ఆరోగ్యానికి ఈ కొలెస్ట్రాల్ బూస్టింగ్ ఫుడ్స్ చాలా అవసరం..

Posted By: Lekhaka
Subscribe to Boldsky

సాధారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగాయంటే చెప్పలేనన్ని అనారోగ్య సమస్యలు చ్చిపడుతుంటాయి. అందుకే చాలా మంది డైట్ ను ఫాలో అవుతుంటారు. శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒక చెడు కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హని కలిగిస్తే, మంచి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి కొలెస్ట్రాల్ తక్కువ ఉండటం వల్ల కూడా తరచూ జబ్బు పడుతుంటారు. అలా జరగకూడదనుకుంటే కొలెస్ట్రాల్ బూస్టింగ్ ఫుడ్స్ ను ఫాలో అవ్వాలి.హార్ట్ ఫ్రెండ్లీ సూపర్ ఫుడ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

అనారోగ్యకరమైన జీవనశైలే హార్ట్ సమస్యలకు కారణమవుతున్నాయి.అందులో ముఖ్యంగా ఆహారపు అలవాట్లు , ఎక్కువ నూనె పదార్థాలు, ప్రిజర్వేటివ్స్ వంటి ఫాస్ట్ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం. హెల్తీ లైఫ్ స్టైల్ ను పొందాలంటే పండ్లు, వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల హార్ట్ హెల్త్ ను మెరుగుపరుచుకోవచ్చు.

సెడెన్ గా ఫుడ్ హ్యాబిట్స్ ను బ్రేక్ చేయాలన్నా లేదా మార్చుకోవాలన్నా, కొద్దిగా కష్టంగానే ఉంటుంది. అయితే రోజులో కనీసం ఒక ఫ్రూట్ మరియు ఒక రకంవెజిటేబుల్ ను డైలీ డైట్ లో చేర్చుకోవడం మంచిది. తర్వాతి స్టేజ్ లో , సలాడ్స్, హెల్తీ రిసిపిలు, ఫ్రూట్స్ వెజిటేబుల్ జ్యూస్ పూర్తిగా మార్చుకోవాలి. ఇలా ఫుడ్ హ్యాబిట్స్ ను మార్చుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఈ ఫుడ్స్ హ్యాబిట్స్ ను పిల్లలకు కూడా అలవాటు చేస్తే మంచిది

అన్ని రకాల కొలెస్ట్రాల్ బూస్టింగ్ ఫుడ్స్ లో వ్యాధులకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ తో పోరాడే యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి . లోఫ్యాట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల పూర్తిగా ఫ్యాట్ ను తీసుకోవడం ఒకటే హార్ట్ హెల్త్ కు పరిష్కార మార్గం కాదు. కాబట్టి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ అయిన హెడ్ డిఎల్ ను పెంచి, ఎల్ డిఎల్ చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించే ఆహారాలు తీసుకోవాలి. మరి అటువంటి కొలెస్ట్రాల్ బూస్టింగ్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం..

1.ఓట్స్

1.ఓట్స్

హార్ట్ హెల్తీగా ఉండాలంటే మొదట బ్రేక్ ఫాస్ట్ లో మార్పులు చేసుకోవాలి. అందుకు ఓట్స్ ఉత్తమం.ఇది ఎల్ డిఎల్ తగ్గిస్తుంది. ఓట్ మీల్ లో ఉండే బీటా గ్లూకాన్, ఎల్ డిఎల్ కొలెస్ట్రాలను గ్రహిస్తుంది. ఎల్ డిఎల్ ను శరీరం నుండి తొలగిస్తుంది. దాంతో హార్ట్ హెల్తీగా ఉంటుంది.

2. సాల్మన్

2. సాల్మన్

సీఫుడ్స్ఇష్టపడే వారికి సాల్మన్ బెస్ట్ ఆప్షన్. ఇది హార్ట్ కు రక్షణ కల్పిస్తుంది. ఇందులో ఉండే ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ను శరీరచంలో మంచి కొలెస్ల్రాల్ హెచ్ డిఎల్ పెంచడానికి సహాయపడుతుంది.

3.వాల్ నట్స్

3.వాల్ నట్స్

రోజూ ఏదో ఒక చిరుతిండ్లు తినడం అలవాటుంది. అయితే వాటి స్థానంలో వాల్ నట్స్ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్(ఎల్ డిఎల్ )ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. దాంతో హార్ట్ , బ్రెయిన్ హెల్తీగా ఉంటాయి.

4.బాదం & జీడిపప్పు

4.బాదం & జీడిపప్పు

బాదం మరియు జీడిపప్పు ను రెగ్యులర్ గా తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అయితే వీటిలో క్యాలరీలు అధికంగా ఉండటం వల్ల ప్రోటీన్స్ కంట్రోల్ కోసం పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.

5.బీన్స్

5.బీన్స్

హార్ట్ హెల్త్ కు ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడం చాలా అవసరం. బీన్స్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ గ్రహించడాన్ని ఆలస్యం చేస్తుంది. కాబట్టి, రెగ్యులర్ డైట్ లో బ్లాక్ బీన్స్, కిడ్నీ బీన్స్, పింటో బీన్స్ ను తీసుకోవాలి. ఇవి బెస్ట్ కొలెస్ట్రాల్ బూస్టింగ్ ఫుడ్స్ .

6.అవొకాడో

6.అవొకాడో

అవొకాడోలో హార్ట్ హెల్తీ మూఫాస్ అధికంగా ఉన్నాయి. ఇదిహెచ్ డి ఎల్ కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇందులో బీటీ సెటోస్ట్రాల్ కంటెంట్ శరీరంలో కొలెస్ట్రాల్ షోషణకకుండా తగ్గిస్తుంది.

7. డార్క్ చాక్లెట్

7. డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్స్ హార్ట్ మంచిదని, డాక్టర్లు సూచిస్తుంటారు.ఇది ఎక్సలెంట్, రిలాక్సెంట్ ఫుడ్. డార్క్ చాక్లెట్ అంత రుచికరంగా ఉండదు అనేకునే వారు, చాక్లెట్స్ డిఫరెంట్ రిసిపిలను తయారుచేసుకోవచ్చు.

8.వెల్లుల్లి

8.వెల్లుల్లి

వెల్లుల్లి పాపులర్ హోం రెమెడీ. ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ పెంచుతుంది.పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. రోజూ ఒకటి రెండు పచ్చివెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల కొలెస్ట్రాల్ బూస్టింగ్ ఫుడ్ గా దాదాపు అన్ని ప్రయోజనాలను పొందుతారు.

English summary

8 Best Cholesterol-busting Foods

High cholesterol level can cause serious health issues. Listed in this article are a few foods that help in lowering the bad cholesterol level.
Story first published: Saturday, April 1, 2017, 20:00 [IST]
Subscribe Newsletter