For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యాంటీ ఇంఫ్లేమేటరీ నేచర్ కలిగిన 10 ఆహారాలు

శరీర రోగనిరోధక వ్యవస్థ యొక్క రెస్పాన్స్ కు సంబంధించి ఇంఫ్లేమేషన్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎందుకో తెలుసా? ఇంజురీ అనేది దానంతట అదే తగ్గేందుకు ఇంఫ్లేమేషన్ అనేది ఒక ప్రయత్నంగా సహకరిస్తుంది.

|

శరీర రోగనిరోధక వ్యవస్థ యొక్క రెస్పాన్స్ కు సంబంధించి ఇంఫ్లేమేషన్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎందుకో తెలుసా? ఇంజురీ అనేది దానంతట అదే తగ్గేందుకు ఇంఫ్లేమేషన్ అనేది ఒక ప్రయత్నంగా సహకరిస్తుంది. బాక్టీరియా మరియు వైరస్ ల వంటి ఫారీన్ జెర్మ్స్ పై పోరాటానికై స్వీయ రక్షణ వ్యవస్థను పెంపొందించేందుకై అలాగే డేమేజ్ అయిన టిష్యూలను వాటంతటవే రిపెయిర్ చేసుకునేందుకై తోడ్పడుతుంది.

ఇంఫ్లేమేషన్ అనే ఫంక్షన్ లేకపోతే, ఏర్పడిన గాయాలు త్వరగా ఇన్ఫెక్షియస్ గా మారతాయి. వాపు, నొప్పి, ఇమ్మొబిలిటీ, వెచ్చదనం మరియు ఎరుపుదనం వంటివి ఇంఫ్లేమేషన్ లక్షణాలు.

ఇంఫ్లేమేషన్స్ రెండు రకాలు. అక్యూట్ మరియు క్రానిక్ ఇంఫ్లేమేషన్స్ గా వీటిని గుర్తిస్తారు. చర్మం ఎక్కడైనా కట్ అయినప్పుడు, చీలమండ వద్ద బెణుకు, అక్యూట్ బ్రాన్కైటీస్, టాన్సిలైటిస్, ఇన్ఫెక్ట్ అయిన గోరు పెరుగుదల లేదా గొంతు నొప్పి వంటివి అక్యూట్ ఇంఫ్లేమేషన్ కిందకి వస్తాయి. ఈ టైప్ ఆఫ్ ఇంఫ్లేమేషన్ కొద్ది రోజులలోనే తగ్గుముఖం పడుతుంది.

మరోవైపు, క్రానిక్ ఇంఫ్లేమేషన్ అనేది లాంగ్ టర్మ్ కండిషన్. ఓస్టియోఆర్త్రైటిస్, ర్యుమటాయిడ్ ఆర్త్రైటిస్, అలర్జీస్, ఆస్త్మా, ఇంఫ్లేమేటరీ బౌల్ డిసీస్ మరియు క్రాన్హ్స్ డిసీస్ లు ఇందులోకి వస్తాయి. ఈ సీరియస్ హెల్త్ కండిషన్స్అనేవి ప్రాణాపాయ స్థితికి దారి తీసే ప్రమాదం కలదు.

యాంటీ ఇంఫ్లేమేటరీ ఫుడ్స్ ని డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వలన క్రానిక్ ఇంఫ్లేమేటరీ డిసీస్ ల లక్షణాలను అరికట్టవచ్చు.

కాబట్టి, యాంటీ ఇంఫ్లేమ్మెటరీ ఫుడ్స్ గురించి ఈరోజు చర్చించుకుందాం.

1. బ్లూ బెర్రీస్:

1. బ్లూ బెర్రీస్:

జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ వారి స్టడీ ప్రకారం ప్రతి రోజూ బ్లూ బెర్రీస్ ను తీసుకోవడం వలన ఇంఫ్లేమేషన్ తగ్గుతుంది. బ్లూ బెర్రీస్ లో ఫ్లెవనాయిడ్స్ మరియు అంతోసియానిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవి ఇంఫ్లేమేటరీ మరియు ఇమ్మ్యూన్ జీన్స్ ని నిలిపివేస్తాయి. అలాగే, యాంటీ ఇంఫ్లేమేటరీ రెస్పాన్స్ లను ప్రమోట్ చేసే విటమిన్ సి మరియు పోలీఫెనాల్ అనేవి లభిస్తాయి.

2. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్:

2. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్:

గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి సెల్యూలార్ హెల్త్ ని రిస్టోర్ చేస్తాయి. స్పినాచ్, స్విస్ కార్డు వంటివి యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ సి పుష్కలంగా లభించే కొన్ని గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. ఇవి బ్రెయిన్ ను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షిస్తాయి. స్మూతీలా కూడా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ని తీసుకోవచ్చు.

3. సెలరీ:

3. సెలరీ:

సెలరీలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ కలవు. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తూ బ్లడ్ ప్రెషర్ ను మెరుగుపరుస్తుంది. తద్వారా, గుండె వ్యాధులను అరికట్టవచ్చు. శరీరంలోని ఇంఫ్లేమేషన్ ని తగ్గించి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ పై పోరాటం జరుపుతుంది. సెలెరీని సలాడ్స్ లో మీ డైట్ లో భాగంగా చేసుకోవడం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.

4. బాక్ చాయ్:

4. బాక్ చాయ్:

ఇదొక రకమైన క్యాబేజ్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ మరియు మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. బాక్ చాయ్ లో 70 శాతం యాంటీ ఆక్సిడెంట్ ఫినోలిక్ సబ్స్టేన్సెస్ కలవు. ఇవి ఫ్రీ రాడికల్స్ ని వెతికి వాటిని వెంటనే అంతం చేస్తాయి. ఈ వెజిటబుల్ ని మీ రోజువారి డైట్ లో భాగంగా చేసుకుని శరీరంలోని ఇంఫ్లేమేషన్ ను తగ్గించుకోవచ్చు.

5. బీట్ రూట్:

5. బీట్ రూట్:

బీట్ రూట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఇంఫ్లేమేషన్ వలన జరిగిన సెల్ డేమేజ్ ని రిపైర్ చేస్తాయి. బీట్ రూట్ లో లభించే బెటాలిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అనేది అద్భుతమైన యాంటీ ఇంఫ్లేమేటరీ ఏజెంట్ గా పనిచేసి ఇంఫ్లేమేషన్ ను తగ్గించి డేమేజ్ అయిన సెల్స్ ను రిపైర్ చేస్తుంది.

6. అల్లం:

6. అల్లం:

అల్లంలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇంఫ్లేమేటరీ కాంపౌండ్స్ కలవు. ఇవి శరీరంలోని ఇంఫ్లేమేషన్ ని ప్రమోట్ చేసే వివిధ జీన్స్ ను అలాగే ఎంజైమ్స్ ను బ్లాక్ చేస్తాయి. కీళ్ల వాపును తగ్గించేందుకు అల్లాన్ని వాడతారు. ఒక కప్పుడు అల్లంటీని రోజూ తీసుకోవడం వలన శరీరంలోని ఇంఫ్లేమేషన్ ను తగ్గించుకోవచ్చు.

7. బ్రొకోలీ:

7. బ్రొకోలీ:

పోషకాలు పుష్కలంగా కలిగిన బ్రొకోలీలో పొటాషియం, మెగ్నీషియం అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవి ఇంఫ్లేమేషన్ పై పోరాటం జరుపుతాయి. అలాగే, ఈ వెజిటబుల్ లో ఫ్లెవనాయిడ్స్ మరియు కెరోటినాయిడ్స్ లభిస్తాయి. ఈ రెండూ కలిసి శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్ పై పోరాటం జరిపి క్రానిక్ ఇంఫ్లేమేషన్ ని తగ్గిస్తాయి.

8. గ్రీన్ టీ:

8. గ్రీన్ టీ:

బరువు తగ్గేందుకు గ్రీన్ టీ ఉపయోగపడుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, గ్రీన్ టీ లో ఇంఫ్లేమేషన్ ను అరికట్టే గుణాలున్నాయన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ ఆరోగ్యకరమైన పానీయంలో కాటెచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ గ్రూప్ లభ్యమవుతుంది. అందువలన, ఇది శక్తివంతమైన యాంటీ ఇంఫ్లేమేటరీ ఫుడ్ గా పేరొందింది. స్కిన్ ట్యూమర్ల వృద్ధిని అరికట్టేందుకు గ్రీన్ టీ తోడ్పడుతుంది.

9. పైనాపిల్:

9. పైనాపిల్:

బ్రోమ్లెయిన్ అనే డైజెస్టివ్ ఎంజైమ్ పైనాపిల్ లో లభిస్తుంది. ఇది ఇంఫ్లేమేషన్ ను అలాగే వాపును తగ్గిస్తుంది. గాయాన్ని త్వరగా తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కండరాల లేక కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. ఆస్త్మాను తగ్గిస్తుంది. పైనాపిల్ పీసులను సలాడ్స్ కి జోడించి తీసుకోవచ్చు. అలాగే ఫ్రూట్ జ్యూస్ గా కూడా దీనిని తీసుకోవచ్చు.

10. డార్క్ చాకొలేట్:

10. డార్క్ చాకొలేట్:

డార్క్ చాకొలేట్ ని తీసుకోవడం వలన బ్లడ్ ప్రెజర్ ని తగ్గించుకోవచ్చు. ఆలాగే పొట్టలో ఉండే మైక్రోబ్స్ ని కూడా తగ్గించుకోవచ్చు. తద్వారా, గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. డార్క్ చాకోలెట్స్ లో లభించే యాంటీ ఇంఫ్లేమేటరీ కాంపౌండ్స్ అనేవి ఇంఫ్లేమేషన్ కి చెందిన జీన్స్ పనితీరును ఆపివేస్తాయి. అందువలన, డార్క్ చాకొలేట్ ను ఉత్తమమైన యాంటీ ఇంఫ్లేమేటరీ ఫుడ్ గా పరిగణించవచ్చు.

English summary

10 Foods That Are Anti Inflammatory

Inflammation makes an attempt to heal an injury from within, defends itself from other foreign germs and helps in repairing the damaged tissues. But, this does not happen in the case of chronic inflammation, seen in case of osteoarthritis, asthma, etc. To reduce inflammation in the body, you can have foods such as pineapple, dark chocolate, blueberries, celery, etc.
Desktop Bottom Promotion