For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మునగ ఆకులో పుసుపు వేసి ఉడికించి 2 నెలలు పాటు తింటే పొందే అద్భుత ప్రయోజనాలు..!!

మనం రెగ్యులర్ గా తినే ఆహారాల్లో ఒకటి మునక్కాడలు, మునగా కాయ మాత్రేమే కాదు మునగాకు కూడా తింటారు. ఇవి ఆరోగ్యానికి అనేక రకాలుగా ప్రయోజనాలను అందిస్తాయి. వ్యాధులను నివారించే అత్యంత అద్భుతమైన ఔషధ గుణాలు కలిగ

|

సహజంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి హెల్తీ ఫుడ్స్ అండ్ న్యూట్రీషియన్ ఫుడ్స్ ను అందివ్వాలి. ఆరోగ్యంగా ఉండగలిగితే ఎలాంటి సమస్యలు ఉండవు.! అలా కాకుండా తరచూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ, దినచర్యకు అంతరాయం కలిగిస్తూ, లైఫ్ మరింత కష్టంగా మారితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ? అలాంటి కష్టమైన, సమస్యలతో కూడిన జీవితాన్ని ఎవ్వరూ కోరుకోరు కదా..!?

జీవితంలో వివిధ రకాల డిజార్డ్స్, నొప్పుల, అసౌకర్యాలతో బాధపడే వారు, వైద్యం కోసం ఎక్కువ డబ్బు మరియు సమయాన్ని స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితిని ఏ ఒక్కరూ కోరుకోరు.

What Happens When You Eat Drumstick Leaves With Haldi?

అందువల్ల జీవితంలో ఎప్పుడైనా సరే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఆరోగ్య పరంగా ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధి యొక్క ప్రారంభ లక్షణాలను గుర్తించి వెంటనే కొన్ని నేచురల్ రెమెడీస్ ను ఫాలో అయితే చాలు ఎప్పటికప్పుడు వ్యాధులను నివారించుకోవచ్చు. లేదంటే అవి మరింత తీవ్రమై హాస్పిటల్స్ వరకూ తీసుకెళుతాయి.

చిన్న చిన్న వ్యాధుల నివారణకు ఇంట్లోనే కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ తో చికిత్సను తీసుకోవచ్చు. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు . అంతే కాదు ఈ నేచురల్ రెమెడీస్ ఇంగ్లీష్ మెడిసిన్స్ కంటే ఎఫెక్టివ్ గా పనిచేసి వివిధ రకాల వ్యాధులను నివారిస్తాయి.

మనం రెగ్యులర్ గా తినే ఆహారాల్లో ఒకటి మునక్కాడలు, మునగా కాయ మాత్రేమే కాదు మునగాకు కూడా తింటారు. ఇవి ఆరోగ్యానికి అనేక రకాలుగా ప్రయోజనాలను అందిస్తాయి. వ్యాధులను నివారించే అత్యంత అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన మునగ ఆకుకు కొద్దిగా పసుపు చేర్చి తీసుకుంటే అద్బుతమైన ప్రయోజనాలున్నాయి. మునగ ఆకును శుభ్రం చేసి, మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికే సమయంలోనే 2 టీస్పూన్ల పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఉడికించి ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత 2 నెలలు పాటు తింటే అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలను పొందుతారు. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

డయాబెటిస్ ను నివారిస్తుంది:

డయాబెటిస్ ను నివారిస్తుంది:

మునగాకులో ఉండే రిబోఫ్లెవిన్ బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది. దాంతో డయాబెటిస్ లక్షణాలను నివారస్తుంది.

ఫీటల్ హెల్త్ మెరుగుపరుస్తుంది:

ఫీటల్ హెల్త్ మెరుగుపరుస్తుంది:

ఈ నేచురల్ గ్రీన్ లీఫ్ రెమెడీలో ఫొల్లెట్ మరియు ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది ఫీటస్ కు పోషణను అందిస్తుంది, ముఖ్యంగా గర్భిణీలు హెల్తీ బేబీని ప్రసవించడానికి సహాయపడుతుంది. అయితే వీరు చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. లేదంటే డయోరియాకు గురిచేస్తుంది.

వ్యాధినిరోధకతను పెంచుతుంది:

వ్యాధినిరోధకతను పెంచుతుంది:

మునగాకు మరియు పసుపు కాంబినేషన్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇంకా అనేక మినిరల్స్ కూడా ఉండటం వల్ల వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

 మలబద్దకం నివారిస్తుంది:

మలబద్దకం నివారిస్తుంది:

ఈ హోం రెమెడీలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది స్టూల్ ను సాప్ట్ గా మార్చి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు సహాయపడుతుంది. దాంతో మలబద్దక సమస్యను నివారించుకోవచ్చు.

హై కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది:

హై కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది:

మునగాకులో ఉండే హెల్తీ ఎంజైమ్స్ స్టొమక్ లైనింగ్ చాలా ఎఫెక్టివ్ గా గ్రహించడంతో పాటు, పొట్ట లైనింగ్ కు అంటుకొని ఉన్న కొలెస్ట్రాల్ ను ఎఫెక్టివ్ గా కరిగిస్తుంది.

 సెక్స్యువల్ ఆరోసెల్ ను పెంచుతుంది:

సెక్స్యువల్ ఆరోసెల్ ను పెంచుతుంది:

పురాతన కాలం నుండి ఈ హోం రెమెడీని నేచురల్ ఆప్పోడిసియాక్ గా ఉపయోగిస్తున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇది సెక్సువల్ లిబిడో పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

మెనుష్ట్రువల్ క్రాంప్స్ ను తగ్గిస్తుంది:

మెనుష్ట్రువల్ క్రాంప్స్ ను తగ్గిస్తుంది:

మునగాకులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫ్లెవనాయిడ్స్ యుటేరియన్ లైనింగ్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.దాంతో పీరియడ్స్ సమయంలో నొప్పులు, క్రాంప్స్ తగ్గుతాయి.

English summary

What Happens When You Eat Drumstick Leaves With Haldi?

What Happens When You Eat Drumstick Leaves With Haldi?,As we know, our kitchens and gardens hold a lot of natural ingredients that are powerful enough to prevent and treat numerous ailments. Did you know that the mixture of drumstick leaves and turmeric has over 7 health benefits?
Story first published: Tuesday, January 24, 2017, 16:22 [IST]
Desktop Bottom Promotion