Latest Updates
-
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.!
హార్మోనులను సమతుల్యం చేసే 10 హోం రెమెడీస్
ప్రస్తుత కాలంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది సర్వ సాధారణంగా మారింది. అందుకు ముఖ్య కారణం ఒత్తిడితో కూడిన జీవన శైలి మరియు తీసుకొనే అనారోగ్యకరమైన ఆహారం. దాంతో శరీరంలో హార్మోనల్ అసమతుల్యత ఏర్పడి అనేక సమస్యలకు దారి తీస్తుంది. అయితే హార్మోనుల అసమతుల్యత వల్ల పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువ సమస్యల ఎవురౌతుంటాయి.
ముఖ్యంగా మనిషి జీవించడానికి శ్వాస ఎంత అవసరమో ఆరోగ్యంగా ఉండడానికి హార్మోనులు కూడా అంతే ముఖ్యం. గర్భాశయంలో పిండంగా ఏర్పడినప్పటి నుంచి మనిషి జీవించి ఉన్నంత వరకు శరీరం మీద హార్మోన్ల ప్రభావం ఉంటుంది. ఈ హార్మోన్‌లు ఎక్సోక్రైన్, ఎండోక్రైన్ అని రెండు రకాలు. ఎక్సోక్రైన్ గ్రంథులు విడుదల చేసే స్రావాలు నాళాల ద్వారా స్రవిస్తాయి. ఎండ్రోక్రైన్ గ్రంథులకు నాళాలు ఉండవు, వీటి నుంచి వెలువడిన హార్లోన్లు రక్తంలో కలసి శరీరమంతా వ్యాపిస్తాయి.
ఎక్సోక్రైన్ గ్రంథులకు ఉదాహరణలుగా స్వేదగ్రంథులు, కాలేయాన్ని చెప్పవచ్చు. కాలేయం, క్లోమం జీర్ణరసాలను ఉత్పత్తి చేస్తాయి. పిట్యుటరీ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్, ఎడ్రినల్ గ్రంథులు ఎండోక్రైన్ గ్రంథులకు ఉదాహరణలు. మగవారిలో వృషణాలు, స్త్రీలలో అండాశయాలు కూడా ఎండోక్రైన్ గ్రంథులకు ఉదాహరణలు. హార్మోనులు తగినంత విడుదల కావాలి. అవసరానికి మించి విడుదలైనా, తక్కువగా విడుదలైనా దుష్పరిణామాలు కలుగుతాయి.
హార్మోన్ల విధులు: హార్మోన్లు మానసిక శారీరక ఎదుగుదలకు ఉపయోగపడతాయి జీవప్రక్రియ, శరీర నియంత్రణ, సంతానోత్పత్తి, వయసుకు తగిన మార్పులు, శారీరక విధులు ఆలోచన, ఆవేశం, సెక్స్ హార్మోన్‌ల వల్లనే కలుగుతాయి శరీరంలో గ్లూకోజ్ నియంత్రణ ఇన్సులిన్ పాత్ర. READ MORE: హార్మోన్ల బ్యాలెన్సింగ్ కొరకు యోగా భంగిమలు
హార్మోనులు సమతుల్యం చేయడానికి కొన్ని ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఈ ఆహారాలను మీ మూడ్ మార్చడంతో పాటు, ఎనర్జీని అందిస్తాయి . మహిళల్లో హార్మోనుల్లో అసమతుల్యతలు పీరియడ్స్ సమయంలో మరియు మోనోపాజ్ దశలో మరియు గర్బధారణ సమయంలో ఎక్కువగా ఉంటాయి. మిగిలిన వారిలో వారి శరీరంను బట్టి ఉంటాయి . ఈ హార్మోనులను సమతుల్యం చేయడానికి లేదా కంట్రోల్ చేయడానికి కొన్ని బేసిక్ హెల్తీ ఫుడ్స్ ఉన్నాయి. వాటిని ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకొని, ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవర్చుకోవాలి...

ఫైబర్ ఫుడ్స్:
హార్మోనులను సమంగా ఉంచడంలో ఫైబర్ ఫుడ్స్ గ్రేట్ గా సహాయడుతాయి . గోధుమలు, బ్రెడ్, బ్రౌన్ రైస్ వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు హార్మోనులను స్థిరంగా ఉంచడానికి సమాయపడుతాయి.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ప్రోటీనులు మరియు న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఇవి హార్మోనులను బ్యాలెన్స్ చేస్థాయి . హార్మోనులను కంట్రోల్ చేస్తాయి.

కొబ్బరి నూనె:
హార్మోనులను బ్యాలెన్స్ చేయడానికి కొబ్బరినూనె గ్రేట్ గా సహాయపడుతుంది . ఈ నూనెలో ఎక్కువగా శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి.

కాఫీ :
మహిళల్లో ఈ సమస్యను నివారించాలంటే కాఫీని త్రాగాలి . కాఫీలో ఉండే కెఫిన్ మహిళల్లో ఎండోక్రైన్ సిస్టమ్ కు అంతరాయం కలిగిస్తుంది. దాంతో శరీరంలో కార్టిసోల్ ఉత్పత్తిని క్రమబద్దం చేస్తుంది.

పంచదార:
ఎక్కువ పంచదార తినడం వల్ల శరీరంను నాశనం చేస్తుంది . పంచదార ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇది బరువు పెంచడం మాత్రమే కాకుండా శరీరంలో ఈస్ట్రోజెన్ లెవల్స్ పెరిగేలా చేస్తుంది.

పిండి పదార్థాలు:
వైట్ ఫుడ్స్ ను తీసుకోవడం ద్వారా ఇవి శరీరంలో ఎండో క్రైన్ సిస్టమ్ ను మరింత తీవ్రతరం చేస్తుంది . కాబట్టి వైట్ ఫ్లోర్ తో తయారుచేసే మఫిన్స్, వైట్ రస్ వంటి వాటికి దూరంగా ఉండాలి.

పండ్లు:
హార్మోనుల అసమతుల్యంతో బాధపడే మహిళలు తాజా పండ్లను తీసుకోవడం ఒక అలవాటుగా చేసుకోవాలి. ముఖ్యంగా ప్లెవనాయిడ్స్ అధికంగా ఉన్న పండ్లను ఎక్కువగా తీసుకోవాలి . ఇవి శరీరంలో హార్మోనులను సమతుల్యం చేస్తాయి.

ఆర్గానిక్ ఫుడ్ :
ఆర్గానిక్ ఫుడ్స్ లో ఎలాంటి రసాయనాలుండవు. అందుకే ఆర్గానిక్ ఫుడ్ పవర్ ఫుల్ గా మరియు నేచురల్ గా న్యూట్రీషియన్స్ కలిగి ఉండటం వల్ల ఇవి శరీరంలో హార్మోనులను ట్రాక్ లో ఉంచుతుంది.

చేపలు:
హార్మోనులు బ్యాలెన్స్ చేయడానికి మరో బెస్ట్ రెమెడీ చేపలు . వారానికొక సారి ఫిష్ తీసుకోవడం వల్ల తున మరియు సాల్మన్ వంటి చేపల్లో ఉండే నూనెలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

నిద్ర:
నిద్రలేమి కూడా హార్మోనుల అసమతుల్యతకు కారణం అవుతుంది . కాబట్టి ప్రతి రోజూ కనీసం 8 గంటల నిద్ర చాలా అవసరం.



Click it and Unblock the Notifications
