Latest Updates
-
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.?
సమ్మర్ స్పెషల్: చల్లచల్లని చెరకు రసంలోని హెల్త్ సీక్రెట్స్
సమ్మర్ లో దాహార్తి తీర్చుకోవడానికి ఎన్ని ఉన్నా తక్కువ వస్తాయి. కొబ్బరిబోండం, ఫ్రూట్ జ్యూస్ లు, మజ్జిగ, లస్సి, కూల్ డ్రింక్స్, నీళ్లు.. ఇలా రకరకాల పానీయాలు తాగుతూ.. ఎండతాపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంటాం. ఈ రసాలలో ఒకటైన చెరకు రసం ప్రత్యేకతే వేరు. ఎలాంటి తీపి పదార్థాలు చేర్చకుండానే.. సహజంగా రుచిని, తీయదనాన్ని, ఆరోగ్యాన్ని అందించే పసందైన పానీయం చెరకు రసం.
ఎలాంటి పళ్ల రసాలనైనా.. ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కానీ.. చెరకు రసం మాత్రం బయట తాగాల్సిందే. రోడ్ సైడ్ దొరికే ఈ చెరకు రసంలోని ప్రయోజనాలు అమోఘం. దీన్ని తేలికగా తీసేయకండి. సమ్మర్ స్పెషల్ డ్రింక్ అయిన చెరకు రసం తాగడం వల్ల పొందే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే.. ఈ సారి చెరకు రసం చూస్తే తాగేస్తారు. మరి అందులోని బెన్ఫిట్స్ ఏంటో చూద్దామా..

పోషకాలు
చెరకు రసంలో ఉండే మినిరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

యూరిన్ ఇన్ఫెక్షన్
మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడే వాళ్లకు చెరకు రసం చక్కటి పరిష్కారం.

కిడ్నీల్లో స్టోన్స్
కిడ్నీల్లో స్టోన్స్ నివారించడానికి చెరకు రసం తాగడం వల్ల ఫలితం ఉంటుంది. ఈ రసం రెగ్యులర్ గా తీసుకుంటే.. రాళ్లు త్వరగా కరిగిపోతాయి.

ఇమ్యునిటీ పవర్
శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి తో పాటు బి2 ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, పాస్ఫరస్‌లు సమృద్ధిగా లభిస్తాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు
చెరకు రసంలో క్యాలరీలు తక్కువ.. పోషకాలెక్కువ. షుగర్స్ ఎక్కువగా ఉండవు. కాబట్టి మధుమేహ రోగులతో సహా అందరూ చెరకురసం తాగేయొచ్చు. ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.

క్యాన్సర్ నివారిణి
చెరకు రసంలో ఆల్కలీన్ ఉండటం వల్ల ప్రొస్టేట్, కోలన్, ఊపిరితిత్తుల, బ్రెస్ట్ క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది.

శరీరంలో వేడి తగ్గించడానికి
సమ్మర్ లో చెరకు రసం ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది.

కామెర్ల నివారణకు
కామెర్ల నివారించడానికి ఒక గ్లాసు చెరకు రసానికి కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి ప్రతి రోజూ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

తల్లిపాలు
చెరకు రసం, పిప్పిని పాలల్లో ఉడికించి తాగటం వల్ల పాలు తక్కువగా ఉన్న తల్లిలో, పాలు సమృద్ధిగా పెరుగుతాయి. అంటే తల్లిపాలని పెంచే హార్మోన్లు ఈ చెరకులో ఉంటాయి.

మలబద్ధకం
చెరకు రసంలో లాక్సేటివ్ గుణాలుంటాయి. కాబట్టి మలబద్ధకం నివారించడానికి ఇది సహాయపడుతుంది.

నోటి దుర్వాసన
చెరకురసంలోని లవణాలు నోటి దుర్వాసనను తగ్గించి, దంతాలు పుచ్చిపోకుండా కాపాడతాయి.

జలుబు, దగ్గు
జలుబు, దగ్గు, ఫ్లూ, గొంతు నొప్పి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఐస్ లేకుండా షుగర్ కేన్ జ్యూస్ తాగడం వల్ల.. వెంటనే ఉపశమనం పొందవచ్చు.

ఇన్ఫెక్షన్స్
డయేరియా, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, కడుపు లేదా గుండె సంబంధించిన వ్యాధులు, లైంగిక సంక్రమణ, వాపు వంటి వ్యాధులకు చెరకు రసం చక్కటి పరిష్కారం.

అలసట
సమ్మర్ లో ఏ పనిచేయకపోయినా అలసటగా అనిపిస్తూ ఉంటుంది. అలా అలసిన ఫీలింగ్ కలిగినప్పుడు రెండు గ్లాసుల చెరకు రసం తాగడం వల్ల వెంటనే అలసట తగ్గిపోయి.. ఎనర్జిటిక్ గా మారిపోతారు.

ఎసిడిటీ
కడుపులో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు ఎదురయినప్పుడు చెరకు రసం తీసుకోవడం వల్ల ఆ సమస్యలను నివారించవచ్చు.

బాడీలో నీటి శాతం
సమ్మర్ లో ఎన్ని నీళ్లు తాగినా దాహార్తి తీరదు. అలాంటప్పుడు చెరకు రసం తీసుకోవడం వల్ల.. శరీరంలో నీటి స్థాయి పడిపోకుండా.. కాపాడుతుంది.



Click it and Unblock the Notifications
