For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఖర్జూరం +పాలలో దాగున్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!!

|

మన ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అంధించే సర్ ప్రైజింగ్ డ్రై ఫ్రూట్ ఖర్జూరం. డేట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఈజిప్ట్ ప్రదేశాల్లో చాలా ఫేమస్. ఇందులో ఉండే అద్భుతమైన న్యూట్రీషియన్ విలువల వల్ల ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయింది. డ్రైఫ్రూట్స్ లో బాగా ఫేమస్ అయినటువంటి ఈ ఫ్రూట్ లో నేచురల్ స్వీట్నెస్ కలిగి ఉంటుంది. అద్భుత పోషక విలువలుండటం చేత వీటిని వివిధ రకాల స్వీట్ డిష్ లలో జోడిస్తుంటారు.

ప్రతి రోజూ 10 కర్జూరాలు తింటే పొందే 16 అమేజింగ్ బెన్ఫిట్స్..!!

డేట్స్ లో లో నేచురల్ షుగర్స్ ఉండటం వల్ల డయాబెటిక్ పేషంట్స్ కు ఇది ప్రక్రుతి ప్రసాధించిన ఒక వరం అని చెప్పవచ్చు. డయాబెటిక్ పేషంట్స్ డేట్స్ తినడం వల్ల షుగర్ లెవల్స్ లో ఎలాంటి మార్పులు ఉండవు. షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారు వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వారిలో స్వీట్స్ తినాలన్న కోరికను తగ్గిస్తుంది. అయితే ఇందులో ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. మితంగా తీసుకోవడం మంచిది.

ఖర్జూర పండు చాలా విలువైన ఔషధం మరియు శరీరానికి ఒక టానిక్ వలే పనిచేస్తుంది. కర్జూరాలను స్టోర్ చేయడం చాలా సులభం. కర్జూరాలు మిగిలిన డ్రై ఫ్రూట్స్ కంటే ధర చాలా తక్కువ. ఈ కర్జూరాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. మిగిలిన డ్రై ఫ్రూట్స్ తో పోల్చితే కర్జూరంలో అధిక ఎనర్జీ కలిగించే పోషకాలు, క్యాలరీలు మెండుగా ఉన్నాయి. 100 గ్రాముల కర్జూరంలో 280క్యాలరీలు అందుతాయి. అతి తేలికగా జీర్ణం అయిపోతుంది. శరీరానికి అవసరమైన శక్తినివ్వటానికి శరీరంలోని వ్యర్ధాలను తొలగించటానికి బాగా ఉపయోగపడుతుంది. ఖర్జూరంలో మెడిసినల్ విలువలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతాయి. మరి డేట్స్ జ్యూస్ ను ఎలా తయారుచేసుకోవాలి. ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల పొందే అమేజింగ్ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

పాలలో ఖర్జూరపండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. బరువు తక్కువగా ఉండి సన్నగా ఉండే వారికి ఇవి చాలా బాగా సహాయపడుతాయి. అలాగే కర్జూరాలను రాత్రంతా పాలలో నానబెట్టి ఉదయం మిక్సీలో వేసి జ్యూస్ లా తయారు చేసి తాగడం వల్ల శరీరానికి కావల్సిన న్యూట్రిషియన్స్ అధికంగా అందుతాయి. దాంతో రోజంతా పనిచేయడానికి కావల్సిన శక్తి అందుతుంది. ఆకలిగా ఉన్నప్పుడు..మూడ్ సరిగా లేనప్పుడు చాక్లెట్స్ కు బదులు కర్జూరాలను తినడం వల్ల మంచి మూడ్ తో ఉత్సాహంగా పనిచేయగలరు.ఒక గ్లాసు డేట్ జ్యూస్ లో ఆరోగ్యనికి అందానికి సంబంధించిన ప్రయోజనాలు ఎన్నో దాగున్నాయి. మరి అవేంటో ఒక సారి తెలుసుకుందాం...

స్కిన్ కు మంచి గ్లో వస్తుంది:

స్కిన్ కు మంచి గ్లో వస్తుంది:

డేట్ జ్యూస్ ను రెగ్యురల్ గా తాగడం వల్ల చర్మానికి పోషణ బాగా అందుతుంది. దాంతో చర్మానికి మంచి గ్లో వస్తుంది.

 చర్మంకు పోషణ అందుతుంది:

చర్మంకు పోషణ అందుతుంది:

డేట్ జ్యూస్ రెగ్యులర్ గా తాడం వల్ల రక్తంలో ప్లేట్ లెట్ కౌంట్ పెరుగుతుంది. కాబట్టి, డేట్ జ్యూస్ ను బయట కొనడం కంటే ఇంట్లో స్వయంగా తయారుచేసుకోవడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. ఫ్రెష్ జ్యూస్ వల్ల పూర్తి పోషకాలు శరీరానికి అందుతాయి.

హెయిర్ స్ట్రక్చర్ స్మూత్ గా మరియు థిక్ గా మారుతుంది:

హెయిర్ స్ట్రక్చర్ స్మూత్ గా మరియు థిక్ గా మారుతుంది:

రోజూ కొన్ని డేట్స్ తినడం లేదా డేట్స్ తో తయారుచేసిన జ్యూస్ తాగడం వల్ల జుట్టుకు అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది. ఎలాంటి సందేహం లేకుండా ఇది జుట్టును ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది. అలాగే జుట్టు స్మూత్ గా తయారవుతుంది.

జుట్టు హెల్తీగా ఉంటుంది:

జుట్టు హెల్తీగా ఉంటుంది:

డేట్స్ జ్యూస్ జుట్టు హెల్తీగా పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది . జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే విటమిన్స్ ఎక్కువ అందిస్తుంది. ముఖ్యంగా విటమిన్ బిను ఎక్కువ అందిస్తుంది.

నేచురల్ లేబర్ :

నేచురల్ లేబర్ :

గర్భధారణ సమయంలోనే కాదు, గర్భం పొందక ముందు నుండే రెగ్యులర్ డైట్ లో డేట్స్ చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందుతారు . అలాగే గర్భణికి గర్భాధారణ కాలంలో గ్రేట్ గా సహాయపడుతాయి. ప్రసవం నేచురల్ గా జరగుతుంది. డేట్స్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మహిళల్లో హార్మోన్ ఆక్సిటోసిన్ ను క్రమబద్దం చేస్తుంది.

 క్యాన్సర్ నివారిస్తుంది:

క్యాన్సర్ నివారిస్తుంది:

డేట్ ఫ్రూట్స్ జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. కాబట్టి, యవ్వనంలో ఉన్నవారు మాత్రమే కాదు అడల్ట్స్ తాగడం వల్ల కూడా క్యాన్సర్ ను నివారించుకోవచ్చు .

బరువు పెరగడానికి సహాయపడుతాయి:

బరువు పెరగడానికి సహాయపడుతాయి:

మరీ సన్నగా ఉన్నవారు. బరువు పెరగాలని కోరుకునే వారు, డేట్స్ జ్యూస్ లోని షుగర్స్ మరియు కార్బోహైడ్రేట్స్ బరువు పెరగడానికి సహాయపడుతాయి.

గ్రేట్ లాక్సేటివ్ :

గ్రేట్ లాక్సేటివ్ :

పురాతన కాలం నుండి, మలబద్దక నివారణకు డేట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకునే వారు. డేట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటం వల్ల ఇది గ్రేట్ లాక్సేటివ్ గా పనిచేస్తుంది.

 యాంటీ ఏజింగ్ లక్షణాలు అధికంగా ఉన్నాయి:

యాంటీ ఏజింగ్ లక్షణాలు అధికంగా ఉన్నాయి:

డేట్స్ జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల ఇది శరీంరలో ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది. ఇది యాంటీ క్యాన్సర్ లక్షణాలను మరియు యాంటీ ఏజింగ్ సామర్థ్యంను అందిస్తుంది.

బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది:

బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది:

డేట్స్ లో ఉండే డైటరీ ఫైబర్ శరీరంలో ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ (బ్యాడ్ కొలెస్ట్రాల్ )లెవల్స్ ను తగ్గిస్తుంది.

దంతాలు మరియు బోన్ హెల్త్ ను మెయింటైన్ చేస్తుంది:

దంతాలు మరియు బోన్ హెల్త్ ను మెయింటైన్ చేస్తుంది:

డేట్స్ జ్యూస్ లో క్యాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్ మరియు కాపర్ ఎక్కువ. కాబట్టి, దంతాలు మరియు బోన్ హెల్త్ ను ప్రోత్సహించడానికి ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ఏర్పడుటకు సహాయపడుతుంది.

English summary

11 Amazing Benefits Of Dates Juice For Skin, Hair And Health

11 Amazing Benefits Of Dates Juice For Skin, Hair And Health,Everyone knows that dates are a bag filled with healthy surprises. Dates, though famously known to be abundant in United Arab Emirates and Egypt, have also made its presence in a remarkable way in the Kutch region of Gujarat eons ago. This highly nu
Desktop Bottom Promotion