Latest Updates
-
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.!
సమ్మర్లో వాటర్ మెలోన్ ను డైట్ లో చేర్చుకోవడానికి పర్ఫెక్ట్ రీజన్
వేసవికాలం వస్తోందంటే చాలు ప్రపంచంలో అందరికీ గుర్తుకొచ్చేది పుచ్చకాయ. దీన్ని ఖర్బూజ అని కూడా పిలుస్తారు. ఈ కాయ నిండా నీరే ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్‌లో దీనికి వాటర్ మెలోన్ అనే పేరు స్థిరపడింది. తాపాన్ని చల్లార్చే చలవగుణం దీనికి ఉంది.వేసవికాలం వస్తోందంటే చాలు ప్రపంచంలో అందరికీ గుర్తుకొచ్చేది పుచ్చకాయ. దీన్ని ఖర్బూజ అని కూడా పిలుస్తారు. ఈ కాయ నిండా నీరే ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్‌లో దీనికి వాటర్ మెలోన్ అనే పేరు స్థిరపడింది. తాపాన్ని చల్లార్చే చలవగుణం దీనికి ఉంది. దీనిలో ఔషధగుణాలు కూడా ఉన్నాయి. జీర్ణప్రక్రియకు బాగా దోహదపడడం దీని లక్షణం.
పుచ్చకాయ (Watermelon) నే కర్బూజా అని కూడా అంటారు. ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యం ఇచ్చేది ఎర్రని పుచ్చకాయలకే. అన్ని సీజన్లలోనూ ఇవి దొరుకుతున్నా, వేసవిలో లభ్యమయ్యే వాటికి నాణ్యత, రుచీ ఎక్కువ. బి విటమిన్లు , పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి. తక్కువ కెలోరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. పుచ్చకాయ జూస్ తాగేందుకు అనువైన పానీయం. ఎందుకంటే, అందులో 92% నీరు ఉంటుంది, పైగా కొలెస్ట్రాల్ లాంటివి అందులో ఉండవు. అది వెంటనే తన ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. పుచ్చకాయలో కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉన్నాయి. మృదువుగా, తీయగా, రసపూరితమైన పుచ్చకాయ ఈ వేసవికి చాలా ఉపయోగకరమైనది. వాటిని తింటే దాహం తీరిపోతుంది. అందులో సందేహం లేదు. అలాగే ఇందులో ఆరోగ్యానికి సహాయపడే ప్రయోజనాలు కూడా ఎన్నో....ఎన్నెన్నో...తెలుసుకోవాలంటే

గుండెకు:
గుండెపోటు రిస్కును పుచ్చకాయతో తగ్గించుకోవచ్చు. పుచ్చకాయలో ఉండే ఫోలేట్‌వల్ల, విటమిన్-బి6వల్ల గుండె పోటు సంఘటనలు దాదాపు 50శాతం తగ్గినట్లు అధ్యయనాల్లో తేలింది.

కీళ్ళ నొప్పులు:
వబలమైన కీళ్ళ కోసం: దోసకాయలోని సిలికా కీళ్ళ జాయింట్లను, సహాయపడే కణజాలాలకు పటిష్టం చేయడానికి బాగా సహాయపడుతుంది.

క్యాన్సర్:
పుచ్చకాయలో ఎరుపు రంగుకు కారణమైన లైకోపీన్ అనే కెరటినాయిడ్ పదార్థం ఉంటుంది. ఇది క్యాన్సర్లను రానివ్వకుండా కాపాడుతుంది.

డయాబెటిస్:
పుచ్చకాయల ద్వారా సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్‌లు లభిస్తాయి. గుండెజబ్బులకి, ప్రేగు కేన్సర్‌కి, అలాగే మధుమేహానికి చాలా మంచివని పరిశోధనలు తెలియజేశాయి.

పళ్ళు మరియు చిగుళ్ళ ఆరోగ్యానికి:
దంతాల ఆరోగ్యానికి మరియు చిగుళ్ళ నుండి రక్తం కారుట, దంత క్షయం వంటి సమస్యలతో బాధపడేవారికి పుచ్చకాయ రసం చాలా సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి:
కొవ్వు పదార్థాలు అత్యంత తక్కువుగానూ, పీచు పదార్థాలు అధికంగానూ ఉండే ఈ పండు బరువు తగ్గాలనుకునే వారికి వరం లాంటింది.

ఫ్లూ:
జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ నివారణకు సరైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అటువంటి సమయంలో పుచ్చకాయ బాగా సహాయపడుతుంది.

నేచురల్ టోనర్:
ఈ ఎర్రని, జ్యూసీ ఫ్రూట్ నేచురల్ ఆస్ట్రిజెంట్ చర్మం రంగును మార్చుతుంది. అందుకు ఈ కర్జూజ గుజ్జును ముఖానకి మర్ధనా చేయాలి. ఈ తాజా వాటర్ మెలోన్ లో కొద్దిగా తేనె కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది ఆయిల్ చర్మానికి నేచురల్ గా పనిచేస్తుంది.

వృద్దాప్య ఛాయలను పోగొడుతుంది:
వాటర్ మెలోన్ లో ఉండే లైకోపిన్, విటమిన్ సి మరియు విటమిన్ ఎ శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగించడంలో బాగా సహాయపడుతుంది. అంలాగే యాంటీఆక్సిడెంట్స్ కూడా ముడతలను, కళ్ళ క్రింద చారలను తొలగిస్తుంది

చర్మానికి కావల్సినంత తేమను అందిస్తుంది: వాటర్ మెలోన్ జ్యూసీ ఫ్రూట్
కాబట్టి శరీరాన్ని ఎప్పడూ తేమగా ఉంచుతుంది మీరు కనక పొడి చర్మంతో బాధపడుతున్నట్లైతే వాటర్ మెలోన్ మీద తేనె చిలకరించి ముఖానికి మాయిశ్చరైజ్ చేసుకోవాలి. డీహైడ్రేషన్ వల్ల ముఖం డల్ గా మరియు డ్రైగా ఉంచుతుంది. కాట్టి ఈ జ్యూస్ రెడ్ ఫ్రూట్ ను మీ డైలీ డైయట్ లో చేర్చుకోండి.

ఆయిల్ చర్మాన్ని తొలగిస్తుంది :
ఇందులో ఉండే విటమిన్ ఎ చర్మలోపల ఉన్న నూనె మగ్రంధులను తగ్గిస్తుంది. దాంతో ముఖంలో జిడ్డు కూడా తగ్గి ముఖం తాజాగా ఉంటుంది. ఈ సీజన్ లో మీకు అతి సులభంగా, చౌకగా దొరికే ఈ పండును తీసుకొచ్చి తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, బ్యూటీ బెనిఫిట్స్ ను కూడా సొంతం చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications