For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాలలో బెల్లం కలుపుకుని తాగితే చాలా ప్రయోజనాలు

పాలలో బెల్లం కలుపుకుని తాగితే చాలా ప్రయోజనాలున్నాయి. జీర్ణ సంబంధిత సమస్యలకు, కీళ్ల నొప్పులకు, రక్త శుద్ధికి, మహిళల్లో పీరియడ్స్‌లో వచ్చే నొప్పిని తగ్గించుకోవడానికి ఈ పాలు బాగా పని చేస్తాయి.

|

రోజూ పాలు తాగడం మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. ఇందులో కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి. అయితే పాలలో బెల్లం కలుపుకుని తాగితే చాలా ప్రయోజనాలున్నాయి. జీర్ణ సంబంధిత సమస్యలకు, కీళ్ల నొప్పులకు, రక్త శుద్ధికి, మహిళల్లో పీరియడ్స్‌లో వచ్చే నొప్పిని తగ్గించుకోవడానికి ఈ పాలు బాగా పని చేస్తాయి.

అలాగే రక్తంలో హీమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచడానికి కూడా పాలు, బెల్లం ద్రావణం బాగా పని చేస్తుంది. బెల్లంలో పొటాషియం ఉంటుంది కాబట్టి శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇక చలికాలంలో మనం చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో పాలు + బెల్లం కలిపిన పాలు తాగితే మీ సమస్యలన్నీ మటుమాయం అవుతాయి.

1. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

1. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

పాలు, బెల్లం వల్ల మీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇక పాలలో బెల్లం కలిపితే ఆ పోషకాలు మరింత ఎక్కువ అవుతాయి. శీతాకాలంలో బ్యాక్టీరియాతో పోరాడటానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇలాంటి పాలు ఎక్కువగా ఉపయోగపడతాయి.

2. అజీర్ణం సమస్య పోతుంది

2. అజీర్ణం సమస్య పోతుంది

చాలామంది అజీర్ణం సమస్యతో బాధపడుతుంటారు. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం లేదా మరి ఏ ఇతర కారణాల వల్ల అయినా ఇలాంటి సమస్య తలెత్తుతుంది. మీరు అజీర్ణం, మలబద్ధకం తదితర సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీకు పాలు బెల్లం కలిపిన పానీయం మీకు బాగా పని చేస్తుంది. దీన్ని తాగడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలుంటాయి. మీకు చాలా సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు.

3. జాయింట్ పెయిన్ తగ్గుతుంది

3. జాయింట్ పెయిన్ తగ్గుతుంది

పాలలో ఉండే కాల్షియం ఎముకలను బలపరుస్తుంది. అలాగే మీరు కీళ్లనొప్పులతో బాధపడుతుంటే ఈజీగా సమస్యను తగ్గించుకోవొచ్చు. అందువల్ల మీరు రోజూ పాలలో బెల్లం కలుపుకుని తాగుతూ ఉండండి.

4. గర్భధారణ సమయంలో రక్తహీనతను నిరోధిస్తుంది

4. గర్భధారణ సమయంలో రక్తహీనతను నిరోధిస్తుంది

గర్భధారణ సమయంలో రక్తహీనతను తగ్గించడానికి పాలు, బెల్లం కలిపిన ద్రావణం బాగా పని చేస్తుంది. గర్భిణీలు ఎక్కువగా అనీమియాతో ఇబ్బందులుపడుతుంటారు. ఆ సమయంలో వైద్యులు ఎక్కువగా ఐరన్ మాత్రలను వాడమని చెబుతుంటారు. అయితే వీటికి ప్రత్యామ్నయంగా వీటికంటే ఎక్కువ పవర్ ఫుల్ గా పాలు, బెల్లం కలిపిన ద్రావణం పని చేస్తుంది.

5. బరువు తగ్గడంలోనూ బాగా పని చేస్తుంది

5. బరువు తగ్గడంలోనూ బాగా పని చేస్తుంది

మీరు బరువు తగ్గడానికి కూడా ఈ ద్రావణం బాగా పని చేస్తుంది. పాలలో చక్కెర కంటే బెల్లం కలపడం వల్లే ఎక్కువ ప్రయోజనాలంటాయి. మీరు త్వరగా బరువు తగ్గాలంటే పాలు బెల్లం కలిపిన ద్రావణాన్ని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి.

6. స్కిన్ కు చాలా మంచిది

6. స్కిన్ కు చాలా మంచిది

శీతాకాలంలో ఎక్కువగా చర్మ సమస్యలు ఏర్పడుతుంటాయి. ముఖంపై పగుళ్లు ఏర్పడుతుంటాయి. చర్మం తన సహజత్వాన్ని కోల్పొతుంది. అందువల్ల శీతాకాలంలో చర్మం మంచి నిగారింపు పొందడానికి పాలు బెల్లంతో కూడిన ద్రావరణం బాగా పని చేస్తుంది. చర్మాన్ని ఇది పొడిబారకుండా చేస్తుంది.

7. ఋతుక్రమ సమస్యలను తగ్గిస్తుంది

7. ఋతుక్రమ సమస్యలను తగ్గిస్తుంది

ఋతుక్రమం సమస్యలను, అప్పుడొచ్చే నొప్పులు దీని వల్ల మటుమాయం అవుతాయి. చాలామంది ఆడవారు ఆ సమయంలో నొప్పి, తిమ్మిరిలతో బాధపడుతుంటారు. అయితే కొందు వేడి నీళ్లతో ఉండే బ్యాగ్ ని ఉదరం పెట్టుకుంటు ఉంటారు. దీని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ విషయంలో పాలు+బెల్లం కలిపిన ద్రావణం బాగా పని చేస్తుందది. మహిళలు ఋతుస్రావం సమయంలో దీన్ని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

8. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది

8. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది

పాలు, బెల్లం కలిపిన ద్రావణం మీ జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది. అలాగే జీవక్రియ రేటును పెంచుతుంది. అజీర్తి సమస్య వల్ల చాలామంది చాలారకాలుగా ఇబ్బందులుపడుతుంటారు. అయితే వీటన్నింటికీ దీని ద్వారా మంచి ఉపశమనం లభిస్తుంది.

9. ఎముకలకు బలాన్ని ఇస్తుంది

9. ఎముకలకు బలాన్ని ఇస్తుంది

బెల్లంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. పాలలో కాల్షియం. ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఈ రెండింటిని కలిపి ద్రావణాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల అది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అందువల్ల దీన్ని రెగ్యులర్ గా తాగుగూ ఉండండి.

10. రక్తాన్నిశుద్ధి చేయగలదు

10. రక్తాన్నిశుద్ధి చేయగలదు

రక్తాన్నిశుద్ధి చేయడానికి ఈ ద్రావణం బాగా సహాయపడుతుంది. మీ శరీరంలోని మలినాలను తొలగించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల పాలు, బెల్లం కలిపిన ద్రావణాన్ని ఎక్కువగా తాగుతూ ఉండండి.

11. మంచి శక్తిని అందిస్తుంది

11. మంచి శక్తిని అందిస్తుంది

బెల్లంలో కార్బోహైడ్రేట్లు మన శరీరానికి మంచి ఎనర్జీ ఇస్తాయి. అయితే చక్కెరలోనూ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కానీ ఇవి శరీరానికి అంతగా ఉపయోగపడవు. బెల్లంలో ఉండే కార్బోహైడ్రేట్స్ శరీరానికితక్షణ శక్తిని ఇస్తాయి. అందువల్ల పాలలో చక్కెరకాకుండా బెల్లం కలుపుకుని తాగితే రుచితో పాటు చాలా ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి.

English summary

milk jaggery health benefits

alking about winter meals, all of us are fond of jaggery (commonly called Gur) during winter. It is a natural sweetener enriched with medicinal values.
Desktop Bottom Promotion