బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తో పోరాడే 12 ఉత్తమ ఆహారాలు

Posted By: Mallikarjuna
Subscribe to Boldsky

క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి అన్న విషయం అందరికీ తెలిసిందే...క్యాన్సర్ వివిధ రకాలుగా ఉన్నాయి. మహిళలు ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ కు గురి అవుతుంటారు, మహిళలల్లో స్తనాలు అత్యంత ముఖ్యమైన శరీర అవయవం. స్తనాల్లో సెడన్ గా ఎలాంటి మార్పు కనిపించినా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

బ్రెస్ట్ క్యాన్సర్ పేషంట్స్ లేదా బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడే వారితో మాట్లాడినప్పుడు, మొదటగా వారు ఎక్స్ ప్రెస్ చేసేది ''నాకే ఎందుకు''?

గతంలో బ్రెస్ట్ క్యాన్సర్ చాల తక్కువ మంది మహిళలకు మాత్రమే ఉండేది. అది కూడా 40ఏళ్ళ పైబడిన మహిళల్లో మాత్రమే కనబడే బ్రెస్ట్ క్యాన్సర్, ప్రస్తుతం 20 నుండి 22 ఏళ్ళు వయస్సున్న వారిలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు కనబడుతున్నాయి.

best foods for cancer patients

మరో భయంకరమైన విషయం ఏంటంటి బ్రెస్ట్ క్యాన్సర్ కు చికిత్స చాలా ఆలస్యం అవుతుంది. అప్పటికే ఆ మహిళ క్యాన్సర్ లో మూడవ స్టేజ్ లో ఉంటుంది.

బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్స నుండి చాలా తక్కువ మంది మాత్రమే లక్కీగా బయటపడుతుంటారు. త్వరగా వైద్య పరీక్షలు చేయించుకోవడం, వల్ల ప్రమాధకర పరిస్థితిని నుండి భయటపడుతారు.

అందువల్ల, చాలా వరకూ ఎక్స్ పర్ట్స్ ఏమని సూచిస్తారంటే, బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు కనుగొనడానికి వ్యక్తిగతంగా కొన్ని పరీక్షలు రెగ్యులర్ గా చేసుకోవాలి. స్తనాల్లో ఎలాంటి మార్పు కనబడినా, క్యాన్సర్ లక్షణాల్లో ఏ ఒక్కటి గుర్తించినా, వెంటనే స్పెషలిస్ట్ ను కలవడం మంచిది. బెస్ట్ క్యాన్సర్ ను ముందే పసిగట్టి నివారించుకోవడం మంచి మార్గం.

అయితే ఇది బ్రెస్ట్ క్యాన్సర్ మరియు కీమోథెరఫీ ట్రీట్మెంట్ తీసుకునే అందరి పేషంట్స్ కోసం కాదు, వారిలో కూడా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.

ఈ సైడ్ ఎఫెక్ట్స్ తో పోరాడటానికి కొన్ని ఆహారాలు సహాయపడుతాయి. ఈ మద్యన జరిపిన ఒక పరిశోధనలో సోయా మరియు బ్రొకోలీ వంటి ఆహారాలు బ్రెస్ట్ క్యాన్సర్ సైడ్ ఎఫెక్ట్స్ ట్రీట్మెంట్ లో ఎఫెక్టివ్ గా సహాయపడ్డాయని కనుగొన్నారు .

వీటితో పాటు బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ తో పోరాడే మరికొన్ని ఆహారాల గురించి, మనం ఇప్పుడు తెలుసుకుందాం..

1. క్యూసిఫెరస్ వెజిటేబుల్స్:

1. క్యూసిఫెరస్ వెజిటేబుల్స్:

క్యాబేజ్, బ్రొకోలీ, వంటి క్రూసిఫెరస్ వెజిటేబుల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ను నివారిస్తాయి. ఇందులో విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇంకా వీటిలో ఉండే అతి ముఖ్యమైన ఫైటో కెమికల్స్ వీటినే ఐసోథైయోసైనేట్స్ క్యాన్సర్ ను నివారిస్తాయి.

బ్రొకోలీలో కూడా రెండు ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్స్ సల్ఫరా ఫేన్స్, ఇండోల్స్ లు క్యాన్సర్ చికిత్సలో భాగంగా వచ్చే దుష్ప్రభావాలను నివారిస్తాయి.

2. సోయా ఫుడ్స్ :

2. సోయా ఫుడ్స్ :

క్యాన్సర్ ఫేషంట్స్ రెగ్యులర్ డైలో సోయా ఫుడ్స్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ ట్రీట్మెంట్ యొక్క ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సోయా ఫుడ్స్ లో ఫైటో కెమికల్స్ లేదా బయో యాక్టివ్ ఫుడ్ కాంపోనేట్స్ అధికం. ముఖ్యంగా ఐస్ ఫ్లవనాయిడ్స్ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తో పోరాడుతాయి.

3. నట్స్ :

3. నట్స్ :

బాదం, వాల్ నట్, బ్రాజిల్ నట్స్ లలో ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి సహాయపడే మంచి కొవ్వులు. బ్రాజిల్ నట్స్ లో సెలీనియం అధికంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ ఫైటింగ్ మెటీరియల్. గుప్పెడు నట్స్ ను రోజు వారి డైట్ లో చేర్చుకోవడం వల్ల వ్యాధినిరోధకశక్తి పెరగడంతో పాటు, క్యాన్సర్ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ను నిరోధిస్తుంది.

4. ఆలివ్ ఆయిల్:

4. ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ మంచి ఫ్యాట్ కు మూలం. ఇందులో ఫాలీ న్యూట్రీయంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేసన్ తగ్గిస్తాయి, ఆలివ్ ఆయిల్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల గౌట్ హెల్త్ ను ప్రోత్సహిస్తుంది. వ్యాధినిరోధకతను పెంచుతుంది.

5. అవొకాడో:

5. అవొకాడో:

అవొకాడోలో ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి సహాయపడే మంచి కొవ్వులు. అవొకాడో మాత్రమే కాదు, ఫైబర్ కంటెంట్, విటమిన్స్, ఎసెన్సియల్ మినిరల్స్ అధికంగా ఉంటాయి.

అదనంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఫైటో కెమికల్స్ కూడా ఎక్కువ , అవొకాడో రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు.

6. త్రుణ ధాన్యాలు:

6. త్రుణ ధాన్యాలు:

మలబద్దకం మరియు జీర్ణ సమస్యలు ప్రదాన సమస్యలు. బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో అతి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఇవి. త్రుణ ధాన్యాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్ , ఇన్ సోలబుల్ ఫైబర్ మరియు కార్బోహైడ్రేట్స్ ఎనర్జీ లెవల్స్ పెంచుతాయి. జీర్ణ సమస్యలను నివారిస్తాయి.

7. ఓట్ మీల్:

7. ఓట్ మీల్:

ఓట్ మీల్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ. అలాగే యాంటీఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉండటం వల్ల ఓట్ మీల్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఫ్రీరాడికల్స్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గిస్తుంది. టాక్సిన్స్ ను న్యూట్రలైజ్ చేసి క్యాన్సర్ తో పోరాడుతుంది.

8. ఫ్రెష్ ఫ్రూట్స్ :

8. ఫ్రెష్ ఫ్రూట్స్ :

పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆరెంజ్ , బ్రైట్ కలర్ ఫ్రూట్స్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ను నివారిస్తుంది. ఈ పండ్లు తినడం వల్ల శరీరంలో టాక్సిన్స్ తొలగిపోతాయి. క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది.

9. చియా సీడ్స్ :

9. చియా సీడ్స్ :

చియా సీడ్స్ లో ఫైబర్ , మినిరల్స్ ఎక్కువ, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల రెగ్యులర్ ఫుడ్స్ లో రెండు టేబుల్ స్పూన్ల విత్తనాలు జోడించడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ తో ఎఫెక్టివ్ గా పోరాడుతాయి.

10. సన్ ఫ్లవర్ సీడ్స్ :

10. సన్ ఫ్లవర్ సీడ్స్ :

సన్ ఫ్లవర్ సీడ్స్ లో విటమిన్ ఇ, మంచి ఫ్యాట్స్ ఎక్కువ. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల క్యాన్సర్ పేషంట్స్ తీసుకునే డైట్ వల్ల ఎలాంటి సమస్యలుండవు. సన్ ఫ్లవర్ సీడ్స్ వ్యాధినిరోధశక్తిని పెంచుతాయి. ఫ్రీరాడికల్స్ ను నివారించి క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తాయి.

11. వెల్లుల్లి:

11. వెల్లుల్లి:

వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో వెల్లుల్లి గ్రేట్ రెమెడీ, వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ. ఇది క్యాన్సర్ కు వ్యతిరేఖంగా పోరాడటంలో స్ట్రాంగ్ ఫుడ్ . వెల్లుల్లిని వంటల్లో చేర్చి లేదా గ్రిల్ చేసి, లేదా పచ్చిగా కూడా తినవచ్చు.

12. లీన్ ప్రోటీన్ :

12. లీన్ ప్రోటీన్ :

బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో లీన్ ప్రోటీన్ ఒకటి. గుడ్డు, చేపలు, మరియు చికెన్ వంటి లీన్ ప్రోటీన్ తినడం వల్ల మజిల్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల వచ్చే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

English summary

Foods That Help Fight Breast Cancer Treatment’s Side-effects

Breast cancer is one major form of cancer that most women dread of. Breast cancer patients undergoing treatment can have several side effects. However, consuming certain foods helps the patients to fight the side effects of breast cancer treatment effectively. This article explains about a few of these foods.