రోజుకు ఒక్క డ్రై ఫ్రూట్ తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు

Posted By:
Subscribe to Boldsky

సాధారణంగా డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాల) లో ఉండే పోషకాల గురించి వినే ఉంటారు. అందుకే ఈ డ్రైఫ్రూట్స్ ను ప్రతి రోజూ తినమని చెబుతుంటారు. శరీరంలో ఒక బలమైన వ్యాధినిరోధక వ్యవస్థ పొందడానికి మీ రెగ్యులర్ డైయట్ లిస్ట్ లో ఈ డ్రైఫ్రూట్స్ ను చేర్చుకోవడం మంచి పద్దతి. ఆరోగ్యానికి కాలవలసిన పోషకాహారం పుష్కలంగా డ్రై ఫ్రూట్స్‌లో ఉన్నాయి. అవి చూడడానికి చిన్నవిగా ఉన్నా వాటికుండే శక్తి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇందులో ఖనిజలవణాలు, విటమిన్లు, ఎంజైములు స్రవించడానికి అవసరమైన వనరులు వీటిల్లో అధికం.

అయితే మనలో చాలా మందికి ఈ 'ఎండిన పండ్లు' గురించి మరియు వాటిలో ఉండే పోషక విలువలు శరీరానికి ఏవిధంగా పనిచేస్తాయో తెలియదు. తెలుసుకోరుకూడా.. అదే సమయంలో కొంతమంది స్వీట్స్ తినడానికి చాలా ఎక్కువగా ఇష్టంచూపుతుంటారు. బయట బేకరీల్లో, స్వీట్స్ స్టాల్స్ లో, మార్కెట్లో లభ్యమయ్యే కొన్ని రకాల స్వీట్స్ మీద ఈ డ్రైఫ్రూట్స్ తో గార్నిషింగ్ చేసి, క్యాండీలకు, చాక్లెట్లకు ప్రత్యామ్నాయాలుగా ఆకర్షిస్తుంటాయి.

 రోజుకు ఒక్క డ్రై ఫ్రూట్ తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు

కొన్ని సందర్భాల్లో ఎక్కువ పని ఒత్తిడి వల్ల భోజనం చేసే సమయం కూడా ఉండదు. అటువంటి సమయంలో ఎక్కువ సమయం వృథా కాకుండా ఈ డ్రైఫ్రూట్స్ (ఎండిన పండ్లు) ఉత్తమ ప్రత్యామ్నాయం. ఎండిన పండ్లును ఒక్కొక్కటే నోట్లో వేసుకొని నమలడం వల్ల రుచిగా అనిపించడమే కాకుండా మీ ఆకలిని తెలియనివ్వదు. ఈ డ్రైఫ్రూట్స్ లో రుచి మాత్రమే కాదు అనేక విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా కలిగి ఉంటాయి. సలాడ్స్ మీద వీటితో గార్నిష్ చేయడం కూడా చాలా ఆరోగ్యకరం. కాబట్టి, రోజుకొక డ్రై ఫ్రూట్ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో తెలుసుకుందాం..

కిస్మిస్ మంచి పోషకాహారమేకాదు, ఉత్తమ ఆహారం కూడా!

డ్రై ఫ్రూట్స్ ఎనర్జీ ఇస్తాయి:

డ్రై ఫ్రూట్స్ ఎనర్జీ ఇస్తాయి:

డ్రై ఫ్రూట్స్ గ్రేట్ ఎనర్జీ ఫుడ్. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువ. వీటి పోషక విలువలు తెలిసిన వ్యక్తులు వీటిని వారి రెగ్యులర్ డైట్ లో ఒక బాగంగా చేసుకుంటారు. ఒంట్లో శక్తిలేనప్పుడు, 5,6డ్రై ఫ్రూట్ తింటే చాలు తక్షణ శక్తిని పుంజుకుంటుంది. కాబట్టి, రోజులో మీరు వీలున్నప్పుడు లేదా గుర్తొచ్చినప్పుడు రెండు, మూడు నోట్లో వేసుకొని నమలండి.

డ్రై ఫ్రూట్స్ తింటే రక్తంలో హీమోగ్లోబిన్ పెరుగుతుంది:

డ్రై ఫ్రూట్స్ తింటే రక్తంలో హీమోగ్లోబిన్ పెరుగుతుంది:

హెల్తీ డ్రై ఫ్రూట్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి చేస్తుంది మరియు బ్లడ్ వెజల్స్ లో ఫ్లెక్సిబిలిటి ఉంటుంది. ఇది హీమోగ్లోబిన్ మెరుగుపరచడంలో గొప్ప పాత్ర పోషిస్తుంది.

మేడిపండులో చూడు..మేలైన ఆరోగ్య గుణగణాలు!

డ్రై ఫ్రూట్స్ తింటే జీర్ణ శక్తి పెంచుతుంది:

డ్రై ఫ్రూట్స్ తింటే జీర్ణ శక్తి పెంచుతుంది:

డ్రై ఫ్రూట్స్ లోని హెల్త్ బెనిఫిట్స్ లో ముఖ్యమైనది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్దకం వంటి సమస్యలను నివారిస్తుంది. డ్రై ఫ్రూట్స్ లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అజీర్తిని నివారించే మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది.

డ్రై ఫ్రూట్స్ తింటే కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ చేస్తుంది:

డ్రై ఫ్రూట్స్ తింటే కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ చేస్తుంది:

ఇది నమ్మడానికి కొంచెం కష్టం అనిపించినా, అవును ఇది నిజం, ఆరోగ్యప్రయోజనాల పరంగా డ్రై ఫ్రూట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ బ్యాలెన్స్ చేస్తుంది. డ్రై ఫ్రూట్స్ లో ఫ్యాట్స్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి అద్భుతంగా సహాయపడుతాయి.

డ్రై ఫ్రూట్స్ తింటే జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది: :

డ్రై ఫ్రూట్స్ తింటే జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది: :

జుట్టు సంరక్షణకు వేరే కాస్మోటిక్స్ ను ఉపయోగించాల్సిన అవసరం లేదు. హెయిర్ లాస్, హెయిర్ డ్యామేజ్ మరియు ఇతర జుట్టు సంబంధిత సమస్యలను నివారించడంలో డ్రై ఫ్రూట్స్ గొప్పగా సహాయపడుతాయి. మరియు జుట్టు పెరుగుదలకు దోహదం చేసి జుట్టును స్ట్రాంగ్ గా ఉంచుతుంది.

డ్రై ఫ్రూట్స్ తింటే క్యాన్సర్ నివారిస్తుంది

డ్రై ఫ్రూట్స్ తింటే క్యాన్సర్ నివారిస్తుంది

డ్రై ఫ్రూట్స్ లో ఉండే ఫ్లెవనాయిడ్స్ మరియు యాంటీయాక్సిడెంట్స్ క్యాన్సర్ కణాల అభివ్రుద్దిని అడ్డుకుంటుంది. మన శరీరంలో క్యాన్సర్ కు కారణం అయ్యే ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది. డ్రై ఫ్రూట్స్ తో ఇది ఒక మేజర్ హెల్త్ బెనిఫిట్.

కర్జూరంలో 7 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు...!

డ్రై ఫ్రూట్స్ తింటే కంటిచూపు మెరుగురుస్తాయి:

డ్రై ఫ్రూట్స్ తింటే కంటిచూపు మెరుగురుస్తాయి:

డ్రై ఫ్రూట్స్ హెల్త్ బినిఫిట్స్ లో ఇది ఒక గ్రేట్ హెల్త్ బెనిఫిట్. వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యలను నివారిస్తుంది. డ్రై ఫ్రూట్స్ లో కెరోటినాయిడ్స్ మరియు విటమిన్ ఎ అధికంగా ఉండి కంటి ఆరోగ్యాన్నికి సహాయపడుతాయి.

డ్రై ఫ్రూట్స్ తింటే ఎముకల ఆరోగ్యం కాపాడుతుంది:

డ్రై ఫ్రూట్స్ తింటే ఎముకల ఆరోగ్యం కాపాడుతుంది:

ఎముకల ఆరోగ్యానికి హెల్తీ డ్రై ఫ్రూట్స్ లో క్యాల్షియం మరియు ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన ఎముకల బలానికి చాలా గొప్పగా సహాయపడుతాయి. డ్రైఫ్రూట్స్ దంతక్షయాన్ని మరియు చిగుళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

డ్రై ఫ్రూట్స్ తింటే బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేస్తాయి:

డ్రై ఫ్రూట్స్ తింటే బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేస్తాయి:

డ్రై ఫ్రూట్స్ లో ఉండే న్యూట్రిషినల్ యాసిడ్స్ రక్తంలో షోషణ చెంది, అసిడోసిస్ ను నివారిస్తుంది. కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ బ్లడ్ ప్రెజర్ బ్యాలెన్స్ చేయడానికి మరియు శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతాయి.

డ్రై ఫ్రూట్స్ తింటే వృద్ధాప్యంను ఆలస్యం చేస్తాయి:

డ్రై ఫ్రూట్స్ తింటే వృద్ధాప్యంను ఆలస్యం చేస్తాయి:

వృద్ధాప్యంను ఎదుర్కోవడానికి ఖరీదైన కాస్మోటిక్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. డ్రై ఫ్రూట్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే చాలు. ఇందులో వృద్ధాప్యం ఆలస్యం చేసే లేదా వృద్ధాప్య ఛాయలను నివారించే యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మరియు ఇది క్లియర్ గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Health Benefits Of Eating Dry Fruits Every Day

    Health Benefits Of Eating Dry Fruits Every Day,Dried fruits have been a delicacy since the time of empires and kings. They are a powerhouse of energy packed in a tiny form. A handful of dried fruits will provide your body with its daily requirement of vitamins and minerals. They are the healthiest of snacks w
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more