందకు సహాయపడుతుంది. దీని ద్వారా మీరు హోం మేడ్ మసాజ్ చేసుకోవచ్చు. గ్రేప్ ఫ్రూట్ ఆయిల్ ను9 కొద్దిగా బాదం, కొబ్బరినూనెల లేదా జోజోబా ఆయిల్లో మిక్స్ చేసి పొట్ట ఉదరంలో మర్దన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఎనర్జినందించడంలో నేచురల్ బూస్టర్
ఆరోమాథెరపీలో గ్రేఫ్ ఫ్రూట్ ఆయిల్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు . ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది . నేచురల్ గానే ఎనర్జిని అందిస్తుంది. కొద్దిగా ఆయిల్ వాసన చూసిన వెంటనే శరీరంలో అవయవాలన్నీ ఉత్తేజితమైవుతాయి. తలనొప్పి, నిద్రలేమి, బ్రెయిన్ ఫాంగ్ సమస్యలను నివారిస్తుంది.

మొటిమలతో పోరాడి చర్మాన్ని రక్షిస్తుంది
చాలా కమర్షియల్ లోషన్స్ లో సిట్రస్ ఆయిల్ ను ఉపయోగిస్తుంటారు. ఇందులో ఉండే యాంటీబ్యాక్టిరియల్, స్కిన్ బూస్టింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మంలోని బ్యాక్టీరియాను నాశనం చేయడం మాత్రమే కాదు, చర్మంలో మొటిమలను నివారిస్తుంది. చర్మం యొక్క వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. ఇండోర్ అవ్ డోర్ గాలి కాలుష్యం నుండి చర్మానికి రక్షణ కల్పిస్తుంది . సెల్యులైట్ ను నివారిస్తుంది.

జుట్టును శుభ్రపరుస్తుంది
షాంపులో కొద్దిగా గ్రేప్ ఫ్రూట్ ఎసెన్షియల్ ఆయిల్ ను మిక్స్ చేసి కండీషనర్ గా అప్లై చేసి హెయిర్ వాష్ చేయడం వల్ల తలలో జిడ్డు, చెమట, మరియు బ్యాక్టిరియాను నాశనం చేసి, హెయిర్ వాల్యూమ్ మరియు షైనింగ్ పెంచుతుంది. మీ జుట్టుకు కలర్ వేసుకుంటే అందులో మిక్స్ చేయడం వల్ల సన్ లైట్ నుండి హెయిర్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది.

వంటలకు ఫ్లేవర్ పెంచుతుంది
వండే వంటకాల్లో కొద్దిగా గ్రేప్ ఫ్రూట్ ఆయిల్ మిక్స్ చేయడం వల్ల ఇది వంటలకు అదనపు రుచి, ఫ్లేవర్ ను అందిస్తుంది . అంతే కాదు సంత్రుప్తి పరుస్తుంది. తిన్న తర్వాత స్వీట్స్, కార్బోహైడ్రేట్ ఫుడ్స్ మీద కోరికను తగ్గిస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.



Click it and Unblock the Notifications











