For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాధారణంగా విస్మరించే, పండ్లు, కూరగాయలలోని ఈ భాగాలు మీ ఆరోగ్యానికి ఎంతో మంచివని తెలుసా?

|

పండ్లు మరియు కూరగాయల సంబంధిత ఆకులు, స్కిన్(తోలు), కోర్ మరియు విత్తనాలు, సాధారణంగా పక్కనబెట్టేవిగా పరిగణించబడుతున్నాయి. కానీ వీటి యొక్క అద్భుతమైన ప్రయోజనాలను చదివిన తర్వాత, మీరు వాటిని మొత్తంగా తినడానికి ఉపక్రమిస్తారు. క్రమంగా వీటిని తినే క్రమంలో స్కిన్ పీలర్ లేదా కత్తిని వాడాలంటే కూడా ఆలోచిస్తారు.

Bits Of These Fruits and Veggies Are Actually Good For You!

ఆ జాబితా ఏమిటో చూద్దామా:

సాధారణంగా విస్మరించే పండ్లు, కూరగాయలలోని ఈ భాగాలు మీ ఆరోగ్యానికి ఎంతో మంచివని నిపుణులు చెప్తున్నారు.

1. స్ట్రాబెర్రీ- ఆకులు మరియు విత్తనాలు

1. స్ట్రాబెర్రీ- ఆకులు మరియు విత్తనాలు

స్ట్రాబెర్రీ ఆకులలో కూడా కాల్షియం, విటమిన్ సి మరియు ఇనుము వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఈ ఆకులలో కలిగి ఉన్న ఐరన్ నిక్షేపాల కారణంగా, అవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని మరియు హీమోగ్లోబిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నందున రక్తహీనత కలిగిన రోగులకు మంచిదిగా సూచించబడినది.

ఈ ఆకులు రక్తనాళాల ఆరోగ్యానికి అనుసంధానించబడిన యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క సమూహంగా ఉన్న ఎల్లగిటానిన్లను కలిగి ఉంటాయి. అవి ఆరోగ్యకరమైన రక్తపోటును నిర్వహించటానికి సహాయపడతాయి. ప్రాచీన కాలంలో, స్ట్రాబెర్రీ ఆకులు ఆర్థరైటిస్ నొప్పి ఉపశమనానికి ఉపయోగించేవారు, ఎందుకంటే దానిలోని కాఫీక్ ఆమ్ల నిక్షేపాలను సహజ సిద్దమైన యాంటీ ఇన్ఫ్లమేటరీగా భావిస్తారు.

2. ఉల్లిపాయ :

2. ఉల్లిపాయ :

ఉల్లిపాయల వెలుపలి, కాగితపు పొర ఖచ్చితంగా తినదగనిది కాదు, కానీ అది ఉపయోగించుకోవలసిన పోషకాలను మాత్రం కలిగి ఉంటుంది. ఇవి ఫ్లేవానాయిడ్లు మరియు పిగ్మెంట్ క్వెర్సెటిన్ నిక్షేపాలను అధికంగా కలిగి ఉంటాయి. మొత్తం ఉల్లిపాయ క్వెర్సెటిన్ నిక్షేపాలను కలిగి ఉన్నప్పటికీ, బయటి పొరలలో 45% ఎక్కువగా ఉంటాయి.

పిగ్మెంట్ క్వెర్సెటిన్, శోథ నిరోధక మరియు హిస్టామిన్ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది జ్వరం చికిత్సకు మరియు అధిక రక్తపోటు తగ్గించడానికి ఒక అద్భుతమైన పదార్ధంగా పనిచేస్తుంది.

3. బట్టర్ నట్ స్క్వాష్ :

3. బట్టర్ నట్ స్క్వాష్ :

గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, మస్క్ మిలాన్ గింజలు, ప్రోటీన్లు వంటి ముఖ్యమైన పోషకాలు మరియు ఖనిజాలను కలిగి ఉంటాయి. అదేవిధంగా బట్టర్ నట్ స్క్వాష్ గింజలు కూడా. ఈ బట్టర్ నట్ స్క్వాష్ సీడ్స్ అధికమోతాదులో మాంసకృత్తులు, ఫైబర్, విటమిన్ ఎ, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఇనుము మరియు ముఖ్యంగా జింక్ నిక్షేపాలలో పుష్కలంగా ఉంటుంది. జీవ క్రియలు, రోగనిరోధకత, సాధారణ జలుబు చికిత్స, గాయాలు నయం చేయడానికి మరియు పునరుత్పత్తి వ్యవస్థ కోసం జింక్ అవసరం.

ఉద్రేకం, తలనొప్పి, డయాబెటిస్, మరియు అలసటతో పోరాడటానికి కావలసిన శక్తి ఉత్పాదన కోసం, కాల్షియం మరియు ఎముకల ఆరోగ్యానికి మెగ్నీషియం అవసరం. విత్తనాలు కడిగి మరియు వాటిని కాల్చుకుని తీసుకోవచ్చు.

4.పైనాపిల్-

4.పైనాపిల్-

పైనాపిల్ యొక్క ప్రధాన భాగం మిగిలిన భాగంతో పోలిస్తే కొంచెం గట్టిగా మరియు కొంచం తక్కువ తీపిగా ఉంటుంది మరియు సాధారణంగా తినేందుకు విస్మరించబడుతుంది. ఈ కోర్ "డైజెస్టివ్ ప్రోటీన్ ఎంజైమ్"ను బ్రోమెలైన్ అని పిలుస్తున్నారు.

ఈ కోర్ ఖచ్చితంగా తినదగినది మరియు ముక్కలుగా కత్తిరించి సలాడ్లు లేదా డెజర్ట్లకు జోడించదగినది. ఇది ఒక పెద్ద భోజనాన్ని పూర్తి చేసే ప్రక్రియలో వినియోగించదగినదిగా అనేక మంది సూచిస్తుంటారు కూడా.

కొన్ని అధ్యయనాలు పైనాపిల్ యొక్క కోర్, స్నాయువులను మరియు కణజాలాన్ని మరమ్మతు చేయడానికి దోహదపడేదిగా తేల్చాయి. మరియు వాపు, నొప్పిని కూడా తగ్గిస్తుందని రుజువైంది.

5. కివి పండు యొక్క చర్మం :

5. కివి పండు యొక్క చర్మం :

మనం తినేముందు సాధారణంగా, దాదాపు కివి పండు యొక్క బయటి, మందపాటి చర్మాన్ని తొలగించటానికి ఇష్టపడతారు ఎందుకంటే, చూచేందుకు స్పష్టముగా తినే ఆహారంలా కనిపించదు కాబట్టి, మరియు తినదగినది కాదు కూడా అని అనేకుల అభిప్రాయం. కానీ ఈ పొర నిజానికి తినదగినది మరియు విటమిన్ ఇ, విటమిన్ సి మరియు ఫోలేట్ నిక్షేపాలతో కూడి ఉంటుంది.

రోగనిరోధక వ్యవస్థకు విటమిన్ ఇ మరియు ఫోలేట్ చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే అవి

అనారోగ్యంతో మరియు ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి సహాయం చేస్తాయి. ఫోలేట్ కూడా మన శరీర జీవక్రియలకు సహాయపడే ముఖ్య పోషకంగా ఉంది.

కివి పండు యొక్క చర్మం తీసుకోవడం వలన శరీరంలోని "ఫ్రీరాడికల్స్" తో పోరాడటానికి సహాయపడే ఒక యాంటి యాక్సిడెంట్ల వలె పనిచేసే ఫైబర్, మూడు రెట్లు అధికంగా అందివ్వడానికి సహాయం చేస్తుంది. ఈ విధంగా, చర్మంతో సహా ఒక కివి పండును తినడం మూలంగా ఈ అద్భుతమైన పోషకాలను మరియు ఖనిజాల పరిమాణాన్ని, తొక్క తీసివేసిన కివీతో పోలిస్తే దాదాపు 30% నుండి 50% వరకు శరీరానికి అదనంగా అందించవచ్చు.

6. స్ప్రింగ్ ఆనియన్స్ ఆకుపచ్చని చివరలు-

6. స్ప్రింగ్ ఆనియన్స్ ఆకుపచ్చని చివరలు-

స్ప్రింగ్ ఆనియన్స్ ఆకుపచ్చ చివరలు రుచిలో తక్కువగా ఉన్నా కూడా, మిగిలిన వాటితో పోల్చినప్పుడు ఫోలేట్లో ఉత్తమంగా ఉంటాయి మరియు వాటిని తినే ముందు అనేక భాగాలను విస్మరిస్తుంటారు కూడా. స్ప్రింగ్ ఆనియన్స్లో ఆనియన్ భాగాన్ని కూడా వినియోగించుకోగలగాలి, లేకుంటే విటమిన్-సి మరియు ఫైబర్ తత్వాలను ఎక్కువ మోతాదులో కోల్పోయినట్లే.

ఈ ఆకుపచ్చ చివరలను బాగా కత్తిరించి, కొన్ని వెల్లుల్లి రెబ్బలను జోడించి సూప్ మరియు సలాడ్లలో చేర్చి తీసుకోవచ్చు. ఇది మన శరీరoలోని బేటా-కెరోటిన్ ను విటమిన్-ఎ గా మారుస్తుంది. మరియు విటమిన్-ఎ శరీరంలో రోగనిరోధకత శక్తిని పెంచడంలో సహాయం చేస్తుంది.

7. క్యాబేజ్:

7. క్యాబేజ్:

మనం క్యాబేజీ యొక్క ముదురు వెలుపలి పొరలను తరచుగా ఆరోగ్యంగా లేదని భావించి తొలగిస్తుంటాము. కానీ ఈ పొరలు లోపలి పొరల కంటే 75% ఎక్కువ కేరోటినాయిడ్లను కలిగి ఉంటాయి. కరోటినాయిడ్స్ అనేది పసుపు, నారింజ మరియు ఎరుపు రంగులను అందించే మొక్కలలో ఉత్పత్తి కాబడే కొవ్వు-రహిత వర్ణద్రవ్యాలు.

ఈ కేరోటినాయిడ్లు కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఈ కారోటినాయిడ్స్ యాంటీఆక్సిడెంట్లను అధికంగా శరీరానికి అందివ్వగలవు. క్యాబేజీ బాహ్య పొరలను కత్తిరించి కొంచెం ఆలివ్ నూనె మరియు మూలికలతో వేయించి, సలాడ్లకు జోడించవచ్చు.

కావున తొక్కే కదా అని పారేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవడం మంచిదని అంటున్నారు నిపుణులు.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలు, జీవనశైలి, ఆరోగ్య, ఆహార, ఆధ్యాత్మిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Bits Of These Fruits and Veggies Are Actually Good For You!

We usually discard the outer leaves of cabbage, onions, strawberries, seeds of butternut squash, pumpkin, sunflowers, core of the pineapple, skin of kiwi, etc. But what if we told you that these contain 30%-50% more vitamins & minerals than the flesh of the fruit or veggie itself? Wouldn't you eat them?
Story first published: Friday, July 20, 2018, 10:45 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more