For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆకుపచ్చని పండ్లు మరియు కూరగాయలు తీసుకోవడం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు

|

మన తల్లిదండ్రుల నుండి మరియు పెద్దలనుండి మనం, ఆకుపచ్చ కూరగాయలను తీసుకోవడం మూలంగా మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఇదివరకే తెలుసుకున్నాము మరియు అది పచ్చినిజం కూడా. ఆకుపచ్చని పండ్లు మరియు కూరగాయలు వాటి రంగును క్లోరోఫిల్ అనే వర్ణద్రవ్యం నుండి పొందుతాయి. క్లోరోఫిల్ మన శరీరాన్ని పరమాణువులు, సెల్యులార్ స్థాయిలలో పునరుద్దరించేందుకు మరియు శరీరాన్ని విషతుల్య రసాయనాల నుండి శుభ్రపరచడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. మరియు సంక్రమణ రోగాలతో, రోగనిరోధక వ్యవస్థ జరిపే పోరాటంలో సహాయపడుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియలు మెరుగుపడడంలో, రోగనిరోధకవ్యవస్థ పెరగడంలో మరియు ఆరోగ్యకర రక్తప్రసరణలో కీలకపాత్ర పోషిస్తుంది.

ఆకుపచ్చని ఆహారాలు మీ ఆరోగ్యాన్ని పునరుజ్జీవింపచేసే ఫైటోన్యూట్రియoట్స్ , ఫైబర్ మరియు నీటితో కూడిన మంచి వనరులుగా ఉన్నాయని అనేక పరిశోధనలు తేల్చాయి కూడా. ఇక్కడ అనేకములైన ఆకుపచ్చ పండ్లు మరియు కూరగాయలను పొందుపరచబడి ఉన్నాయి.

Health Benefits Of Green Fruits And Vegetables

ఆకుపచ్చ పండ్ల జాబితా:

• అవకాడొలు

• గ్రీన్ యాపిల్స్

• ఆకుపచ్చ ద్రాక్ష

• గ్రీన్ పియర్స్

• హానీడ్యూ పుచ్చకాయలు

• కివి పండ్లు

• లైమ్స్

• ఆకుపచ్చ మామిడి

• కస్టర్డ్ ఆపిల్

• జామపండ్లు

• గూస్ బెర్రీస్

• స్టార్ ఫ్రూట్స్

• ఆకుపచ్చ రేగుపండ్లు(కొండరేగులు)

• గ్రీన్ ఆలీవ్స్

ఆకుపచ్చ కూరగాయల జాబితా :

• అరుగుల

• బోక్ చోయ్

• బ్రొకలీ

• కొల్లార్డ్ గ్రీన్

• బ్రోకోలిని

• బ్రోకలీ రాబే

• పాలకూర

• కూరాకు

• కాలే

• స్పినాచ్(పాలకూర)

• మస్టర్డ్(ఆవాలు) ఆకులు

• రొమైన్ లెట్యూస్

• వాటర్క్రెస్

• బచ్చలి కూర

• టర్నిప్ గ్రీన్

• క్యాబేజీ

• బీట్ గ్రీన్

• ఆకుపచ్చని చిక్కుళ్ళు

• గ్రీన్ పీస్

• బెండకాయ(ఓక్రా)

• అర్టిచొక్

• ఆకుకూరల

• కొత్తిమీర, పార్స్లీ, పుదీనా, మరియు సెలరీ ఆకులు

• ఆస్పరాగస్

• మొలకెత్తిన బ్రస్సెల్స్

• గ్రీన్ కాప్సికం

• పచ్చి మిరపకాయ

• జుచ్చిని

• దోసకాయ

• స్ప్రింగ్ ఆనియన్

ఆకుపచ్చని పండ్లు మరియు కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి, ఎందుకని?

ఆకుపచ్చని పండ్లు మరియు కూరగాయలలో క్లోరోఫిల్, ఫైబర్, ల్యూటేన్, జియాక్సాంథిన్, కాల్షియం, ఫోలేట్, విటమిన్-సి మరియు బీటాకెరోటిన్ ఉంటాయి. ఈకూరగాయలలో కనిపించే పోషకాలు క్యాన్సర్ వ్యతిరేకంగా పోరాడడమే కాకుండా, రక్తపోటు క్రమబద్దీకరించడంలో, చెడుకొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, ఆహారాన్ని జీర్ణం చేయడంలో, రెటీనా ఆరోగ్యం మెరుగుపరచడంలో మరియు దృష్టి సంబందిత సమస్యలను తగ్గించడంలో, హానికరమైన ఫ్రీరాడికల్స్ తో పోరాడటంలో మరియు రోగనిరోధకవ్యవస్థను పెంచడంలో ఎంతగానో సహాయం చేస్తాయి.

1.చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

1.చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

ధమనుల గోడలలో ఎల్.డి.ఎల్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పేరుకుని పోవడం కారణంగా గుండెపోటు మరియు స్ట్రోక్ సమస్యలకు దారితీస్తుంది. మీ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి, అవకాడోస్, ఆలీవ్, ఆకుపచ్చ బఠాణీలు, ద్రాక్ష మొదలైన ఆకుపచ్చ ఆహారపదార్ధాల వినియోగం ఎంతగానో సహాయపడుతుంది. ఎందుకంటే అవి మోనోసాచురేటేడ్ కొవ్వు ఆమ్లాలను మరియు ఫైబర్ నిక్షేపాలను అధికంగా కలిగి ఉన్న కారణాన చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడగలవు కాబట్టి.

2. క్యాన్సర్ నిరోధిస్తుంది:

2. క్యాన్సర్ నిరోధిస్తుంది:

అనేక అధ్యయనాలు, ఆకుపచ్చ కూరగాయలు మరియు పండ్లు అధికంగా ఉన్న ఆహారప్రణాళిక అవలంబించడం ద్వారా క్యాన్సర్ వంటి సమస్యలను సైతం అడ్డుకోవచ్చని వెల్లడించాయి. ఈ ఆహారాలు, అనామ్లజనకాలు, కెరోటినాయిడ్స్ మరియు ఫ్లేవనోయిడ్స్ వంటి ఫైటోన్యూట్రియంట్స్ నిక్షేపాలను కలిగి ఉంటాయి. ఇవి కడుపు క్యాన్సర్, పెద్దప్రేగు కాన్సర్, చర్మ క్యాన్సర్ మరియు రొమ్ము క్యాన్సర్ వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడగలిగే లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ ఫైటోన్యూట్రియంట్స్ అవకాడొలు, ఆలివ్స్, ఆకుపచ్చ ఆపిల్స్, పాలకూర, కాలే, మొదలైన వాటిలో ఎక్కువగా ఉంటాయి.

3. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

3. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

ఆకుపచ్చని ఆకుకూరలు తినడం వల్ల మీకళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడంలో సహాయపడుతుంది. బచ్చలికూర, కాలే, కివి ఫ్రూట్స్, ద్రాక్ష మరియు గుమ్మడికాయలలో ప్రధానంగా ల్యూటేన్ మరియు జియాక్సాంథిన్ అనే ముఖ్యమైన కెరోటినాయిడ్స్ నిక్షేపాలను కలిగి ఉంటాయి. ఈ సమ్మేళనాలు కంటిలో ఉండే “మాకులా” రక్షణకవచంగా పనిచేస్తుంది, మరియు బ్లూ-లైట్ నుండి ఎదురయ్యే దుష్ప్రభావాలను సైతం నివారించగలదు. కంటిశుక్లాలు రాకుండా నిరోధిస్తుంది.

4. జీర్ణశక్తికి మంచిది

4. జీర్ణశక్తికి మంచిది

మీ శరీరంలో జీర్ణక్రియలను పెంచడంద్వారా ఆహారాన్ని పోషించటానికి సహాయపడుతుంది, శరీరంలో శక్తిస్థాయిలను నిర్వహించుటకు, కణాల వృద్ధి మరియు కణజాల మరమ్మత్తుకు సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థ యొక్క ఉత్తమ పనితీరును ప్రోత్సహించే క్రమంలో, ఆర్టిచోక్స్, ఆపిల్స్, బ్రొకోలీ, గ్రీన్-బీన్స్, బటానీ మరియు టర్నిప్-గ్రీన్స్ వంటి అధిక ఫైబర్ ఆహారాలను ఆహారప్రణాళికలో చేర్చుకోవడం శ్రేయస్కరం. ఈ ఆకుపచ్చ కూరగాయలు, పండ్లలోని అధిక ఫైబర్ ప్రేగులలో అదనపు నీటిని సంగ్రహించడమే కాకుండా, ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు ప్రేగుల పనితీరును మెరుగుపరుస్తుంది.

 5.జీవక్రియలను మెరుగుపరుస్తుంది:

5.జీవక్రియలను మెరుగుపరుస్తుంది:

జీవక్రియలు పెరగడం అధిక బరువును తగ్గించడంలో సహాయం చేస్తుంది. పచ్చిమిరపకాయలు, మిరియాలు, అవకాడో, బచ్చలికూర వంటి ఆకుపచ్చని ఆహారపదార్ధాలు, జీవక్రియలను మెరుగుపరుస్తాయి. జీవక్రియలు మెరుగుపడడంలో దోహదం చేసే అత్యంత ముఖ్యమైన పోషకంగా విటమిన్-బి ఉంటుంది.

6. మెదడు పనితీరును ప్రోత్సహిస్తుంది

6. మెదడు పనితీరును ప్రోత్సహిస్తుంది

బ్రొకోలీ, ఆకుపచ్చ బీన్స్, బ్రస్సెల్స్ మొలకలు, అవకాడోస్, ఆస్పరాగస్, స్పినాచ్, కాలే వంటి ముదురు ఆకుపచ్చ ఆకుకూరలు మరియు పండ్లు విటమిన్-B9 నిక్షేపాలలో అధికంగా ఉంటాయి. ఫోలేట్, వయస్సు సంబంధిత జ్ఞాపకశక్తి క్షీణత సమస్యను నివారించడానికి, ఏకాగ్రతతో పాటు, మొత్తం మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

English summary

Health Benefits Of Green Fruits And Vegetables

Green fruits and vegetables get their colour from a pigment named chlorophyll. Chlorophyll has the powerful ability to regenerate your bodies at the molecular and cellular levels and is known to cleanse the body. It helps in fighting infection and promotes the health of the digestive, immune, and circulatory systems.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more