For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు తెలుసుకోవాల్సిన పటికబెల్లం (మిశ్రి) యొక్క 10 ఆరోగ్య లాభాలు

వాడుక బాషలో మిశ్రిగా పిలవబడే పటిక బెల్లం పలుకులు, చెక్కర యొక్క శుద్ధి చేయబడని రూపం.దీన్ని వంటల్లో మరియు వైద్య ప్రయోజనాల కోసం వాడతారు మరియు ఇది పలుకుగా ఉండి, రుచిగా ఉండే చెక్కర నుంచి తయారు చేయబడుతుంది.

|

వాడుక బాషలో మిశ్రిగా పిలవబడే పటిక బెల్లం పలుకులు, చెక్కర యొక్క శుద్ధి చేయబడని రూపం.దీన్ని వంటల్లో మరియు వైద్య ప్రయోజనాల కోసం వాడతారు మరియు ఇది పలుకుగా ఉండి, రుచిగా ఉండే చెక్కర నుంచి తయారు చేయబడుతుంది.చెక్కర కంటే పటిక బెల్లం కొంచెం తక్కువ తియ్యనైనదే మరియు తెల్ల చెక్కరతో పోల్చుకుంటే రుచిలో కూడా కొంచెం వేరైనదే.

మిశ్రి లేక పటిక బెల్లం పలుకులు చెరుకు రసం మరియు తాటి చెట్టు జిగురుతో తయారు చేస్తారు. మిశ్రిలో ఈ తాటి చెట్టు మరియు చెక్కర యొక్క వివిధ పోషకాలు ఉంటాయి.

characteristics defined by initials

పటిక బెల్లంలో ముఖ్యమైన విటమిన్లు,ఖనిజాలు మరియు అమినో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి.కేవలం మాంసాహారంలో దొరికే ముఖ్యమైన విటమిన్, విటమిన్ బి12 మిశ్రిలో ఎక్కువ మొత్తంలో దొరుకుతుంది.

ఈ చిన్న చిన్న పటిక బెల్లం పలుకులు మంచి ఆరోగ్యకరమైన మిఠాయి.మిశ్రికి రోజూ వాడే చెక్కర కి ప్రత్యామ్నాయం గానే కాకుండా కొన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

తాజా శ్వాస

తాజా శ్వాస

మీరు భోజనం తరువాత నోరు కడుక్కోకపోయినా, నోరు పుక్కిలించకపోయినా, ఆ బాక్టీరియా చిగుళ్ళ సందుల్లో ఉండిపోయి చెడు వాసన కలిగిస్తుంది.పటిక బెల్లం లేక మిశ్రి భోజనం తరవాత తింటే చెడు వాసన పోగొట్టి , తాజా శ్వాస నింపుతుంది.ఇది నోట్లో మరియు శ్వాసలో తాజాదనాన్ని నిర్ణయిస్తుంది.

దగ్గుని తగ్గిస్తుంది

దగ్గుని తగ్గిస్తుంది

మీ గొంతులో క్రిములు దాడి చేస్తే లేక జ్వరం వస్తే మీకు దగ్గు వస్తుంది.మిశ్రిలోని ఔషధ గుణాలు దగ్గు నుంచి తక్షణ ఉపశమనం ఇస్తాయి. మిశ్రి తీసుకోని నోట్లో వేసుకొని చప్పరిస్తే నిరంతరం ఉండే దగ్గు తగ్గుతుంది.

గొంతు పూతకి మంచిది

గొంతు పూతకి మంచిది

చల్లని వాతావరణం చాలా ఆరోగ్య సమస్యలు కలిగిస్తుంది, వాటిలో గొంతు పూత ఒకటి.పటిక బెల్లం గొంతు పూతకి తొందరగా పనిచేసే ఒక పరిష్కారం.పటిక బెల్లాన్ని , నల్ల మిరియాల పొడి మరియు నెయ్యితో రాత్రి తీసుకుంటే గొంతు పూత తగ్గిపొతుంది.

హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచుతుంది

హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచుతుంది

తక్కువ హిమోగ్లోబిన్ స్థాయి ఉన్న వాళ్ళు రక్తహీనత,పాలిపోయిన చర్మం,మైకం,అలసట మరియు నీరసం వంటి సమస్యలతో బాధపడతారు.పటిక బెల్లం హిమోగ్లోబిన్ స్థాయి పెంచడమే కాకుండా రక్త ప్రసరణని పునరుద్ధరిస్తుంది. జీర్ణక్రియ లో సహాయం చేస్తుంది

పటిక బెల్లం నోటికి తాజాదనం ఇవ్వడమే కాకుండా,సోంపుతో వేసుకుంటే జీర్ణక్రియలో కూడా సహాయం చేస్తుంది.అందులో ఉన్న లక్షణాలు జీర్ణ ప్రక్రియని వెంటనే మొదలుబెట్టిస్తాయి.కనుక, అజీర్తిగా ఉంటే భోజనం అయిన వెంటనే మిశ్రి పలుకులు వేసుకోండి.

శక్తిని పెంచుతుంది

శక్తిని పెంచుతుంది

పటిక బెల్లంలో ఉన్న తాజాదనమైన రుచి, భోజనం తరవాత వేసుకుంటే శక్తిని పెంచుతుంది.సాధారణంగా భోజనం తరవాత మనం బద్ధకంగా ఉంటాము,కాని మిశ్రీ మనలో శక్తిని పెంచుతంది. బద్ధకం ని దూరం చేయడానికి సోంపుతో మిశ్రీ తినండి.

ముక్కు నుంచి రక్తస్రావాన్ని ఆపుతుంది.

ముక్కు నుంచి రక్తస్రావాన్ని ఆపుతుంది.

పటిక బెల్లం ముక్కు నుంచి రక్తస్రావాన్ని వెంటనే ఆపుతుంది అంటే మీరు ఆశ్చర్యపోతారు.మీకు ముక్కు నుంచి రక్తస్రావం ఉంటే, పటిక బెల్లం పలుకులు నీళ్ళతో తీసుకోండి,అది రక్తస్రావాన్ని ఆపేస్తుంది.

మెదడుకి మంచిది

మెదడుకి మంచిది

మిశ్రి మెదడుకు మంచి ప్రకృతి వైద్యం.పటిక బెల్లం మతిమరుపుని మరియు మెదడు అలసటని తగ్గిస్తుంది.పటిక బెల్లాన్ని వేడి పాలలో కలిపి పడుకునే ముందు తాగండి.మీ మతిమరుపును తగ్గించడానికి ఇది బాగా ఉపయోగ పడుతుంది.

పాలిచ్చే తల్లులకు ఉపయోగపడుతుంది

పాలిచ్చే తల్లులకు ఉపయోగపడుతుంది

మిశ్రి లేక పటిక బెల్లం, పాలిచ్చే తల్లులకు బాగా ఉపయోగపడుతుంది.ఎందుకంటే ఇది బలహీనతని తగ్గిస్తుంది మరియు స్తనాలలో పాల ఉత్పత్తిని పెంచుతుంది.పటిక బెల్లం తక్కువ తియ్యగా ఉంటుంది మరియు తల్లికి ఏ విధమైన హాని కలగదు.

చూపును మెరుగుపరుస్తుంది

చూపును మెరుగుపరుస్తుంది

మిశ్రి కంటి చూపుకి చాలా మంచిది.మిశ్రిని తరచుగా తింటే కంటి చూపు మెరుగు పడడమే కాకుండా శుక్లాలు రాకుండా కూడా కాపాడుతుంది.భోజనం తరువాత లేక రోజంతా మిశ్రి నీళ్ళు తాగితే కంటి చూపు మెరుగుపడుతుంది.

English summary

10 Health Benefits Of Rock Sugar (Mishri) You Should Know

health benefits of rock sugar, rock sugar health benefits, mishri health benefits, is misri good for diabetes
Desktop Bottom Promotion