For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

థైరాయిడ్ పేషంట్స్ ఏం తినాలి ? ఏం తినకూడదు ?

By Swathi
|

ధైరాయిడ్ గ్రంథిలో వచ్చే ఇబ్బందులను థైరాయిడిజంగా పిలుస్తారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. హైపోథైరాడిజం, హైపర్ థైరాయిడిజం అని రెండు రకాల సమస్యలు వస్తాయి. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిలో వచ్చే సమస్యలను థైరాయిడ్ గా పిలుస్తారు. థైరాయిడ్ సమస్య ఉందని గుర్తించిన తర్వాత సరైన డైట్ ఫాలో అవడం వల్ల ఈ సమస్య నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు.

READ MORE: థైరాయిడ్ ఉందని తెలిపే సాధారణ లక్షణాలు

ప్రస్తుతం థైరాయిడ్ సమస్య చాలామందిని వేధిస్తోంది. కొంతమందికి వారసత్వంగా కూడా ఈ సమస్య మొదలవుతోంది. అయితే ఎక్కువగా మహిళల్లోనే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి థైరాయిడ్ పేషంట్స్ మందులతో పాటు.. కొన్ని ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకోవడం వల్ల.. థైరాయిడ్ గ్రంథి యాక్టివ్ ఉంటూ.. మెటబాలిజం, హార్ట్ రేట్, మూడ్, బాడీ టెంపరేచర్, బ్లడ్ ప్రెజర్ సజావుగా ఉండటానికి సహాయపడతాయి. ఇంతకీ థైరాయిడ్ పేషంట్స్ డైట్ లో కంపల్సరీ ఉండాల్సిన ఆహారాలు, అవైడ్ చేయాల్సిన ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఫిష్

ఫిష్

హైపోథైరాయిడిజంతో బాధపడే పేషంట్స్ కి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ ఐటమ్ షిఫ్. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ వల్ల థైరాయిడ్ పేషంట్స్ కి ఫిష్ న్యాచురల్ ట్రీట్మెంట్ గా పనిచేస్తుంది. ఆరోగ్యకరమైన ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్.. సాల్మన్, ట్యూనా, సార్డీన్స్ వంటి చేపల ద్వారా పొందవచ్చు. దీనిద్వారా ఇన్ల్ఫమేషన్ తగ్గడంతోపాటు, ఇమ్యూన్ పవర్ పెంచుతుంది. అలాగే హార్ట్ డిసీజ్ లు వచ్చే ఛాన్స్ లు తక్కువ.

నట్స్

నట్స్

థైరాయిడ్ డిజార్డర్ తో బాధపడేవాళ్ల డైట్ లో సెలీనియం కంపల్సరీ ఉండాలి. ఇది పుష్కలంగా లభించే నట్స్ ని డైట్ లో చేర్చుకుంటే.. మంచిది. థైరాయిడ్ గ్రంథి పనితీరు సజావుగా సాగడానికి నట్స్ ని రోజూ కంపల్పరీ తీసుకోవాలి. అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి గుప్పెడు తీసుకుంటే మంచిది. మరీ మోతాదుకి మించి తీసుకోకుండా జాగ్రత్త పడాలి.

ఫ్రూట్స్, వెజిటబుల్స్

ఫ్రూట్స్, వెజిటబుల్స్

పండ్లు, కూరగాయలు డైట్ లో చేర్చుకునే వాళ్ల శరీరంలో టాక్సిన్స్ బయటకు ఈజీగా తొలగిపోతాయి. అయితే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల హైపోథైరాయిడిజంను కంట్రోల్ చేయడం తేలికవుతుంది. ఇది న్యాచురల్ రెమిడీగా పనిచేస్తాయి. అలాగే బరువు పెరగకుండా కూడా కంట్రోల్ చేస్తాయి. బ్లూబెర్రీస్, చెర్రీస్, క్యాప్సికమ్, టమోటా, స్వీట్ పొటాటోస్ వంటివి ఎక్కువగా డైట్ లో చేర్చుకోవాలి.

ఓల్ గ్రెయిన్స్

ఓల్ గ్రెయిన్స్

థైరాయిడిజం లక్షణాల్లో కాన్ట్సిపేషన్ ఒకటి. దీన్ని నివారించడానికి డైట్ లో ఓల్ గ్రెయిన్స్ చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఫైబర్ అందుతుంది. బ్రౌన్ రైస్, బుల్గర్, ఓట్స్ వంటివి డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడం కూడా తేలికవుతుంది.

డైరీ ప్రొడక్ట్స్

డైరీ ప్రొడక్ట్స్

హైపోథైరాయిడిజం కారకాల్లో విటమిన్ డి డెఫిసియెన్సీ.. ఒకటి. మిల్క్, డైరీ ప్రొడక్స్ అయిన పెరుగు, కాటేజ్ చీజ్ వంటివి తీసుకోవడం వల్ల విటమిన్ డి పొందవచ్చు. అలాగే ఐయోడిన్, ప్రొటీన్, క్యాల్షియం వంటి పోషకాలు కూడా పొందవచ్చు.

బీన్స్

బీన్స్

బీన్స్ లో మెండైన పోషక విలువలు ఉంటాయని అందరికీ తెలుసు. కానీ.. బీన్స్ ద్వారా హైపోథైరాయిడిజం నివారించడానికి సహాయపడుతుందని చాలా మందికి తెలియదు. బీన్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్, ప్రొటీన్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా పొందవచ్చు. సూప్స్, సలాడ్స్, సైడ్ డిష్ ల రూపంలో బీన్స్ డైట్ లో చేర్చుకోవడం అవసరం.

సోయా ప్రొడక్ట్స్

సోయా ప్రొడక్ట్స్

మహిళల్లో థైరాయిడ్ సమస్యను సోయా ఉత్పత్తులకు దూరంగా ఉండటం ద్వారా నివారించవచ్చు. సోయా బీన్స్ లో ఉండే ఫైటోస్ర్టజెన్స్ థైరాయిడ్ హార్మోన్ పై దుష్ర్పభావం చూపుతాయి. కాబట్టి థైరాయిడ్ పేషంట్స్ డైట్ లో సోయా బీన్స్ తీసుకోవడం వల్ల హైపోథైరాయిడిజం పెరిగే అవకాశం ఉంది.

వెజిటబుల్స్

వెజిటబుల్స్

హైపోథైరాయిడిజంతో బాథపడే వాళ్లు బ్రొకోలి, క్యాబేజ్, క్యాలీ ఫ్లవర్, టర్నిప్స్ వంటివి తీసుకోకూడదు.

వీట్

వీట్

ప్రొసెస్డ్ ఫుడ్స్ అయిన వీట్, బార్లీ, బ్రెడ్ వంటి వాటికి దూరంగా ఉంటాయి. ఓల్ గ్రెయిన్స్, బ్రౌన్ రైస్, మల్టీ గ్రెయిన్ బ్రెడ్, పాస్తా చాలా కంట్రోల్ గా తీసుకోవాలి.

ఫ్యాటీ ఫుడ్స్

ఫ్యాటీ ఫుడ్స్

శ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే.. ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, ఫ్రైడ్ చికెన్, బట్టర్ వంటి ఫుడ్స్ దూరంగా ఉండాలి.

ప్రాసెస్డ్ ఫుడ్

ప్రాసెస్డ్ ఫుడ్

ప్రొసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ లో సోడియం ఎక్కువగాఉంటుంది. కాబట్టి హైపోథైరాయిడిజంతో బాధపడేవాళ్లు ప్రొసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ కి దూరంగా ఉండాలి. కుకీస్, కేక్స్, పాస్తా, బ్రెడ్ వంటివి థైరాయిడ్ పేషంట్స్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ పెరిగే అవకాశం ఉంది.

షుగరీ ఫుడ్స్

షుగరీ ఫుడ్స్

షుగరీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరగడమే కాదు.. మెటబాలిజం కూడా తగ్గుతుంది. కాబట్టి ఫ్యాట్, షుగరీ ఫుడ్స్ తీసుకోకూడదు. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ పైనా ప్రభావం చూపుతుంది కాబట్టి థైరాయిడ్ పేషంట్స్ షుగర్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి.

English summary

Foods to Include and Avoid in Hypothyroidism Diet

Foods to Include and Avoid in Hypothyroidism Diet. There is obviously no supplement for medication in case of thyroid disorders, but eating certain foods can help in improving the functions if the thyroid glands and regulate metabolism, heart rate, mood, body temperature and blood pressure.
Desktop Bottom Promotion