Latest Updates
-
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే! -
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి -
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా..
వైట్ ఆనియన్స్ లో అద్భుతమైన ప్రయోజనాలు..!
ఉల్లిపాయ ఉపయోగించకుండా ఎన్ని రకాలు వంటకాలు వండుతారు? చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఉల్లిపాయ వాడని ఇల్లంటూ ఉండదు కాబట్టి. ప్రతి ఇంట్లోనూ వివిధ రకాల వంటకాలలో విరివిగా వాడుతారు. భారతీయ వంటలలో ఇది ఒక ముఖ్యమైన ఆహార పదార్ధము. వివిధ రకాలైన కూరలు తయారుచేయడంలో దీనిని అనుబంధ పదార్ధంగా వాడతారు. ఉల్లికాడలు కొన్ని రకాలైన ఆకుకూరలు మాదిరిగా ఉపయోగిస్తారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఉల్లిపాయలు వివిధ రంగుల్లో ఉంటాయి. ఉదా: రెడ్, ఎల్లో, వైట్ మరియు గ్రీన్ కలర్స్ లో లభ్యం అవుతాయి. అవి ప్రత్యేక రుచి మరియు వాసన కలిగి ఉంటాయి. మంచి పోషక విలువులు కూడా ఉంటాయి.విటమిన్ సి, ఫ్లెవనాయిడ్స్, ఫైటో న్యూట్రీషియన్స్ ఉంటాయి. ఉల్లిపాయలను అలాగే పచ్చివి కూడా తినవచ్చు. అందుకే చాలా రకాల సలాడ్స్, రైతా వంటి వాటిల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. అంతే కాదు వీటిని ఉడికించి, ఫ్రై చేసి మరియు రోస్ట్ చేసి వివిధ రకాలుగా ఉపయోగించుకుంటారు.
ఉల్లిపాయను అత్యధిక ఔషధ విలువలు కలిగిన అత్యధిక విలువైన మూలికగా పిలుస్తారు. లాభదాయక లక్షణాలు కలిగి ఉండటవల్లే వీటిని ప్రాచీన కాలం నుండీ కొన్ని ఔషదాలుగా ఉపయోగిస్తున్నారు. ఉల్లిపాయల్లో ఉండే ఫ్లెవనాయిడ్స్ మతిమరుపు, స్ట్రోక్ మరియు గుండెకు సంబంధించిన వ్యాధులు నివారించేందుకు సహాయపడుతాయి. ఉల్లిపాయల్లో ఫైబర్, ఫోలిక్ యాసిడ్, యాంటీఆక్సిడెంట్స్, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ క్యాన్సర్, ఇతర ఇన్ఫెక్షన్లను నిరోధించడానికి బాగా సహాయపడుతాయి.
ఉల్లిపాయలు రుచితో పాటు ఘాటైనే వాసనను కలిగి ఉంటాయి. అంతే కాదు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. వివిధ రంగులున్న ఉల్లిపాయల్లో తెల్లగా ఉండే ఉల్లిపాయలు ఉడికించే లేదా పచ్చివి ఎలా తిన్నా ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. వీటిలో 5000ఏళ్ళ క్రింత నుండే వీటిని పండిస్తున్నారు. 16శతాబ్దంలో మహిళల్లో అనేక ఆరోగ్య సమస్యలను నివారించుకోవడానికి డాక్టర్స్ సూచించేవారట. ముఖ్యంగా మహిళల్లో ఇన్ఫెర్టిలిటిని నివారిస్తాయని అప్పట్లో బాగా ఫేమస్ అయ్యాయి.వైట్ ఆనియల్స్ తినడం వల్ల కలరా, ప్లేగు వంటి వ్యాధులను నివారించుకోవచ్చని రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో వెల్లడైనది,.ఉల్లిపాయలు, బ్లడ్ షుగర్ లెవల్స్ ను బ్యాలెస్స్ చేస్తుంది. ఇంకా మరెన్నో ప్రయోజనాలున్నాయి. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కుడా చేయదనే సామెత ఉన్నది . ఉల్లి పాయ వెనక దాదాపు 5000 ఏళ్ళ చరిత్ర ఉన్న వీటిలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. రుచి మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయనడానికి ఈ క్రింది పాయింట్సే నిదర్శనం....

1. హార్ట్ హెల్త్ :
వైట్ ఆనియన్స్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా నివారిస్తుంది. దాంతో హార్ట్ సమస్యలు దూరమవుతాయి.

2. క్యాన్సర్ నివారిణి:
వైట్ ఆనియన్స్ లో ఉండే క్వర్సిటిన్, యాంటీ క్యాన్సర్ ఏజెంట్ గా పనిచేస్తుంది. రెగ్యులర్ డైట్ లో వైట్ ఆనియన్స్ చేర్చుకోవడం వల్ల క్యాన్స్ రిస్క్ తగ్గుతుందని రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో వెల్లడైనది.

3. బ్లడ్ పల్చగా మార్చుతుంది:
వైట్ ఆనియన్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల రక్తం పల్చగా మారుతుంది. వైట్ ఆనియన్స్ లో ఉండే ఫ్లెవనాయిడ్స్ మరియు సల్ఫర్ రక్తం పల్చగా మారడానికి సహాయపడుతుంది.

4. యాంటీ ఇన్ఫ్లమేటరీ:
వైట్ ఆనియన్స్ లో సల్ఫర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది యాంటీఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఆస్త్మా నివారణకు దీన్ని ఉపయోగించడం మంచిది.

5. ఇమ్యూనిటి పెంచుతుంది:
శరీరంలో ఇమ్యూనిటి పెంచడంలో వైట్ ఆనియన్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. వైట్ ఆనియన్స్ అలర్జిక్ రియాక్షన్ తగ్గిస్తాయి.

6. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది:
వైట్ ఆనియన్స్ జీర్ణశక్తిని పెంచడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దాంతో డయేరియా మరియు గ్యాస్ట్రిక్ అల్సర్లను నివారిస్తుంది.

7. బ్లడ్ షుగర్ ను రెగ్యులేట్ చేస్తుంది:
వైట్ ఆనియన్స్ లో ఉండే క్రోమియం, సల్ఫర్స్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుందని రీసెంట్ స్టడీస్ లో వెల్లడించారు.

8. బోన్ డెన్సిటి మెరుగుపరుస్తుంది:
వైట్ ఆనియన్స్ యస్సైన వారిలో బోన్ డెన్సిటిని మెరుగుపరుస్తుంది. అలాగే చిన్న పిల్లల్లో కూడా బోన్స్ డెన్సిటి పెంచుతుంది,

9. ఫెర్టిలిటి పెంచుతుంది:
ఫెర్టిలిటి కోసం డాక్టర్స్ ఆనియన్స్ ను సూపర్ ఫుడ్ గా సూచిస్తుంటారు. ఉల్లిపాయల్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఫెర్టిలిటి పెంచుతుంది, బర్త్ డిఫెక్ట్స్ తగ్గిస్తుంది. ఐరన్ పుష్కలంగా అందుతుంది.

10. హెల్తీ హెయిర్:
జుట్టు సంరక్షణలో భాగంగా ఉల్లిపాయలను పురాతన కాలం నుండే ఉపయోగిస్తున్నారు. ఇది హెయిర్ స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది.

11.జలుబును తగ్గిస్తుంది:
ఉల్లిపాయల్లో సల్ఫర్ ఉండటం వల్ల ఇది మెడిసిన్ గా తీసుకుంటారు. జలుబు తగ్గించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది.

12. స్కిన్ సాప్ట్ గా మార్చుతుంది:
రెగ్యులర్ గా ఉల్లిపాయలు తినడం వల్ల స్కిన్ సాప్ట్ గా మరియు అట్రాక్టివ్ గా మారుతుంది. ఇది ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది. అలాగే, ఇందులో ఉండే విటమిన్ సి చర్మంను హెల్తీగా అందంగా మార్చుతుంది.

13. నిద్రబాగా పడుతుంది:
ఉల్లిపాయలు డిప్రెషన్ తగ్గిస్తాయి. బాగా నిద్రపట్టేందుకు సహాయపడుతాయి.



Click it and Unblock the Notifications